పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/శిశుపాలుని వధించుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

శిశుపాలుని వధించుట

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/శిశుపాలుని వధించుట)
రచయిత: పోతన


(తెభా-10.2-788-క.)[మార్చు]

చా లుఁ బురే యహహా! యీ
'కా ము గడపంగ దురవగాహం బగు నీ
తే లా తప్పెను నేఁ డీ
'బా కు వచనములచేతఁ బ్రాజ్ఞుల బుద్ధుల్‌?

(తెభా-10.2-789-వ.)[మార్చు]

ఇట్లు దప్పిన తెఱం గెట్టనినఁ బాత్రాపాత్ర వివేకంబు సేయనేర్చిన విజ్ఞాననిపుణులు, నున్నతసత్త్వ గరిష్ఠులు, బహువిధ తపోవ్రత నియమశీలురు, ననల్పతేజులు, మహైశ్వర్యశక్తిధరులుఁ, బరతత్త్వవేదులు, నఖిలలోకపాలపూజితులు, విగతపాపులుఁ బరమయోగీంద్రులు నుండ వీరిం గైకొనక వివేకరహితులై గోపాలబాలునిం బూజసేయుటకు నెట్లు సమ్మతించిరి; పురోడాశంబు సృగాలంబున కర్హంబగునే? యదియునుంగాక.

(తెభా-10.2-790-సీ.)[మార్చు]

'గురుదేవశూన్యుండు కులగోత్రరహితుండు;
'లిదండ్రు లెవ్వరో డవఁ గాన
'ప్పులఁ బొరలెడు నాదిమధ్యావసా;
'నంబులం దరయ మానంబు లేదు
'హురూపియై పెక్కుభంగుల వర్తించు;
'వావి వర్తనములు రుస లేవు
'రికింప విగతసంబంధుండు తలపోయ;
'మా నిమిత్తంబున మాని సయ్యెఁ

(తెభా-10.2-790.1-తే.)[మార్చు]

'రఁగ మున్ను యయాతిశామునఁ జేసి
'వాసి కెక్కదు యీ యదువంశమెల్ల
'బ్రహ్మతేజంబు నెల్లఁ గోల్పడిన యితఁడు
'బ్రహ్మఋషి సేవ్యుఁ డగునె గోపాలకుండు?

(తెభా-10.2-791-క.)[మార్చు]

జా రుఁడు జన్మావధియును
'జో రుఁడు ముప్పోకలాఁడు సుమహితపూజా
చా క్రియలకు నర్హుఁడె
'వా క యితఁడ నుచు నశుభవాక్యస్ఫూర్తిన్.

(తెభా-10.2-792-చ.)[మార్చు]

' ని తను దూఱనాడిన మురాంతకుఁడా శిశుపాలు వాక్యముల్‌
'వి ని మదిఁ జీరికిం గొనఁడు విశ్రుతఫేరవ రావ మాత్మఁ గై
'కొ ని మృగేంద్రురీతి మునికోటియు రాజులుఁ బద్మనాభు నా
'డి యవినీతి భాషలకు డెందమునం గడు వంత నొందుచున్.

(తెభా-10.2-793-ఉ.)[మార్చు]

వీ నులుమూసికొంచు వినవిస్మయ మంచు ముకుంద! మాధవా!
శ్రీ నిధి! వీని నేగతికిఁ జేర్చెదొ యంచు దురాత్ముఁ దిట్టుచు
న్నా రనాథులున్ మునులు చ్చట నిల్వక పోవఁ బాండు సం
తా ము లప్రమేయ బలర్ప మహోద్ధత రోషచిత్తులై.

(తెభా-10.2-794-వ.)[మార్చు]

అప్పుడు కేకయ సృంజయభూపతులుం దామును వివిధాయుధ పాణులై యదల్చి నిల్చిన వాఁడును బిఱుతివక యదల్చి పలకయు వాలునుం గైకొని, భుజాగర్వదుర్వారుండై గోవిందునిఁ దదనువర్తులైన వారలం గుపితుండై నిందింప నమ్ముకుందుం డాగ్రహంబున లేచి తన కట్టెదుర నెదిర్చియున్న శిశుపాలుని రూక్షేక్షణంబుల వీక్షించుచు, నా క్షణంబ తన్మస్తకంబు నిశితధారా కరాళంబైన చక్రంబున నవక్రపరాక్రముండై రుధిరంబు దొరఁగం దునుమ నమ్మహాకలకలం బాకర్ణించి చైద్యబలంబులు దదీయపక్షచరులైన భూపతులును గనుకనిం బఱచి; రయ్యవసరంబున.

(తెభా-10.2-795-క.)[మార్చు]

ము నివరులును జనపతులును
' నుఁగొని వెఱఁగందఁ జైద్యుగాత్రమునందుం
నుపమ తేజము వెలువడి
' జోదరు దేహమందు డిఁ జొచ్చె నృపా!

(తెభా-10.2-796-వ.)[మార్చు]

అనిన మునివరునకు భూవరుం డిట్లనియె.

(తెభా-10.2-797-క.)[మార్చు]

లాక్షుని నిందించిన
' ఘోషతనూభవుండు దారుణ మల కూ
మునుం బొందక యే క్రియ
'సు హితమతిఁ గృష్ణునందుఁ జొచ్చె మునీంద్రా!

(తెభా-10.2-798-వ.)[మార్చు]

అనిన శుకయోగి రాజయోగి కిట్లనియె.

(తెభా-10.2-799-మ.)[మార్చు]

' ధుదైత్యాంతకుమీఁది మత్సరమునన్ త్తిల్లి జన్మత్రయా
' ధి యే ప్రొద్దుఁ దదీయ రూప గుణ దివ్యధ్యాన పారీణ ధీ
'ని ధి యౌటన్ శిశుపాలభూవిభుఁడు తా నిర్ధూత సర్వాఘుఁడై
'వి ధి రుద్రాదుల కందరాని పదవిన్ వే పొందె నుర్వీశ్వరా!

21-05-2016: :
గణనాధ్యాయి 11:12, 12 డిసెంబరు 2016 (UTC)