పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/ధర్మరాజాదుల అవబృథంబు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ధర్మరాజాదుల అవబృథంబు

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/ధర్మరాజాదుల అవబృథంబు)
రచయిత: పోతన


(తెభా-10.2-800-వ.)[మార్చు]

అంత ధర్మనందనుండు ఋత్విగ్గణంబులను సదస్యులను బహుదక్షిణలం దనిపి వివిధార్చనలం బూజించి యవభృథస్నానక్రియా పరితోషంబున.

(తెభా-10.2-801-సీ.)[మార్చు]

'మురజ మృదంగ గోముఖ శంఖ డిండిమ;
'ణవాది రవము లంరము నిండఁ
'వి సూత మాగధ గాయక వంది వై;
'తాళిక వినుతు లందంద బెరయ
'వితతమర్దళ వేణు వీణారవంబుల;
'తులకు నర్తకీతులు సెలఁగఁ
'రళ విచిత్రక ధ్వజపతాకాంకిత;
'స్యందన గజ వాజియములెక్కి

(తెభా-10.2-801.1-తే.)[మార్చు]

'సుత సహోదర హిత పురోహితజనంబు
'టక కేయూర హార కంణ కిరీట
'స్త్ర మాల్యానులేపనవ్రాతములను
'విభవ మొప్పారఁ గైసేసి వెడల నంత.

(తెభా-10.2-802-వ.)[మార్చు]

మఱియు యదు సృంజయ కాంభోజ కురు కేకయ కోసల భూపాల ముఖ్యులు చతుర్విధ సేనాసమేతులై ధరణి గంపింప వెన్నడి నడతేర ఋత్విఙ్నికాయంబును సదస్యులను బ్రహ్మ ఘోషంబు లొలయ మున్నిడికొని శోభమానానూన ప్రభాభాసమాన సువర్ణమయమాలికా దివ్యమణిహారంబులు గంఠంబునం దేజరిల్ల నున్నత జవాశ్వంబులం బూన్చిన పుష్పరథంబు గళత్ర సమేతుండై యెక్కి యతిమనోహర విభవాభిరాముండై చనుదెంచు చుండె; నప్పుడు వారాంగనా జనంబులు దమ తమ వారలం గూడికొని.

(తెభా-10.2-803-సీ.)[మార్చు]

'నకాద్రిసానుసంత కేకినుల భాతిఁ;
'గ్రొమ్ముళ్ళు వీఁపుల గునిసి యాడఁ
'రళ తాటంక ముక్తాఫలాంశుద్యుతుల్‌;
'చెక్కుటద్దములతోఁ జెలిమిసేయఁ
'బొలసి యదృశ్యమై పోని క్రొమ్మెఱుఁగుల;
'గతులఁ గటాక్షదీధితులు దనర
'మంచుపై నెగయ నుంకించు జక్కవ లనఁ;
'న్నులు జిలుఁగు కంలల నఱుమ

(తెభా-10.2-803.1-తే.)[మార్చు]

'హితకుచభారకంపితధ్య లగుచు
'ర్థి మొలనూళ్ళు మెఱయఁ బయ్యదలు జారఁ
'రసరోజాతకంకణక్వణనములును
'రణనూపురఘోషముల్‌ సందడింప.

(తెభా-10.2-804-వ.)[మార్చు]

