పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/విష్ణు సేవా ప్రాశస్త్యంబు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

విష్ణు సేవా ప్రాశస్త్యంబు

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/విష్ణు సేవా ప్రాశస్త్యంబు)
రచయిత: పోతన


(తెభా-10.2-1231-మ.)[మార్చు]

ము నినాథోత్తమ! దేవమానవులలో ముక్కంటి సేవించు వా
యంబున్ బహువస్తుసంపదల సౌఖ్యానందులై యుండ న
వ్వ జాతాక్షు రమామనోవిభుని శశ్వద్భక్తి సేవించు స
న్ము నివర్యుల్‌ గడుఁ బేద లౌటకు గతంబున్ నా కెఱింగింపవే.

(తెభా-10.2-1232-సీ.)[మార్చు]

నావుడు శుకయోగి రనాథుఁ గనుఁగొని;
విను మెఱింగింతుఁ దద్విధము దెలియ
నశక్తిసహితుండు కాలకంధరుఁడు దా;
వినుతగుణత్రయాన్వితుఁడు గాన
రాగాదియుక్తమై రాజిల్లు సంపద;
లాతనిఁ గొలుచు వారందు చుందు;
చ్యుతుఁ బరము ననంతు గుణాతీతుఁ;
బురుషోత్తముని నాదిపురుషు ననఘు

(తెభా-10.2-1232.1-తే.)[మార్చు]

ర్థి భజియించువారు రాగాది రహితు
గుచు దీపింతు రెంతయు నఘచరిత!
ర్మనందనుఁ డశ్వమేధంబు సేసి
పిదప సాత్త్విక కథనముల్‌ ప్రీతితోడ.

(తెభా-10.2-1233-ఉ.)[మార్చు]

నా దసంయమీంద్రు వలనన్ వినుచుండి యనంతరంబ పం
కే రుహనాభుఁ జూచి యడిగెం దగ నిప్పుడు నీవు నన్ను నిం
డా రిన భక్తిమై నడిగి ట్ల యతండును మందహాస వి
స్ఫా కపోలుఁడై పలికెఁ బాండుతనూభవుతోడఁ జెచ్చెరన్.

(తెభా-10.2-1234-సీ.)[మార్చు]

సుమతీనాథ! యెవ్వనిమీఁద నా కను;
గ్రహ బుద్ధి వొడము నా నుని విత్త
మంతయుఁ గ్రమమున పహరించిన వాఁడు;
నహీనుఁ డగుచు సంతాప మంద
విడుతురు బంధు ల వ్విధమున నొందిలి;
యై చేయునదిలేక ఖిలకార్య
భారంబు లుడిగి మద్భక్తులతో మైత్రి;
నెఱపుచు విజ్ఞాననిరతుఁ డగుచు

(తెభా-10.2-1234.1-తే.)[మార్చు]

బిదప వాఁ డవ్యయానందపదము నాత్మ
నెఱిఁగి సారూప్యసంప్రాప్తి నెలమి నొందుఁ
గాన మత్సేవ మిగుల దుష్కర మటంచు
దలి భజియింతు రితరదేతల నెపుడు.

(తెభా-10.2-1235-క.)[మార్చు]

సే వింప వారు దమకుం
గా వించిన శోభనములు ని నిజములుగా
భా వించి వారి మఱతురు
భా ములఁ గృతఘ్నవృత్తిని తమ పనిగన్.

(తెభా-10.2-1236-క.)[మార్చు]

మె లఁగుచు నుందురు దీనికిఁ
దొక యితిహాస మిపుడు గైకొని నీకుం
దె లియఁగఁ జెప్పెద దానన
వడు నీ వడుగు ప్రశ్న గు నుత్తరమున్.

21-05-2016: :
గణనాధ్యాయి 11:32, 12 డిసెంబరు 2016 (UTC)