పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/శ్రుతిగీతలు

వికీసోర్స్ నుండి

శ్రుతిగీతలు

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/శ్రుతిగీతలు)
రచయిత: పోతన


తెభా-10.2-1203-వ.
అని చెప్పిన బాదరాయణికి నభిమన్యునందనుం డిట్లనియె “మునీంద్రా! ఘటపటాదివస్తు జాతంబు భంగి నిర్దేశింప నర్హంబు గాక, సత్త్వాదిగుణశూన్యం బైన బ్రహ్మంబునందు సత్త్వాది గుణగోచరంబులైన వేదంబులే క్రమంబునం బ్రవర్తించు, నట్టి చందంబు నాకెఱిఁగింపు” మనిన భూవరునకు మునివరుం డిట్లనియె; “సకల చేతనాచేతనాంతర్యామియైన సర్వేశ్వరుండు సర్వశబ్దవాచ్యుండు గావున సకల జంతు నివహంబులందు బుద్ధీంద్రియమనః ప్రాణశరీరంబు లను సృజియించి; చేతనవర్గంబునకు జ్ఞానప్రదుండగుం గావున సకల నిగమసమూహంబులును దత్స్వరూప గుణవైభవప్రతిపాదకంబులు గావున, ముఖ్యంబై ప్రవర్తించు; శ్రుతిస్తోత్రం బుపనిషత్తుల్యంబు; ననేక పూర్వఋషి పరంపరాయాతంబును నైన దీనిని శ్రద్ధాయుక్తుండై యెవ్వం డనుసంధించు, నతనికి మోక్షంబు సులభంబు; దీనికి నారాయణాఖ్యాతంబగునొక్క యుపాఖ్యానంబు గలదు; వినిపింతు వినుము; భగవత్ప్రియుండైన నారదుం డొక్కనాఁడు నారాయణాశ్రమంబునకుం జని ఋషిగణసమేతుం డైన నారాయణఋషిం గనుంగొని నీవు నన్నడిగినట్ల యమ్మహాత్ముని నడిగిన నతండు మున్నీయర్థంబు శ్వేతద్వీపవాసులైన సనక సనందనాది దివ్యయోగీంద్రులు ప్రశ్న సలిపిన, వారలకు సనందనుండు చెప్పిన ప్రకారంబు నీ కెఱింగించెద” నని చెప్పందొడంగె; “శయానుం డైన రాజశ్రేష్ఠునిఁ దత్పరాక్రమ దక్షతాది చిహ్నంబు లను నుతియించు వందిజనంబుల చందంబున జగదవసాన సమయంబున ననేక శక్తియుతుండై యోగనిద్రావశుండైన సర్వేశ్వరుని వేదంబులు స్తోత్రంబుసేయు విధంబు నారాయణుండు నారదునకుం జెప్పిన తెఱుంగు విను"మని యిట్లనియె.
టీక:- అని = అని; చెప్పినన్ = చెప్పగా; బాదరాయణి = శుకమహర్షి {బాదరాయణి - బదరీవనమున ఉండువాడు బాదరాయణుడు (వ్యాసమహర్షి) వారి పుత్రుడు బాదరాయణి (శుకమహర్షి)}; కిన్ = కి; అభిమన్యునందనుండు = పరీక్షిన్మహారాజు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; ముని = ముని; ఇంద్రా = ఉత్తముడా; ఘట = కుండ; పట = వస్త్రము; ఆది = మొదలగు; వస్తు = వస్తువుల; జాతంబున్ = సముదాయము; భంగిన్ = వలె; నిర్దేశింపన్ = ఇట్టిది అని చెప్పను; అర్హంబు = వీలు, యుక్తమైనది; కాక = కాకుండ; సత్వాదిగుణ = త్రిగుణముల {సత్వాది - గుణత్రయము, 1సత్వగుణము 2రజోగుణము 3తమోగుణము}; శూన్యంబు = లేనిది; ఐన = అయినట్టి; బ్రహ్మంబున్ = పరతత్వము; అందున్ = అందు; సత్వాది = గుణత్రయముల; గుణ = గుణములతో; గోచరంబులు = తోచునవి; ఐన = అయినట్టి; వేదంబులు = వేదములు; ఏ = ఏ; క్రమంబునన్ = ప్రకారము; ప్రవర్తించును = ప్రతిపాదించును; అట్టి = అటువంటి; చందంబు = విధానము; నా = నా; కున్ = కు; ఎఱిగింపుము = తెలుపుము; అనినన్ = అనగా; భూవరున్ = రాజున; కున్ = కు; ముని = ముని; వరుండు = ఉత్తముడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; సకల = సమస్తమైన; చేతన = ప్రాణము కలవాని; అచేతన = ప్రాణము లేనివాని; అంతః = లోపల; యామి = వ్యాపించినవాడు {అంతః + యామి – అంతర్యామి, విసర్గ సంధి}; ఐన = అయినట్టి; సర్వేశ్వరుండు = కృష్ణుడు {సర్వేశ్వరుడు - సర్వ + ఈశ్వరుడు, గుణ సంధి, సమస్తమును నియమించువాడు, విష్ణువు}; సర్వశబ్దవాచ్యుండు = కృష్ణుడు {సర్వశబ్దవాచ్యుండు - సర్వ శబ్దముచే తెలియబడు వాడు, ప్రమాణ శ్లో. సర్వగత్వాదనంతస్య సఏవాహ మనస్థితః, మత్తస్సర్వమహం సర్వం మయి సర్వం సనాతనః., విష్ణువు}; కావునన్ = కనుక; సకల = ఎల్ల; జంతు = స్థావర జంగములైన జంతు; నివహంబులు = జాలము; అందున్ = అందు; బుద్ధిః = బుద్ధి {బుద్ధి - నిశ్చయాత్మకమైన అంతఃకరణము}; ఇంద్రియ = దశేంద్రియములు {దశేంద్రియములు - జ్ఞానేంద్రియ పంచకము మరియు కర్మేంద్రియపంచకము, మొత్తం పది ఇంద్రియములు}; మనః = మనస్సు {మనస్సు - సంకల్పాత్మకమైన అంతఃకరణము}; ప్రాణ = పంచప్రాణములు {పంచప్రాణములు - 1ప్రాణము 2అపానము 3సమానము 4ఉదానము 5వ్యానము}; శరీరంబులు = దేహత్రయములు {దేహత్రయము - 1స్థూలశరీరము 2సూక్ష్మశరీరము 3కారణశరీరములు}; సృజియించి = కలుగజేసి; చేతన = ఎల్ల ప్రాణుల; వర్గంబున్ = సమూహమున; కున్ = కు; జ్ఞాన = తెలివిని; ప్రదుండు = ఇచ్చువాడు; అగున్ = అగును; కావునన్ = కాబట్టి; సకల = సమస్త; నిగమ = వేదముల; సమూహంబులును = సమూహములు; తత్ = అతని, అట్టివాని; స్వరూప = శుభ స్వరూపములను {శుభస్వరూపములు - సచ్చిదానందాది స్వరూపములు}; గుణ = శుభ గుణములను {శుభగుణములు - సర్వజ్ఞత్వాది గుణములు}; వైభవ = వైభవములను; ప్రతిపాదికంబులు = విశదపరచునవి; కావునన్ = కాబట్టి; ముఖ్యంబు = ప్రధానము; ఐ = అయ్యి; ప్రవర్తించు = ఉండునట్టి; శ్రుతి = వేద రూపమైన; స్తోత్రంబున్ = స్తోత్రము; ఉపనిషత్ = ఉపనిషత్తులో; తుల్యంబు = సమానమైనది; అనేక = అసంఖ్యాకులైన; పూర్వ = పూర్వకాలపు; ఋషి = ఋషుల; పరంపర = పరంపరలనుండి; ఆయతంబునున్ = వచ్చినిది; ఐన = అయినట్టి; దీనిని = దీనిని; శ్రద్ధా = శ్రద్ధతో; యుక్తుండు = కూడినవాడు; ఐ = అయ్యి; ఎవ్వండునున్ = ఎవరైతే; అనుసంధించున్ = పఠించునో; అతని = వాని; కిన్ = కి; మోక్షంబు = ముక్తి; సులభంబు = సుళువుగా దొరుకునది; దీని = ఈ విషయమున; కిన్ = కు; నారాయణ = నారాయణునిచే; ఆఖ్యాతంబు = చెప్పబడినది; అగు = ఐన; ఒక్క = ఒకానొక; ఉపాఖ్యానంబు = వృత్తాంతము; కలదు = ఉన్నది; వినిపింతున్ = చెప్పెదను; వినుము = వినుము; భగవత్ = నారాయణునికి; ప్రియుండు = ఇష్టమైనవాడు; ఐన = అగు; నారదుండు = నారదుడు; ఒక్క = ఒకానొక; నాడున్ = దినమున; నారాయణాశ్రమంబు = నారాయణాశ్రమమున {నారాయణాశ్రమము - నారాయణ ఋషి యొక్క ఆశ్రమము}; కున్ = కు; చని = వెళ్ళి; ఋషి = మునుల; గణ = సమూహములతో; సమేతుండు = కూడి ఉన్నవాడు; ఐన = అయినట్టి; నారాయణఋషిన్ = నారాయణఋషిని; కనుంగొని = చూసి; నీవున్ = నీవు; నన్నున్ = నన్ను; అడిగిన = ప్రశ్నించిన; అట్ల = ఆ విధముగనే; ఆ = ఆ; మహాత్మునిన్ = గొప్పవానిని; అడిగినన్ = అడుగగా; అతండు = అతను; మున్ను = మునుపు; ఈ = ఈ; అర్థంబున్ = విషయమును; శ్వేతద్వీప = శ్వేతద్వీపమున; వాసులు = నివసించువారు; ఐన = అయినట్టి; సనకసనందనాది = సనకాది {సనకాదులు - 1సనకుడు 2సనందనుడు 3సనత్సుజాతుడు 4సనత్కుమారుడు}; దివ్య = దేవ; యోగి = ఋషి; ఇంద్రులు = ఉత్తములు; ప్రశ్నసలిపినన్ = చర్చించుకొనుచుండగ; వారల = వారి; కున్ = కి; సనందనుండు = సనందనుడు; చెప్పిన = చెప్పిన; ప్రకారంబు = విధముగా; నీ = నీ; కున్ = కు; ఎఱింగించెదను = తెలిపెదను; అని = అని; చెప్పన్ = చెప్పట; తొడంగె = మొదలిడెను; శయానుండు = పరుండి యున్నవాడు; ఐన = అయినట్టి; రాజ = రాజ; శ్రేష్ఠునిన్ = ఉత్తముని; తత్ = అతని; పరాక్రమ = పరాక్రమము; దక్షత = సమర్థతల; ఆది = మున్నగువాని; చిహ్నంబులను = గుర్తులను; నుతియించు = స్తోత్రములు చేయు; వంది = స్తుతిపాఠకుల; జనంబులు = సమూహము; చందంబునన్ = విధముగ; జగత్ = లోకములకు; అవసాన = ప్రళయకాల; సమయంబునన్ = సమయమునందు; అనేక = పెక్కు; శక్తి = శక్తులతో; యుతుండు = కూడినవాడు; ఐ = అయ్యి; యోగనిద్రా = యోగనిద్రలో; పరవశుండు = మునిగినవాడు; ఐన = అయినట్టి; సర్వేశ్వరుని = సర్వనియాకుని; వేదంబులు = వేదములు; స్తోత్రంబున్ = స్తుతించుట; చేయు = చేసెడి; విధంబున్ = విధానమును; నారాయణుండు = నారాయణుడు; నారదున్ = నారదుని; కున్ = కి; చెప్పినిన్ = చెప్పగా; తెఱంగు = విధమున; వినుము = వినుము; అని = అని; ఇట్లు = ఈ విధముగా; అనియె = పలికెను.
భావము:- ఇలా శుకమహర్షి చెప్పగా పరీక్షిత్తు ఆయనతో ఇలా అన్నాడు. “శుకమహర్షి! ఘటపటాదులలాగా నిర్దేశించటానికి వీలుగాకుండా సత్త్వాది గుణశూన్యమైన బ్రహ్మముతో సత్త్వాదిగుణాలకు లోబడిన వేదాలు ప్రవర్తించే విధానాన్ని చెప్పవలసింది” అని కోరాడు అందుకు శుకయోగీంద్రుడు పరీక్షన్నరేంద్రునకు ఇలా చెప్పసాగాడు. “సకల చరాచరములందు సర్వాంతర్యామియై ఉండు భగవంతుడు సమస్త చేతన వర్గానికీ జ్ఞానాన్ని ప్రసాదించేవాడు. కనుక వేదాదులు సర్వం ఆ పరమేశ్వరుని స్వరూప గుణ వైభవాలను స్తుతిస్తూ ఉంటాయి. అలాంటి శ్రుతిస్తోత్రం ఉపనిషత్తులతో సమానమైనది. ఎందరో మహర్షులు పూర్వం ప్రసాదించిన ఇది పరంపరాగతంగా అందుతోంది. దీనిని శ్రద్ధాపూర్వకంగా అనుసంధించే వారికి మోక్షం సులభ సాధ్యం అవుతుంది. దీనికి దృష్టాంతంగా నారాయణోపాఖ్యానము అనే ఒక పురాణకథ ఉంది. చెప్తాను, విను. పానుపుమీద పడుకుని ఉన్న రాజేంద్రుని పరాక్రమ సామర్థ్యాలను వందిమాగధులు కొనియాడేవిధంగా కల్పాంతసమయంలో అనేక శక్తులతో కూడుకొని యోగనిద్రలో ఉన్న సర్వేశ్వరుడిని వేదాలు స్తోత్రం చేసే పద్ధతి (శ్రుతిగీతలు) ఎలాంటిదో పూర్వం సనందుడనే ముని, శ్వేతద్వీపవాసులైన సనకాది మునులు పరస్పరం చర్చించుకునే సందర్భంలో విశదీకరించాడు. దానిని నారాయణముని తన దగ్గరకు విచ్చేసిన నారదుడికి చెప్పాడు. ఆ వృత్తంతం వివరిస్తాను” అని శుకుడు పరీక్షత్తునకు ఇలా చెప్పసాగాడు.

