పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/శ్రుతదేవ జనకుల చరిత్రంబు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

శ్రుతదేవజనకుల చరిత్రంబు

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/శ్రుతదేవ జనకుల చరిత్రంబు)
రచయిత: పోతన


(తెభా-10.2-1177-సీ.)[మార్చు]

'రనాథ! విను భువప్రసిద్ధంబుగ;
'దీపించు నట్టి విదేహదేశ
'మందు భూకాంతకు నాననదర్పణం;
'నఁ దనర్చిన మిథి ను పురమునఁ
'లఁడు శ్రీహరిపాదకంజాత భక్తుండు;
'ళితరాగాది వికారుఁ డమల
'రితుఁ డక్రోధుండు శాంతుండు నిగమార్థ;
'కోవిదుం డగు శ్రుతదేవుఁ డనెడి

(తెభా-10.2-1177.1-తే.)[మార్చు]

'భూసురోత్తముఁ డొకఁ డనిచ్ఛాసమాగ
'తంబు తుషమైన హేమ శైలంబు గాఁగఁ
'లఁచి పరితోష మందుచుఁ గ గృహస్థ
'ర్మమున నుండె సముచితర్ముఁ డగుచు.

(తెభా-10.2-1178-ఉ.)[మార్చు]

' పురి నేలువాఁడు బహుళాశ్వుఁడు నా నుతి కెక్కినట్టి ధా
'త్రీ తి యా ధరామరునిరీతిని నిష్కలుషాంతరంగుఁడై
'యే నులందు ధర్మగతి నేమఱఁ కర్థిఁ జరించుచుండె ల
'క్ష్మీ తి వారిపైఁ గరుణఁ జేసి ప్రసన్నముఖాంబుజాతుఁడై.

(తెభా-10.2-1179-వ.)[మార్చు]

అట్లు కృష్ణుండు వారల జూచువేడ్క నిజ స్యందనారూఢుండై, నారద వామదేవాత్రి కృష్ణ రామ సితారుణ దివిజగురు కణ్వ మైత్రేయ చ్యవనులును, నేనునుమొదలైన మును లనుగమింపం జనుచుఁ దత్తద్దేశ నివాసులగు నానర్తక ధన్వ కురు జాంగల వంగ మత్స్య పాంచాల కుంతి మధు కేకయ కోస లాది భూవరులు, వివిధ వస్తుప్రచయంబులు గానిక లిచ్చి సేవింప, గ్రహమధ్యగతుండై దీపించు సూర్యునిం బోలి, యప్పుండరీకాక్షుండు మందస్మిత సుందరవదనారవిందుం డగుచు వారలం గరుణార్ద్రదృష్టిం జూచి, యోగక్షేమంబులరసి, సాదరభాషణంబుల నాదరించుచుఁ, గతిపయ ప్రయాణంబులం జనిచని విదేహనగరంబు డాయంజనుటయు; నా బహుళాశ్వుండు నమ్మాధవు రాక విని మనంబున హర్షించుచు వివిధపదార్థంబులు గానికలుగాఁగొని, తానును శ్రుతదేవుండును నెదురుగాఁ జనుదెంచి; యప్పుడు.

(తెభా-10.2-1180-ఉ.)[మార్చు]

' మునికోటికిన్ వినయ మారఁగ వందన మాచరించి, యా
'తా రసాభలోచనుఁ డుదారచరిత్రుఁడు పాపగోత్ర సు
'త్రా ముఁడు భక్తలోకశుభదాయకుఁ డైన రమేశు సద్గుణ
'స్తో ముని పాదపద్మములు సోఁకఁగ మ్రొక్కి వినమ్రులై తగన్.

(తెభా-10.2-1181-చ.)[మార్చు]

' ములు మోడ్చి యో! పరమకారుణికోత్తమ! నీవు నీ మునీ
'శ్వ రులును మద్గృహంబునకుచ్చి మముం గృపసేసి యిచ్చటం
' మనురక్తిఁ బూజనలు గైకొనుఁ డంచు నుతించి వేఁడ నా
' రి మనమందు వారివినయంబుల కెంతొ ప్రమోద మందుచున్.

(తెభా-10.2-1182-చ.)[మార్చు]

'తి ముగ వారి యిష్టములుదీర్పఁ దలంచి మురాసురారి యొం
'డొ రుల కెఱుంగకుండ మునియూథముఁదానును నేఁగె వారి మం
'ది ముల కేకకాలమున ధీరత నా ధరణీవరుండు వా
'రి రుహదళాయతాక్షు మునిబృందములం గనకాసనంబులన్.

