పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/బలుడు నాగ నగరంబేగుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

బలుడు నాగనగరంబేగుట

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/బలుడు నాగ నగరంబేగుట)
రచయిత: పోతన


(తెభా-10.2-573-వ.)[మార్చు]

అని వారల వారించి తత్‌క్షణంబ బంధుప్రియుం డైన బలరాముండ నలార్కసంకాశంబగు కాంచనరథం బెక్కి యనురక్తులైన భూసురులును, నుద్ధవాదులగు కులవృద్ధులును సేవింపం గరిపురంబునకుం జని తత్పురోపకంఠవనంబున సురభికుసుమ ఫలభరితతరుచ్ఛాయావిరచిత చంద్రకాంత శిలాతలంబునందు వసియించి, మహితగ్రహమధ్యగతుండైన పూర్ణచంద్రు ననుకరించి యుండె; నంతఁ గార్యబోధనంబు సేయుటకై కౌరవులకడకుఁ బ్రబుద్ధుండైన యుద్ధవునిం బనిచినం జని యతం డాంబికేయునకు ధనురాచార్యాపగాతనూభవ సుయోధనులకుం బ్రణమిల్లి వారి చేత నభినందితుండై యిట్లనియె.

(తెభా-10.2-574-సీ.)[మార్చు]

భూరియశోధనులార! తాలాంకుండు;
నుదెంచి నగరోపనము నందు
నున్నవాఁ డనిన వా రుత్సాహమున బలుఁ;
బొడగను వేడుక బుద్ధిఁ దోఁపఁ
దనరారు కానికల్‌ గొని చని యర్ఘ్యపా;
ద్యాదిసత్కృతులు నెయ్యమునఁ జేసి
ధేనువు నిచ్చి సమ్మానించి యందఱు;
నందంద వందనం బాచరించి

(తెభా-10.2-574.1-తే.)[మార్చు]

యుచితభంగిని నచటఁ గూర్చున్న యెడను
గుశలమే మీకు? మాకును గుశల మనుచుఁ
లికి రాముఁడు కురునరపాలుఁ జూచి
చటి జనములు వినఁగ నిట్లనియెఁ దెలియ.

(తెభా-10.2-575-ఉ.)[మార్చు]

మా రనాథునాజ్ఞ నిజస్తములన్ ధరియించి కౌరవుల్‌
మా నుగఁజేయు టొప్పగుఁ; గుమారకునొక్కనిఁ బెక్కుయూథపుల్‌
పూ నిన లావుమై నెదిరి పోర జయించుట మీఁదితప్పు; త
ప్పై ను గాచె బాంధవహితాత్మకుఁడై మనుజాధినాథుఁడున్.

(తెభా-10.2-576-క.)[మార్చు]

ను మాటలు విని కౌరవ
నాయకుఁ డాత్మ నలిగి చాలుఁ బురే? యే
నఁ గలదు కాలగతి? చ
క్క నఁ గాలం దొడుగు పాదులు దల కెక్కెన్.

(తెభా-10.2-577-ఆ.)[మార్చు]

నము బంధువరుస న్నించు మన్ననఁ
గాదె రాజ్యభోగరిమఁ బొదలి
సుధఁ బేరు గలిగి వాసికి నెక్కుటఁ
మకు ననుభవింపఁ గని యట్టి.

(తెభా-10.2-578-వ.)[మార్చు]

సితచ్ఛత్ర చామర శంఖ కిరీట చిత్రశయ్యా సౌధ సింహాసనంబులు గైకొనుట మన మందెమేలంబునం గాదె? యిట్టిచో సరివారునుం బోలె నూరక గర్వించు యదుకులులతోడి సంబంధ సఖ్యంబులు సాలుఁ; బాములకుఁ బాలు వోసి పెంచిన విషంబు దప్పునే? మమ్ముం దమ పంపుసేయ మనుట సిగ్గులేకుంటఁ గాదె! యదియునుంగాక దివ్యాస్త్రకోవిదులైన గంగానందన గురు కృపాశ్వత్థామ కర్ణాది యోధవీరులకున్ లోఁబడ్డవానిని మహేంద్రునకైనను విడిపింపఁవచ్చునే? యహహ! వృథాజల్పంబుల కేమిపని?” యని దుర్భాషలాడుచు దిగ్గున లేచి నిజమందిరం బునకుం జనియె; నప్పుడు హలాయుధుం డమ్మాటల కదిరిపడి.

