పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/మృతులైన సహోదరులఁదెచ్చుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

మృతులైన సహోదరులఁదెచ్చుట

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/మృతులైన సహోదరులఁదెచ్చుట)
రచయిత: పోతన


(తెభా-10.2-1137-సీ.)[మార్చు]

'వనీశ! యొక్కనాఁ డానకదుందుఖి;
'భార్య పద్మాక్షుండు లుఁడుఁ దొల్లి
'శరధిలోఁ జొచ్చిన గురుతనూభవునిని;
'రలంగఁ దెచ్చిన హిమ లెల్ల
'నములు దమలోన న్నుతుల్‌ సేయంగ;
'విని తన సుతులు దుర్వృత్తుఁడైన
'కంసుచే నిహతులై కాలునిపురి నున్న;
'వారి నందఱఁ జూడఁ గోరి కృష్ణ

(తెభా-10.2-1137.1-తే.)[మార్చు]

'లులకడ కేగి కన్నుల బాష్పకణము
'లొలుక నో రామ! రామ! నిత్యోన్నతాత్మ!
'పరమపావనమూర్తి! యో మురవిభేది!
'యిందిరానాథ! యోగీశ్వరేశ! కృష్ణ!

(తెభా-10.2-1138-క.)[మార్చు]

ము కంస చైద్య పౌండ్రక
' క జరాతనయ యవన రనాయకులన్
దు రితాత్ములఁ బొరిగొని భూ
' ముడిపిన యట్టి మేటిలులు దలంపన్.

(తెభా-10.2-1139-ఆ.)[మార్చు]

'నన వృద్ధి విలయ సంగతి నిఖిలంబుఁ
'బొందఁ జేయు పరమపురుషులార!
'మీకు లీల లౌట మీ రని నమ్మిన
'దాన నేను వినుఁ డుదారులార!

(తెభా-10.2-1140-వ.)[మార్చు]

అని యనేక విధంబుల వినుతించుచు నిట్లనియె; “మీరలు మహానుభావులరు; మీరు తొల్లి యనేకకాలంబు సనినక్రిందట మృతుండై, దండధరుమందిరంబున నున్న గురుకుమారుని మీ మహాప్రభావంబులు లోకంబులఁ బరిపూర్ణంబులై ప్రకాశింప; నక్కాలుని చెంతనుండి మగుడందెచ్చి గురుదక్షిణగా నొసంగితి; రివ్విధంబునం గంసునిచేత హతులైన మత్పుత్త్రులనందఱ మరలం దెచ్చి నా మనంబున నున్న దుఃఖంబు నివారింపవలయు” నని దేవకీదేవి ప్రార్థించినం దమతల్లి యాడిన మృదుమధురవాక్యంబు లత్యాదరంబున నాదరించి, యప్పుడు బలకృష్ణులు దమ యోగమాయా మహత్త్వంబున సుతలంబునకుం జని; రట్టి యెడ.

(తెభా-10.2-1141-మ.)[మార్చు]

' నియెన్ దానవుఁ డింద్రసేనుఁడు దళత్కంజాక్షులన్ దక్షులన్
' సారాంబుదవర్ణులన్ నిఖిలలోకైకప్రభాపూర్ణులం
' రారన్ హలచక్రపాణులను భక్తత్రాణులన్ నిత్యశో
' వర్ధిష్ణుల రామకృష్ణుల జయభ్రాజిష్ణులన్ జిష్ణులన్.

(తెభా-10.2-1142-చ.)[మార్చు]

' ని హితకోటితో నెదురుగాఁ జనుదెంచి మనోనురాగ సం
' నిత కుతూహలుం డగుచుఁ జాఁగిలి మ్రొక్కి సమగ్ర కాంచనా
' ముల నుంచి తచ్చరణసారససేచన సర్వలోక పా
' సలిలంబు లౌదల ధ్రువంబుగఁ దాల్చి సుభక్తి యుక్తుఁ డై.

(తెభా-10.2-1143-సీ.)[మార్చు]

సురభి కాలాగరు హరిచంద నై లాది;
ధూపంబు లా విశ్వరూపకులకుఁ
గాంచనపాత్ర సంతరత్న కర్పూర;
దీపంబు లా జగద్దీపకులకుఁ
బాయసాపూపాన్న క్వఫలాది నై;
వేద్యంబు లా వేదవేద్యులకును
నరు వినూత్నరత్నప్రభాభాసి తా;
రణంబు లా దైత్యరణులకును

(తెభా-10.2-1143.1-తే.)[మార్చు]

'మిలమిలని మంచుతోఁ బొలుపలరు బహు వి
'ధాంబరంబులు నీలపీతాంబరులకు
'లలిత కుసుమమాలికా లయజాను
'లేపనంబులు భూరినిర్లేపులకును.

