పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/లక్షణ ద్రౌపదీ సంభాషణంబు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

లక్షణ ద్రౌపదీ సంభాషణంబు

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/లక్షణ ద్రౌపదీ సంభాషణంబు)
రచయిత: పోతన


(తెభా-10.2-1082-వ.)[మార్చు]

అట్టియెడఁ గృష్ణకథావిశేషంబులు పరితోషంబున నుగ్గడించుచుఁ బ్రసంగ వశంబున నా రుక్మిణీదేవి మొదలగు శ్రీకృష్ణుభార్యలం గనుంగొని పాంచాలి యిట్లనియె. “మిమ్ముఁ బుండరీకాక్షుండు వివాహంబయిన తెఱంగులు వినిపింపుఁడన వారును దమ పరిణయంబుల తెఱంగులు మున్ను నే నీకుం జెప్పిన విధంబున వినిపించి; రందు సవిస్తరంబుగాఁ దెలియం బలుకని మద్రరాజకన్యకా వృత్తాంతం బా మానిని పాంచాలికిం జెప్పిన విధంబు విను మని శుకుండు పరీక్షిన్నరేంద్రున కిట్లనియె.

(తెభా-10.2-1083-సీ.)[మార్చు]

పాంచాలితో మద్రతిసుత యిట్లను;
సంగీతవిద్యా విశారదుండు
నారదుచేతి వీణాస్వనకలిత మై;
ట్టి గోవింద కథామృతంబు
విలి యేఁ గ్రోలి చిత్తము దన్మయత్వంబు;
నొంది మోదించుచు నుండునంత
దుహితృవత్పలుఁడు మద్గురుఁడు దా నది విని;
దుపాయ మొక్కటి దిఁ దలంచి

(తెభా-10.2-1083.1-తే.)[మార్చు]

దల నెబ్భంగి నైన గోరము గాక
వారి మధ్యములో నభివ్యాప్తి దోఁచు
త్స్యయంత్రంబు కల్పించి నుజు లెంత
వారి కై నను దివ్వ మోవంగరాని.

(తెభా-10.2-1084-తే.)[మార్చు]

'నువుఁ బవిచండ నిష్ఠురాస్త్రంబు నచట
'సంచితంబై న గంధపుష్పాక్షతలను
'బూజగావించి యునిచి యే పురుషుఁ డేని
'నిద్ధబలమున నీ చాప మెక్కు వెట్టి.

(తెభా-10.2-1085-క.)[మార్చు]

సాయకంబు నారిం
'బో సి వెసన్ మత్స్యయంత్రమున్ ధరఁ గూలన్
వే సిన శౌర్యధురీణుఁడు
'నా సుత వరియించు నని జనంబులు వినఁగన్.

(తెభా-10.2-1086-క.)[మార్చు]

చా టించిన నవ్వార్తకుఁ
'బా టించిన సంభ్రమముల బాణాసన మౌ
ర్వీ టంకార మహారవ
'పా టితశాత్రవులు బాహుల సంపన్నుల్‌.

(తెభా-10.2-1087-క.)[మార్చు]

సుం రతనులు దదుత్సవ
'సం ర్శనకుతుకు లమిత సైన్యులు భూభృ
న్నం ను లేతెంచిరి జన
'నం దితయశు లగుచు మద్రగరంబునకున్.

(తెభా-10.2-1088-క.)[మార్చు]

నుదెంచిన వారికి మ
'జ్జ కుఁడు వివిధార్చనములు మ్మతిఁ గావిం
చి నా బాహుబలాఢ్యులు
' నువుం జేరంగ నరిగి ధైర్యస్ఫూర్తిన్.

(తెభా-10.2-1089-వ.)[మార్చు]

ఇట్లు డగ్గఱి యద్ధనువుం గనుంగొని.

(తెభా-10.2-1090-ఉ.)[మార్చు]

'కొం ఱు పూనలేక చనఁ గొందఱు పూని కదల్పలేక పోఁ,
'గొం ఱొకింత యెత్త నొక కొందఱు మోపిడలేక దక్కఁగాఁ,
'గొం ఱొకింత యెక్కిడుచుఁ గోరి నృపాలకు లిట్లు సిగ్గునుం
'జెం ది తలంగి పోవుచును సీ యిటకేఁగుట నీతి తప్పనన్.

(తెభా-10.2-1091-వ.)[మార్చు]

అట్టియెడ.

(తెభా-10.2-1092-క.)[మార్చు]

భీ ముఁడు రాధేయుఁడు ను
'ద్దా గతిన్నెక్కు ద్రోఁచి గ నమ్మీనం
బే ఱక దిరుగుచుంటయుఁ
'దా మేమియు నెఱుఁగలేక లఁగిన పిదపన్.