(తెభా-10.2-579-ఉ.)[మార్చు]

కౌ వుఁ డాడి పోయిన యగౌరవభాషల కాత్మఁ గిన్క దై
వా ఱఁగ నుల్లసత్ప్రళయభానుని కైవడి మండి చండ రో
షా రుణితాంబకుం డగుచు యాదవవృద్ధులఁ జూచి పల్కెఁ బెం
పా రిన రాజ్యవైభవమదాంధుల మాటలు మీరు వింటిరే?

(తెభా-10.2-580-తే.)[మార్చు]

శ్రీమదాంధులు సామంబుచేతఁ జక్కఁ
డుదురే యెందు? బోయఁడు సులఁ దోలు
గిది నుగ్రభుజావిజృంణ సమగ్ర
సుమహితాటోప మనిలోనఁ జూపకున్న.

(తెభా-10.2-581-క.)[మార్చు]

కౌ వుల సమయఁజేయ ను
దా త యదువీరవరుల దామోదరుఁడున్
రా రావలదని యచ్చట
వా రించితిఁ గాదె బంధుత్సలయుక్తిన్.

(తెభా-10.2-582-వ.)[మార్చు]

అదియునుం గాక.

(తెభా-10.2-583-సీ.)[మార్చు]

దేవు భృత్యులై యింద్రాది దిక్పాల;
రులు భజింతురు రుసతోడ
నే దేవుమందిరం బేపారు దేవతా;
రుసభావిభవసుంరతఁ జెంది
యే దేవుపదయుగం బేప్రొద్దు సేవించు;
ఖిల జగన్మాతయైన లక్ష్మి
యే దేవు చారు సమిద్ధకళాంశ సం;
వులము పద్మజవులు నేను

(తెభా-10.2-583.1-తే.)[మార్చు]

ట్టిదేవుండు దుష్టసంహారకుండు
రి ముకుందుండు పంపుసేయంగ నొప్పు
నుగ్రసేనుని రాజ్యసమగ్రగరిమ
యంతయును దార యిచ్చిన దంట! తలఁప.

(తెభా-10.2-584-చ.)[మార్చు]

దియును గాక యెవ్వని పదాంబుజచారురజోవితాన మా
త్రి దివవరాది దిక్పతి కిరీటములందు నలంకరించు; భూ
వి దితపుఁ దీర్థముం గడు బవిత్రము సేయును; నట్టి కృష్ణుచేఁ
బొ లిన రాజ్యచిహ్నములఁ బొందఁగ రాదఁట యేమిచోద్యమో!

(తెభా-10.2-585-క.)[మార్చు]

తా మఁట తలఁపం దల లఁట
యే మఁట పాదుకల మఁటఁ గణింపఁగ రాజ్య
శ్రీ దమున నిట్లాడిన
యీ నుజాధముని మాట కే మన వచ్చున్?

(తెభా-10.2-586-వ.)[మార్చు]

అని సక్రోధమానుసుండై యప్పుడు.

(తెభా-10.2-587-క.)[మార్చు]

ధా రుణి నిటమీఁదట ని
'ష్కౌ వముగఁ జేయకున్నఁ గాదని యుగ్రా
కా రుండై బలభద్రుఁడు
'సీ ము వెసఁ బూన్చి లావుఁ జేవయు నెసఁగన్.

21-05-2016: :
గణనాధ్యాయి 11:04, 12 డిసెంబరు 2016 (UTC)