మఱియు నయ్యిందువదన లందంద మందగమనంబునం జెందు ఘర్మజల బిందుసందోహ కందళిత మందహాసచంద్రికాసుందర వదనారవిందంబుల నిందిందిర రుచిర చికురబృందంబులు చిందఱవందఱలై సందడిగొన, నమందానందహృదయలై, సువర్ణశృంగ సంగతంబులైన సంకుమద మలయజ ముఖ సురభితోయంబులు సముదాయంబులై తమ తోయంబులవారి పయిం జల్లుచుఁ బెందొవలఁ గెందలిరుల రచియించిన చిమ్మనగ్రోవులఁ దావులు గల పూఁదేనియలు నించి, వావులు దెలిపి, ఠేవలు మీఱఁ, గ్రేవల నుండి యిమ్ములం గని చిమ్ముచుఁ, మృగమద కుంకుమ పంకంబును గొంకక బింకముల జంకెన లొలయం బంకజ సన్నిభంబు లగు మొగంబుల నేమఱించి చరుముచు నుల్లంబులు పల్లవింపఁ బెల్లడరి యందియలు గల్లుగల్లని మొరయఁ గ్రేళ్లుదాఁటుచుం జారు చంద్రికాసార ఘనసారధూళి మిళిత రజనీపరాగంబు రాగంబు రంజిల్లం గరంబులం బుచ్చికొని శిరంబులం జల్లుచుఁ జిత్తంబుల నమ్మత్తకాశినుల వృత్తంబులగు కుచంబుల కెత్తువత్తుమని బిత్తరించు పువ్వుగుత్తులం దత్తఱంబున వ్రేయుచుఁ బరిహసించుచు నన్యోన్యకర కిసలయ కనకకరండభరితంబగు పన్నీటం జెంగావి జిలుఁగుఁ బుట్టంబులు దట్టంబుగాఁ దోఁగి మర్మంబులు బయలు పడిన నగ్గలంబు లగు సిగ్గులకు నొప్పిదంబులగు తమ కనుఱెప్ప లడ్డంబు సేయుచుఁ బురుషులుం దాము నారామ లభిరామలీలా రసోక్తు లెనయ నంతరంగంబుల సంతసంబునం బంతంబులిచ్చుచు వసంతంబు లాడి రవ్వేళ నతుల విమానారూఢులైన యింద్రపురంధ్రీజనంబులుంబోలె హాటకశిబిక లెక్కి, నిజచేటికాజనంబులు సేవింపఁ జనుదెంచు భూకాంతకాంతాజనంబులం దమ సరసంబులకు నర్హంబులైన ధరణీపాల వధూలలామంబు లాదరించు చెలులపైఁ దమ సఖీజనంబులం బురికొల్పి చల్లించుచు భావగర్భితంబులగువారి చతురసరసోక్తుల మందహాసచంద్రికలు ముఖకమల లీలావిలాసలక్ష్మిం బ్రోదిసేయం జని రవ్విధంబున నిజసామ్రాజ్య విభవంబు పూజ్యంబుగా నజాతశత్రుండు గంగాప్రవాహంబున కరిగి యందు నిజవధూయుక్తుండై శాస్త్రోక్తప్రకారంబున నవభృథస్నానం బాచరించె; నా సమయంబున.

(తెభా-10.2-805-క.)[మార్చు]

నిమిషదుందుభి ఘన ని
స్వ ములు వీతెంచెఁ బుష్పర్షము గురిసెన్
ము నిదేవపితృమహీసుర
వి నుతుల రవ మెసఁగె నపుడు విమలచరిత్రా!

(తెభా-10.2-806-క.)[మార్చు]

రులెట్టి పాపు లైనను
మర్థిని నెద్ది సేసి తకల్మషులై
రియింతు రట్టి యవభృథ
రుదుగఁ గావించి రెలమి ఖిలజనంబుల్‌.

(తెభా-10.2-807-ఆ.)[మార్చు]

అంత ధర్మతనయుఁభినవమృదుల దు
కూల సురభికుసుమమాలికాను
లేపనములు రత్నదీపితభూషణా
ళులు దాల్చి వైభమున నొప్పె.

(తెభా-10.2-808-వ.)[మార్చు]

అంత నవభృథస్నానానంతరంబున మరలి చనుదెంచి,

(తెభా-10.2-809-ఉ.)[మార్చు]

పాం డుతనూభవాగ్రజుఁడు పాండుయశోనిధి భాసమాన మా
ర్తాం నిభుండు యాజక సస్య మహీసుర మిత్ర బంధు రా
ణ్మం లిఁ బూజ సేసి బుధమాన్యచరిత్రుడు వారి కిచ్చెనొం
డొం దుకూలరత్న కనకోజ్జ్వలభూషణముఖ్యవస్తువుల్‌.

(తెభా-10.2-810-వ.)[మార్చు]

అట్లు నారాయణపరాయణులై దేవసమాన ప్రకాశప్రభావంబుల సకలనరనారీలోకంబు లనర్ఘ్యరత్నమయభూషణ మాల్యానులేపనంబులు ధరించి పరమానంద భరితాత్ములై యెప్పియుండి; రంత.

