పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/నారదుని ద్వారకాగమనంబు

వికీసోర్స్ నుండి

నారదుని ద్వారకాగమనంబు

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/నారదుని ద్వారకాగమనంబు)
రచయిత: పోతన


తెభా-10.2-598-చ.
"వర! యొక్కనాఁడు విను నారదసంయమి మాధవుండు దా
కునిఁ ద్రుంచి వాని భవనంబున నున్న పదాఱువేల సుం
రులను నొక్కమాటు ప్రమదంబున నందఱ కన్నిరూపులై
రిణయ మయ్యె నా విని శుస్థితిఁ దద్విభవంబుఁ జూడఁగన్.

టీక:- నరవర = రాజా; ఒక్క = ఒకానొక; నాడు = రోజు; విను = వినుము; నారద = నారద; సంయమి = ముని {సంయమి - సంయమనము కలవాడు, యోగి}; మాధవుండు = కృష్ణుడు; తాన్ = తను; నరకుని = నరకాసురుని; త్రుంచి = చంపి; వాని = అతని యొక్క; భవనంబునన్ = ఇంటిలో; ఉన్న = ఉన్నట్టి; పదాఱువేల = పదహారువేల (16000); సుందరులన్ = అందగత్తెలను; ఒక్క = ఒకే; మాటు = సారి; ప్రమదంబునన్ = సంతోషంగా; అందఱ = అందరి; కున్ = కి; అన్ని = అన్ని; రూపులు = స్వరూపములు కలవాడు; ఐ = అయ్యి; పరిణయము = వివాహము; అయ్యెన్ = అయ్యెను; నాన్ = అనగా; విని = విని; శుభ = శోభనకరమైన; స్థితిన్ = రీతిలో; తత్ = ఆ యొక్క; విభవంబున్ = వైభవమును; చూడగన్ = చూడవలెనని.
భావము:- “ఓ రాజశేఖరా! విను. శ్రీకృష్ణుడు నరకాసురుడిని చంపి, అతని మందిరంలో ఉన్న పదహారువేల మంది అందగత్తెలనూ వరించి, ఒకేమారు అందరికీ అన్ని రూపాలతో కనపడుతూ వివాహం చేసుకున్నాడు అనే వార్త నారదుడు విన్నాడు. ఒకనాడు ఆ కృష్ణవైభవం దర్శించాలనే కాంక్షతో ద్వారకకు వచ్చాడు. అప్పుడు....

తెభా-10.2-599-వ.
ఇట్లు దలంచి కృష్ణపాలితంబయిన ద్వారకానగరంబు డాయంజని ముందట.
టీక:- ఇట్లు = ఇలా; తలంచి = భావించుకొని; కృష్ణు = కృష్ణునిచే; పాలితంబున్ = పరిపాలింపబడినది; అయిన = ఐన; ద్వారకా = ద్వారకా; నగరంబు = పట్టణము; డాయన్ = దగ్గరకు; చని = వెళ్ళి; ముందటన్ = ఎదురుగా.
భావము:- అలా కృష్ణవైభవ దర్శనం కోసం నారదుడు ద్వారకలో ప్రవేశించి నప్పుడు.

తెభా-10.2-600-సీ.
శుక శారికా శిఖి పిక కూజిత ప్రస-
వాంచితోద్యానవనౌఘములనుఁ
లహంస సారస కైరవ కమల క-
హ్లార శోభిత కమలాకరములఁ
లమాది సస్య సంకుల వరేక్షుక్షేత్ర-
భూరి లసన్నదీ తీరములను
గిరిసాను పతిత నిర్ఝరకణ సందోహ-
సంతత హేమంతమయములనుఁ

తెభా-10.2-600.1-తే.
మలసంభవ కాంచనకార రచిత
చిరతరైశ్వర్య నగరలక్ష్మీకరాబ్జ
టిత నవరత్నమయ హేమటక మనఁగ
సొబగుమీఱిన కోటయుఁ జూచె మౌని.