(తెభా-10.2-1183-సీ.)[మార్చు]

'కూర్చుండ నియమించి కొమరారు కాంచన;
'లధౌత కలశోదములచేతఁ
'బాదముల్‌ గడిగి తత్పావనజలములు;
'దానును సతియు బాంవజనంబుఁ
'ర మర్థి నిజమస్తకంబుల ధరియించి;
'వివిధార్చనములు సద్విధి నొనర్చి
'ణిభూషణాంబర మాల్యానులేపన;
'రాజిత ధూప నీరాజనములు

(తెభా-10.2-1183.1-తే.)[మార్చు]

'క్తిఁ గావించి పరిమృష్ట హు విధాన్న
'పాయసాపూప పరిపక్వలము లోలి
'నారగింపఁగఁ జేసి కర్పూరమిళిత
'లిత తాంబూలములు నెయ్య లర నొసఁగె.

(తెభా-10.2-1184-వ.)[మార్చు]

ఇట్లు సమర్పించి, యనంతరంబ యమ్మిథిలేశ్వరుండైన జనకుండు పరమానందంబును బొంది.

(తెభా-10.2-1185-చ.)[మార్చు]

' రిపదపద్మయుగ్మము నిజాంకతలంబునఁ జేర్చి యొత్తుచుం
'బు రుషవరేణ్య! యీ నిఖిలభూతగణావలి యాత్మలందు సు
'స్థి మతిఁ గర్మసాక్షివి సుధీవర! నీ పదభక్తకోటితో
' య నుమాధినాథ చతురాస్యులుఁ బోలరటందు వెప్పుడున్.

(తెభా-10.2-1186-వ.)[మార్చు]

అట్టి లోకవిదితం బయిన భవద్వాక్యంబు నిక్కంబుగా భవదీయ పాదారవిందంబు లందు నొకానొకవేళ లేశమాత్రధ్యానంబుగల నా గృహంబున కకించనుండని చిత్తంబునం దలంపక భక్తవత్సలుండ వగుటంజేసి విజయం జేసితివి; భవత్పాదపంకేరుహ ధ్యానసేవారతిం దగిలిన మహాత్ములు త్వద్ధ్యానంబు వదలం జాలుదురే? నిరంతరంబును శాంతచిత్తులై నిష్కించనులై యోగీంద్రులై నీ వలనం గోరిక గలవారలకు నిన్నైన నిత్తువు గదా!” యని వెండియు నిట్లనియె.

(తెభా-10.2-1187-తే.)[మార్చు]

'కృష్ణ! పరమాత్మ! యదుకుల క్షీరవార్ధి
'పూర్ణచంద్రమ! దేవకీపుత్త్ర! సుజన
'వినుత! నారాయణాచ్యుత! వేదవేద్య!
'క్తజనపోషపరితోష! రమపురుష!

(తెభా-10.2-1188-ఉ.)[మార్చు]

'శ్రీ పురుషోత్తమాఖ్య! యదుసింహకిశోరక! భక్తలోకర
'క్షా రతంత్ర! నీవు మునిసంఘముఁ గొన్నిదినంబు లుండవే
'నీ దపద్మ రేణువులు నెమ్మి మదీయగృహంబు సోఁకినం
'దా సవంద్య! యే నిపుడ న్యుఁడ నయ్యెదఁగాదె మాధవా!

(తెభా-10.2-1189-వ.)[మార్చు]

అని యభ్యర్థించినం బ్రసన్నుండై యప్పుండరీకాక్షుండు నిమికుల ప్రదీపకుండైన జనకచక్రవర్తిం గరుణించి, యమ్మిథిలానగరంబునం బౌరజనంబులకు నున్నత శోభనంబులు గావించుచుం గొన్నిదినంబు లుండె; నంత.

(తెభా-10.2-1190-మ.)[మార్చు]

'శ్రు దేవుండును మోదియై మునిజనస్తోమంబుతో నిందిరా
' తిఁ దోకొంచు నిజాలయంబునకు నొప్పన్నేగి యచ్చోట స
'మ్మ తి దర్భాస్తరణంబులన్నునిచి సమ్యగ్జ్ఞానపారీణుఁడై
' తియుం దానుఁ బదాజ్జముల్‌ గడిగి చంద్భక్తిఁ దత్తోయముల్‌.

(తెభా-10.2-1191-చ.)[మార్చు]

'శి ములఁ దాల్చి నవ్యతులసీదళదామ కుశప్రసూన వి
'స్ఫు దరవింద మాలికలఁ బూజ లొనర్చి గృహాంధకూప సం
' ణుఁడ నైన నాకడకుఁ క్రి దనంతనె వచ్చునట్టి సు
'స్థి మతి నే తపంబు మును సేసితినో? యని సంతసించుచున్.

(తెభా-10.2-1192-తే.)[మార్చు]

'ఱియుఁ దత్పాదతీర్థంబు మందిరమునఁ
'లయఁ జిలికించి సంప్రీతి డలుకొనఁగఁ
'త్త్ర ఫలపుష్పతోయముల్‌ క్తి నొసగి
'రి మురాంతకమూర్తి నిజాత్మ నిలిపి.

(తెభా-10.2-1193-తే.)[మార్చు]

'మానితంబుగ విశ్వనిదానమూర్తి
'యైన కృష్ణుండు దనయింట నారగించెఁ
'న మనోరథసిద్ధియుఁ నకు నబ్బె
'నుచుఁ బైపుట్ట మల్లార్చి యాడుచుండె.

