పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/వసుదేవుని గ్రతువు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

వసుదేవుని గ్రతువు

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/వసుదేవుని గ్రతువు)
రచయిత: పోతన


(తెభా-10.2-1115-చ.)[మార్చు]

వదరాతిమర్దనులఁ బాండురనీలనిభప్రభాంగులం
లిత నిజాననాంబుజ వికాస జితాంచిత పూర్ణచంద్ర మం
లులఁ బరేశులన్ నరవిడంబనులం గరుణాపయోధులన్
వి సదలంకరిష్ణుల నవీనసహిష్ణుల రామకృష్ణులన్.

(తెభా-10.2-1116-వ.)[మార్చు]

సందర్శించు తలంపుల నందఱుఁ దమ హృదయారవిందంబులఁ బ్రేమంబు సందడిగొన నప్పుడు.

(తెభా-10.2-1117-ఉ.)[మార్చు]

ధీ మతిన్ ద్వితత్రితక దేవల సాత్యవతేయ కణ్వులున్
నా ద గౌతమచ్యవన నాకుజ గార్గ్య వసిష్ఠ గాలవాం
గీ స కశ్య పాసిత సుకీర్తి మృకండుజ కుంభసంభవాం
గీ రులు యాజ్ఞవల్క్య మృగ శృంగ ముఖాఖిల తాపసోత్తముల్‌.

(తెభా-10.2-1118-వ.)[మార్చు]

చనుదెంచినం గృష్ణుండు వారలకుఁ బ్రత్యుత్థానంబు సేసి వందనంబు లాచరించి వివిధార్చనలు గావించి యిట్లనియె.

(తెభా-10.2-1119-సీ.)[మార్చు]

న్మునీశ్వరులార! న్మభాక్కులమైన;
మాకు నిచ్చోట సమ్మతిని దేవ
నికరదుష్ప్రాపులు నిరుపమయోగీంద్రు;
లైన మీ దర్శనం బ్బెఁ గాదె
ధృతి మందభాగ్యు లింద్రియపరతంత్రులు;
నైన మూఢాత్ముల నఘులార!
వదీయ దర్శన స్పర్శన చింతన;
పాదార్చనలు దుర్లభంబు లయ్యు

(తెభా-10.2-1119.1-తే.)[మార్చు]

నేఁడు మాకిట సులభమై నెగడెఁ గాదె!
గతిపైఁ దీర్థభూతులు సాధుమతులు
మిమ్ము దర్శించుటయు చాలు నెమ్మితోడ
వేఱ తీర్థంబు లవనిపై వెదక నేల?

(తెభా-10.2-1120-వ.)[మార్చు]

అదియునుం గాక, యుదకమయంబులైన తీర్థంబులును మృచ్ఛిలామయంబు లైన దేవగణంబులును, దీర్థదేవతారూపంబులు గాకుండుట లే; దయిననవి చిరకాల సేవనార్చనలంగాని పావనంబు సేయవు; సత్పురుషులు దర్శనమాత్రంబునం బావనంబు సేయుదు రని వెండియు.

(తెభా-10.2-1121-సీ.)[మార్చు]

ఆదిత్య చంద్రాగ్ని మేదినీ తారాంబు;
మారుతాకాశ వాఙ్మనము లోలిఁ
రికింపఁ దత్తదుపాసనంబులఁ బవి;
త్రములుసేయఁగ సమర్థములు గావు;
కలార్థగోచరజ్ఞానంబు గల మహా;
త్మకులు దారు ముహూర్తమాత్ర సేవఁ
జేసి పావనములు సేయుదు; రదియు న;
ట్లుండె ధాతుత్రయ యుక్తమైన

(తెభా-10.2-1121.1-తే.)[మార్చు]

కాయమం దాత్మబుద్ధియుఁ గామినీ కు
మారులందు స్వకీయాభిమానములును
దివిరి జలమునఁ దీర్థబుద్ధియును జేయు
ట్టి మూఢుండు పశుమార్గుఁ నఁగఁ బరఁగు.