తెభా-10.2-1204-సీ.
"యజయ హరి! దేవ! కలజంతువులకు-
జ్ఞానప్రదుండవుగాన వారి
లన దోషంబులు లిగిన సుగుణ సం-
తానంబుగాఁ గొని జ్ఞానశక్తి
ముఖ్యషడ్గుణ పరిపూర్ణతఁ జేసి మా-
యాత్మవిశిష్టుండ గుచుఁ గార్య
కారణాత్మకుఁడవై డఁగి చరించుచు-
నున్న నీయందుఁ బయోరుహాక్ష!

తెభా-10.2-1204.1-తే.
తివిరి యామ్నాయములు ప్రవర్తించుఁ గాన
ప్రకట త్రిగుణాత్మకం బైన ప్రకృతితోడి
యోగ మింతయు మాన్పవే! యోగిమాన
సాంబుజాత మధువ్రత!" ని నుతించి.

టీక:- జయజయ = జయము జయము; హరి = కృష్ణా {హరి - ప్రళయకాలమున సకల లోకములను లయింపజేసికొనువాడు, విష్ణువు}; దేవా = కృష్ణా {దేవుడు - దీవ్యత ఇతి ద్వః, ధాతువు, దివ్ విజిగీషా స్వప్న కాంతి గతిషు.}; సకల = సమస్తమైన; జంతువుల్ = ప్రాణుల; కున్ = కు; జ్ఞాన = జ్ఞానమును; ప్రదుండవు = ఇచ్చువాడవు; కాన = కాబట్టి; వారి = వారల; వలన = వలన; దోషంబులు = తప్పులు, పొరపాట్లు; కలిగినన్ = కలిగినను; సుగుణ = మంచిగుణముల; సంతానంబు = సమూహము; కాన్ = ఐనట్లు; కొని = తీసుకొని; జ్ఞాన = జ్ఞానమునందు; శక్తి = సమర్థతలు; ముఖ్య = మొదలగు; షడ్గుణ = షడ్గుణములచేత {షడ్గుణములు - 1జ్ఞానము 2ఐశ్వర్యము 3వీర్యము 4యశము 5శ్రీ 6వైరాగ్యము ఇవి భగవంతుని షడ్గుణములు.}; పరిపూర్ణతన = పరిపూర్ణత్వము; చేసి = వలన; మా = మా యొక్క; ఆత్మ = ఆత్మలలో; అవశిష్టుండవు = శేషించినవాడవు; అగుచున్ = ఔతు; కార్య = కార్యము {కార్యము - ప్రపంచము}; కారణ = కారణములు(రెండు) {కారణము - ప్రపంచసృష్టికి కారణములు ఐన అవ్యక్తము మహత్తు అహంకారము పంచతన్మాత్రలు పంచభూతములు}; ఆత్మకుండవు = తానేఐనవాడవు {ఆత్మకుండవు - స్వరూపుడవు}; ఐ = అయ్యి; కడగి = పూని; చరించుచున్ = వర్తించుచు; ఉన్న = ఉన్నట్టి; నీ = నీ; అందున్ = అందు; పయోరుహాక్ష = పద్మాక్ష, కృష్ణా.
తివిరి = యత్నించి; ఆమ్నాయములు = వేదములు; ప్రవర్తించున్ = ఉండును, పుట్టును; కానన్ = కనుక; ప్రకట = ప్రసిద్ధములైన; త్రిగుణా = త్రిగుణముల {త్రిగుణములు - సత్వరజస్తమో గుణములు}; ఆత్మకంబు = కలది; ఐన = అయినట్టి; ప్రకృతి = మాయ; తోడి = తోటి; యోగమున్ = కూడికను; ఇంతయున్ = ఇది అంతటిని; మాన్పవే = తొలగించుము; యోగి = ఋషుల యొక్క; మానస = మనస్సులు అను; అంబుజాత = పద్మముల యందు; మధువ్రత = తుమ్మెదవంటివాడా; అని = అని; నుతించి = స్తుతించి.
భావము:- “ఓ దేవ! శ్రీహరి! పద్మాక్షా! మహర్షి మానస విహారా! నీకు జయమగు గాక, నీవు సకల ప్రాణులకు జ్ఞానాన్ని ప్రసాదించేవాడివి. కనుక, ఆ జీవుల వలన దోషాలు ఏమి కలిగిన మంచి తనయులనుగానే స్వీకరిస్తావు. భాగవత సద్గుణైశ్వర్య సంపన్నుండవు కావున, మా అందరిలోను ఆత్మరూపంతో ఉంటావు. కార్యకారణాత్మకుడవై ప్రవర్తిస్తుంటావు. నీ లోనే సకలవేదాలు ప్రవర్తిస్తాయి. సత్త్వరజస్తమోగుణాలు అనే త్రిగుణాత్మక ప్రకృతితో మా కున్న బంధాన్ని ఛేదించు.” అని భగవంతుని కీర్తించి

తెభా-10.2-1205-వ.
"అదియునుం గాక.
టీక:- అదియునున్ = అంతే; కాక = కాకుండా.
భావము:- ఇంకా ఇలా పలుకసాగాడు.

తెభా-10.2-1206-సీ.
రమవిజ్ఞాన సంన్ను లైనట్టి యో-
గీంద్రులు మహితనిస్తంద్ర లీలఁ
రిదృశ్యమానమై భాసిల్లు నిమ్మహీ-
ర్వత ముఖర ప్రపంచ మెల్ల
రఁగ బ్రహ్మస్వరూము గాఁగఁ దెలియుదు-
రెలమి నీవును జగద్విలయవేళ
వశిష్టుఁడవు గాన నఘ! నీ యందు నీ-
విపుల విశ్వోదయవిలయము లగు

తెభా-10.2-1206.1-తే.
ట శరావాదు లగు మృద్వికారములు మృ
దాత్మకంబైన యట్లు పద్మాయతాక్ష!
విలి కారణరూపంబుఁ దాల్చి లీలఁ
డఁగు నీయందు బుద్ధి వాక్కర్మములను.

టీక:- పరమ = ఉత్కృష్టమైన; విజ్ఞాన = అనుభవజ్ఞానము యొక్క; సంపన్నులు = కలిమి కలవారు; ఐనట్టి = అయినట్టి; యోగి = ఋషి; ఇంద్రులు = ఉత్తములు; మహిత = గొప్ప; నిస్తంద్ర = పరాకులేని; లీలన్ = విధముగా; పరిదృశ్యమానము = చక్కగా కనబడుచున్నది; ఐ = అయ్యి; భాసిల్లున్ = ప్రకాశించునట్టి; ఈ = ఈ; మహీ = భూమి; పర్వత = కొండలు; ముఖర = మున్నగువానితో కూడిన; ప్రపంచము = జగత్తు; ఎల్లన్ = సర్వము; పరగన్ = ప్రకటముగా; బ్రహ్మ = పరబ్రహ్మయొక్క; స్వరూపము = ఆకృతి; కాగన్ = ఐనట్లు; తెలియుదురు = తెలిసికొందురు; ఎలమిన్ = సంతుష్టితో; నీవునున్ = నీవు; జగత్ = లోక మంతయు; విలయవేళన్ = ప్రళయకాలమందును; అవశిష్టుండవు = మిగిలి ఉండువాడవు, శేషుడవు; కానన్ = కాబట్టి; అనఘ = పుణ్యస్వరూపుడా; నీ = నీ; అందున్ = అందు; ఈ = ఈ; విపుల = విస్తారమైన; విశ్వ = జగత్తు యొక్క; ఉదయ = సృష్టి; విలయములు = ప్రళయములు; అగున్ = కలుగును.
ఘట = కుండ; శరావ = మూకుడు; ఆదులు = మొదలగునవి; అగు = ఐన; మృత్ = మట్టి నుండి; వికారములు = మార్పుచెందినవి; మృత్ = మట్టి; ఆత్మకంబు = స్వరూపములే; ఐన = అయిన; అట్లు = ఆ విధముగనే; పద్మాయతాక్ష = కృష్ణా; తవిలి = పూని; కారణరూపంబున్ = జగత్కారణభూతము; తాల్చి = ధరించి; లీలన్ = విలాసముగా; కడగు = పూనునట్టి; నీ = నీ; అందున్ = అందు; బుద్ధిన్ = బుద్ధి యొక్క; వాక్ = పలుకుల యొక్క; కర్మములను = వ్యాపారమును.
భావము:- “ఓ మహానుభావ! కమలాక్షా! బ్రహ్మ విజ్ఞాన సంపన్నులైన పరమ యోగీశ్వరులు ప్రమత్తమైన విధంగా కనబడేది అయినట్టి భూమి, పర్వతాలు మున్నగు వాటి అన్నింటితో కూడి ఉన్న ఈ ప్రపంచాన్ని బ్రహ్మస్వరూపం గానే భావిస్తారు. ప్రళయకాలంలో నీవు ఒక్కడవే మిగిలి ఉంటావు. కుండలూ, మూకుళ్ళూ మొదలైనవన్నీ మట్టితో ఏర్పడి మృత్తికా రూపాలైనట్లే, విస్తారమైన ఈ విశ్వం మొత్తము పుట్టుక నాశము రెండూ నీ వల్లనే జరుగుతున్నాయి. ఈ సమస్త విశ్వానికీ నీవే కారణభూతుడవు. అట్టి నీ యందు వాక్కాయ కర్మల పూర్వకంగా....

తెభా-10.2-1207-క.
వడఁ జేయుచు నుందురు
కొని యిలఁ బెట్టఁబడిన దవిన్యాసం
బులు పతనకారణముగా
వున సేవించుచునుఁ గృతార్థులు నగుచున్.

టీక:- అలవడజేయుచున్ = అలవాటు చేయుచు; ఉందురు = ఉంటారు; బలకొని = అతిశయించి; ఇలన్ = నేలపై; పెట్టబడిన = వేయబడిన; పదవిన్యాసంబులు = అడుగులు; పతన = పడుటకు, జారుటకు; కారణము = కారణము; కాన్ = అగునట్లు; అలవునన్ = నేర్పుతో; సేవించుచునున్ = కొలచుచు; కృతార్థులు = ధన్యులు; అగుచున్ = అగుచు.
భావము:- త్రికరణ శుద్ధిగా విజ్ఞానసంపన్నులు నీ యందే బుద్ధిని లగ్నంచేసి జన్మము ఎత్తడానికి పతనానికి కారణంగా గ్రహిస్తారు. త్రికరణశుద్ధిగా నిన్నే సేవిస్తూ కృతార్థు లవుతారు.

తెభా-10.2-1208-క.
లీలం బ్రాకృతపూరుష
కాలాదిక నిఖిలమగు జగంబుల కెల్లన్
మాలిన్య నివారక మగు
నీ లితకథాసుధాబ్ధినిం గ్రుంకి తగన్.

టీక:- లీలన్ = విలాసముగా; ప్రాకృత = మాయకు చెందినవి; పూరుష = పురుషులకు చెందినవి; కాల = కాలానికి చెందినవి; ఆదిక = మొదలైన; నిఖిలము = సమస్తము; అగు = ఐన; జగంబుల్ = లోకములు; కున్ = కు; ఎల్లన్ = అన్నిటికి; మాలిన్య = అజ్ఞానమును, మలినములను; నివారకము = తొలగించునది; అగు = ఐన; నీ = నీ యొక్క; లలిత = మనోజ్ఞమైన; కథా = కథలు అను; సుధా = అమృతపు; అబ్ధిన్ = సముద్రము నందు; క్రుంకి = మునిగి; తగన్ = బాగా.
భావము:- ప్రాకృతము, పురుషుడు, కాలములకు స్వరూప నిలయమైన ఈ ప్రపంచంలోని నిఖిల పాపాలనూ నివారించే సామర్ధ్యం కల నీ మనోహర కథామృత సముద్రంలో మునిగి ధన్యులు అవుతారు.