(తెభా-10.2-1194-చ.)[మార్చు]

' రుణియుఁ దానుఁ బుత్రులుఁ బదంపడి కృష్ణు భజించుచుండ త
'చ్చ ణము లంకపీఠమునఁ జాఁచిన మెల్లన యొత్తుచున్ రమా
' రుఁ గని వల్కె భక్తజనత్సల! మామకభాగ్య మెట్టిదో
' చతురాస్యులున్నెఱుఁగ ట్టి నినుం గనుగొంటి నెమ్మితోన్.

(తెభా-10.2-1195-క.)[మార్చు]

ము ని యోగిమానసస్ఫుట
' జంబుల నెల్ల ప్రొద్దు ర్తించు భవ
ద్ఘ దివ్యమూర్తి నా లో
' గోచర మయ్యెఁ గాదె! ర్వాత్మ! హరీ!

(తెభా-10.2-1196-వ.)[మార్చు]

దేవా! నీ సచ్చరితంబులు గర్ణరసాయనంబులుగా నాకర్ణించుచు, నీకుం బూజలొనర్చుచు నీచరణారవిందంబులకు వందనంబులు సేయుచు, నీ దివ్యనామ సంకీర్తనంబులు సేయుచుం దమ శరీ రంబులు భవదధీనంబులుగా మెలంగు నిర్మలబోధాత్ములగు వారి చిత్తంబులను దర్పణంబులం గానంబడుచుందువు; కర్మవిక్షిప్తచిత్తులైన వారి హృదయంబుల నుండియు, దూరగుండ వగుదు;” వని మఱియు నిట్లనియె.

(తెభా-10.2-1197-సీ.)[మార్చు]

'నీకు మ్రొక్కెదఁ గృష్ణ! నిగమాంత సంవేద్య! ;
'లోకరక్షక! భక్తలోకవరద!
'నీపాదసేవననిరతుని నన్ను నే;
'నిఁ బంపె దానతి మ్మనినఁ గృష్ణుఁ
'డెలనవ్వు మోమునఁ జెలువొంద నా విప్రు;
'ర మాత్మకరమునఁ దియఁ జేర్చి
'పాటించి యతనితోఁ లికెఁ దపశ్శక్తి;
'ఱలిన యమ్మునిర్యు లెపుడుఁ

(తెభా-10.2-1197.1-తే.)[మార్చు]

'మ పదాంబుజరేణు వితానములను
'విలి లోకంబులను బవిత్రంబు సేయు
'వారు ననుఁ గూడి యెప్పుడు లయు నెడల
'రుగుదెంతురు నీ భాగ్య రిమ నిటకు.

(తెభా-10.2-1198-వ.)[మార్చు]

చనుదెంచిరి; పుణ్యస్థలంబులును విప్రులును దేవతలును సంస్పర్శన దర్శనార్చనంబులం బ్రాణులను సమస్త కిల్బిషంబులం బాయంజేయుదు; రదియునుంగాక, బ్రాహ్మణుండు జననమాత్రంబున జీవకోటి యందు ఘనుండై యుండు, జపతపోధ్యానాధ్యయనాధ్యాత్మములం జతురుండై మత్కలాశ్రయుండయ్యెనేని నతం డుత్తముం డై వెలుంగు; నతనిం జెప్ప నేల?” యని వెండియు నిట్లనియె.

(తెభా-10.2-1199-క.)[మార్చు]

నా ది విప్రులపైఁ గల
ప్రే ము నా తనువు నందుఁ బెట్టని కతనన్
భూ మీసురు లర్హులు; నీ
వీ మునులం బూజ సేయు మిద్ధచరిత్రా!

(తెభా-10.2-1200-క.)[మార్చు]

దియే నా కిష్టము ననుఁ
దివేలవిధంబు లొలయ జియించుటగా
ది కింపగు నటు గావున
లని భక్తిన్ భజింపు సుధామరులన్!

(తెభా-10.2-1201-క.)[మార్చు]

ని సర్వలోక విభుఁ డగు
జోదరుఁ డానతిచ్చు వాక్యంబుల జా
భూమీసురుఁ డమ్ముని
నులకు సద్భక్తిఁ బూజ లిపెన్ వరుసన్.

(తెభా-10.2-1202-చ.)[మార్చు]

యఁగఁ గృష్ణుఁ డంత మిథిలేశ్వర భూసురులం గృపావలో
మొలయన్ననూనసుభస్థితిఁ బొందఁగఁ జేసి వారి వీ
డ్కొ ని రథమెక్కి దివ్యమునికోటియుఁ దానును వచ్చెఁ గ్రమ్మఱన్
వర! మోక్షదం బగు కుస్థలికిం బ్రమదాంతరంగుఁడై!

21-05-2016: :
గణనాధ్యాయి 11:31, 12 డిసెంబరు 2016 (UTC)