పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/జరాసంధుని వధింపఁ బోవుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

జరాసంధుని వధింపఁ బోవుట

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/జరాసంధుని వధింపఁ బోవుట)
రచయిత: పోతన


(తెభా-10.2-718-వ.)[మార్చు]

ఇట్లు కృష్ణభీమార్జునులు బ్రాహ్మణ వేషంబులు దాల్చి త్రేతాగ్నులుం బోలెఁ దమ శరీరతేజోవిశేషంబులు వెలుంగ, నతిత్వరితగతిం జని గిరివ్రజంబు సొచ్చి యందు యతిథిపూజలు శ్రద్ధాగరిష్ఠ చిత్తుండై కావించుచున్న జరాసంధునిం గనుంగొని యిట్లనిరి.

(తెభా-10.2-719-క.)[మార్చు]

ణీశ! యతిథిపూజా
' రుఁడవు నీ వనుచు దిశలఁ లుకఁగ విని మే
రుదెంచితిమి మదీప్సిత
' సేయక యిమ్ము సువ్రతాచారనిధీ!

(తెభా-10.2-720-క.)[మార్చు]

తిథిజనంబుల భక్తిన్
' తముఁబూజించి యుచితత్కారము లు
న్న తి నడపు సజ్జనులు శా
'శ్వ కీర్తులు ధరణిఁబడయఁజాలుదు రనఘా!

(తెభా-10.2-721-క.)[మార్చు]

రికింపఁగ దేహం బ
'స్థి మని నిజబుద్ధిఁ దలఁచి చిరతరకీర్తి
స్ఫు ణం బ్రస్తుతి కెక్కని
'పు రుషుఁడు జీవన్మృతుండు భూరివివేకా!

(తెభా-10.2-722-క.)[మార్చు]

ధా రుణిలోన వదాన్యుల
'కీ రాని పదార్థ మొక్కటేనిం గలదే
కో రినఁ దన మేయెముకలు
'ధీ రుండై యిచ్చె నని దధీచిని వినమే?

(తెభా-10.2-723-క.)[మార్చు]

డిగిన వృథసేయక తన
'యొ లాఁకలిగొన్న యెఱుకు కోగిరముగ నే
ర్ప నిచ్చి కీర్తిఁ గనె నని
'పు మిన్ మును వినమె యల కపోతము ననఘా!

(తెభా-10.2-724-క.)[మార్చు]

యింద్రాగ్నులు శ్యేనక
'వా స రూపములఁ దన్ను లఁతిగ వేఁడన్
ధీ యుతుఁడై మును శిబి తన
'కా ము గోసిచ్చె నన జగంబుల వినమే!

(తెభా-10.2-725-ఆ.)[మార్చు]

'ధీరమతులు రంతిదేవ హరిశ్చంద్ర
'లులు నుంఛవృత్తి బ్రాహ్మణునిని
'మున్ను సెప్ప వినమె? సన్నుతచరితులు
'సన్న నైన నేఁడు నున్నవారు.

(తెభా-10.2-726-వ.)[మార్చు]

అనిన విని జరాసంధుండు వారల రూపంబులును, మేఘగంభీర భాషణంబులును, గుణకిణాంకంబులును మహాప్రభావంబులును జూచి తన మనంబున “వీరలు బ్రాహ్మణవేషధారులైన రాజేంద్రులు గానోపుదు” రని తలంచి “యిమ్మహాత్ములు గోరిన పదార్థంబ కాదు; ప్రాణంబులేనియు నిత్తు; నదియునుం గాక తొల్లి బలీంద్రుండు విప్రవ్యాజంబున నడిగిన విష్ణుదేవునకు నాత్మపదభ్రష్టత్వం బెఱింగియు విచారింపక జగత్త్రయంబు నిచ్చి కీర్తిపరుండయ్యె; క్షత్రబంధుం డనువాఁడు బ్రాహ్మణార్థంబు నిజప్రాణపరిత్యాగంబు సేసి నిర్మలంబగు యశంబు వడసె; నది గావున ననిత్యంబైన కాయంబు విచారణీయంబు గాదు; కీర్తి వడయుట లెస్స” యని తలంచి యుదారుండై కృష్ణార్జునభీములం గని యిట్లనియె.

(తెభా-10.2-727-క.)[మార్చు]

భూ రిగుణులార! మీ మది
కో రిక యెఱిఁగింపుఁ డేమి కోరిననైనన్
ధీ త నొసఁగుటయే కా
దా య నా శిరము ద్రుంచి యైనను నిత్తున్.

(తెభా-10.2-728-ఉ.)[మార్చు]

నా వుడుఁ గృష్ణుఁ డమ్మగధనాధున కిట్లను భూవరేణ్య! నీ
భా ము సూనృతవ్రతశుస్థితిఁ జెందు టెఱుంగవచ్చె మా
కీ లె నాజిభిక్ష; యితఁ డింద్రతనూభవుఁ డే నుపేంద్రుఁడం
బా ని యీతఁ డిం దొకనిఁ బైకొని యెక్కటి పోరఁగాఁ దగున్.

(తెభా-10.2-729-చ.)[మార్చు]

విని వాఁడు నవ్వి యహహా! విన వింతలుపుట్టె మున్ను న
న్న నిమొన నోర్వఁజాలక భయంబునఁ బాఱితి పెక్కుమార్లు; వం
మథురాపురిన్ విడిచి సాగరమధ్యమునందు డాఁగవే?
రుహనాభ! నీ బిరుదు వాఁడితనంబును నాకు వింతయే?

(తెభా-10.2-730-క.)[మార్చు]

న్నేల సెప్ప? మాయలఁ
న్నినఁ బో విడువ గోపబాలక! బల సం
న్నుని మాగధభూవరు
న్నెఱుఁగవె తొల్లి నందనందన! పోరన్?

(తెభా-10.2-731-ఉ.)[మార్చు]

కా రణోర్వి నన్నెదురఁ ష్టము గాన తలంగు; గోత్రభి
త్సూ నుఁడుభూరిబాహుబలదుర్దముఁడయ్యునుబిన్న; యీమరు
త్సూ నుఁడు మామకప్రకటదోర్బలశక్తికిఁ జూడఁ దుల్యుఁడౌ;
వీ నినెదుర్తు నంచుఁ జెయివీచె జరాసుతుఁ డుగ్రమూర్తియై.

(తెభా-10.2-732-క.)[మార్చు]

రువలిసుతునకు నొక భీ
గద నిప్పించి యొక్కదఁ దనకేలన్
రియించి నలువురును గ్ర
చ్చ ఱఁ బురి వెలి కేగి యచట మతలభూమిన్.

21-05-2016: :
గణనాధ్యాయి 11:09, 12 డిసెంబరు 2016 (UTC)