(తెభా-10.2-1122-వ.)[మార్చు]

అని యివ్విధంబునం గృష్ణుండాడిన సాభిప్రాయంబులగు వాక్యంబులు విని; యమ్మునీంద్రులు విభ్రాంతహృదయులై యూరకుండి, ముహూర్తమాత్రంబున కమ్మహాత్ము ననుగ్రహంబు వడసి, మందస్మితముఖులై, యప్పుండురీకాక్షున కిట్లనిరి “దేవా! నేము నుదత్త్వవిదుత్తము లయిన బ్రహ్మరుద్రాదులును, భవదీయ మాయావిమోహితులమై యుందుము; నిగూఢంబయిన నీ యిచ్ఛ చేత మమ్ము ననుగ్రహించితివి; భవదీయ చరిత్రంబులు విచిత్రంబు; లిమ్మేదిని యొక్కటి యయ్యును బహురూపంబులఁ గానంబడు విధంబున నీవును మొదలఁ గారణరూపంబున నేకంబయ్యును ననేక రూపంబులు గైకొని, జగదుత్పత్తి స్థితి లయంబులకు హేతుభూతంబునా నద్భుతకర్మంబులం దగిలి, లీలావతారంబులు గైకొని, దుష్టజన నిగ్రహంబును, శిష్టజన రక్షణంబును గావించు చుందు; వదియునుంగాక వర్ణాశ్రమధర్మంబు లంగీకరించి, పురుషరూపంబున వేదమార్గంబు విదితంబు సేసిన బ్రహ్మరూపివి; తపస్ప్వాధ్యాయ నియమంబులచేత నీ హృదయంబు పరిశుద్ధంబు; గావున బ్రహ్మస్వరూపంబులైన వేదంబు లందు వ్యక్తావ్యక్త స్వరూపంబు లేర్పడఁగా నుందువు; కావున బ్రాహ్మణకులంబునెల్ల బ్రహ్మకులాగ్రణివై రక్షించిన మహానుభావుండవు; మాయా జవనికాంతరితుండవైన నిన్నును నీ భూపాలవర్గంబును, నేమును దర్శింపం గంటిమి; మా జన్మ విద్యా తపో మహిమలు సఫలంబులయ్యె; నీకు నమస్కరించెద” మని బహువిధంబులఁ గృష్ణు నభినందించి, యమ్మురాంతకుచేత నామంత్రణంబులు వడసి తమతమ నివాసంబులకుం బోవందలంచు నవసరంబున.

(తెభా-10.2-1123-సీ.)[మార్చు]

మ్మునీశ్వరులకు నానకదుందుభి;
తిభక్తి వందనం బాచరించి
తాపసోత్తములార! ర్మతత్త్వజ్ఞులు;
మన్నించి వినుఁడు నా విన్నపంబు
త్కర్మ వితతిచే సంచితకర్మచ;
యంబు వాపెడు నుపాయంబు నాకు
న దయామతిఁ జెప్పుఁ నిన నమ్మునివరుల్‌;
భూవరుల్‌ విన వసుదేవుఁ జూచి

(తెభా-10.2-1123.1-తే.)[మార్చు]

యెలమిఁ బలికిరి నిఖిల యజ్ఞేశుఁడైన
మలలోచనుఁ గూర్చి యాములు సేయు;
ర్మమునఁ బాయు నెట్టి దుష్కర్మమైన;
నిదియె ధర్మంబు గాఁగ నీ మదిఁ దలంపు.

(తెభా-10.2-1124-వ.)[మార్చు]

అదియునుం గాక.

(తెభా-10.2-1125-క.)[మార్చు]

దే ర్షి పితృఋణంబులు
భూ ర! మఖ వేదపాఠ పుత్రులచేతన్
వా విరి నీఁగని పురుషుఁడు
పో వు నధోలోకమునకుఁ బుణ్యచ్యుతుఁడై.

