పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/సకలరాజుల శిక్షించుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

సకలరాజుల శిక్షించుట

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/సకలరాజుల శిక్షించుట)
రచయిత: పోతన


(తెభా-10.2-1105-వ.)[మార్చు]

అట్టియెడ సకలరాజ లోకంబును గృష్ణుని విభవంబునకుం జూపోపక యసంఖ్యంబులగు మూఁకలు గట్టి యమ్మహాత్ముని మాహాత్మ్యంబు దెలియక దర్పాంధులై కడంగి

(తెభా-10.2-1106-ఉ.)[మార్చు]

భా భవప్రసూన శరబాధిత మానసులై సమస్త ధా
త్రీ రనందనుల్‌ బలుపుఁ దెంపును బెంపును సొంపు నేర్పడన్
దే కిరీటరత్న రుచిదీపిత పాదసరోజుఁడైన రా
జీ దళాక్షుఁ దాఁకిరి విశృంఖల వృత్తి నతిప్రయత్నులై.

(తెభా-10.2-1107-వ.)[మార్చు]

అంత.

(తెభా-10.2-1108-చ.)[మార్చు]

సిజలోచనుండు నిజశార్‌ఙ్గశరాసనముక్త హేమ పుం
రుచిరశాతసాయక నికాయములన్ రిపుకోటి నేసి సిం
ధు రిపు విక్రమప్రకట దోర్బలుఁడై విలసిల్లి యొత్తె దు
స్త చలితాన్యసైన్యమును జ్జనమాన్యముఁ బాంచజన్యమున్.

(తెభా-10.2-1109-ఉ.)[మార్చు]

ఱి భూరిబాహుబలులైన విరోధి నరేశ్వరుల్‌ మృగ
వ్రా ము లొక్కపెట్ట మృగరాజకిశోరముపై నెదిర్చి న
ట్లా తురులై చతుర్విధ సగ్ర బలంబులతోడఁ గూడి ని
ర్ధూ కళంకుఁడైన నవతోయజనేత్రునిఁ జుట్టు ముట్టినన్.

(తెభా-10.2-1110-చ.)[మార్చు]

లిగి మురాంతకుండు కులిశాభశరంబుల నూత్నరత్నకుం
ములతో శిరంబులు, రన్మణినూపురరాజితోఁ బదం
బు లుఁ , గటకాంగుళీయక విభూషణచాప శరాలితోడఁ జే
తు లు , నిలఁగూలఁగా విజయదోహలియై తునుమాడె వెండియున్

(తెభా-10.2-1111-క.)[మార్చు]

శేషులు సొక్కాకుల
తిఁ దూల నిశాతపవనకాండముల సము
ద్ధ తి నేసి తోలి విజయో
న్న తుఁడై నిజనగరి కేగె గధరుఁ డంతన్.

(తెభా-10.2-1112-వ.)[మార్చు]

అట్లు మహిత మంగళాలంకృతంబును, నతిమనోహర విభవాభిరామంబు నగు ద్వారకానగరంబున కరుగుదెంచిన మజ్జనకుండును బ్రియంబునఁ దోడన చనుదెంచి.

(తెభా-10.2-1113-చ.)[మార్చు]

ణిత వినూత్న రత్న రుచిస్ఫుట నూపుర హార కర్ణభూ
కటకాంగుళీయక లత్పరిధాన కిరీట తల్ప వా
రథ వాజి హేతినికరంబులనుం బరిచారికాతతిం
బ్ర ణుతగుణోత్తరుం డయిన ద్మదళాక్షున కిచ్చె నెమ్మితోన్.

(తెభా-10.2-1114-వ.)[మార్చు]

ఇట్లు మహనీయతేజోనిధియైన మాధవు దయాపరిలబ్ధనిఖిల వస్తువిస్తారుం డయ్యును, నిజాధికారశుద్ధికొఱకు మరలఁ గన్యారత్నంబును, వినూత్నరత్నవ్రాతంబును సమర్పించె; నని భూసుర విసరంబులు వినుతింప మా తండ్రియైన బృహత్సేనుండు నన్నును సమస్త వస్తువులను గృష్ణునకు సమర్పించి, క్రమంబున సకల యాదవులనుం బూజించి మరలి నిజపురంబునకుం జనియె” నని చెప్పినఁ గుంతియు గాంధారియుఁ గృష్ణయు, నఖిల నృపాలకాంతాజనంబులును, గోపికలుం దమతమ మనంబుల సర్వభూతాంతర్యామియు, లీలామానుష విగ్రహుండును నైన పుండరీకాక్ష చరణారవింద స్మరణానంద పరవశలై కృష్ణుం బ్రశంసించి; రంత.

21-05-2016: :
గణనాధ్యాయి 11:28, 12 డిసెంబరు 2016 (UTC)