తెభా-10.2-1209-చ.
రిత నిదాఘ తప్తుఁ డగు పాంథుఁడు శీతలవారిఁ గ్రుంకి దు
ష్క మగు తాపముం దొఱగు కైవడి సంసరణోగ్రతాపమున్
వెవునఁ బాయుచుండుదురు నిన్ను భజించుమహాత్మకుల్‌ జరా
ణ మనోగదంబులఁ గ్రమంబునఁ బాయుట సెప్ప నేటికిన్?

టీక:- భరిత = నిండు; నిదాఘ = వేసవి యందు; తప్తుడు = తాపము పొందినవాడు; అగు = ఐన; పాంథుడు = బాటసారి; శీతల = చల్లని; వారిన్ = నీటి యందు; క్రుంకి = స్నానముచేసి; దుష్కరము = ఓర్వరానిది; అగు = ఐన; తాపమున్ = తాపమును; తొఱగు = పోగొట్టుకొను; కైవడిన్ = విధముగ; సంసరణ = సంసారము వలని; ఉగ్ర = భయంకరమైన; తాపమున్ = తాపత్రయములను {తాపత్రయములు - 1ఆధ్యాత్మిక 2ఆధిదైవిక 3 ఆధిభౌతికములను తాపములు}; వెరవునన్ = ఉపాయముగా; పాయుచుండుదురు = తొలగించు కొనుచుందురు; నిన్నున్ = నిన్ను; భజించు = సేవించెడి; మహాత్మకుల్ = గొప్పవారు; జరా = ముసలితనము; మరణ = చావు; మనోగదంబులన్ = మనోవ్యాధులను; క్రమంబునన్ = క్రమముగా; పాయుటన్ = తొలగించుకొనుటను; చెప్పనేటికిని = వేరే చెప్పడం ఎందుకు.
భావము:- బాటసారి తీవ్రమైన వేసవి ఎండకి కలిగే పరితాపాన్ని, చన్నీళ్ళ స్నానం చేసి పోగొట్టుకుంటాడు. అదే విధంగా నిన్ను పూజించే మహాత్ములు సంసార దుర్భర తాపాన్ని నేర్పుతో తొలగించుకుంటారు. అలాంటప్పుడు మనోవ్యధ, ముసలితనము, మరణములను పోగొట్టుకుంటారని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు కదా.

తెభా-10.2-1210-వ.
అదియునుం గాక.
టీక:- అదియునున్ = అంతే; కాక = కాకుండా.
భావము:- అంతేకాకుండా.

తెభా-10.2-1211-సీ.
నయంబు దేహి నిత్యానిత్య సద్విల-
క్షణమునఁ బంచకోవ్యవస్థ
భివృద్ధిఁ బొరయుచు నందులోపల నున్న-
ప్రాణాన్నబుద్ధి విజ్ఞానమయము
ను చతుష్కోశంబు వ్వల వెలుఁగొందు-
నానందమయుఁ డీవు గాన దేవ!
సురుచిర స్వప్రకాశుండవు నీ పరి-
గ్రహము గల్గుటఁ జేసి కాదె ప్రకృతి

తెభా-10.2-1211.1-తే.
హ దహంకార పంచతన్మాత్ర గగన
వన తేజోంబు భూ భూతపంచకాది
లిత తత్త్వముల్‌ బ్రహ్మాండకార్య కరణ
మందు నెపుడు సమర్థంబు గుటఁ జూడ.

టీక:- అనయంబున్ = ఎల్లప్పుడు; దేహి = జీవుడు; నిత్యా = శాశ్వతము; అనిత్య = అశాశ్వతము అను; సత్ = శ్రేష్ఠమైన; విలక్షణమునన్ = విశిష్టలక్షణములు కల; పంచకోశ = అన్నకోశాదుల {పంచకోశములు - 1అన్నమయము 2ప్రాణమయము 3మనోమయము 4విజ్ఞానమయము 5ఆనందమయము}; వ్యవస్థన్ = వ్యవస్థలచేత; అభివృద్ధిన్ = పెరుగుటను; పొరయుచున్ = పొందుతు; అందు = దాని; లోపలన్ = లోన; ఉన్న = ఉన్నట్టి; ప్రాణ = ప్రాణమయము; అన్న = అన్నమయము; బుద్ధి = బుద్ధిమయము; విజ్ఞాన = విజ్ఞాన; మయములు = మయములు; అను = అనెడి; చతుష్ = నాలుగు (4); కోశంబుల = కోశములకు; అవ్వల = పైన; వెలుగొందు = ప్రకాశించెడి; ఆనందమయుడవు = ఆనందమయకోశ రూపుడవు; కాన = కాబట్టి; దేవ = భగవంతుడా; సు = మిక్కిలి; రుచిర = కాంతివంతమైన; స్వ = స్వయముగా; ప్రకాశుండవు = ప్రకాశించువాడవు; నీ = నీ యొక్క; పరిగ్రహమున్ = అనుగ్రము; కల్గుటన్ = లభించుట; చేసి = చేతనే; కాదె = కదా; ప్రకృతి = అవ్యక్తము.
మహత్ = మహత్తు; అహంకార = అహంకారము; పంచతన్మాత్ర = పంచతన్మాత్రలు {పంచతన్మాత్రలు - 1శబ్ద 2స్పర్శ 3రూప 4రస 5గంధములు}; గగన = ఆకాశము; పవన = వాయువు; తేజంబు = అగ్ని; అంబు = జలము; భూ = భూమి అను; భూతపంచక = పంచభూతములు; ఆది = మున్నగువానిచేత; కలిత = కూడిన; తత్వముల్ = తత్వములు {తత్వములు - 1ప్రకృతి 2మహత్తు 3అహంకారము మరియు పంచతన్మాత్రలు (5) భూతపంచకము (5)మున్నగునవి}; బ్రహ్మాండ = సృష్టిస్థితిలయములను, సమస్తజగత్తులలోని; కార్య = కార్యములను; కరణ = కావించుట; అందున్ = లో; ఎపుడున్ = ఎల్లప్పుడు; సమర్థంబులు = సామర్థ్యముకలవి; అగుటన్ = ఐఉంటుట; చూడన్ = తరచిచూసినచో.
భావము:- ప్రాణ, అన్న, బుద్ధి, విజ్ఞాన, ఆనందమయాలనే పంచకోశాల యొక్క శాశ్వతమూ అశాశ్వతమూ అనే లక్షణాల వలన జీవులు అభివృద్ధి పొందుతూంటాయి. ఈ పంచకోశాలలో చివరిదైన ఆనందమయకోశానికి చెంది ప్రాణమయ, అన్నమయ, బుద్ధిమయ, విజ్ఞానమయ నాలుగు కోశాలకు పరమై నీవు స్వయంప్రకాశుడవై వెలుగొందుతుంటావు. నీ అనుగ్రహం ఉన్నందు వలనే కదా ఈ ప్రకృతీ, మహత్తూ, అహంకారమూ; పంచతన్మాత్రలైన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలూ; పంచభూతాలైన భూమీ, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం మున్నగునవి అన్నీ ఈ సమస్త సృష్టి, స్థితి, లయ కార్యాలను సర్వ సమర్థంగా నిర్వహిస్తున్నాయి.

తెభా-10.2-1212-క.
కోరి శరీరులు భవదను
సారంబున నిహపరైక సౌఖ్యంబులఁ బెం
పారఁగ నందుచు నుందురు
ధీజనోత్తము లనంగ దివిజారిహరా!

టీక:- కోరి = ఆపేక్షించి; శరీరులు = జీవులు; భవత్ = నిన్ను; అనుసారంబునన్ = అనుసరించుటచేత; ఇహ = ఈ లోకములో; పర = పరలోకములో; ఏక = ముఖ్యమైన; సౌఖ్యంబులన్ = సుఖానుభవములను; పెంపారగన్ = అధికముగ; అందుచుందురు = పొందుతుంటారు; ధీరజన = జ్ఞానసంపన్ను లైన వారిలో; ఉత్తములు = ఉత్తములు; అనంగన్ = అనగా; దివిజారిహరా = కృష్ణా {దివిజారి హరుడు - దేవతశత్రువు (రాక్షసు)లను సంహరించువాడు, విష్ణువు}.
భావము:- ఓ అసుర సంహారా! నామ రూప ధారులు నిన్ను భజిస్తూ ఇహపర సౌఖ్యాలను పొంది గొప్పవారని ప్రసిద్ధులు అవుతారు.

తెభా-10.2-1213-ఆ.
నిన్ను ననుసరింప నేరని కుజనులు
వనపూర్ణ చర్మస్త్రి సమితి
యోజఁ జేయుచుందు రుచ్ఛ్వసనంబులు
లసి యాత్మదేహజను లగుచు.

టీక:- నిన్నున్ = నిన్ను; అనుసరింపన్ = ఆరాధించుట; నేరని = తెలియని; కుజనులు = చెడ్డవారు; పవన = గాలిచేత; పూర్ణ = నిండిన; చర్మభస్త్రి = తోలుతిత్తి; సమితి = సమూహము; యోజన్ = వలె; చేయుచుందురు = చేస్తుంటారు; ఉచ్ఛ్వసనంబులు = ఉచ్ఛ్వానిశ్వాసములు; బలసి = అతిశయించి; ఆత్మ = తమ; దేహ = శరీరమునే; భజనులు = ఆరాధించువారు; అగుచున్ = ఔతు.
భావము:- గాలితో నిండిన తోలుతిత్తి లాంటి తమ శరీరం మీది మమకారంతో, నిన్ను సేవించని దుష్ట మానవులు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నింపుకుంటూ ఆ దేహాన్నే తమ ఆత్మ అనుకుని భజిస్తూ ఉంటారు.

తెభా-10.2-1214-సీ.
దేవ! కొందఱు సూక్ష్మదృక్కు లైనట్టి మ-
హాత్మకు లుదరస్థుఁ డైన వహ్ని
గా మదిఁ దలఁతురు కైకొని మఱికొంద-
ఱారుణు లనుపేర మరు ఋషులు
లీల సుషుమ్ననాడీ మార్గగతుఁడవై-
హృత్ప్రదేశమునఁ జరించుచున్న
రుచి దహరాకాశ రూపిగా భావింతు-
ట్టి హృత్పద్మంబునందు వెడలి

తెభా-10.2-1214.1-తే.
వితమూర్ధన్యనాడికాతుల నోలి
బ్రహ్మరంధ్రంబుఁ బ్రాపించి రమపురుష!
సుమహితానందమయ పరంజ్యోతిరూపి
వైన నినుఁ బొంది మఱి పుట్ట వని యందు.

టీక:- దేవ = కృష్ణా {దేవుడు - స్వయంప్రకాశుడు, విష్ణువు}; కొందఱు = కొంతమంది; సూక్ష్మదృక్కులు = సూక్షదృష్టికలవారు; ఐనట్టి = అయిన; మహాత్మకులు = గొప్ప ఆత్మ కలవారు; ఉదరస్థుడు = మణిపూరకచక్రమున ఉండునట్టి; ఐన = అయిన; వహ్ని = అగ్నిహోత్రునిగా; మదిన్ = మనసునందు; తలతురు = ధ్యానించెదరు; కైకొని = చేపట్టి; మఱికొందఱు = మరికొంతమంది; ఆరుణులు = ఆరుణులు; అను = అనెడి; పేరన్ = పేరుతో; అమరు = ఉండెడి; ఋషులు = మునులు; లీలన్ = విలాసముగా; సుషుమ్ననాడీ = సుషుమ్ననాడి యొక్క {సుషుమ్ననాడి మార్గము - రొమ్ము మొదలుకొని శిరస్సువరకు వ్యాపించుచున్న నాడీమార్గము}; మార్గగతుడవు = వెడలినవాడవు; ఐ = అయ్యి; హృత్ప్రదేశమునన్ = అనాహతచక్రము {హృత్ప్రదేశము - హృదయస్థానము నందలి చక్రము, అనాహతము}; చరించుచున్న = మెలగుచుండెడి; రుచిత్ = కాంతివంతమైన; అహరాకాశ = ఆకాశ; రూపి = స్వరూపముకలవాడు; కాన్ = ఐనట్లు; భావింతురు = తలచెదరు; అట్టి = అటువంటి; హృత్పద్మంబున్ = అనాహతచక్రము; అందున్ = నుండి; వెడలి = బయలుదేరి.
వితత = విశాలమైన; మూర్థన్య = నడినెత్తి; నాడికా = నరముల, నాడుల కూడలి; గతులన్ = మార్గమున; బ్రహ్మరంధ్రంబున్ = సహస్రారచక్రమును; ప్రాపించి = పొంది, చేరి; పరమపురుష = పురుషోత్తమ; సుమహిత = మిక్కిలి రమణీయమైన; ఆనందమయ = చిదానందరూపమైన; పరంజ్యోతి = పరబ్రహ్మ; రూపివి = స్వరూపముకలవాడవు; ఐన = అయిన; నినున్ = నిన్ను; పొంది = చేరి; మఱి = ఆ పైన; పుట్టరు = జన్మించరు.
భావము:- ఓ భగవంతుడా! మహితాత్మకులు “సూక్ష్మ దర్శనులు” నిన్ను గర్భంలో ఉన్న అగ్నిగా భావిస్తారు. ఋషీశ్వరులు “ఆరుణులు” సుషుమ్నానాడీ మార్గంలో సంచరిస్తూ హృదయ ప్రదేశంలో సంచరించే సూక్ష్మాకార రూపం కలవాడిగా నిన్ను తలుస్తారు. అట్టి హృదయపద్మం నుంచి వెలువడి మూర్ధన్య నాడి ద్వారా బ్రహ్మరంధ్రం చేరుకుని, ఆనందమయ పరంజ్యోతి స్వరూపుడవు అయిన నిన్ను చేరి ఆ అరుణులు ముక్తులు అవుతారు. వారికి మరల జన్మ అంటూ ఉండదు.