(తెభా-10.2-811-చ.)[మార్చు]

సు నిశితభక్తిఁ దన్మఖముఁ జూడఁగ వచ్చిన యట్టి దేవతా
ము ని ధరణీసురప్రకర భూవర విడ్జన శూద్రకోటి య
జ్జ వరచంద్రుచే నుచిత త్కృతులం బరితోషచిత్తులై
వి యముతోడ ధర్మజుని వీడ్కొని పోవుచుఁ బెక్కుభంగులన్.

(తెభా-10.2-812-చ.)[మార్చు]

రిచరణాంబుజాతయుగళార్చకుఁడై పెనుపొందు పాండుభూ
సుతరాజసూయమఖ వైభవమున్ నుతియించుచున్ సమా
మున నాత్మభూముల కుదారత నేఁగిరి ధర్మసూనుఁడున్
సిజనేత్రుఁ దా ననుపఁజాలక యుండు మటంచు వేఁడినన్.

(తెభా-10.2-813-వ.)[మార్చు]

ఇట్లు పాండవాగ్రజుప్రార్థనం గైకొని దామోదరుండు సమస్త యాదవులను గుశస్థలికిఁ బోవంబనిచి కతిపయ పరిజనంబులుం దానును నతనికిఁ బ్రియంబుగాఁదన్నగరంబునఁ బ్రమోదంబున నుండె” నని చెప్పి మఱియు నిట్లనియె.

(తెభా-10.2-814-చ.)[మార్చు]

వర! పాండుభూపతనుజాతుఁడు దుస్తరమౌ మనోరథా
బ్ధి ని సరసీరుహాక్షుఁ డను తెప్ప కతంబున దాఁటి భూరి శో
యుతుఁడై మనోరుజయుఁ బాసి ముదాత్మకుఁడై వెలింగె న
వ్వ రుహనాభుదాసజనర్యులకుం గలవే యసాధ్యముల్‌?

(తెభా-10.2-815-వ.)[మార్చు]

అట్టి యెడ.

(తెభా-10.2-816-ఆ.)[మార్చు]

'రాజసూయమఖ వప్రభావమునకు
'ఖిలజనులు మోదమంది రపుడు
'కలుషమానసుండు కులపాంసనుఁడు సుయో
'నుఁ డొకండు దక్క రణినాథ!

(తెభా-10.2-817-వ.)[మార్చు]

అనిన విని శుకయోగీంద్రునకుఁ బరీక్షిన్నరేంద్రుం డిట్లనియె.

(తెభా-10.2-818-ఆ.)[మార్చు]

'ఖిల జనుల కెల్ల నానందజనకమై
'యెనయు మఖము కురుకులేశ్వరునకుఁ
'ర మసహ్యమైన కారణ మెయ్యది
'యెఱుఁగఁ బలుకు నాకు నిద్ధచరిత!

(తెభా-10.2-819-చ.)[మార్చు]

' నిన మునీంద్రుఁ డిట్లను ధరాధిపుతోఁ గురురాజు పాండు నం
' నులదెసన్ననేక దురితంబులు నిచ్చలుఁ జేయుచుండు నై
' ను నొకనాఁడు పంకరుహనాభ దయాపరిలబ్ధభూరి శో
' జిత దేవదైత్యనరపాలకరాజ్యరమామహత్త్వమై.

(తెభా-10.2-820-చ.)[మార్చు]

'వె యు ననూనసంపదల విశ్రుతకీర్తులు మిన్ను ముట్టఁ బెం
' రిన పాండుభూవరసుతాగ్రజుఁ డంతిపురంబులోన ను
'జ్జ్వ మణిభూషణాంశురుచిజాలము బర్వఁ బయోజనాభు ను
'త్క లిక భజించుచున్ ఘనసుస్థితి భూరిమనోహరాకృతిన్.