(తెభా-10.2-1093-క.)[మార్చు]

రేంద్ర తనయుఁ డమ్మ
'త్స్య ము నేయ నుపాయ మెఱిఁగి గ నేసియు మీ
ము ద్రుంపలేక సిగ్గున
'వి ముఖుండై చనియె నంత వికలుం డగుచున్.

(తెభా-10.2-1094-వ.)[మార్చు]

ఇట్లు సకల రాజకుమారులుం దమతమ ప్రయత్నంబులు విఫలంబులైన ముఖారవిందంబులు ముకుళించి దైన్యంబున విన్ననై చూచుచున్న యెడ.

(తెభా-10.2-1095-చ.)[మార్చు]

' సిజపత్త్రలోచనుఁడు చాపము సజ్యము సేసి యుల్లస
'చ్ఛ మరిఁబోసి కార్ముకవిశారదుఁడై యలవోక వోలె ఖే
' మగు మీనముం దునిమె త్వరతన్ సుర సిద్ధ సాధ్య ఖే
' జయశబ్ద మొప్పఁ బెలుచం గురిసెం దివిఁ బుష్పవర్షముల్‌.

(తెభా-10.2-1096-వ.)[మార్చు]

అయ్యవసరంబున నేనుం బరితుష్టాంతరంగనై పరమానందవికచ వదనారవింద నగుచు,నిందిందిర సన్నిభంబులగు చికురబృందంబులు విలసదలిక ఫలకంబునం దళుకులొలుకు ఘర్మజల కణంబులం గరంగు మృగమద తిలకంపు టసలున మసలుకొనినం గరకిసలయంబున నోసరించుచు మిసమిస మను మెఱుంగుగములు గిఱికొన నెఱిగౌను వడవడ వడంక నప్పుడు మందగమనంబున.

(తెభా-10.2-1097-చ.)[మార్చు]

' లితపదాబ్జ నూపురకధ్వనితో దరహాస చంద్రికా
' లిత కపోలపాలికలఁ ప్పు సువర్ణవినూత్న రత్నకుం
' రుచులొప్పఁ గంకణఝణంకృతు లింపెసలార రంగ భూ
' మున కేగుదెంచి ముఖతామరసం బపు డెత్తి చూచుచున్.

(తెభా-10.2-1098-చ.)[మార్చు]

' పతులం గనుంగొని మనంబున వారిఁ దృణీకరించి మ
'త్క జలజాత దివ్యమణి కాంచనమాలిక నమ్మురారి కం
' మున లీలమై నిడి పదంపడి నవ్య మధూకదామ మా
' రికబరిం దగిల్చితి నయంబునఁ గన్నుల లజ్జ దేఱఁగన్.

(తెభా-10.2-1099-వ.)[మార్చు]

అప్పుడు.

(తెభా-10.2-1100-చ.)[మార్చు]

'కొ లఁదికి మీఱఁగా డమరు గోముఖ డిండిమ మడ్డు శంఖ కా
' మురళీ మృదంగ పణ వానక దుందుభి ఢక్క కాంస్య మ
'ర్ద మురజారజాది వివిధ్వను లేపున భూనభోంతరం
'బు లఁ జెలఁగెన్ నటీనటనముల్‌ దనరారె మనోహరాకృతిన్.

(తెభా-10.2-1101-వ.)[మార్చు]

అంత.

(తెభా-10.2-1102-చ.)[మార్చు]

రగణంబుఁ దోలి యురగారి సుధాకలశంబుఁ గొన్న చం
మున సమస్తశత్రువసుధావర కోటిఁ దృణీకరించి య
క్క ల విలోచనుండు ననుఁ గౌఁగిట నొప్పుఁగ జేర్చి సింహచం
క్ర ణ మెలర్పఁ గొంచుఁ జనెఁ గాంచనచారు రథంబుమీఁదికిన్.

(తెభా-10.2-1103-వ.)[మార్చు]

అట్లు రథారోహణంబు సేసిన.

(తెభా-10.2-1104-చ.)[మార్చు]

తు గచతుష్కమున్ విమతదుర్దమశూరతఁ బూన్చి దారుకుం
దము రొప్ప శత్రునికరాంధతమః పటలప్రచండ భా
స్క రుచి నొప్పునట్టి నిజకార్ముక యుక్తగుణప్రఘోష సం
రిత దిగంతరుం డగుచుఁ ద్మదళాక్షుడు వోవుచుండఁగన్!

21-05-2016: :
గణనాధ్యాయి 11:28, 12 డిసెంబరు 2016 (UTC)