(తెభా-10.2-1144-వ.)[మార్చు]

సమర్పించి యప్పుండరీకాక్షుని చరణారవిందంబు లొత్తుచు నా నందబాష్పపూరంబు తోరంబుగా రోమాంచ కంచుకిత శరీరుండగుచుం దన గరకమలంబులు ఫాలభాగంబునం గదియించి యిట్లని స్తుతియించె.

(తెభా-10.2-1145-ఉ.)[మార్చు]

'ధీ యుతుఁడై నమో భగవతే హరయే పరమాత్మనే ముకుం
'దా సమస్తభక్తవరదాయ నమః పురుషోత్తమాయ కృ
'ష్ణా మునీంద్రవంద్యచరణాయ సురారిహరాయ సాంఖ్యయో
'గా వినీల భాస్వదలకాయ రథాంగధరాయ వేధసే.

(తెభా-10.2-1146-వ.)[మార్చు]

అని యభినందించి యిట్లనియె.

(తెభా-10.2-1147-ఉ.)[మార్చు]

'రా స తామసాత్ములకు రాదుగదా నినుఁగాన నవ్యపం
'కే దళాయతాక్ష! మునిగేయ! పవిత్రచరిత్ర! విస్ఫుర
'ద్రా కళాధరాజ సురరాజ ముఖామర మౌళిరత్న వి
'భ్రా జితపాదపీఠ! భవబంధవిమోచన! పద్మలోచనా!

(తెభా-10.2-1148-మ.)[మార్చు]

' ది నూహింపఁగ యోగివర్యులు భవన్మాయా లతాబద్ధులై
'యి మిత్థమ్మనలేరు తామసులమై యేపారు మాబోఁటి దు
'ర్మ దు లేరీతి నెఱుంగఁ జాలుదురు సమ్యగ్ధ్యానధీయుక్తి? నీ
' ముల్‌ సేరెడి త్రోవఁ జూపి భవకూపంబుం దరింపింపవే!

(తెభా-10.2-1149-ఉ.)[మార్చు]

'వై ముచేతఁ జేదినృపర్గముఁ, గామముచేత గోపికల్‌,
'మీ ఱినభక్తి నాశ్రితులు మిమ్ము నహర్నిశమున్ మనంబులం
'దా రఁగనీక రూపగుణత్పరులై మిముఁ బొందు కైవడిన్
'భూ రివివేక సత్త్వగుణముల్‌ గల దేవత లంద నేర్తురే!

(తెభా-10.2-1150-క.)[మార్చు]

కా భవత్పదపద్మ
'ధ్యా నంబునఁ గాని శాస్త్రత్త్వంబులచేఁ
గా రు శ్రుతిసంవేద్యం
'బై భవత్పదముఁ జిన్మయాకార! హరీ!

(తెభా-10.2-1151-వ.)[మార్చు]

దేవా! యే నరుండైన నేమి శ్రద్ధాగరిష్ఠచిత్తుండై మిమ్ముసేవించు నట్టి మహాత్ముండు విధిచోదితంబయిన ప్రమాణంబువలన విము క్తుండై వర్తించు; నట్లుగావున యోగీశ్వరుండవైన నీ వీశితవ్యుల మైన మమ్ము నిష్పాపులం జేయు” మని నుతించి మఱియు నిట్లనియె.

(తెభా-10.2-1152-మత్త.)[మార్చు]

'కం టిగంటి భవాబ్ధి దాఁటఁగఁ గంటి ముక్తినిధానముం
'గం టి నీ కరుణావలోకముఁ గంటి బాపము వీడ ము
'క్కం టి తామరచూలియుం బొడఁ గాననట్టి మహాత్మ! నా
'యిం టికిం జనుదెంచి తీశ్వర! యేఁ గృతార్థతఁ బొందితిన్.

(తెభా-10.2-1153-వ.)[మార్చు]

దేవా! యేను భవద్దాసుండ! నేది పంచినం జేయుదు; నిచ్చటికి మీరలు విజయంబు చేసిన కార్యం బానతీయవలయు” నని కరం బులు మొగిచి, విన్నవించినం బుండరీకాక్షండతని వాక్యంబులకు సంతసిల్లి యిట్లనియె

(తెభా-10.2-1154-సీ.)[మార్చు]

'లిదైత్య! విను మున్ను ప్రథమయుగంబున;
'నా మరీచికి భార్యయైన వర్ష
'ను నింతివలన నంను లార్వు రుద్భవ;
'మైరి వా రొక్కనాఁ బ్జభవుఁడు
'తనపుత్త్రిపై మోహమునఁ గూడి రతికేళి;
'యొనరింప వీరు నవ్వుటయుఁ గ్రోధ
'మంది యాసురయోని యందుఁ బుట్టుం డని;
'నశాప మిచ్చె న వ్వనజజుండు.