(తెభా-10.2-821-వ.)[మార్చు]

ఉండం గనుంగొని; యదియునుంగాక, యొక్కనాఁడు లలితాష్టమీ శశాంకబింబంబులం విడంబించుచు నింద్రనీలరుచినిచయంబు నపహసించు కుటిలకుంతలంబులు నటనంబు సలుపం దనరు నిటలఫలకంబులును, బుష్పచాపుచాపంబు రూపునేపుమాపు భ్రూయుగోపాంతంబులై సౌదామనీదామ రుచిస్తోమంబులై, కర్ణాంతసీమంబులై యంజనంబులతోడ రంజిల్లు నేత్రకంజంబులును, నవమల్లికాముకుళ విభాసిత దంతమరీచికా నిచయోద్దీపిత మందహాసచంద్రికాధవళితంబులును, ముకురోపమితంబులై కర్ణకుండలమణిమరీచి జాలంబులు బెరసి బహుప్రకారంబులఁ బర్వంబొలుచు కపోలపాలికలును, విలసిత గ్రైవేయక ముక్తాఫలహార నిచయంబుల కిమ్ముచూపక మిసమిసని పసగల మెఱుంగులు గిఱికొన మీటినంబగులు ననం బొగడందగి మొగంబులకుం బుటంబులెగయు నుత్తుంగపీనకుచభారంబుల వ్రేఁగు లాఁగలేక తూఁగాడుచుం గరతల పరిమేయంబులగు మధ్యభాగంబులును, ఘనజఘనమండ లావతీర్ణకాంచన కాంచీకలాప కింకిణీకలకల నినాదోల్లసితంబులగు కటిప్రదేశంబులును, సల్లలిత హల్లక పల్లవకాంతుల మొల్లంబులఁ గొల్లలుగొని యభిరామంబులై శోభిల్లు పదపాణితలంబులును, నలసగతులం బదంబులం దనరు మణినూపురంబులు గోపురంబులం బ్రతిస్వనంబు లొలయ మొరయ నలరు చరణారవిందంబులును, రత్నవలయ కంక ణాంగుళీయకాది వివిధ భూషణద్యుతినిచయంబు లుష్ణమరీచి కరనిచయంబుల ధిక్కరింప వెలుంగు కరకంజంబులును, మృగ మద ఘనసార హరిచందనాగరు కుంకుమపంకంబుల భాసురంబులగు వాసనలు నాసారంధ్రంబులకు వెక్కసంబులై పొలయు సౌభాగ్యంబులు గలిగి చైతన్యంబు నొందిన మాణిక్యపుబొమ్మల విధంబున గగన మండలంబు నిర్గమించి, వసుధాతలంబున సంచరించు చంద్రరేఖల చెలువున శృంగారరసంబు మూర్తీభవించిన జగంబుల మోహపఱచు మోహినీదేవతలచందంబున, విల సించు మాధవ వధూసహస్రంబుల సంగతిని సౌదామనీలతయునుం బోలె నొప్పుచుండెడు ద్రుపదరాజనందన విభవంబును రాజసూయ మహాధ్వరోత్సవంబునం జూచి చిత్తంబుత్తలపడ సుయో ధనుండు సంతాపానలంబునం గ్రాఁగుచుండె; నంత నొక్కనాఁడు ధర్మనందనుఁడు నిర్మలంబగు సభాభవనంబునకుం జని.

(తెభా-10.2-822-సీ.)[మార్చు]

'సుత సహోదర పురోహిత బాంధవామాత్య;
'రిచార భటకోటి లసి కొలువఁ
'లిత మాగధ మంజు గానంబుఁ బాఠక;
'ఠన రవంబును బ్రమద మొసఁగఁ
'గంకణ ఝణఝణత్కారంబు శోభిల్ల;
'రసిజాననలు చారములిడఁగ
'య వినిర్మిత సభాధ్యంబునను భాస;
'మాన సింహాసనాసీనుఁ డగుచు

(తెభా-10.2-822.1-తే.)[మార్చు]

'మర గణములు గొలువఁ బెంపారు ననిమి
'షేంద్రుకైవడి మెఱసి యుపేంద్రుఁ డలర
'సరసఁ గొలువున్న యత్తఱి దురభిమాని
'క్రోధమాత్సర్యధనుఁడు సుయోధనుండు.

(తెభా-10.2-823-ఉ.)[మార్చు]

'కాం నరత్నభూషణ నికాయముఁ దాల్చి సముజ్జ్వలప్రభో
'దం చితమూర్తి నొప్పి ఫణిహారులు ముందటఁ గ్రందు వాయ వా
'రిం సహోదరుల్‌ నృపవరేణ్యులు పార్శ్వములన్ భజింప నే
'తెం చెను రాజసంబున యుధిష్ఠిరుపాలికి వైభవోన్నతిన్.

21-05-2016: :
గణనాధ్యాయి 11:12, 12 డిసెంబరు 2016 (UTC)