తెభా-10.2-1215-వ.
మఱియు వివిధ కాష్ఠాంతర్గతుం డయిన వాయుసఖుండు తద్గత దోషంబునం బొరయక నిత్యశుద్ధుఁడై తరతమ భావంబున వర్తించు చందంబున స్వసంకల్పకృతంబు లయిన విచిత్రశరీరంబుల యందు నంతర్యామివై ప్రవేశించి తత్తద్విచిత్రయోనిగతం బైన హేయంబులం బొరయక సకలాత్మ సమంబై బ్రహ్మం బయిన నిన్ను నైహికాముష్మిక ఫలసంగమంబు లేక విగత రజోగుణంబులం దగిలి కొందఱు భజియించుచుండుదు; రదియునుం గాక, దేవా! భవదీయ సంకల్పాధీనంబు లయిన శరీరంబులం బ్రవేశించి యున్న జీవసమూహంబు నీకు శేషభూతం బని తెలిసి కొందఱు భవనివారకం బయిన శ్రీమత్త్వచ్చరణారవిందంబులు సేవించి కృతార్థు లగుదురు మఱియును.
టీక:- మఱియున్ = ఇంకను; వివిధ = నానా విధములైన; కాష్ఠ = కఱ్ఱల; అంతర్గతుండు = లోపల నుండువాడు; ఐన = అయిన; వాయుసఖుండు = అగ్నిహోత్రుడు; తత్ = వాటి; గత = అందలి; దోషంబునన్ = దోషములను, వంకరలను; పొరయక = పొందకుండ; నిత్య = ఎల్లప్పుడును; శుద్ధుడు = శుద్ధముగా నుండువాడు; ఐ = అయ్యి; తర = అధిక్యము; తమ = సర్వాధిక్య; భావంబునన్ = లక్షణములతో; వర్తించున్ = మెలగెడి; చందంబునన్ = విధముగ; స్వ = తన యొక్క; సంకల్ప = సంకల్పముచేత; కృతంబులు = చేయబడినవి; అయిన = ఐన; విచిత్ర = ఆశ్చర్యకరములైన; శరీరంబులన్ = దేహముల; అందున్ = అందును; అంతర్యామివి = లోపల నుండువాడవు {అంతర్యామి - జీవత్మలో నుండెడి పరమాత్మ}; ఐ = అయ్యి; ప్రవేశించి = చేరి; తత్తత్ = ఆయా; విచిత్ర = విచిత్రములైన; యోని = గర్భము నందు; గతంబు = ఉండునవి; ఐన = అయిన; హేయంబులన్ = దోషములను; పొరయక = పొందకుండ; సకల = సర్వమును; ఆత్మన్ = తనకు; సమంబు = సమానముగా; ఐ = ఉండి; బ్రహ్మంబు = పరబ్రహ్మతత్వము; అయిన = ఐన; నిన్నున్ = నిన్ను; ఐహిక = ఇహలోకపు; ఆముష్మిక = పరలోకపు; ఫల = ప్రయోజనముల; సంగమంబు = సంబంధము; లేక = లేకుండా; విగత = తొలగిన; రజోగుణంబులన్ = రజోగుణము లందు; తగిలి = ఆసక్తులై; కొందఱు = కొంతమంది; భజియించుచున్ = సేవించుచు; ఉండుదురు = ఉంటారు; అదియున్ = అంతే; కాక = కాకుండ; దేవా = భగవంతుడా; భవదీయ = నీ యొక్క; సంకల్ప = సంకల్పమునకు; ఆధీనంబులు = లోబడినవి; అయిన = ఐన; శరీరంబులన్ = దేహము లందు; ప్రవేశించి = దూరి; ఉన్న = ఉన్నట్టి; జీవ = ప్రాణుల; సమూహంబున్ = సమూహములు; నీ = నీ; కున్ = కు; శేషభూతంబు = మిగిలి ఉండునవి; అని = అని; తెలిసి = తెలిసి; కొందఱు = కొంతమంది; భవ = పునర్జన్మల, సంసార; నివారకంబు = తొలగించునది; అయిన = ఐన; శ్రీమత్త్వత్ = మోక్షసంపద కలిగించెడి; చరణ = పాదములు అను; అరవిందంబులున్ = పద్మములు; సేవించి = కొలిచి; కృతార్థులు = ధన్యులు; అగుదురు = ఔతారు; మఱియును = ఇంకను.
భావము:- దేవా! కఱ్ఱకు ఎన్ని వంకరలు ఉన్నా, కఱ్ఱలో అంతర్గతంగా ఉండే అగ్నిహోత్రునికి ఆ వంకరలు అంటవు కదా అలాగే. నీవు నీ సంకల్పానికి అనుగుణంగా విశిష్ఠంగా చిత్రించి ఆ శరీరాలలో అంతర్యామిగా ఉన్నప్పటికీ, ఆయా శరీరుల పాపాలు నీకు సోకవు. అటువంటి సర్వాంతర్యామివై సాక్షాత్తు పరబ్రహ్మమైన నిన్ను నిష్కాములై ఫలాపేక్షలేక రజోగుణాన్ని వదలిన కొందరు మహాత్ములు సేవిస్తూ ఉంటారు. తమ తమ ప్రాణదేహాలు నీ ఆధీనాలని తెలిసినవారు భగవంతుడవైన నీ పాదపద్మాలను ధ్యానించి భవరోగాలకు దూరులౌతారు.

తెభా-10.2-1216-సీ.
నఘ! దుర్గమమైన యాత్మతత్త్వంబు ప్ర-
ర్తించుకొఱకు దివ్యంబులైన
యంచిత రామకృష్ణాద్యవతారముల్‌-
జియించియున్న నీ వ్యచరిత
ను సుధాంభోనిధి వగాహనము సేసి-
విశ్రాంతచిత్తులై వెలయుచుండి
మోక్షంబు బుద్ధినపేక్షింపనొల్లరు-
ఱియుఁగొందఱు భవచ్చరణపంక

తెభా-10.2-1216.1-ఆ.
ములఁ దగిలి పుణ్యము లైన హంసల
డువు నొంది భాగతజనముల
నొనరువారు ప్రకట యోగిజనప్రాప్య
మైన ముక్తిఁ గోర రాత్మ లందు.

టీక:- అనఘ = పుణ్యవంతుడా; దుర్గమము = పొందరానిది; ఐన = అయిన; ఆత్మ = పరమాత్మ; తత్వంబున్ = స్వరూపమున; ప్రవర్తించు = వర్తిల్లచేయుట; కొఱకు = కోసము; దివ్యంబులు = దివ్యములు; ఐన = అయినట్టి; అంచిత = చక్కటి; రామ = రామావతారము; కృష్ణా = కృష్ణావతారము; ఆది = మున్నగు; అవతారముల్ = అవతారములు; భజియించి = సేవించి; ఉన్న = ఉన్నట్టి; నీ = నీ యొక్క; భవ్య = మంగళ, శుభకర; చరితము = చరిత్ర; అను = అనెడి; సుధ = అమృతము అను; అంభోనిధి = సముద్రమునందు; అవగాహనము = మునుగుట, ఆకళించుకొనుట; చేసి = చేసి; విశ్రాంత = నెమ్మదినొందిన; చిత్తులు = మనసులుకలవారు; ఐ = అయ్యి; వెలయుచుండి = ప్రకాశించుచుండి; మోక్షంబున్ = ముక్తిని; బుద్ధిన్ = మనసునందు; అపేక్షింపన్ = కోరుటకూడ; ఒల్లరు = అంగీకరించరు; మఱియున్ = ఇంకను; కొందఱు = కొంతమంది; భవత్ = నీ యొక్క; చరణ = పాదములు అను; పంకజములన్ = పద్మములందు; తగిలి = ఆసక్తులై.
పుణ్యతములు = సర్వోత్తమపుణ్యులు; ఐన = అయిన; హంసలు = పరమహంసల; వడువున్ = విధమును; ఒంది = పొంది; భాగవత = భాగవతులు ఐన; జనములన్ = వారిని; ఒనరువారు = కూడి ఉండు వారు; ప్రకట = ప్రసిద్ధులైన; యోగి = ఋషుల; జన = సమూహముచేత; ప్రాప్యము = పొందదగినది; ఐన = అయిన; ముక్తిన్ = మోక్షమును; కోరరు = కోరుకొనరు; ఆత్మలు = మనసులు; అందున్ = లోను.
భావము:- పుణ్యాత్మా! నీ ఆత్మతత్వం తెలియుట బహుళతర కష్టసాధ్యమైనది. అట్టి ఆ ఆత్మతత్వం వ్యక్తమయ్యేలా రామకృష్ణాది అవతారాలు ధరిస్తావు. అటువంటి నీ దివ్యచరిత్ర అనే అమృతసాగరంలో స్నానమాడినవారు శాంతించిన చిత్తములు పొందుతారు. వారు ముక్తిని కూడా కోరరు. నీ పాదపద్మాలనే ధ్యానిస్తూ పరమహంసల్లా ప్రవర్తించే భాగవతశిఖామణులు కొందరు మహా యోగి వరేణ్యులు పొందే మోక్షమును ఆశించను కూడ ఆశించరు.

తెభా-10.2-1217-ఉ.
కొంఱు నీ శరీరము లకుంఠితభక్తి భవద్వశంబులై
చెందఁగ నీ పదాబ్జములు సేరి భజించుచుఁ దత్సుఖాత్ములై
యుందురు కొందఱీ తనువు లోలి ధరించి భవత్పదాబ్జముల్‌
పొందుగఁ గొల్వలేక నిలఁ బుట్టుచుఁ జచ్చుచు నుందు రవ్యయా!

టీక:- కొందఱు = కొంతమంది; ఈ = ఈ యొక్క; శరీరములన్ = భౌతిక దేహములను; అకుంఠిత = మొక్కవోని; భక్తిన్ = భక్తితో; భవత్ = నీకు; వశంబులు = ఆధీనములు; ఐ = అయ్యి; చెందగన్ = పొందగా; నీ = నీ యొక్క; పద = పాదములు అను; అబ్జములున్ = పద్మములను; చేరి = చేరి; భజించుచున్ = సేవించుచు; తత్ = ఆ యొక్క; సుఖ = సుఖముతోడి; ఆత్ములు = మనసులు కలవారు; ఐ = అయ్యి; ఉందురు = ఉంటారు; కొందఱు = కొంతమంది; ఈ = ఈ యొక్క; తనువులు = భౌతిక దేహములను; ఓలిన్ = క్రమముగా; ధరించి = తాల్చి; భవత్ = నీ యొక్క; పద = పాదములు అను; అబ్జముల్ = పద్మములను; పొందుగన్ = చక్కగా; కొల్వ = సేవించ; లేక = లేకుండా; ఇలన్ = భూమిమీద; పుట్టుచున్ = పునర్జన్మము లొందుచు; ఉందురు = ఉంటారు; అవ్యయా = కృష్ణా {అవ్యయుడు - వ్యయము లేనివాడు, విష్ణువు}.
భావము:- అవ్యయా! భగవంతుడ! శరీరధారులు సర్వులూ నీ అంశభూతములే యని ఎఱిగిన కొందరు సదా నీ పాదపద్మాలను సేవిస్తూ పరమానందం చెందుతారు. మఱికొందరు శరీరధారులు నీ పాదపద్మాలను భజించలేక ఈ లోకంలో పుడుతూ చస్తూ ఉంటారు.

తెభా-10.2-1218-చ.
నియమాది యోగమహితాత్మకులైన మునీంద్రులున్ విరో
మునఁ దలంచు చైద్యవసుధావర ముఖ్యనృపుల్‌ ఫణీంద్ర భో
ము లన నొప్పు బాహువులు ల్గిన నిన్ను భజించు గోపికల్‌
క్రమున నేమునున్ సరియ కామె భవత్కృప కంబుజోదరా!

