పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/సుభద్రా పరిణయంబు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

సుభద్రా పరిణయంబు

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/సుభద్రా పరిణయంబు)
రచయిత: పోతన


(తెభా-10.2-1165-సీ.)[మార్చు]

మునినాథ! పార్థుండు వనజనాభుని సహో;
రి సుభద్రను నే విమునఁ బెండ్లి
య్యెను నా విధం బంతయు నాకును;
దెలియంగ నెఱిఁగింపు ధీవిశాల!
నవుడు నా వ్యాసనయుఁ డాతనిఁ జూచి;
వినవయ్య! నృప! దేవవిభుని సుతుఁడు
మును తీర్థయాత్రాసముత్సుకుండై చని;
మణఁ బ్రభాసతీర్థమున నుండి

(తెభా-10.2-1165.1-తే.)[మార్చు]

యా తలోదరితోడి నెయ్యంబు కలిమిఁ
జూడఁ గోరుచు రాముఁడు సుందరాంగిఁ
గౌరవేంద్రున కీ సమట్టె ననుచుఁ
నకు నెఱుఁగ రా నా పురంరసుతుండు.

(తెభా-10.2-1166-వ.)[మార్చు]

అట్లు సుభద్రా దర్శనోత్సాహంబు దన మనంబున సందడిగొనం, ద్రిదండివేషంబు ధరియించి, ద్వారకాపురంబునకుం జనుదెంచి, యప్పౌరజనంబులు భక్తిస్నేహంబుల ననిశంబుఁ బూజింపం దన మనోరథసిద్ధి యగునంతకుం గనిపెట్టుకొని, వానకాలంబు సనునంతకు నప్పట్టణంబున నుండు సమయంబున.

(తెభా-10.2-1167-క.)[మార్చు]

రా ముఁడు తత్కపటాకృతిఁ
దా దిఁ దెలియంగలేక గ నొకనాఁ డా
భూ మీవర తాపసుఁ బో
రా మిం గని యాత్మమందిమునకుఁ దెచ్చెన్.

(తెభా-10.2-1168-ఆ.)[మార్చు]

తెచ్చి భిక్షసేయ దేవేంద్రతనయుండు
గుడుచుచుండి యచటఁ గోరి మెలఁగు
సమబాణు మోహనాస్త్రంబుకై వడి
వీరమోహి నన విహారలీల.

(తెభా-10.2-1169-వ.)[మార్చు]

అట్లు సుభద్ర విహరించుచున్న సమయంబున.

(తెభా-10.2-1170-చ.)[మార్చు]

రుహపత్త్రనేత్రు ననుసంభవ చారువధూలలామ స
ల్ల లితవిహారవిభ్రమవిలాసము లాత్మకు విందు సేయ న
బ్బ రిపు నందనుండు గని భావజసాయకబాధ్యమాన వి
హ్వ హృదయాబ్జుఁడై నిలిపె త్తరుణీమణియందుఁ జిత్తమున్.

(తెభా-10.2-1171-ఉ.)[మార్చు]

రుణీశిరోమణియు ర్జును నర్జునచారుకీర్తి వి
ఖ్యా తుని నింద్రనందను నల్మషమానసుఁ గామినీ మనో
జా తునిఁ జూచి పుష్పశర సాయకజర్జరితాంతరంగయై
భీ తిలి యుండె సిగ్గు మురిపెంబును మోహముఁదేఱు చూపులన్.

(తెభా-10.2-1172-వ.)[మార్చు]

అట్లా నృపసత్తమ మత్తకాశినులొండొరుల చిత్తంబులు చిత్తజాయత్తంబులై కోర్కులు దత్తరింపం దాల్ములువీడ సిగ్గునం జిట్టుముట్టాడుచున్నయంత నొక్కనాఁడు దేవతామహోత్సవ నిమిత్తం బత్తలోదరి పురంబు వెలుపలికి నరుగుదెంచిన నర్జునుండు గృష్ణ దేవకీ వసుదేవుల యనుమతంబు వడసి తోడనం దానును చని యప్పుడు.

(తెభా-10.2-1173-సీ.)[మార్చు]

సాంద్రశరచ్చంద్ర చంద్రికా స్ఫూర్తిచే;
రాజిల్లు పూర్ణిమాజనివోలెఁ
బూర్ణేందు బింబావతీర్ణమై యిలమీఁద;
భాసిల్లు హరిణ డింభంబుఁ బోలె
సులలిత మేఘమండలమును నెడఁబాసి;
సుధఁ గ్రుమ్మరు తటిద్వల్లి వోలె
మాణిక్య రచిత సన్మహిత చైతన్యంబు;
వొందిన పుత్తడిబొమ్మ వోలె

(తెభా-10.2-1173.1-తే.)[మార్చు]

లిత విభ్రమ రుచి కళాక్షణములఁ
బొసఁగ రూపైన శృంగారరసముఁ బోలె
ర్థిఁ జరియించుచున్న పద్మాయతాక్షిఁ
బ్రకటసద్గుణభద్ర సుద్రఁ జూచి.

(తెభా-10.2-1174-వ.)[మార్చు]

అప్పుడు డాయం జని యరదంబుపై నిడుకొని పోవుచుండం గనుంగొని యదుబలంబులు మదంబున నంటం దాఁకిన, నప్పు డయ్యాఖండలనందనుండు ప్రచండగాండీవ కోదండ నిర్ముక్త కాండంబులం దూలించి, యఖండ బాహుదండ విజయప్రకాండుండై ఖాండవప్రస్థపురంబున కరిగె; నట బలభద్రుండవ్వార్త విని విలయ సమయ సమీరసఖునికైవడిం బటురోష భీషణాకారుండై క్రోధించి నం గని కృష్ణుండాదిగాఁగల బంధుజనంబు లతని చరణంబులకుం బ్రణమిల్లి మృదుమధుర భాషణంబుల ననునయించి యొడంబడునట్లుగా నాడిన నతండును సంతుష్టుండయి మనంబునఁ గలంకదేఱి, యప్పుడు.

(తెభా-10.2-1175-క.)[మార్చు]

రులం దేరుల నుత్తమ
' రులన్ మణి హేమభూషణాంబరభృత్యో
త్క దాసికాజనంబుల
' ణంబుగ నిచ్చి పంపె నుజకుఁ బ్రీతిన్.

(తెభా-10.2-1176-వ.)[మార్చు]

ఇట్లు కృష్ణున కభిమతంబుగా నర్జునసుభద్రల కరణంబిచ్చి పంపె" నని చెప్పి శుకయోగీంద్రుండు మఱియు నిట్లనియె.

21-05-2016: :
గణనాధ్యాయి 11:30, 12 డిసెంబరు 2016 (UTC)