టీక:- శుక = చిలుకలు; శారికా = గోరువంకలు; శిఖి = నెమళ్ళు; పిక = కోయిలలు యొక్క; కూజిత = కూతల చేత; ప్రసవ = పూలచేత; అంచిత = మనోజ్ఞములైన; ఉద్యానవన = ఉద్యానవనముల; ఓఘములను = సమూహములు; కలహంస = ఉత్తమజాతి హంసలచేత; సారస = బెగ్గురు పక్షులచేత; కైరవ = తెల్ల కలువలు; కమల = తామరపూలు; కహ్లార = ఎఱ్ఱ కలువలు చేత; శోభిత = శోభిల్లుచున్న; కమలాకరములన్ = సరస్సులచేత; కలమ = వరి; ఆది = మున్నగు; సస్య = పైరుల యొక్క; సంకుల = వ్యాపించుటతోటి; వర = ఉత్తమమైన; ఇక్షు = చెరకు; క్షేత్ర = పొలములు చేత; భూరి = మిక్కుటమైన; లసత్ = ప్రకాశించెడి; నదీ = నదుల; తీరములను = గట్లుచేత; గిరి = కొండ; సాను = చరియలనుండి; పతిత = పడుచున్న; నిర్ఝర = సెలయేళ్ళ; కణ = నీటితుంపరల; సందోహ = ప్రవాహములచేత; సంతత = ఎడతెగని; హేమంత = హేమంత; సమయములను = ఋతువులును; కమలసంభవ = బ్రహ్మదేవుడు అను; కాంచనాకర = కంసాలిచే, బంగారంపనివాడిచే; రచిత = చేయబడిన; చిరతర = మిక్కిలిఅధికమైన; ఐశ్వర్య = సంపదలతో కూడిన; నగర = పురము అను; లక్ష్మీ = లక్ష్మీదేవి; కర = చేతులు అను; అబ్జ = పద్మములందు; ఘటిత = కూర్చబడిన; నవరత్న = నవరత్నాలతో {నవరత్నాలు - 1వజ్రము 2వైఢూర్యము 3గోమేధికము 4పుష్యరాగము 5మరకతము 6మాణిక్యము 7నీలము 8ప్రవాళము 9ముత్యము అను తొమ్మిది మణులు}; మయ = పొదగబడిన; హేమ = బంగారపు; కటకము = చేతిగాజులు; అనగన్ = అన్నట్లుగా; సొబగు = అందము; మీఱిన = అతిశయించిన; కోటయున్ = కోటను; చూచెన్ = చూసెను; మౌని = మహర్షి.
భావము:- చిలుకలూ, గోరువంకలూ, నెమళ్ళూ, కోయిలలూ ఆనందంతో కలకలారావాలు చేస్తూ ఉన్న ఉద్యానవనాలను కనుగొన్నాడు. హంసలతోనూ, బెగ్గురపక్షులతోనూ, పద్మాలతోనూ, కలువలతోనూ శోభిస్తున్న సరస్సులను సందర్శించాడు. వరిపంటలతో కలకలలాడే క్షేత్రాలతోనూ చెరకుతోటలతోనూ కనువిందుచేసే నదీతీరాలను సందర్శించాడు. కొండచరియల నుంచి ఎడతెగకుండా జల్లులుగా పడుతున్న సెలయేటి నీటితుంపరల వలన సదా హేమంత ఋతువుగా అలరారుతున్న ప్రదేశాలనూ తిలకించాడు. భోగభాగ్యాలతో తులతూగే నగరలక్ష్మి తన చేతికి ధరించినదీ, బ్రహ్మతో సమానులైన స్వర్ణకారులు తయారుచేసినదీ అయిన నవరత్న ఖచిత బంగారు కంకణంలాగా ప్రకాశిస్తున్న కోటను చూసాడు.