టీక:- యమ = యమము {అష్టాంగయోగము - 1యమము 2నియమము 3ప్రాణాయామము 4ప్రత్యాహారము 5ధ్యానము 6ధారణ 7మననము 8సమాధి}; నియమ = నియమము; ఆది = మున్నగు; యోగ = యోగాభ్యాసములచేత; మహిత = శుద్ధములైన; ఆత్మకులు = మనసులు కలవారు; ఐన = అయిన; ముని = ముని; ఇంద్రులున్ = ఉత్తములూ; విరోధమునన్ = శత్రుత్వముచేత; తలంచు = తలచుకొనెడి; చైద్యవసుధావర = శిశుపాలుడు {చైద్యవసుధావరుడు - చేదిదేశపు రాజు, శిశుపాలుడు}; ముఖ్య = మున్నగు; నృపుల్ = రాజులూ; ఫణీ = పాములలో; ఇంద్ర = శ్రేష్ఠుల; భోగములనన్ = దేహములు; అనన్ = అనగా; ఒప్పు = సరిపోలి ఉండు; బాహువులున్ = చేతులు; కల్గిన = కలిగినట్టి; నిన్నున్ = నిన్ను; భజించు = సేవించెడి; గోపికల్ = గొల్ల యువతులూ; క్రమమునన్ = అదే వరుసలో; నేమునున్ = మేము; సరియ = సమానులమే; కామె = కదా; భవత్ = నీ యొక్క; కృప = దయ; కున్ = కు; అంబుజోదర = కృష్ణా.
భావము:- జితేంద్రియులూ పరమశాంతమూర్తులూ అయిన యోగులూ; శత్రుభావంతో నిన్ను తలపోసే శిశుపాలాది రాజన్యులూ; ఆదిశేష నాగుని పోలిన బాహువులతో నిండైన నిన్ను భక్తితో ఆరాధించే గోపికలూ; తరువాత మేమూ; నీ దివ్యమైన కృపకు సమానంగా పాత్రులం కావటంలో సందేహం లేదు.

తెభా-10.2-1219-మ.
విందాక్ష! భవత్స్వరూప మిలఁ బ్రత్యక్షంబునం గాన నె
వ్వరికిం బోలదు శాస్త్రగోచరుఁడవై ర్తింతు వీ సృష్టి ముం
సద్రూపుఁడవైన నీ వలననే ధాత్రాద్యమర్త్యుల్‌ జనిం
చిరి నిన్నంతకు మున్నెఱుంగఁ గలమే చింతింప నేమచ్యుతా!

టీక:- అరవిందాక్ష = కృష్ణా {అంబుజోదరుడు - పద్మము నాభియందు కలవాడు, విష్ణువు}; భవత్ = నీ యొక్క; స్వరూపము = స్వరూపము; ఇలన్ = భూమిమీద; ప్రత్యక్షంబునన్ = కనుల కెదురుగా; కానన్ = చూచుటకు; ఎవ్వరి = ఏ ఒక్కరికి; కిన్ = కిని; పోలదు = శక్యము కాదు; శాస్త్ర = శాస్త్ర జ్ఞానము లందు; గోచరుండవు = తోచువాడవు; ఐ = అయ్యి; వర్తింతువు = మెలగుదువు; ఈ = ఈ యొక్క; సృష్టి = ప్రపంచము; ముందరన్ = మునుపు; సద్రూపుండవు = చెడని బ్రహ్మ స్వరూపము; ఐన = అయిన; నీ = నీ; వలననే = వలన మాత్రమే; ధాత్ర = బ్రహ్మదేవుడు; ఆది = మున్నగు; అమర్త్యుల్ = దేవతలు; జనించిరి = పుట్టిరి; నిన్నున్ = నిన్ను; అంతకు = దానికి; మున్ను = ముందు; ఎఱుంగగలమే = తెలిసికొనగలమా, లేము; చింతింపన్ = విచారించినచో; నేము = మేము; అచ్యుతా = కృష్ణా {అచ్యుతుడు - చ్యుతము లేనివాడు, విష్ణువు}.
భావము:- అంబుజాక్ష! ఈ లోకంలో ఎవరికీ నీ అసలైన స్వరూపాన్ని ప్రత్యక్షంగా చూడటం సాధ్యం కాదు. నీవు శాస్త్రగోచరుడవు అయి ఉంటావు. ఈ సృష్టికి పూర్వం సత్తు రూపంలో వెలుగొందు పరమాత్మ స్వరూపుడవైన నీ వలననే బ్రహ్మాది దేవతలు ప్రభవించారు. అటువంటి బ్రహ్మాదుల సృష్టికి ముందరి ఆ సచ్చిదానంద స్వరూపాన్ని మేము తెలుసుకోలేము.

తెభా-10.2-1220-వ.
అట్టి నిన్నుఁ బరమాణుకారణవాదులైన కణ్వ గౌతమాదులును, బ్రకృతి కారణవాదులయిన సాంఖ్యులును, దేహాత్మవాదులయిన బౌద్ధులును, వివిధంబులైన కుతర్కంబులచేతం బరస్పరావ్యాహతంబులైన మతంబులు దమతమ కుతర్కవాదంబుల సమర్థించుచు నిన్నుం దెలియలేరు; మహాభాగ్యవంతులయిన యోగీంద్రులకు నీవు ప్రత్యక్షం బైన నివి యన్నియు నసత్యంబు లని కానవచ్చు; వెండియుఁ గొందఱీ సచరాచర వస్తుజాతంబులకు నంతర్యామివై సర్వంబు నీవ యగుటం దెలియలేక నిత్యం బనియు, ననిత్యం బనియు విపరీతబుద్ధిం దెలియుదురు; గాని భవదీయ దివ్యతత్త్వంబు నిక్కంబుగఁ దెలియజాలరు; కొందఱు జగచ్ఛరీరుండవుగాన జగద్రూపకుండవైన నిన్నుం గటకమకుటకర్ణికాది వివిధ భూషణభేదంబులం గనకంబు నిజస్వరూపంబు విడువక వర్తించు చందంబున జగద్వికారానుగతుండ వయ్యును నిఖిల హేయప్రత్యనీక కల్యాణగుణాత్మకుండవై యుండుదు వని యాత్మ విదులయిన వారు దెలియుదు; రదియునుం గాక.
టీక:- అట్టి = అటువంటి; నిన్నున్ = నిన్ను; పరమాణుకారణ వాదులు = కణవాదులు {పరమాణుకారణవాదులు - పరమాణు స్వరూపుడే పరబ్రహ్మ జగత్తుకి మాలకారణభూతుడు అనెడివారు}; ఐన = అయినట్టి; కణ్వ = కణ్వుడు {అణువు - శ్లో. జాలసూర్యమరీచిస్థం యచ్ఛసూక్ష్మ తమంరజః, తస్య షష్టాష్టమో భాగస్త్వణురిత్యభి ధీయతే. తస్యమష్టాష్టమోభాగః పరమాణుః ప్రకీర్తితః. తా. కిటికీ కన్నం లోనుండి వచ్చెడి సూర్యకిరణంలోని చిన్న దుమ్ము కణంలో ఆరవైలోఎనిమిదవ (షష్ట - అరవై కనుక 60x8, 480వ వంతు) పాలు అణువు. ఆ అణువులో ఆరవైఎనిమిదవ పాలు (60x8, 480వ వంతు)పరమాణువు.}; గౌతమ = గౌతముడు; ఆదులును = మొదలగువారు; ప్రకృతికారణవాదులు = ప్రకృతివాద మతస్థులు {ప్రకృతికారణ వాదులు - అవ్యక్త నామక ప్రకృతియే మూల కారణభూతము అనెడివారు)}; ఐన = అయినట్టి; సాంఖ్యులును = సాంఖ్య మతస్థులు; దేహ = దేహమే; ఆత్మ = తాము; ఆదులు = అనెడివారు; అయిన = ఐన; బౌద్ధులును = బౌద్ధమతస్థులు; వివిధంబులున్ = నానా విధములు; ఐన = అయిన; కుతర్కంబులన్ = చెడ్డ తర్కముల; చేతన్ = చేత; పరస్పర = ఒండొరులచేత; అవ్యాహతంబులు = పెద్దతేడాలేనివి {అవ్యాహతంబులు - అవ్యవహితములైనవి, వ్యవహితము (వ్యవధానమైనవి, తేడాకలవి) కానివి}; అయిన = ఐన; మతంబులున్ = మార్గములలో; తమతమ = వారివారి; కుతర్క = కుత్సిత తర్కపు; వాదంబులన్ = వాదములతో; సమర్థించుచున్ = సమర్థించుకొనుచు; నిన్నున్ = నిన్ను; తెలియ = తెలిసికొన; లేరు = చాలరు; మహా = గొప్ప; భాగ్యవంతులు = అదృష్టవంతులు; అయిన = ఐన; యోగి = ఋషి; ఇంద్రుల్ = ఉత్తముల; కున్ = కు; నీవు = నీవు; ప్రత్యక్షంబు = ఎదురుగా కనబడువాడవు; ఐనన్ = అయినచో; ఇవి = ఇవి; అన్నియున్ = అన్నీ; అసత్యంబులు = నిజమైనవి కాదు; అని = అని; కానవచ్చున్ = తెలియవచ్చును; వెండియున్ = ఇంకను; కొందఱు = కొంతమంది; సచరాచర = సర్వప్రాణుల, చేతన; వస్తు = అచేతన వస్తువుల; జాతంబుల్ = సమూహముల; కున్ = కు; అంతర్యామివి = లోనుండువాడవు {అంతర్యామి - విష్ణువు, శ్రుతి. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారయణ స్థితః.}; ఐ = అయ్యి; సర్వంబున్ = సమస్తము; నీవ = నీవే; అగుటన్ = ఐ ఉండుటను; తెలియన్ = తెలిసికొన; లేక = చాలక; నిత్యంబు = సత్తు; అనియున్ = అని; అనిత్యంబు = చిత్తు; అనియున్ = అని; విపరీత = వ్యతిరిక్త; బుద్ధిన్ = బుద్ధితో; తెలియుదురు = అనుకొనెదరు; కాని = కాని; భవదీయ = నీ యొక్క; దివ్య = అప్రాకృత, దివ్యమైన; తత్వంబున్ = తత్వమును; నిక్కంబుగన్ = నిజానికి; తెలియన్ = తెలిసికొన; చాలరు = సమర్థులు కారు; కొందఱు = కొంతమంది; జగత్ = లోకమే; శరీరుండవు = దేహముగా కలవాడవు; కానన్ = కాబట్టి; జగత్ = లోకమే; రూపకుండవు = స్వరూప మైనవాడవు; ఐన = అయినట్టి; నిన్నున్ = నిన్ను; కటక = చేతికడియములు; మకుట = కిరీటములు; కర్ణిక = కర్ణాభరణాలు, దుద్దులు; ఆది = మున్నగు; వివిధ = నానా విధములైన; భూషణ = అలంకారముల; భేదంబులన్ = వేర్పాటుల వలన; కనకంబు = బంగారము; నిజ = తన; స్వరూపంబున్ = ఆకృతిని; విడువక = వదలకుండ; వర్తించున్ = నడచెడెడి; చందంబునన్ = విధముగా; జగత్ = లోకము యొక్క; వికార = మార్పులను; అనుగతుండువు = అనుసరించి పోవువాడవు; అయ్యును = అయినప్పటికిని; నిఖిల = సమస్తమైన; హేయప్రత్యనీక = రోతపుట్టించని; కల్యాణ = శుభకరమైన; గుణ = గుణములు; ఆత్మకుండవు = స్వరూపములైన వాడవు; ఐ = అయ్యి; ఉండుదువు = ఉండెదవు; అని = అని; ఆత్మవిదులు = బ్రహ్మతత్వవేత్తలు; అయిన = ఐన; వారున్ = వారు; తెలియుదురు = తెలిసికొందురు; అదియునున్ = అంతే; కాక = కాకుండ.
భావము:- పరమాణువులే ఈ సృష్టికి కారణమని భావించే కణ్వ గౌతమాదులు, ప్రకృతే కారణమని వాదించే సాంఖ్యులు, దేహాత్మ వాదులు అయిన బౌద్ధులు మున్నగు వారు తమ తమ పరస్పర విరుద్ధము లైన కుతర్కాలతో కొట్టుమిట్టు లాడుతూ అట్టి సచ్చిదానంద స్వరూపుడవైన నిన్ను తెలుసుకోలేరు; నిన్ను సాక్షాత్కరించుకున్న మాహా భాగ్యవంతులు అయిన పరమ యోగులకు ఈ సృష్టిలో నీవు తప్ప ఇతర పదార్థాలు సమస్తము అసత్యాలు అనిపిస్తాయి; చరాచర ప్రపంచం అంతటా ఉండే నిన్ను సక్రమంగా తెలుసుకోలేక కొందరు విపరీత బుద్ధులతో నిత్యానిత్య వాదాలు వాదించుకుంటూ ఉంటారే తప్ప నీ నిజస్వరూపాన్ని తెలుసుకోలేరు; కటక కంకణ కిరీటాది నానావిధ భూషణాలలో సువర్ణం తన స్వరూపాన్ని విడువక వర్తించునట్లు నీవు విశ్వాత్ముడవు, సమస్త కల్మషాలకు అతీతుడవు, శుభరూపుడవు, కల్యాణ గుణాత్మకుడవు అని ఆత్మతత్వం తెలిసినవారే తెలుసుకుంటారు. అంతేకాకుండా....