(తెభా-10.2-1154.1-తే.)[మార్చు]

'న్నిమిత్తమునను వారు గిలి హేమ
'శిపునకుఁ బుట్టి రంత నా కౌకసులకు
'నొదవ వీరలఁ దెచ్చి య య్యోగమాయ
'డరి దేవకిగర్భము నందుఁ జొనుప.

(తెభా-10.2-1155-క.)[మార్చు]

దొ రఁకొని కంసుఁడు దోడ్తోఁ
'బొ రిగొనెఁ దత్పుత్త్రశోకమునఁ దన చిత్తం
బె రియఁగ దేవకి వారల
' రిశింపఁగఁ గోరి పనుపఁ గ నసురేంద్రా!

(తెభా-10.2-1156-క.)[మార్చు]

చ్చితిమి వారిఁ గ్రమ్మఱఁ
'దె చ్చెద మని తల్లి కోర్కిఁ దీర్పఁగ నిపు డే
మి చ్చటికిని నీకడఁ బొర
'పొ చ్చెము లేకున్నవారె పో వీ రనఘా!

(తెభా-10.2-1157-క.)[మార్చు]

వీ లఁ దోకొని యిపుడే
'ధా రుణికిన్నేగి జనని తాపము వాపన్
వీ లు నంతట శాపముఁ
'దీ ఱి మదీయప్రసాదధీయుతు లగుచున్.

(తెభా-10.2-1158-క.)[మార్చు]

పొ లుపుగ సుగతిం బొందఁగఁ
రని హరి యానతిచ్చి రుణాన్వితుఁడై
లిచే ననుమతిఁ గొని వా
లఁ దోకొని వచ్చె నిద్ధరామండలికిన్.

(తెభా-10.2-1159-వ.)[మార్చు]

అట్లు వారలం దోడితెచ్చి తల్లి కిట్లనియె.

(తెభా-10.2-1160-క.)[మార్చు]

నుఁ గొనుము వీరె నీ నం
ను లని జనయిత్రికడ ముదంబున వారి
న్ను నిచిన నద్దేవకియును
పుత్త్రస్నేహ మోహలితాత్మకయై.

(తెభా-10.2-1161-క.)[మార్చు]

న్నులు దిగ్గనఁ జేపఁగఁ
న్నులనానందబాష్పణములుదొరఁగం
గ్ర న్నన కౌఁగిట నిడి ననుఁ
న్నన్నలు వచ్చి రనుచుఁ గౌతుక మొప్పన్.

(తెభా-10.2-1162-వ.)[మార్చు]

అట్లు కౌఁగిటం జేర్చి నిజాంకపీఠంబున నునిచి, శిరంబులు మూర్కొని, చిబుకంబులు పుణుకుచుం బ్రేమాతిశయమున మేనం బులకలొలయం జన్నిచ్చిన, వారును వైష్ణవమాయామోహితులై స్తన్యపానంబు సేయుచు భగవంతు డయిన రథాంగపాణి యంగ సంగంబున విగతకల్మషులై విధిశాపసాగరంబు హరిదయాకటాక్షంబను నావచేతం దరించి నిజస్వరూపంబులు ధరించి, కృష్ణునకుఁ దలిదండ్రులకు వందనం బాచరించి గగనపథంబున నిజస్థానంబున కరిగి; రంత దేవకీదేవి తన మనంబున.

(తెభా-10.2-1163-క.)[మార్చు]

చ్చిన బాలురఁ గ్రమ్మఱఁ
దె చ్చుట గడుఁ జిత్ర మనుచు దేవకి మదిలో
చ్చెరువడి యిది యంతయు
చ్చపు హరిమాయ గాక! ని తలఁచె నృపా!

(తెభా-10.2-1164-క.)[మార్చు]

మాత్ముఁ డఖిల జగదీ
శ్వ రుఁడగు కృష్ణుండు సేయు త్కృత్యంబుల్‌
రికింప నెన్నఁ బెక్కులు
ణీవర! యనిన రాజు తా ముని కనియెన్.

21-05-2016: :
గణనాధ్యాయి 11:30, 12 డిసెంబరు 2016 (UTC)