తెభా-10.2-601-వ.
మఱియును, సముత్తుంగమణిసౌధగవాక్షరంధ్ర నిర్గత నీరంధ్ర ఘనసార చందనాగరు ధూపధూమపటల విలోకన సంజనిత పయోధరాభిశంకాంగీకృత తాండవకేళీవిలోల పురకామినీజనోప లాలిత నీలకంఠ సముదయంబును, జంద్రకాంతమణిస్ఫటికస్తంభ సంభృత మరకత పద్మరాగఘటిత నవరత్న కాంచనప్రాసాదశిఖరాగ్ర విన్యస్త బహుసూర్య విభ్రమకృదంచిత శాతకుంభకుంభ నిచయంబును, సమస్తవస్తువిస్తార సమర్పిత వైశ్యాగారవీథీవేదికా కలితంబును, మహితాతపనివారణ తరళవిచిత్రకేతనాబద్ధ మయూరశింజినీ నినదపూరితాశాంతరిక్షంబును, సరోజనాభ పూతనాచేతనాపహారాది నూతనవిజయసందేశలిఖిత స్వర్ణ వర్ణావళీవిభాసిత గోపురమణివిటంకప్రదేశంబును, యాదవేంద్ర దర్శనోత్సవాహూయమాన సమాగతనానాదేశాధీశభూరివారణ దానజల ప్రభూతపంకనిరసనైక గతాగత జనసమ్మర్ద కరకంకణ కర్షణ వికీర్యమాణ రజఃపుంజంబును; వినూత్న రత్నమయ మంగళరంగవల్లీ విరాజిత ప్రతిగృహప్రాంగణంబును, గుంకుమ సలిలసిక్త విపణిమార్గంబును, వందిమాగధసంగీతమంగళారావ విలసితంబును, భేరీ మృదంగ కాహళ శంఖ తూర్యరవాధరీకృత సాగరఘోషంబునునై, యమరావతీపురంబునుం బోలె వసుదేవ నందననివాసంబై, యనల పుటభేదనంబునుం బోలెఁ గృష్ణమార్గ సంచారభూతంబై, సంయమనీనామ నగరంబునుం బోలె హరి తనూభవాభిరామంబై, నైరృతినిలయంబునుం బోలెఁ బుణ్యజనాకీర్ణంబై, వరుణనివాసంబునుఁ బోలె గోత్రరక్షణభువనప్రశస్తంబై, ప్రభంజనపట్టణంబునుం బోలె మహాబలసమృద్ధంబై, యలకాపురంబునుం బోలె ముకుంద వర శంఖ మకరాంక కలితంబయి, రజతాచలంబునుం బోలె నుగ్రసేనాధిపార్యాలంకృతంబయి, నిగమంబునుం బోలె వివిధవర్ణక్రమవిధ్యుక్త సంచారంబయి, గ్రహమండలంబునుం బోలె గురుబుధకవిరాజమిత్ర విరాజితంబయి, సంతతకల్యాణవేదియుం బోలె వైవాహికోపేతంబయి, బలిదానవ కరతలంబునుం బోలె సంతతదానవారియుక్తంబయి, యొప్పు నప్పురంబు ప్రవేశించి, యందు విశ్వకర్మనిర్మితంబైన యంతఃపురంబున నుండు షోడశసహస్ర హర్మ్యంబులందు.
టీక:- మఱియును = ఇంకను; సముత్తంగ = మిక్కిలి ఎత్తైన; మణి = రత్నాల; సౌధ = మేడల; గవాక్ష = కిటికీ; రంధ్ర = కన్నముల; నిర్గత = వెలువడు; నీరంధ్రమునన్ = ఎడతెగని; ఘనసార = కర్పూరము; చందన = గంధపు; అగరు = అగరు; ధూప = ధూపముల యొక్క {ధూపము - సువాసనల పొగను సమర్పించుట}; ధూమ = పొగల; పటలన్ = సమూహములను; విలోకన = చూచుటచేత; సంజనిత = కలిగిన; పయోధర = మేఘముల; అభిశంకా = గట్టి అనుమానమును; అంగీకృత = నిజ మని భావించి; తాండవ = నాట్యము; కేళీ = ఆడుట యందు; విలోల = మునిగిన; పుర = పట్టణములో ఉండు; కామినీ = స్త్రీల; జన = సమూహములచే; ఉపలాలిత = పోషింపబడుతున్న; నీలకంఠ = నెమళ్ళ; సముదయంబును = సమూహము కలది; చంద్రకాంత = చలువరాయి; మణి = రాళ్ళ; స్ఫటిక = మెరుపురాళ్ళ; స్తంభ = స్తంభముల చేత; సంభృత = చక్కగా భరించబడిన; మరకత = పచ్చలు; పద్మరాగ = కెంపులు; ఘటిత = పొదిగిన; నవరత్న = నవరత్నాలు (9) గల; కాంచన = బంగారు; ప్రాసాద = భవనముల; శిఖర = పైభాగపు; అగ్ర = మీద; విన్యస్త = పొదిగిన; బహు = అనేకమైన; సూర్య = సూర్యులు; విభ్రమ = అనెడి భ్రమించుట; కృత్ = కలుగజేయుచున్న; అంచిత = చక్కటి; శాతకుంభ = బంగారు; కుంభ = కుంభముల; నిచయంబును = సమూహము కలది; సమస్త = సకలమైన; వస్తు = పదార్థములను; విస్తార = అధికముగా; సమర్పిత = ఉంచబడిన; వైశ్య = వ్యాపారము చేయువారి; ఆగార = ఇళ్ళు గల; వీథీ = వీధుల యందలి; వేదికా = అరుగులు; కలితంబును = కలది; మహిత = అధికమైన; ఆతప = ఎండవేడిమిని; నివారణ = పోగొట్టుటకు; తరళ = చలించుచున్న; విచిత్ర = విశిష్ఠముగా చిత్రించిన; కేతనా = కేతనము లందు; ఆబద్ధ = కట్టబడిన; మయూర = నెమలిఈకలు యొక్క; శింజినీ = చిరుగజ్జల; నినద = శబ్దములతో; పూరిత = నిండిన; ఆశా = దిక్కులు; అంతరిక్షంబును = ఆకాశము కలది; సరోజనాభ = కృష్ణుని యొక్క; పూతనా = పూతన అను రాక్షసి; చేతనా = ప్రాణములను; అపహర = అపహరించుట; ఆది = మున్నగు; నూతన = నవీనమైన; విజయ = గెలుపుల యొక్క; సందేశ = సందేశములను; లిఖిత = రాయబడిన; స్వర్ణ = బంగారు; వర్ణ = అక్షరముల; ఆవళీ = వరుసలచేత; విభాసిత = ప్రకాశింపజేసిన; గోపుర = పురద్వారము లందలి; మణి = రత్నాల; విటంక = చూరుల; ప్రదేశంబును = ప్రదేశములు కలది; యాదవేంద్ర = కృష్ణుని; దర్శన = చూచుటకు; ఉత్సవ = వేడుకలకు; ఆహూయమాన = పిలువబడినవారై; సమాగత = వచ్చిన; నానా = వివిధ; దేశ = దేశముల; అధీశ = రాజుల యొక్క; భూరి = అతి పెద్దవైన; వారణ = ఏనుగుల; దానజల = మదజలముచేత; ప్రభూత = పుట్టిన; పంక = బురదను; నిరసన = అణచుటను; ఏక = ముఖ్యమైన; గతాగత = రాకపోకల చేయు; జన = వారి యొక్క; సమ్మర్ద = సాంద్రత వలని; కరకంకణ = చేతిగాజులు; కర్షణ = ఒరిపిడులచేత; వికీర్యమాణ = రాలుచున్న; రజః = రజను యొక్క; పుంజంబును = సమూహము కలది; వినూత్న = సరికొత్త; రత్న = రత్నాలతో; మయ = నింపిన; మంగళ = శుభసూచకమైన; రంగవల్లీ = ముగ్గులచేత; విరాజిత = ప్రకాశించునట్టి; ప్రతిగృహ = అన్ని ఇళ్ళ; ప్రాంగణంబునున్ = ముంగిళ్ళు కలది; కుంకుమ = కుంకుమ కలిపిన; సలిల = నీటిచేత; సిక్త = తడపబడిన; విపణి = వ్యాపార, బజారు; మార్గంబును = వీధులు కలది; వంది = స్తుతిపాఠకుల; మాగధ = బిరుదు లుగ్గడించు వారి; సంగీత = పాటల యొక్క; మంగళ = మేలైన; ఆరావ = ధ్వనులచేత; విలసితంబును = విలసిల్లుచున్నది; భేరీ = రాండోళ్ళు; మృదంగ = మద్దెలలు; కాహళ = బాకాలు; శంఖ = శంఖములు; తూర్య = వాయిద్యముల; రవ = ధ్వనులచేత; అధరీకృత = కిదుపరచబడిన; సాగర = సముద్ర; ఘోషంబును = ఘోషకలది; ఐ = అయ్యి; అమరావతీ = దేవతల ఉనికిపట్టైన {దేవతల పట్టణము - అమరావతి}; పురంబునున్ = పట్టణమును; పోలె = వలె; వసుదేవనందన = కృష్ణుడు, వసువుల దేవతల ఉద్యానవనాలు; నివాసంబు = ఉండు స్థలము; ఐ = అయ్యి; అనల = అగ్నిదేవుని; పుటభేదనంబునున్ = పట్టణమును; పోలెన్ = వలె; కృష్ణమార్గ = కృష్ణుని దారిలో, నల్లని మార్గముల; సంచారభూతంబు = తిరుగుట కలిగినది, వ్యాప్తి కలది; ఐ = అయ్యి; సంయమనీ = సంయమని అను {సంయమని - యముని పట్టణము}; నామ = పేరుగల; నగరంబునున్ = పట్టణమును; పోలెన్ = వలె; హరితనూభవ = కృష్ణుని కొడుకులచే, సూర్యపుత్రుని (యముని)చే; అభిరామంబు = మనోజ్ఞమైనది; ఐ = అయ్యి; నైరృతి = నైరృతి; నిలయంబునున్ = పట్టణము; పోలెన్ = వలె; పుణ్యజనా = రాక్షసులచే, పుణ్యవంతులైన వారిచే; ఆకీర్ణంబు = నిండుగా ఉన్నది; ఐ = అయ్యి; వరుణ = వరుణుని; నివాసంబునున్ = పట్టణమును; పోలెన్ = వలె; గోత్ర = కొండల(మైనాకాది), స్వవంశస్థుల; రక్షణ = కాపాడుటచే; భువన = లోకులచే; ప్రశస్తంబు = శ్లాఘించబడునది; ఐ = అయ్యి; ప్రభంజన = వాయుదేవుని; పట్టణంబునున్ = పట్టణమును; పోలెన్ = వలె; మహాబల = మిక్కిలిశక్తి, గొప్ప సైన్యములు; సమృద్ధంబు = అధికముగా కలది; ఐ = అయ్యి; అలకాపురంబును = కుబేరుని పట్టణమును {అలకాపురము - కుబేరుని పట్టణము}; పోలెన్ = వలె; ముకుంద = ముకుందము, కృష్ణుని యొక్క; వర = వరము, ఉత్తమమైన; శంఖ = శంఖము, శంఖముతో; మకర = మకరము అనునిధుల, మొసలి; అంక = గురుతులు, గుర్తుగల జండాతో; కలితంబు = కలది, కూడినది; అయి = ఐ; రజతాచలంబునున్ = వెండికొండ, కైలాసము {కైలైసము - శివుని పట్టణము}; పోలెన్ = వలె; ఉగ్రసేనాధిపార్య = శివుడు కుమారస్వామి పార్వతులచే, ఉగ్రసేనమహారాజు అర్యులచే; అలంకృతంబున్ = అలంకరింపబడినది; అయి = ఐ; నిగమంబునున్ = వేదమును; పోలెన్ = వలె; వివిధ = నానావిధము లైన; వర్ణక్రమ = అక్షరమాల, వర్ణస్థుల పద్ధతులను; విధ్యుక్త = పద్ధతిగా వాడబడిన, పద్ధతి ప్రకారము; సంచారంబు = వ్యాప్తి కలది, నడచుటలు కలది; అయి = ఐ; గ్రహమండలంబునున్ = గ్రహమండలము; పోలెన్ = వలె; గురు = గురుగ్రహంచే, పూజ్యులైన; బుధ = బుధగ్రహంచే, జ్ఞానులైన; కవిరాజ = చంద్రునిచే, పండితోత్తముల; మిత్ర = సూర్యునిచే, స్నేహితులచేత; విరాజితంబు = విరాజిల్లుతున్నది; అయి = ఐ; సంతత = ఎడతెగని; కల్యాణవేదియున్ = పెళ్ళిమండపము; పోలెన్ = వలె; వైవాహిక = పెళ్ళిళ్ళతో; ఉపేతంబున్ = కూడినది; అయి = ఐ; బలిదానవ = బలిచక్రవర్తి యొక్క; కరతలంబునున్ = అరచేతి; పోలెన్ = వలె; సంతత = ఎడతెగని; దానవారి = కృష్ణునితో, దానోదకముతో; యుక్తంబు = కూడినది; అయి = ఐ; ఒప్పు = చక్కగా నుండు; ఆ = ఆ ప్రసిద్ధమైన; పురంబున్ = పట్టణము; ప్రవేశించి = లోపలికి వెళ్ళి; అందున్ = దానిలో; విశ్వకర్మ = విశ్వకర్మచే; నిర్మితంబు = నిర్మింపబడినది; ఐన = అయిన; అంతఃపురంబునన్ = అంతఃపురమలో; ఉండు = ఉండెడి; షోడశసహస్ర = పదహారువేల (16000); హర్మ్యంబుల్ = భవనముల; అందున్ = లోపల.
భావము:- ఆ ద్వారకానగరంలో చాలా ఎత్తైన మేడలు ఉన్నాయి. ఆ సౌధాల కిటికీలలో నుంచి అగరు ధూపధూమాలు వెలువడుతున్నాయి. ఆ నల్లని పొగలను మేఘాలని భ్రమించి, అచ్చటి కాంతామణులు ఎంతో అనురాగంతో లాలిస్తున్న నెమళ్ళు తాండవం చేస్తున్నాయి. ఆ పట్టణంలో చంద్రకాంతమణులు చెక్కిన స్ఫటిక స్తంభాలతో కూడిన నవరత్న ప్రాసాదాలు ఉన్నాయి. ఆ ప్రాసాద శిఖరాల మీద బంగారుకలశాలు అమర్చి ఉన్నాయి ఆ కలశాల మీద ప్రసరించిన సూర్యకిరణాలు వేలకొలది సూర్యబింబాలను సృష్టిస్తున్నాయి. ఆ పట్టణంలో సమస్త వస్తువులతో కలకల లాడుతున్న విపణివీధులు ఉన్నాయి. ఆ పట్టణంలో ఆకాశాన్ని అంటుతూ, ఎగురుతున్న చిత్రవిచిత్రమైన జెండా గుడ్డలు ఎండ తగలకుండా అడ్డుపడుతున్నాయి. గోపాల కృష్ణుడు బాలుడుగా చేసిన పూతన సంహారం మొదలైన వీరగాథలు బంగారు అక్షరాలతో చెక్కిన ఫలకాలు గోపురాలపై విరాజిల్లుతున్నాయి. నందనందనుని సందర్శన కోసం వచ్చిన నానాదేశాల రాజులు కానుకలుగా తెచ్చిన ఏనుగుల మదధారలతో తడిసిన ప్రదేశాలను వచ్చేపోయే వారి కరకంకణాల ఒరిపిడి వలన రాలిపడిన బంగారు రజను పొడిపొడిగా మారుస్తున్నాయి. ప్రతి ఇంటి ముందూ కొంగ్రొత్త రత్నాలతో ముద్దుముద్దుగా తీర్చిదిద్దిన ముత్యాలముగ్గులు అలరారుతున్నాయి. ఆ పట్టణం పన్నీరు చల్లిన వీధులతోనూ వందిమాగధుల సంగీత మంగళారావాలతోనూ సముద్రఘోషాన్ని సైతం క్రిందుపరచే భేరీ, మృదంగ, కాహళాది తూర్య ధ్వనులతోనూ నిండి ఉన్నది. అష్టదిక్పాలుర పట్టణాలను తలపించే ఆ ద్వారకాపట్టణాన్ని నారదుడు ప్రవేశించి అక్కడ విశ్వకర్మ చేత నిర్మించబడ్డ అంతఃపురంలోని పదహారువేల సౌధాలలోనూ శ్రీకృష్ణుడిని దర్శించాడు.