తెభా-10.2-1221-మ.
జాతాక్ష! భవత్పదాబ్జయుగ సేవాసక్తు లైనట్టి య
జ్జముల్‌ మృత్యుశిరంబుఁదన్ని ఘనసంసారాంబుధిన్ దాఁటి పా
నులై లోకములుం బవిత్రములుగా ర్తించుచున్ నిత్య శో
మై యొప్పెడి ముక్తిఁ బొందుదురు శుంద్వైభవోపేతులై.

టీక:- వనజాతాక్ష = పద్మాక్ష, కృష్ణా; భవత్ = నీ యొక్క; పాద = పాదములు అను; అబ్జ = పద్మముల; యుగ = జంట యందు; సేవా = కొలచుట యందు; ఆసక్తులు = ఆసక్తికలవారు; ఐనట్టి = అయినట్టి; ఆ = అట్టి; జనముల్ = వారు; మృత్యు = చావును; శిరంబుదన్ని = జయించి; ఘన = మిక్కుటమైన; సంసార = సంసారము అను; అంబుధిన్ = సముద్రమును; దాటి = తరించి; పావనులు = పవిత్రులు; ఐ = అయ్యి; లోకములున్ = లోకులు అందరిని; పవిత్రములు = పరిశుద్ధులు; కాన్ = అగునట్లు; వర్తించుచున్ = మెలగుచు; నిత్య = శాశ్వతములైన; శోభనము = శుభములతో; ఒప్పెడి = చక్కటి; ముక్తిన్ = మోక్షమును; పొందుదురు = పొందుతారు; శుంభత్ = మేలైన; వైభవ = వైభవములతో; ఉపేతులు = కూడుకొన్నవారు; ఐ = అయ్యి.
భావము:- ఓ దేవా! పరమ భాగవతులు సదా నీ పాదసేవలో నిమగ్నులు అయి ఉంటారు. వారు మృత్యువును జయించి; భవసాగారాన్ని తరించి; జననమరణ పరంపరలకు గురికాక; పవిత్రులై లోకాలను పవిత్రం చేస్తూ; మహద్వైభవములతో ముక్తిని అందుకుంటారు.

తెభా-10.2-1222-మ.
మిము సద్భక్తి భజింపనొల్ల కిల దుర్మేధం బ్రవర్తించు నీ
తివ్రాతము నేర్పునం బసులఁ బాశ్రేణి బంధించు చం
మునం బెక్కగు నామరూపములచేతన్ వారి బంధించి దు
ర్గ సంసారపయోధిఁ ద్రోతువు దళత్కంజాతపత్త్రేక్షణా!

టీక:- మిమున్ = మిమ్ములను; సత్ = మంచి; భక్తిన్ = భక్తితో; భజింపన్ = సేవించుటకు; ఒల్లక = అంగీకరించకుండ; ఇలన్ = భూలోకమున; దుర్మేధన్ = దుష్టబుద్ధితో; ప్రవర్తించు = మెలగెడి; నీచ = అల్ప; మది = బుద్ధి కలవారి; వ్రాతమున్ = సమూహమును; నేర్పునన్ = ఉపాయముతో; పసులన్ = పశువులను; పాశ = పలుపులతో, ముకుతాళ్ళతో; బంధించు = కట్టివేయు; చందమునన్ = విధముగా; పెక్కు = అనేకములు; అగు = ఐన; నామ = పేర్లు; రూపముల = ఆకృతుల; చేతన్ = చేత; వారిన్ = వారిని; బంధించి = కట్టవేసి; దుర్గమ = దాటరాని; సంసార = సంసారము అను; పయోధిన్ = సముద్రము నందు; త్రోతువు = పడద్రోయుదువు; దళత్కంజాతపత్రేక్షణ = పద్మాక్ష, కృష్ణా.
భావము:- వికసించిన కలువరేకుల వంటి కన్నులు కల మహాత్మా! నిను భక్తితో సేవించకుండా దుర్మదాంధులై ప్రవర్తించేవారిని పశువులను బంధించినట్లు నామరూపాలతో బంధించి సంసారం అనే సముద్రంలో పడదోస్తావు.

తెభా-10.2-1223-వ.
దేవా! కర్మమూలంబు లయిన పాణి పాదంబులు లేనివాఁడ వయ్యును స్వతంత్రుఁడవు గావున బ్రహ్మాదులు భవత్పరతంత్రులై యుండుదురు; స్థిర చర రూపంబులు గల చేతనకోటికి నీవు సర్వవిధ నియంతవు; గావున నీ కృపావలోకనంబు గల వారికి మోక్షంబు కరస్థితంబై యుండు; భవత్కృపావలోకనంబు లేని దుష్టాత్ములు దుర్గతిం గూలుదు; రట్టి జీవులు దేవతిర్మఙ్మనుష్యస్థావ రాది శరీరంబులు సొచ్చి యణురూపులై యుందు; రందును నీ వంతరాత్మ వగుచు నుందువు; మఱియును.
టీక:- దేవా = స్వామీ; కర్మ = కర్మములకు; మూలంబులు = సాధనములు; అయిన = ఐనట్టి; పాణిన్ = చేతులు; పాదంబులున్ = కాళ్ళు; లేని = లేనట్టి; వాడవు = వాడవు; అయ్యున్ = అయినప్పటికిని; స్వతంత్రుడవు = సర్వస్వతంత్రుడవు; కావునన్ = కాబట్టి; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆదులు = మొదలగువారు; భవత్ = నీకు; పరతంత్రులు = ఆధీనులు; ఐ = అయ్యి; ఉండుదురు = ఉంటారు; స్థిర = స్థావర, అచర; చర = జంగమ, చర; రూపంబులున్ = రూపములు, దేహములు; కల = కలిగిన; చేతన = ప్రాణి; కోటి = సమస్తమునకు; కున్ = కు; నీవు = నీవు; సర్వవిధ = అన్ని రకములుగను; నియంతవు = నియమించువాడవు, నాయకుడవు; కావునన్ = కాబట్టి; నీ = నీ యొక్క; కృపా = దయతోడి; అవలోకనంబున్ = చూపులు; కల = పొందిన; వారిన్ = వారల; కిన్ = కు; మోక్షంబు = ముక్తి; కర = అరచేతిలో; స్థితంబు = ఉన్నది; ఐ = అయ్యి; ఉండున్ = ఉండును; భవత్ = నీ యొక్క; కృపా = దయతోడి; అవలోకనంబున్ = చూపు; లేని = పొందలేని; దుష్టాత్ములు = దుష్టబుద్ధులు; దుర్గతిన్ = నరకము నందు; కూలుదురు = పడిపోవుదుర; అట్టి = అటువంటి; జీవులు = ప్రాణులు; దేవ = దేవతల; తిర్యక్ = జంతువుల; మనుష్య = మానవుల; స్థావర = వృక్షముల; ఆది = మున్నగువాని; శరీరంబులున్ = దేహములను; చొచ్చి = ప్రవేశించి; అణు = అణువులవంటి; రూపులు = స్వరూపములు కలవారు; ఐ = అయ్యి; ఉందురు = ఉండెదరు; అందునున్ = వాటిలో; నీవు = నీవు; అంతరాత్మ = లోపలలుండెడి ఆత్మవు; అగుచున్ = ఔతు; ఉందువు = ఉండెదవు; మఱియునున్ = ఇంతే కాకుండ.
భావము:- ఓ దేవాదిదేవా! పాణి పాదములు కర్మ మూలములు. అట్టివి లేని నిర్వికారుడవు సర్వస్వతంత్రుడవు అయిన నీకు బ్రహ్మాదులు వశులు అయి ఉంటారు. ఈ చరాచర ప్రపంచము సమస్తానికి నీవే ప్రభువవు, నియామకుడవు. కనుక నీ కృపాపాత్రులకు మోక్షం కరతలామలకము అవుతుంది. నీ దయకు పాత్రులు కాని దుష్టాత్ములు దుర్గతిపాలై బహువిధ దేవ, నర, జంతు, వృక్షాది శరీరాలు ధరిస్తూ అణురూపులు ఔతూ ఉంటారు. అలాంటివారిలోనూ అంతరాత్మవై నీవు ఉంటావు. అంతే కాకుండా......

తెభా-10.2-1224-క.
దిఁదల పోయఁగ జల బు
ద్బుములు ధరఁ బుట్టి పొలియు పోలిక గల యీ
త్రిశాది దేహములలో
లక వర్తించు నాత్మర్గము నోలిన్.

టీక:- మదిన్ = మనసు నందు; తలపోయగన్ = తరచి చూసుకొనినచో; జల = నీటి; బుద్బుదములున్ = బుడగలు; ధరన్ = భూలోకమున; పుట్టి = పుట్టి; పొలియు = నశించు; పోలిక = విధము; కల = కలిగిన; ఈ = ఈ; త్రిదశ = దేవతలు; ఆది = మొదలగు; దేహములు = శరీరములు; లోన్ = అందు; వదలకన్ = విడువకుండ; వర్తించు = మెలగెడి; ఆత్మ = జీవాత్మల; వర్గమున్ = సమూహమును; ఓలిని = క్రమముగా.
భావము:- బుద్ధిపూర్వకంగా ఆలోచించి చూస్తే, నీళ్ళల్లో బుడగలు పుట్టి నశించే విధంగా దేవతాదుల దేహాల్లో విడువక ప్రవర్తిస్తూ ఉంటారు ఈ సకల ఆత్మలు.

తెభా-10.2-1225-ఆ.
ప్రళయవేళ నీవు రియింతు వంతకుఁ
గారణంబ వగుటఁ మలనాభ!
క్తపారిజాత! వభూరితిమిరది
నే! దుష్టదైత్యనా! కృష్ణ!

టీక:- ప్రళయలవేళన్ = ప్రళయకాలమున; నీవు = నీవు; భరియింతువు = భరించెదవు; అంత = సమస్తమైన సృష్టి; కున్ = కిని; కారణంబవు = మూలకారణుడవు; అగుటన్ = ఔటచేత; కమలనాభ = కృష్ణా; భక్త = భక్తులకు; పారిజాత = కల్పవృక్షమైనవాడా; భవ = సంసారము అను; భూరి = గొప్ప; తిమిర = చీకట్లకు; దినేశ = సూర్యు డైనవాడా {దినేశుడు - దిన + ఈశుడు, గుణ సంధి, పగలుకు ప్రభువు, తత్పురుష సమాసము, సూర్యుడు}; దుష్ట = దుర్మార్గులైన; దైత్య = రాక్షసులను; నాశ = నాశము చేయువాడా; కృష్ణా = కృష్ణా.
భావము:- శ్రీకృష్ణా! భక్తులపాలిటి పారిజాతమ! భవబంధ విదూర! దుష్టశిక్షక! సమస్తమునకు కారణభూతుడవైన నీవు, అటువంటి శరీరాల్లో అంతరాత్మవై వర్తించి, ప్రళయ కాలంలో వాటిని ఆ సకలాత్మలను అన్నింటిని నీలో లీనం చేసుకుంటావు.

తెభా-10.2-1226-చ.
ఘ! జితేంద్రియస్ఫురణు య్యును జంచలమైన మానసం
ను తురగంబు బోధమహితాత్మ వివేకపు నూలి త్రాట న
ల్ల గుదియంగఁ బట్టను దలంచుచు ముక్తి కుపాయలాభ మే
నువును లేమికిన్ వగల నందెడు నాత్మలువో తలంపఁగన్.