(తెభా-10.2-1126-వ.)[మార్చు]

అట్లగుటం జేసి నీవును.

(తెభా-10.2-1127-క.)[మార్చు]

తనయాధ్యయనంబులఁ
రియించితి ఋణయుగంబు; డయక ధరణీ
ర! దేవ ఋణము సవనా
ణుఁడవై యీఁగు టొప్పు మ్మతితోడన్

(తెభా-10.2-1128-క.)[మార్చు]

వుడు నవ్వసుదేవుఁడు
ము నివరులకు ననియె వినయమున మీరలు సె
ప్పి యట్లు మఖము సేసెద
ది కరనిభులార! మీరు దీర్పఁగవలయున్!

(తెభా-10.2-1129-వ.)[మార్చు]

అని యభ్యర్థించి యమ్మునీంద్రుల యాజకులంగా వరించి, యప్పుణ్యతీర్థోపాంతంబున మహేంద్రామితవైభవంబున, నష్టాదశ భార్యాసమేతుండై దీక్షఁ గైకొని, యమ్మహాధ్వరంబు వేదోపదిష్ట విధిం బరిసమాప్తించి, ఋత్విఙ్నికాయంబుల బహుదక్షిణలం దనిపి, భార్యాసమేతుండై యవభృథస్నానం బాచరించి, వివిధ రత్నమణి మయభూషణ విచిత్రాంబర సురభి సుమానులేపనంబులు ధరించి, నిఖిల భూదేవ ముని బంధు రాజలోకంబుల నుచిత సత్కారంబులఁ బ్రీతులం గావించిన వారును గృష్ణానుమతి నాత్మనివాసంబులకుం జని; రందు.

(తెభా-10.2-1130-ఉ.)[మార్చు]

' ఱి నుగ్రసేన వసుధాధిప పంకజనాభ ముష్టికా
'రా తులు దమ్ము నర్థి మధుప్రియభాషల నిల్వ వేఁడినం
'గౌ తుక మాత్మ నివ్వటిలఁగా వసియించిరి గోపగోపికా
'వ్రా ముతోడ నచ్చట ధరావర! నందయశోద లిమ్ములన్.

(తెభా-10.2-1131-క.)[మార్చు]

రినయముల హరి ప్రియముల
' రిమధురాలాపములను రికథల మనో
లీలఁ దగిలి నందుఁడు
'ని రుపమగతి నచట మూఁడు నెల లుండె నృపా!

(తెభా-10.2-1132-చ.)[మార్చు]

' రుహలోచనాది యదుత్తము లందఱు నన్నిభంగులం
' లితవిభూషణాంబర నికాయము లిచ్చి బహూకరించి వీ
'డ్కొ లిపిన నందముఖ్యులు ముకుందపదాబ్జ మరందపాన స
'ల్ల లిత నిజాత్మ షట్పదములన్ మరలించుచు నెట్టకేలకున్.

(తెభా-10.2-1133-వ.)[మార్చు]

చనిచని.

(తెభా-10.2-1134-ఆ.)[మార్చు]

'రలి మరలి కృష్ణ! మాధవ! గోవింద!
'ద్మనాభ! భక్త పారిజాత!
'దేవదేవ! యనుచుఁ దివిరి చూచుచు మధు
'రాభిముఖులు నగుచు రిగి రంత.

(తెభా-10.2-1135-క.)[మార్చు]

క్ర మున నచ్చటఁ బ్రావృ
'ట్స యం బగుటయును బంధున యాదవ వ
ర్గ ము లోలిఁ గొలువ సురగణ
' మితులు బలకృష్ణు లాత్మగరంబునకున్.

(తెభా-10.2-1136-వ.)[మార్చు]

వచ్చి సుఖంబుండు నంత.

21-05-2016: :
గణనాధ్యాయి 11:29, 12 డిసెంబరు 2016 (UTC)