తెభా-10.2-602-సీ.
టికంపుఁ గంబముల్‌ వడంపుఁ బట్టెలు-
రకత రచితముల్‌ దురు లమర
వైడూర్యమణిగణలభులఁ బద్మరా-
గంబుల మొగడుల కాంతు లొలయ
జ్ఞాతివజ్ర లజ్జాల రుచులతో-
భాసిల్లు నీలసోపానములును
రుడపచ్చల విటంములును ఘనరుచి-
వెలసిన శశికాంత వేదికలును

తెభా-10.2-602.1-తే.
ఱలు మౌక్తికఘటిత కవాటములును
బ్రవిమలస్వర్ణమయ సాలభంజికలును
మించు కలరవ మెసఁగఁ గ్రీడించు మిథున
లీలనొప్పు కపోతపాలికలుఁ గలిగి.

టీక:- పటికంబు = స్ఫటికపు; కంబముల్ = స్తంభములు, కోళ్ళు; పవడంపు = పగడాల; పట్టెలు = కమ్మీపట్టీలు; మరకత = పచ్చలతో; రచితముల్ = రచింపబడిన; మదురులు = గోడ మీది కప్పు; అమరన్ = చక్కగానుండగా; వైడూర్య = వైడూర్యములు; మణి = రత్నాలు; గణ = సమూహములచే; వలభులన్ = చంద్రశాలలుచే; పద్మరాగంబుల = కెంపుల; మొగడుల = ఇంటినడికొప్పుల; కాంతులు = ప్రకాశములు; ఒలయన్ = వ్యాపించగా; సత్ = మంచి; జాతి = జాతిగల; వజ్రల = వజ్రముల; సజ్జాల = అలంకారముల; రుచుల = ప్రకాశముల; తోన్ = తోటి; భాసిల్లు = మెరిసిపోయెడి; నీల = నీలాల; సోపానములును = మెట్లు; గరుడపచ్చల = గరుడపచ్చలతోచేసిన; విటంకములును = గువ్వల గూళ్లును; ఘన = మిక్కుటమైన; రుచిన్ = కాంతులతో; వెలసిన = ఏర్పడిన; శశికాంత = చంద్రకాంత శిలల; వేదికలును = అరుగులు; వఱలు = చక్కగానున్న; మౌక్తిక = ముత్యాలు పొదిగిన; కవాటములును = తలుపులు; ప్రవిమల = మిక్కిలి స్వచ్ఛమైన; స్వర్ణమయ = బంగారము పూర్తిగా కల; సాలభంజికలును = బొమ్మలు; మించు = అతిశయించునట్టి; కల = మధురమైన; రవము = కూతలు; ఎసగన్ = వెలువడుచుండగా; క్రీడించు = క్రీడిస్తుండెడి; మిథున = ఆలుమగల; లీలన్ = విలాసములు; ఒప్పు = కలిగియుండు; కపోత = పావురాల; పాలికలున్ = గూళ్ళు; కలిగి = కలిగి.
భావము:- స్ఫటికపు స్తంభములు, పగడాల పట్టెలు, మరకత మణుల కప్పులు, శోభిల్లగా వైడూర్యాల ముంజూరులు, వజ్రాల కిటికీలు కాంతులీనగా; పద్మరాగాల నడికొప్పులూ, నీలాల సోపానాలు విలసిల్లగా; చంద్రకాంత వేదికలు గరుడపచ్చల గువ్వగూండ్లు ప్రకాశింపగా; ఆణిముత్యాలు కూర్చిన తలుపులు, సువర్ణమయ సాలభంజికలు, పావురాల జంటల కువకువలతో కూడిన గూళ్ళు కలిగిన ద్వారకానగరాన్ని నారదుడు దర్శించాడు.

తెభా-10.2-603-తే.
చేటికానీకపద తులాకోటిమధుర
నినదభరితమై రుచిరమాణిక్య దీప
మాలికయుఁ గల్గి చూపట్టఁ గ్రాలు నొక్క
లజలోచన నిజసౌధలము నందు.

టీక:- చేటికా = పరిచారికల; అనీక = సమూహముల; పద = పాదము లందలి; తులాకోటి = అందెల; మధుర = మధురమైన; నినద = రవములతో; భరితము = నిండినది; ఐ = అయ్యి; రుచిర = కాంతివంతమైన; మాణిక్య = మాణిక్యపు మణి; దీప = దీపముల; మాలికయున్ = వరుసలు; కల్గి = కలిగి; చూపట్టన్ = కనబడుట; క్రాలు = వర్తిల్లు; ఒక్క = ఒకానొక; జలజలోచన = సుందరి యొక్క {జలజలోచన - పద్మాక్షి, స్త్రీ}; నిజ = స్వంత; సౌధ = భవన; తలమున్ = ప్రదేశము; అందున్ = లో.
భావము:- చెలికత్తెల కాలిఅందెల మధుర ధ్వనులతో నిండి మంజుల మాణిక్యదీప మాలికలతో వెలుగొందే ఒక అందకత్తె సౌధంలో....

తెభా-10.2-604-తే.
నక కంకణ ఝణఝణత్కార కలిత
చంద్రబింబాననా హస్తలజ ఘటిత
చామరోద్ధూత మారుత లిత చికుర
ల్లవునిఁ గృష్ణు వల్లవీ ల్లవునిని.

టీక:- కనక = బంగారు; కంకణ = గాజుల; ఝణఝణత్కార = గలగల మను శబ్దములను; కలిత = కలిగిన; చంద్రబింబానన = స్త్రీల {చంద్రబింబాననలు - చంద్రబింబము వంటి ముఖము కల స్త్రీలు}; హస్త = చేతులు అను; జలజ = పద్మము లందు; ఘటిత = పట్టుకోబడిన; చామర = వింజామరలచే; ఉద్ధూత = విసరబడుతున్న; మారుత = గాలిచేత; చలిత = కదులుతున్న; చికుర = ముంగురుల; పల్లవునిన్ = విరివి కలవానిని; కృష్ణునిన్ = కృష్ణుడుని; వల్లవీ = గోపికలకి; వల్లవునిని = ప్రియుడిని.
భావము:- బంగారు కంకణాలు గలగలలాడుతు ఉండగా, సుందరీమణులు వీస్తున్న వింజామరల గాలికి కదులుతున్న ముంగురులు కల గోపికావల్లభుడు, నల్లనయ్యను నారదుడు చూసాడు.