టీక:- అనఘ = పాపరహితుడా; జిత = జయింపబడిన; ఇంద్రియ = ఇంద్రియములు; స్ఫురణులు = తోచువారు; అయ్యును = అయినప్పటికిని; మానసంబు = మనస్సు; అను = అనెడి; తురగంబున్ = గుఱ్ఱమును; బోధన్ = జ్ఞానముచేత; మహితాత్మన్ = పరమాత్మను; వివేకపు = తెలిసికొనుట అనెడి; నూలిత్రాటను = కళ్ళెముచేత; అల్లన = మెల్లిగా; కుదియన్ = అణగి ఉండునట్లు; పట్టన్ = పట్టుకొనవలెనని; తలంచుచున్ = అనుకొనుచు; ముక్తి = మోక్షమున; కున్ = కు; ఉపాయ = ఉపాయము; లాభమున్ = పొందుట; ఏ = ఏ; అనువునున్ = విధముగను; లేమి = లేకపోవుట; కిన్ = కు; వగలన్ = విచారమును; అందెడు = పొందుచున్నవి; ఆత్మలువో = జీవులు సుమా; తలంపన్ = విచారించి చూసినచో.
భావము:- మహానుభావా! పుణ్యరూపా! జితేంద్రియత సాధించిన వారు కూడా చంచలమైన మనస్సు అనే గుఱ్ఱాన్ని నిగ్రహించుకోలేరు; దానిని జ్ఞానము, గొప్పదనము, వివేకములు అనే తాళ్ళతో నియంత్రించగలం అని భావిస్తారు; ముక్తి పొందే ఉపాయం తెలియలేక విచారగ్రస్తులు అవుతారు.

తెభా-10.2-1227-చ.
గురు పదపంకజాతములు గొల్వని వారలువో మహాబ్ధి ని
స్తణకుఁ గర్ణధారరహితంబగు నావను సంగ్రహించు బే
రి గతి భూరి దుస్తర భవాంబుధిలోన మునుంగుచుందు రం
బురుహదళాక్ష! నీవు పరిపూర్ణుఁడవై తనరారఁగా నొగిన్.

టీక:- గురు = గొప్పవైననీ; పద = పాదములు అను; పంకజాతములున్ = పద్మములను; కొల్వని = సేవించని; వారలుపో = వారలు సుమా; మహాబ్ధిన్ = మహాసముద్రమును; నిస్తరణ = దాటుట; కున్ = కు; కర్ణధార = ఓడనడపువాడు {కర్ణధారుడు - కర్ణము (చుక్కాని) ధారుడు (పట్టువాడు), ఓడనడపువాడు}; రహితంబు = లేనిది; అగు = ఐన; నావను = ఓడను; సంగ్రహించు = తీసుకొన్న; బేహారి = వర్తకుని; గతిన్ = విధముగా; భూరి = మిక్కిలి; దుస్తర = దాటరాని; భవ = సంసారము అను; అంబుధి = సముద్రము; లోనన్ = అందు; మునుగుచున్ = ములిగిపోతూ; ఉందురు = ఉంటారు; అంబురుహదళాక్ష = పద్మాక్షా, కృష్ణా; నీవున్ = నీవు; పరిపూర్ణుడవు = స్వయంసంపూర్ణుడవు; ఐ = అయ్యి; తనరారగాన్ = ఉండగా; ఒగిన్ = క్రమముగా.
భావము:- పద్మముల వంటి కన్నులు గల మహాత్మా! గురుపాదపద్మాల్ని సేవించనివారు నావికుడు లేని నావ ఎక్కి సముద్రం దాటాలి అని ప్రయత్నించే వ్యాపారి వలె జనన మరణ పరంపరలనే దాటరాని మహాసముద్రంలో మునిగిపోతారు; వారు పరిపూర్ణుడవైన నిన్ను తెలుసుకొనలేరు.

తెభా-10.2-1228-తే.
పుత్రదార గృహక్షేత్ర భూరివిషయ
న సుఖాసక్తుఁ డగుచు నే నుజుఁ డేని
ర్థిఁ జరియించు వాఁడు భవాబ్ధిలోనఁ
జెంది యెన్నాళ్ళకును దరిఁ జేర లేఁడు.

టీక:- పుత్ర = సంతానము; దార = భార్య; గృహ = ఇల్లు; క్షేత్ర = పొలములు (ఆది); భూరి = మిక్కుటమైన; విషయ = విషయములవలన; ఘన = మిక్కిలి అధికమైన; సుఖ = సుఖము లందు; ఆసక్తుడు = ఆసక్తి కలవాడు; అగుచున్ = ఔతు; ఏ = ఏ; మనుజుడు = మానవుడు; ఏని = ఐనాసరే; అర్థిన్ = కోరి; చరియించు = మెలగెడి; వాడు = అతను; భవ = సంసారము అను; అబ్ధి = సముద్రము; లోనన్ = అందు; చెంది = పడి; ఎన్నాళ్ళ = ఎన్ని దినముల; కున్ = కు; దరిన్ = ఒడ్డు; చేరను = చేర; లేడు = శక్తుడు కాడు.
భావము:- మానవుడు ఎప్పుడూ సతీసుతాదులమీద, గృహక్షేత్రాదులమీద, అంతులేని విషయాలపైన మిక్కిలి అనురక్తిని పెంచుకుంటాడు. అట్టివాడు ఈ సంసారం అనే సాగరంలో చిక్కుకుని ఎప్పటికీ గట్టెక్కలేడు.

తెభా-10.2-1229-సీ.
గతిపై బహుతీర్థ దనంబు లనఁ గల్గి-
పుణ్యానువర్తన స్ఫురితు లగుచుఁ
బాటించి నీ యందు ద్ధమత్సరములు-
లే భక్తామరానోహంబ
గు భవత్పాదాబ్జయుళంబు సేవించి-
వపాశముల నెల్లఁ బాఱఁదోలి
మమతులై యదృచ్ఛాలాభ తుష మేరు-
మముగాఁ గైకొని సాధు లగుచుఁ

తెభా-10.2-1229.1-తే.
బాదతీర్థంబు గల మహాభాగవత జ
నోత్తమోత్తము లైనట్టి యోగివరుల
వార కెప్పుడు సేవించువాఁడు వొందుఁ
బ్రవిమలానందమయ మోక్షదము మఱియు.

టీక:- జగతి = భూమి; పైన్ = మీద; బహు = అనేకమైన; తీర్థ = పుణ్యతీర్థముల; సదనంబులు = ఉనికిపట్లు; అనన్ = అనునట్లు; కల్గి = ఉండి; పుణ్య = చేసికొన్న పుణ్యములను; అనువర్తన = అనుసరించుట; స్ఫురితు = స్ఫూర్తికలవారు; అగుచున్ = ఔతు; పాటించి = ఆదరించి; నీ = నీ; అందున్ = ఎడల; బద్ద = మిక్కిలి; మత్సరంబులు = మచ్చరములు; లేక = లేకుండా; భక్త = భక్తులకు; అమరానోకహంబవు = కల్పవృక్షమైనవాడవు {అమరానోకహము - దేవతా వృక్షము, కల్ప వృక్షము}; అగు = ఐన; భవత్ = నీ యొక్క; పద = పాదములు అను; అబ్జ = పద్మముల; యుగళంబున్ = జంటను; సేవించి = కొలిచి; భవ = సంసార; పాశములన్ = తగులములను; ఎల్లన్ = సమస్తమును; పాఱదోలి = తొలగించుకొని; సమమతులు = సమబుద్ధి కలవారు; ఐ = అయ్యి; అదృచ్ఛా = తనకు తాను; లాభమున్ = లభించిన; తుష = ఊకను, పొట్టును; మేరు = మేరుపర్వతముతో; సమమము = సమానమైనవి; కాన్ = ఐనట్లు; కైకొని = గ్రహించి; సాధులు = సాధుస్వభావులు; అగుచున్ = ఔతు; పాద = పాదసేచనజలము; తీర్థంబులు = పుణ్యతీర్థములుగా; కల = కలిగినట్టి.
మహా = గొప్ప; భాగవత = భాగవతులైనట్టి; జన = వారిలో; ఉత్తమోత్తములు = మిక్కిలి ఉత్కృష్టులు; ఐనట్టి = అయినట్టి; యోగి = ఋషి; వరులన్ = ఉత్తములను; వారక = విడువక, సంకోచింపక; ఎపుడున్ = ఎల్లప్పుడు; సేవించువాడు = కొలచినవాడు; పొందున్ = పొందును; ప్రవిమల = మిక్కిలినిర్మలమైన; ఆనంద = సంతోషము; మయ = నిండిన, స్వరూపమైన; మోక్షపదమున్ = ముక్తిమార్గమును; మఱియున్ = ఇంకను.
భావము:- భాగవతోత్తములు లోకానికే మహాతీర్థములు. అట్టి పుణ్యవర్తన మూర్తులు మాత్సర్యాది విముక్తులై, భక్తులపాలిటి కల్పవృక్షమైన నిన్ను నిరంతరం సేవిస్తుంటారు. భవబంధాలనుంచి విముక్తులై సమచిత్తులై సదా సంతుష్ట మనస్కులై పరమ సాధు స్వభావులు అయి ఉంటారు. వారి పాదములే పుణ్యతీర్థములు. అట్టి పరమభాగవతులను భజించేవాడు ఆనందమయమైన మోక్షసామ్రాజ్య పదవికి యోగ్యుడు అవుతాడు. అంతేకాకుండా....

