పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/హస్తినఁ గంగం ద్రోయబోవుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

హస్తినఁగంగంద్రోయబోవుట

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/హస్తినఁ గంగం ద్రోయబోవుట)
రచయిత: పోతన


(తెభా-10.2-588-వ.)[మార్చు]

ఇట్లు పూని కౌరవరాజధాని యైన కరినగరంబు కడతల హలాగ్రంబును జొనిపి యప్పుటభేదనవిస్తారంబగు గడ్డ భుజాగర్వ దుర్వారుండై పెకలించి తిగిచి గంగాప్రవాహంబునం బడఁద్రోయ గమకించిన నప్పుడు, మహాజలమధ్య విలోలంబగు నావ చందంబున నన్నగరంబు వడవడ వడంకుచు గోపుర వప్ర ప్రాకార సౌధా ట్టాలక తోరణ ధ్వజ ద్వార కవాట కుడ్య వీథీ యుతంబుగా నొడ్డ గెడవైనఁ బౌరజనంబులు పుడమి నడుగులిడంగరాక తడంబడుచు, నార్తులై కుయ్యిడుచుండి; రట్టియెడ నమ్మహోత్పాతంబులు గనుంగొని; తాలాంకుండు గినుక వొడమి కావించిన యుపద్రవంబుగా నెఱింగి; దానికిఁ బ్రతీకారంబు లేమిని; గళవళంబున భయాకులమానసు లై పుత్ర మిత్ర కళత్ర బంధు భృత్య పౌరజన సమేతంబుగా భీష్మ దుర్యోధనాది కౌరవులు వేగంబున నతని చరణంబుల శరణంబులుగాఁ దలంచి, సాంబునిఁ గన్యకాయుక్తంబుగా ననేక మణిమయ భూషణాంబర జాలంబుతోఁ గొనివచ్చి; దండప్రణామంబు లాచరించి కరకమలంబులు మొగిడ్చి యిట్లనిరి.

(తెభా-10.2-589-క.)[మార్చు]

రా మ! సమంచితముక్తా
'దా మ! యశఃకామ! ఘనసుధాధామ! రుచి
స్తో మ! జయసీమ! జగదభి
'రా మ! గుణోద్దామ! నిఖిలరాజలలామా!

(తెభా-10.2-590-క.)[మార్చు]

నీ హిమ యెఱిఁగి పొగడఁగఁ
'నే మెంతటివార? మఖిలనేతవు; త్రిజగత్‌
క్షే మంకరుఁడవు; సుమతివి
'తా సులము మమ్ముఁ గావఁ గు హలపాణీ!

(తెభా-10.2-591-క.)[మార్చు]

భూ క్ర మెల్లఁ దాల్చిన
'యా క్రీశ్వరుఁడు దావకాంశుఁడు బలదే
వా! క్రికి నగ్రజుఁడవు
'నీ క్రియ లుడుపఁ జెల్లు నీకు జితారీ!

(తెభా-10.2-592-క.)[మార్చు]

క్షింపుము రక్షింపు ము
'పే క్షింపక నమితనిఖిలబృందారక! ఘో
క్షణదాచరవిషనిట
'లా క్ష! భయాతురుల మమ్ము రయు మనంతా!

(తెభా-10.2-593-వ.)[మార్చు]

మఱియును దేవా! యీ సచరాచరంబు నయిన జగంబుల నీ లీలావినోదంబులం జేసి దుష్టజనమర్దనంబును, శిష్టజనరక్షణంబునుం జేయుచు, జగదుత్పత్తి స్థితి లయహేతువైన నీకు నమస్కరింతు” మని వెండియు నిట్లనిరి.

(తెభా-10.2-594-తే.)[మార్చు]

'వ్యయుండువు; సర్వభూతాత్మకుఁడవు;
'ర్వశక్తి ధరుండవు; శాశ్వతుఁడవు;
'విశ్వకరుఁడవు; గురుఁడవు; విమలమూర్తి
'వైన నిన్ను నుతింప బ్రహ్మకును దరమె?

(తెభా-10.2-595-చ.)[మార్చు]

' ని వినుతించినం బ్రముదితాత్మకుఁడై హలపాణి వారలం
' నుఁగొని యోడ కోడకుఁడు కార్యగతిం దగి లిట్లు మీరు సే
'సి యవినీతిచేత నిటు చేసితి; నింక భయంబు దక్కి పొం
' నిన సుయోధనుండు వినయంబున నల్లునిఁ గూఁతునుం దగన్.

(తెభా-10.2-596-క.)[మార్చు]

నుపుచు నరణము దాసీ
' ముల వేయింటి లక్ష సైంధవములఁ దా
ని నుమడి యేనుంగులఁ గాం
' రథముల నాఱువేల మ్మతి నిచ్చెన్.

(తెభా-10.2-597-వ.)[మార్చు]

ఇట్లిచ్చి యనిచిన బలభద్రుండు గొడుకునుంగోడలిం దోడ్కొనుచుఁ బరమానందంబు నొందుచు, నక్కడక్కడి జనంబులు పదివేల విధంబులం బొగడ, నిజపురంబున కరిగి యచ్చట యాదవుల తోడఁ దాఁ గరిపురంబునకుం బోయిన విధంబును, వారలాడిన దురాలాపంబులును, దానందులకై యొనర్చిన ప్రతీకారంబును నెఱింగించి సుఖంబుండె; వారణపురంబు నేఁడును దక్షిణం బెగసి యుత్తరభాగం బొకించుక గంగకై క్రుంగి బలభద్రుని మాహాత్మ్యంబుఁ దెలుపుచున్న” దని యమ్మహాతుని భుజవీర్యం బవార్యం బనిచెప్పి శుకయోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రున కిట్లనియె.

21-05-2016: :
గణనాధ్యాయి 11:05, 12 డిసెంబరు 2016 (UTC)