తెభా-10.2-605-వ.
మఱియు హాటకనిష్కంబు లఱ్ఱులందు వెలుగొందఁ గంచుకంబులు శిరోవేష్టనంబులుఁ గనకకుండలంబులు ధరించి, సంచరించు కంచుకులును, సమాన వయోరూపగుణవిలాసవిభ్రమ కలితలయిన విలాసినీ సహస్రంబులును గొలువం గొలువున్న యప్పద్మలోచనుం గాంచన సింహాసనాసీనుం గాంచె; నప్పుండరీకాక్షుండును నారదుం జూచి ప్రత్యుత్థానంబు సేసి యప్పుడు.
టీక:- మఱియున్ = ఇంకను; హాటక = బంగారు; నిష్కంబులు = మాడలు {నిష్కము - పాతకాలపు టంకము (డబ్బు బిళ్ళ)}; అఱ్ఱులు = మెడల; అందున్ = లో; వెలుగొందన్ = ప్రకాశించగా; కంచుకంబులున్ = రవికెలు, వక్షస్థలాచ్ఛాదనములు; శిరోవేష్టనంబులున్ = తలపాగాలు; కనక = బంగారు; కుండలంబులున్ = చెవికుండలాలు; ధరించి = ధరించి; సంచరించు = వర్తిల్లెడి; కంచుకులును = అంతఃపురకావలివారు; సమాన = సరిసమానమైన; వయస్ = వయస్సు; రూప = అందము; గుణ = సుగుణములు; విలాస = మెలగుటలు; విభ్రమ = తిరుగుటలు; కలితలు = కలిగినవారు; అయిన = ఐన; విలాసినీ = స్త్రీల; సహస్రంబులును = వేలమంది (1000), అనేకులు; కొలువన్ = సేవించుచుండగా; కొలువున్న్ = కొలువుతీరి ఉన్న; ఆ = ఆ ప్రసిద్ధుడైన; పద్మలోచనున్ = పద్మాక్షుని, కృష్ణుని; కాంచన = బంగారు; సింహాసన = సింహాసనముపై; ఆసీనున్ = కూర్చున్నవానిని; కాంచెన్ = చూసెను; పుండరీకాక్షుండును = పద్మాక్షుడు, కృష్ణుడు; నారదున్ = నారదుడిని; చూచి = చూసి; ప్రత్యుత్థానంబు = లేచి ఎదురువెళ్ళుట; చేసి = చేసి; అప్పుడు = పిమ్మట.
భావము:- మెడలో ప్రకాశించే బంగారు పతకాలతో; కంచుకాలూ తలపాగాలూ కుండలాలూ ధరించి సంచరించే కంచుకి జనము; సరియైన వయో, రూప, గుణాలతో విలసిలిల్లే వేలాది లీలావతులు సేవిస్తూ ఉండగా, బంగారు సింహాసనంమీద కొలువుతీరి కూర్చున్న పద్మాక్షుడు శ్రీకృష్ణుడిని ఆ మహర్షి తిలకించాడు. తన వద్దకు వస్తున్న నారదమునిని చూసి గోపవల్లభుడు ఎదురు వచ్చాడు.

తెభా-10.2-606-క.
మునివరు పాదాంబుజములు
చారుకిరీటమణి వితానము సోఁకన్
విమితుఁడై నిజసింహా
మునఁ గూర్చుండఁ బెట్టి ద్వినయమునన్.

టీక:- ముని = ఋషి; వరున్ = ఉత్తముని; పాద = పాదములు అను; అంబుజములున్ = పద్మములను; తన = తన యొక్క; చారు = అందమైన; కిరీట = కిరీటములోని; మణి = రత్నాల; వితానమున్ = సమూహము; సోకన్ = తాకునట్లు; వినమితుడు = నమస్కరించినవాడు; ఐ = అయ్యి; నిజ = తన యొక్క; సింహాసనమునన్ = సింహాసనముపై; కూర్చుండబెట్టి = కూర్చోబెట్టి; సత్ = మిక్కిలి; వినయమునన్ = వినయముతో.
భావము:- శ్రీకృష్ణుడు తన కిరీటంలోని మణుల సమూహం మునిశ్రేష్ఠుడైన నారదుని పాదపద్మాలకు తాకేలా నమస్కారం చేసి, తన సింహాసనం మీద కూర్చోపెట్టి, చక్కటి వినయంతో....

తెభా-10.2-607-క.
పాదకమలతీర్థం
బు లోకములం బవిత్రముగఁ జేయు పురా
మౌని లోకగురుఁ డ
మ్ముని పదతీర్థంబు మస్తమున ధరియించెన్.

టీక:- తన = తన యొక్క; పాద = పాదములు అను; కమల = పద్మము లందలి; తీర్థంబునన్ = జలముతో; లోకములన్ = ఎల్లలోకములను; పవిత్రముగన్ = పావనముగా; చేయు = చేసెడి; పురాతనమౌని = కృష్ణుడు {పురాతనమౌని - బహుపాత కాలపు ముని, నారాయణఋషి ఐనవాడు, విష్ణువు}; లోకగురుడు = కృష్ణుడు {లోకగురుడు - ఎల్లలోకములకు తండ్రి, విష్ణువు}; ఆ = ఆ ప్రసిద్ధుడైన; ముని = నారదముని; పద = పాదము లందలి; తీర్థంబున్ = జలమును; మస్తమునన్ = తలమీద; ధరియించెన్ = ధరించెను.
భావము:- తన పాదకమలతీర్థంచేత సర్వలోకాలనూ పవిత్రం చేసే, ప్రాచీనమునీ, లోకగురుడూ అయిన శ్రీకృష్ణుడు నారదుడి పాదతీర్థం తన తల మీద ధరించాడు.

తెభా-10.2-608-వ.
ఇట్లు బ్రహ్మణ్యదేవుండును నరసఖుండునైన నారాయణుం డశేష తీర్థోపమానంబయిన మునీంద్రపాద తీర్థంబు ధరించినవాఁడయి, సుధాసారంబులైన మితభాషణంబుల నారదున కిట్లనియె.
టీక:- ఇట్లు = ఈ విధముగ; బ్రహ్మణ్య = వేదోక్తధర్మము నడపునట్టి; దేవుండును = భగవంతుడు; నర = అర్జునునకు; సఖుండునున్ = స్నేహితుడు; ఐన = అయినట్టి; నారాయణుండు = కృష్ణుడు; అశేష = లెక్కలేనన్ని; తీర్థ = పుణ్యతీర్థములకు; ఉపానంబులు = సరిపోలునవి; అయిన = అగు; ముని = ఋషి; ఇంద్ర = ఉత్తముని; పాద = పాదము లందలి; తీర్థంబున్ = జలమును; ధరించినవాడు = ధరించినవాడు; అయి = అయ్యి; సుధా = అమృతము; సారంబులు = వంటివి; ఐన = అయినట్టి; మితి = తక్కువైన; భాషణంబులన్ = మాటలతో; నారదున్ = నారదముని; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అలా దేవదేవుడూ, అర్జునుడి చెలికాడూ, నారాయణుడూ అయిన నల్లనయ్య సమస్త పుణ్యతీర్ధాలకూ సాటివచ్చే నారదమునీంద్రుడి పాదజలాన్ని తన తలపై ధరించి, అమృతం చిలికే పలుకులతో ఇలా అన్నాడు.