తెభా-10.2-1230-వ.
సత్తైన ప్రకృతివలన నుత్పన్నంబైన యీజగత్తు సత్తు గావలయు; నది యెట్లనినం గనకోత్పన్నంబులైన భూషణంబులు కనకమయంబులయి కానంబడు చందంబున నని సాంఖ్యుండు వలికిన విని యద్వైతవాది యిట్లను; నెయ్యది యుత్పన్నంబు గాదది సత్తును గా; దను వ్యతిరేక వ్యాప్తి నియమంబు నిత్యసత్యంబైన బ్రహ్మంబునందుఁ దర్కహతంబగుం గావునం బ్రపంచంబు మిథ్య యని నిరూపించిననా ప్రపంచంబు బ్రహ్మవిశేషణంబై కార్యకారణావస్థలు గలిగియున్న యంతమాత్రంబున మిథ్యగానేర; దా ప్రపంచంబునకుఁ గార్యకారణావస్థలు నిత్యంబులు గావున నవస్థాద్వయ యుక్తంబయిన ప్రపంచంబు నిత్యంబనిన వెండియు నద్వైతి యిట్లను; బహుగ్రంథ ప్రతిపాదితం బయిన జగన్మిథ్యాత్వంబు లేమి యెట్లనిన నదియునుం గర్మవశులైన జడుల నవిద్యా ప్రతిపాదకం బైన కుతర్క సమేతం బైన భారతి యంధపరంపరా వ్యవహారంబునం జేసి భ్రమియింపఁజేయుఁ; గారణావస్థలయందును బ్రహ్మ విశేషణంబయిన సూక్ష్మరూపంబునం బ్రపంచంబు సత్తై యుండు; సత్యంబు బాధాయోగ్యంబు గావున నీకు శేషంబయి యుండుఁ గావున నీవు దేహగతుండైన దేహియందు నంతర్యామివయ్యుం గర్మఫలంబులం బొరయక కర్మఫలభోక్తయైన జీవునకు సాక్షిభూతంబవై యుందు; వట్టి నిన్ను నజ్ఞులైన మానవులు నిజకంఠ లగ్నంబయిన కంఠికామణి నిత్యసన్నిహితంబై వెలుంగుచుండినను గానకవర్తించు తెఱంగునఁ దమహృదయపద్మమధ్యంబున ననంతతేజోవిరాజమానుండవై ప్రకాశించు నిన్నుం దెలియలేరు; సకల బ్రహ్మాండనాయకుండవైన నీయందు శ్రుతులు ముఖ్య వృత్తిం బ్రవర్తించు"నని శ్రుత్యధిదేవతలు నారాయణు నభినందించిన తెఱంగున సనందనుండు మహర్షుల కెఱింగించిన ప్రకారం బని నారాయణర్షి నారదునకుం జెప్పిన నమ్మహాత్ముండు మజ్జనకుండైన వేదవ్యాసమునీంద్రునకు నుపన్యసించె; నయ్యర్థంబు నతండు నాకుం జెప్పిన విధంబున నీకుం జెప్పితి; నీ యుపాఖ్యానంబు సకల వేదశాస్త్ర పురాణేతిహాససారం; బుపనిషత్తుల్యంబు; దీనిం బఠించువారును వినువారును విగతకల్మషులై యిహపర సౌఖ్యంబుల నొంది వర్తింతు;” రని చెప్పిన శుకయోగీంద్రునకు రాజేంద్రుం డిట్లనియె.
టీక:- సత్తు = సత్, ఎప్పటికి చెడనిది; ఐన = అయిన; ప్రకృతి = మూలప్రకృతి; వలనన్ = వలన; ఉత్పన్నంబు = కలిగినది; ఐన = అయిన; ఈ = ఈ; జగత్తు = ప్రపంచము; సత్తుగా = సత్, ఎప్పటికి చెడనిది; కావలయున్ = అయ్యి ఉండవలెను; అది = అది; ఎట్లు = ఏవిధముగా; అనినన్ = అనగా; కనక = బంగారముచే; ఉత్పన్నంబులు = తయారైనవి; ఐన = అగు; భూషణంబులు = ఆభరణములు; కనక = బంగారము యొక్క; మయంబులు = స్వరూపములే; అయి = ఐ; కానంబడు = తెలియబడెడి; చందంబునన్ = విధముగా; అని = అని; సాంఖ్యుండు = సాంఖ్యకుడు; పలికినన్ = చెప్పుతుండగా; విని = విని; అద్వైతవాది = అద్వైత మతస్థుడు; ఇట్లు = ఈ విధముగ; అనున్ = అని చెప్పును; ఎయ్యది = ఏదైతే; ఉత్పన్నంబు = పుట్టుక కలది; కాదో = కాదో; అది = అది; సత్తును = సత్, ఎప్పటికి చెడనిది; కాదు = కాదు; అను = అనెడి; వ్యతిరేక = విరుద్ధ; వ్యాప్తి = అన్వయము గల; నియమంబున్ = నియమము; నిత్య = శాశ్వతమైన; సత్యంబు = సత్యము; ఐన = అయినట్టి; బ్రహ్మంబు = పరమాత్మ; అందున్ = ఎడల; తర్క = ఏ తర్కము, ఏ వాదన; హతంబు = నిలబడనిది, పనిచేయనిది; అగున్ = ఐపోవును; కావునన్ = కాబట్టి; ప్రపంచంబు = ప్రపంచము; మిథ్య = భ్రాంతి, ఉన్నట్టు తోచునది; అని = అని; నిరూపించినన్ = నిర్ణయించగా; ఆ = ఆ యొక్క; ప్రపంచంబు = లోకము; బ్రహ్మ = పరబ్రహ్మమును; విశేషణంబు = తెలియబరచునది; ఐ = అయ్యి; కార్యకారణ = కార్య కారణ నియమంలోని {కార్యకారణనియమము - ప్రతి కార్యమునకు కారణము ప్రతి కారణమునకు కార్యము ఉంటుంది ఇది సృష్టి నియమము}; అవస్థలు = దశలు; కలిగి = కలిగి; ఉన్నన్ = ఉన్నప్పటికి; అంతమాత్రంబునన్ = అంతమాత్రముచేత; మిథ్య = అసత్తు; కానేరదు = కాకుండా పోలేదు; ప్రపంచంబున్ = ప్రపంచమున; కున్ = కు; కార్య = కార్యము {కార్యము - కలిగినది}; కారణ = కారణము అను {కారణము - కలిగించినది}; అవస్థలు = దశలు; నిత్యంబులు = శాశ్వతములు; కావునన్ = కాబట్టి; అవస్థా = దశలు; ద్వయ = జంటతో; యుక్తంబు = కూడినది; అయిన = ఐన; ప్రపంచంబు = జగత్తు; నిత్యంబున్ = శాశ్వతమైనది; అనినన్ = అనగా; వెండియున్ = ఇంకను; అద్వైతి = అద్వైతమతస్థుడు; ఇట్లు = ఈ విధముగ; అనున్ = అని చెప్పును; బహు = అనేకమైన; గ్రంథ = గ్రంథము లందు; ప్రతిపాదితంబులు = చెప్పబడినది; అయిన = ఐన; జగత్ = ప్రపంచము; మిథ్యత్వంబు = అసత్యము; లేమి = లేకుండుట; ఎట్లు = ఎలా కుదురుతుంది; అనినన్ = అని చెప్పగా; అదియునున్ = అదంతా; కర్మవశులు = కర్మలకు వశమైన వారు; ఐన = అగు; జడుల = మూఢులు యొక్క; అవిద్యా = అజ్ఞానముచేత; ప్రతిపాదికంబు = చెప్పబడినది; ఐన = అయిన; కుతర్క = అసంబద్ధ తర్కముతో; సమేతంబు = కూడినది; ఐన = అయినట్టి; భారతి = వేదవాక్కు; అంధ = సరిగా చూడనట్టి; పరంపరా = వరుస వాదనల; వ్యవహారంబునన్ = వ్యవహారము; చేత = వలన; భ్రమియింపన్ = భ్రాంతి కలిగింపబడినదిగ; చేయు = చేసెడి; కారణ = కారణముల {కారణావస్థలు - అవ్యక్త మహదాదులు}; అవస్థల = దశలు; అందున్ = అందు; బ్రహ్మ = పరబ్రహ్మ యొక్క; విశేషణంబు = విశేషణములు; అయిన = ఐనట్టి; సూక్ష్మ = సూక్ష్మమైన; రూపంబునన్ = రూపముతో; ప్రపంచంబున్ = జగత్తు; సత్తు = శాశ్వతమైనది; ఐ = అయ్యి; ఉండున్ = ఉంటుంది; సత్యంబు = సత్యము; బాధా = బాధచెందుటకు; అయోగ్యంబు = తగినది కాదు; కావునన్ = కాబట్టి; నీ = నీ; కున్ = కు; శేషంబు = శేషించినది; అయి = ఐ; ఉండున్ = ఉంటుంది; కావునన్ = కాబట్టి; నీవున్ = నీవు; దేహగతుండు = శరీరము నందుండు వాడు; ఐన = అయిన; దేహి = జీవుని; అందున్ = లోపల; అంతర్యామి = ఆత్మగా {అంతర్యామి - లోపలంతా వ్యాపించి ఉండు వాడు, ఆత్మ}; కర్మ = కర్మల యొక్క; ఫలంబులన్ = పర్యవసానములను; పొరయక = పొందకుండ; కర్మ = కర్మల యొక్క; ఫల = ఫలితములను; భోక్త = అనుభవించువాడు; ఐన = అయిన; జీవున్ = జీవుని; కున్ = కి; సాక్షిభూతంబవు = సాక్షి యైనవాడవు {సాక్షి - అంటకుండ కనుగొనువాడు}; ఐ = అయ్యి; ఉందువు = ఉంటావు; అట్టి = అటువంటి; నిన్నున్ = నిన్ను; అజ్ఞులు = అజ్ఞానులు; ఐన = అయిన; మానవులు = మనుషులు; నిజ = తన యొక్క; కంఠ = కంఠమున; లగ్నంబు = వేయబడి యున్నది; అయిన = ఐనట్టి; కంఠికామణిన్ = కంఠహారపు రత్నమును; నిత్య = ఎల్లప్పుడును; సన్నిహితంబు = సమీపముననే ఉండునది; ఐ = అయ్యి; వెలుంగుచుండినను = ప్రకాశించుచున్నను; కానక = కనుగొనలేక; వర్తించు = మెలగు; తెఱంగునన్ = విధముగా; తమ = తమ యొక్క; హృదయ = హృదయము అను; పద్మ = పద్మము; మధ్యంబునన్ = మధ్య బొడ్డు నందు; అనంత = అంతులేని; తేజస్ = తేజస్సుతో; విరాజమానుండు = విరాజిల్లుతున్నవాడవు; ఐ = అయ్యి; ప్రకాశించు = వెలిగిపోతుండెడి; నిన్నున్ = నిన్ను; తెలియలేరు = తెలిసికొనజాలరు; సకల = సమస్తమైన; బ్రహ్మాండ = బ్రహ్మాండములకు; నాయకుండవు = అధినాయకుడవు; ఐన = అయినట్టి; నీ = నీ; అందున్ = అందు; శ్రుతులు = వేదములు; ముఖ్య = ప్రథానకారణభూత; వృత్తిన్ = వృత్తి యందు; ప్రవర్తించును = వర్తించును; అని = అని; శ్రుతిఅధిదేవతలు = వేదాధిదేవతలు; నారాయణున్ = విష్ణుమూర్తిని; అభినందించిన = స్తుతించిన; తెఱంగునన్ = విధముగనే; సనందనుండు = సనందనదేవర్షి; మహ = గొప్ప; ఋషుల్ = మునుల; కున్ = కు; ఎఱింగించిన = తెలిపిన; ప్రకారంబు = విధము; అని = అని; నారాయణ = నారాయణుడు అను; ఋషి = ముని; నారదున్ = నారదున; కున్ = కు; చెప్పిన = చెప్పగా; ఆ = ఆ; మహాత్ముండు = గొప్పవాడు; మత్ = నా యొక్క; జనకుండు = తండ్రి; ఐన = అయిన; వేదవ్యాస = వేదవ్యాస; ముని = ఋషి; ఇంద్రున్ = ఉత్తమున; కున్ = కు; ఉపన్యసించెన్ = వివరించెను; ఆ = ఆ; అర్థంబునన్ = విషయమును; అతండు = అతను; నా = నా; కున్ = కు; చెప్పిన = చెప్పినట్టి; విధంబునన్ = విధముగా; నీ = నీ; కున్ = కు; చెప్పితిన్ = చెప్పాను; ఈ = ఈ యొక్క; ఉపాఖ్యానంబున్ = ఉపకథను; సకల = సమస్తమైన; వేద = వేదముల యొక్క; శాస్త్ర = ధర్మశాస్త్రముల యొక్క; పురాణ = పురాణముల యొక్క; ఇతిహాస = ఇతిహాసముల యొక్క; సారంబున్ = సారాంశము, అర్థము; ఉపనిషత్ = ఉపనిషత్తులతో; తుల్యంబు = సమానమైనది; దీనిన్ = దీనిని; పఠించు = చదువు; వారున్ = వారు; విను = వినెడి; వారునున్ = వారు; విగత = తొలగిన; కల్మషులు = పాపములు కలవారు; ఐ = అయ్యి; ఇహ = ఈ లోకపు; పర = పరలోకపు; సౌఖ్యంబులన్ = శుభములను; ఒంది = పొంది; వర్తింతురు = ఉంటారు; అని = అని; చెప్పిన = చెప్పినట్టి; శుక = శుకుడు అను; యోగి = ఋషి; ఇంద్రున్ = శ్రేష్ఠున; కున్ = కు; రాజ = రాజ; ఇంద్రుండు = ఉత్తముడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- సాంఖ్యులు “బంగారంతో చేసిన నగలు సర్వం బంగార మయములే కదా, అలాగే సత్యమైన ప్రకృతి నుండి జనించినది కావున ఈ జగత్తు సత్యమైనదే” అంటారు. అద్వైతవాది “స్వాయంభువమైన సర్వం సత్యం కానేరదు అనే వ్యతిరేక సిద్ధాంతం ప్రకారం, నిత్యసత్యమైన బ్రహ్మము నందు సకల జగత్తు ధర్మహతము అగును కావున ప్రపంచం మిథ్య మాత్రమే” అంటారు. ద్వైతులు “జగత్తు బ్రహ్మవిశేషణం అయి కార్యకారణ అవస్థలు కలిగి ఉన్నంత మాత్రం చేత మిథ్య అనలేము, కార్యకారణావస్థలు అనే అవస్థా ద్వయంతో కూడి ఉన్న లోకం సమస్తం సత్యమైనదే” అంటారు. అద్వైతసిద్ధాంతులు “ఎన్నో గ్రంథాలలో ప్రతిపాదించబడిన “జగన్మిథ్య” అనే సూత్రం తప్పు అని ఎలా అనగలము అంటే. కర్మవశులైన జడస్వభావులు చేసే అవిద్యా ప్రతిపాదికములు అయిన కుతర్కముల వలె గ్రుడ్డి పరంపరాగత వ్యవహారముల వలన భ్రమింప చేస్తున్నాయి. కారణావస్థ అందు బ్రహ్మమునకు విశేషణములై, సూక్ష రూపంలో జగత్తు సత్యమే అయి ఉంటుంది. అసత్తైన కారణంగా పరబ్రహ్మము అయిన నీకు శేషము అయి ఉంటుంది” అంటారు. కావున, సమస్త శరీరధారులలో అంతర్యామివై ఉండే నిన్ను కర్మఫలాలు సోకవు. కర్మఫలభోక్తలు అయిన జీవునకు సాక్షీభూతుడవై ఉంటావు. అజ్ఞానులు తమ కంఠమందు ప్రకాశించే రత్నాన్ని ఎలా తెలియలేరో అలా, తమ హృదయపద్మాల్లో మహాతేజంతో ప్రకాశించే నిన్ను తెలుసుకోలేరు. సకల బ్రహ్మాండానికి నాయకుడవైన నీలో వేదాలు వర్తిస్తుంటాయి. అని వేదాధిదేవతలు నారాయణుని స్తుతించిన ఈ విధం అంతా సనందనుడు మహర్షులకు తెలిపాడు. దానిని నారాయణముని నారదునికి చెప్పాడు. నారదుడు నా తండ్రి అయిన వేదవ్యాసునికి వివరించాడు. ఆ మహానుభావుడు నాకు చెప్పారు. ఆదే విధంగా దానిని నేను సవిస్తరంగా నీకు చెప్పాను. ఈ “శ్రుతిగీతములు” అని ప్రసిద్ధము అయిన నారాయణోపాఖ్యానం సకల వేద, శాస్త్ర, పురాణ, ఇతిహాసాల సారం. ఉపనిషత్తులకు సమానం. దీనిని పఠించినా విన్నా పాపాలు నశించిపోతాయి. ఇహపర సౌఖ్యాలు కలుగుతాయి.” అని శుకుడు చెప్పగా పరీక్షిత్తు ఇలా అన్నాడు.