తెభా-10.2-609-క.
"ఏ ని పంచినఁ జేయుదుఁ
దాసవర!"యనుడు నతఁడు "దామోదర! చి
ద్రూక! భవదవతార
వ్యాపారము దుష్టనిగ్రహార్థము గాదే!

టీక:- ఏ = ఏ; పనిన్ = పనిని; పంచినన్ = చేయమనినను; చేయుదన్ = చేసెదను; తాపస = ఋషి; వర = శ్రేష్ఠుడా; అనుడున్ = అనగా; అతడు = నారదుడు; దామోదర = కృష్ణా; చిద్రూపక = జ్ఞానస్వరూప మైనవాడా; భవత్ = నీ యొక్క; అవతార = అవతార మెత్తిన; వ్యాపారము = ప్రయోజనము, పని; దుష్ట = దుష్టులను; నిగ్రహ = శిక్షించుట; అర్థము = కోసము; కాదే = కాదా, అవును.
భావము:- “ఓ తాపసోత్తమా! మీరు ఏ పని చేయమని ఆజ్ఞాపిస్తే ఆ పని చేస్తాను. సెలవీయండి.” ఇలా పలికిన కృష్ణుడితో నారదుడు ఇలా అన్నాడు. “ఓ దామోదరా! నీ అవతార లక్ష్యం దుర్మార్గులను శిక్షించడానికే కదా!

తెభా-10.2-610-తే.
ఖిలలోకైకపతివి, దయార్ద్రమతివి,
విశ్వసంరక్షకుండవు, శాశ్వతుఁడవు
వెలయ నే పనియైనఁ గావింతు ననుట
యార్త బంధుండ విది నీకు ద్భుతంబె!

టీక:- అఖిల = సర్వ; లోక = లోకములకు; ఏకైక = ప్రధానమైన; పతివి = ప్రభువవు; దయా = దయారసముచేత; ఆర్ద్ర = తడసిన; మతివి = మనస్సు కలవాడవు; విశ్వ = సర్వజగత్తును; సంరక్షకుండవు = కాపాడెడివాడవు; శాశ్వతుడవు = భూత భవిష్య ద్వర్తమానముల ఉండువాడవు; వెలయన్ = ప్రసిద్ధముగా; ఏ = ఏ; పనిన్ = పనిని; ఐనన్ = అయినను; కావింతును = చేసెదను; అనుట = అనుట; ఆర్త = ఆర్తిచెందినవారి ఎడల; బంధుండవు = బంధువువంటి వాడవు; ఇది = ఇది; నీ = నీ; కున్ = కు; అద్భుతంబె = విచిత్రమా.
భావము:- నీవు సమస్తలోకాలకూ ప్రభుడవు; దయా పూరిత మానసుడవు; ప్రపంచాన్ని రక్షించేవాడవు; ఆర్తులకు బాంధవుడవు; అయిన నీవు ఏ పని అయినా చేస్తానని చెప్పడం ఆశ్చర్యం కాదు.

తెభా-10.2-611-తే.
బ్జసంభవ హర దేవతార్చనీయ,
భూరిసంసారసాగరోత్తాణంబు,
వ్యయానందమోక్షదాకము నైన
నీ పదధ్యాన మాత్మలో నిలువనీవె "

టీక:- అబ్జసంభవ = బ్రహ్మదేవుడు; హర = శివుడు; దేవతా = దేవతలచేత; అర్చనీయ = అర్చింపదగినవాడ; భూరి = అతిమిక్కుటమైన {భూరి - అతి పెద్ద సంఖ్యయైన భూరి (1 తరువాత 34 సున్నాలు కల సంఖ్య) వలె అధికమైన}; సంసార = సంసారము అను; సాగర = సముద్రమును; ఉత్తారణంబున్ = తరించు సాధనము, దాటించునది; అవ్యయ = తరగని; ఆనంద = ఆనందమును; మోక్ష = ముక్తిని; దాయకమును = ఇచ్చునది; ఐన = అయిన; నీ = నీ యొక్క; పద = పాదముల యొక్క; ధ్యానమున్ = ధ్యానమును; ఆత్మ = మనసు; లోన్ = అందు; నిలువన్ = నిలుచునట్లు; ఈవె = ప్రసాదించుము.
భావము:- బ్రహ్మ, శివుడు మొదలైన దేవతల చేత పూజింపబడే ఓ కృష్ణా! సంసారసాగరాన్ని దాటడానికి సాధనము; మోక్షాన్ని ప్రసాదించేదీ; ఐన నీ పదధ్యానం నా ఆత్మలో నిలిచి ఉండేలా అనుగ్రహించు.”