పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/వృకాసురుండు మడియుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

వృకాసురుండు మడియుట

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/వృకాసురుండు మడియుట)
రచయిత: పోతన


(తెభా-10.2-1237-క.)[మార్చు]

కుని యను దైత్యు తనయుఁడు
'వృ కుఁ డనువాఁ డొకఁడు దుర్వివేకుఁడు సుజన
ప్ర రముల నలఁపఁ దెరువున
'నొ నాఁ డొదిగుండి దివ్యయోగిం గడఁకన్.

(తెభా-10.2-1238-వ.)[మార్చు]

కనుంగొని.

(తెభా-10.2-1239-క.)[మార్చు]

ములు ముకుళించి మునీ
'శ్వ ర! నారద! లలితధీవిశారద! నన్నుం
రుణించి యాన తీ శుభ
' రు లగు హరి హర హిరణ్యర్భులలోనన్

(తెభా-10.2-1240-ఆ.)[మార్చు]

'డఁగి కొలువ శీఘ్రకాలంబులోనన
'యిష్టమైన వరము లిచ్చునట్టి
'దైవ మెవ్వఁ డనిన దానవుఁ గనుఁగొని
'మునివరుండు పలికె ముదముతోడ.

(తెభా-10.2-1241-వ.)[మార్చు]

“వినుము; దుర్గుణసుగుణంబులలో నొక్కటి యెచ్చటం గలుగు నచ్చట నాక్షణంబ కోపప్రసాదఫలంబులు సూపువాఁ డమ్మువ్వుర యందు ఫాలలోచనుఁ డివ్విధంబుఁదెలిసినవారై బాణాసుర దశకం ధరులు సమగ్ర భక్తియుక్తులై సేవించి యసమానసామ్రాజ్య వైభ వంబుల నొంది ప్రసిద్ధులై; రట్లుగాన నీవు నమ్మహాత్ముని సేవింపు; మతనివలన నభిమతఫలంబులు వేగంబ ప్రాప్తం బయ్యెడి” నని చెప్పిన నతం డా క్షణంబ.

(తెభా-10.2-1242-సీ.)[మార్చు]

'దీపించు కేదార తీర్థంబునకు నేగి;
'తిసాహసాత్మకుం గుచు నియతి
'లోకముల్‌ వెఱఁగంద నా కాలకంధరు;
'రదుని నంబికారునిఁ గూర్చి
'న మేనికండ లుద్దండుఁడై ఖండించి;
'గ్ని కాహుతులుగా లర వేల్చి
'ర్పకారాతి ప్రత్యక్షంబుగాకున్న;
'డియక సప్తవారము నందుఁ

(తెభా-10.2-1242.1-తే.)[మార్చు]

'బూని తత్తీర్థమునఁ గృతస్నానుఁ డగుచు
'వెడలి మృత్యువు కోఱనా వెలయునట్టి
'గండ్రగొడ్డంటఁ దన మస్తకంబు దునుము
'కొనఁగఁ బూనిన నయ్యగ్నికుండమునను.

(తెభా-10.2-1243-క.)[మార్చు]

రుదుగ వెలువడి రుద్రుఁడు
' రుణ దలిర్పంగ వానిర మాత్మకరాం
బు రుహమునఁ బట్టి తెగువకుఁ
'జొ వలవదు; మెచ్చు వచ్చె సుమహిత చరితా!

(తెభా-10.2-1244-క.)[మార్చు]

నీ దిఁ బొడమిన కోరిక
'లే మైనను వేఁడు మిపుడ యిచ్చెద ననినం
దా నమున సంతసపడి
'యా నుజాశనుఁడు హరుపదాంబుజములకున్.

(తెభా-10.2-1245-తే.)[మార్చు]

'వందనం బాచరించి యో యిందుమకుట!
'ఫాలలోచన! వరద! మత్పాణితలము
'నేను నెవ్వని తలమీఁద నిడిన వాఁడు
'స్తకము నూఱు వ్రయ్యలై డియ నీవె!

(తెభా-10.2-1246-క.)[మార్చు]

ని వేఁడిన నమ్మాటలు
'వి ని మదనారాతి నవ్వి విబుధాహితు కో
రి వరముఁ దడయ కిచ్చిన
' నుజుఁడు తద్వర పరీక్షఁ దాఁ జేయుటకున్.

(తెభా-10.2-1247-వ.)[మార్చు]

ఆ క్షణంబు వరదాన గర్వంబున నుద్వృత్తుండై కడంగి.

(తెభా-10.2-1248-క.)[మార్చు]

రుమస్తకమునఁ గడు
'సా సమునఁ జేయి వెట్ట డియక కదియ
న్నో హో! తన మెచ్చులు దన
'కా హా! పై వచ్చె ననుచు భవుఁడు భీతిన్.

(తెభా-10.2-1249-క.)[మార్చు]

నుజుఁడు దన వెనువెంటం
' నుదే ముల్లోకములను సంత్రాసముఁ గై
కొ ని పాఱ, సురలు మనములఁ
' నికిరి దానికిని బ్రతివిధానము లేమిన్.

(తెభా-10.2-1250-వ.)[మార్చు]

అట్లు చనిచని.

(తెభా-10.2-1251-సీ.)[మార్చు]

'నిరుపమానందమై నిఖిల లోకములకు;
'వలయై యమృతపదాఖ్యఁ దనరి
'దినకర చంద్ర దీధితులకుఁ జొరరాక;
'లలిత సహజ తేమున వెలుఁగు
'మధికంబగు శుద్ధత్త్వ గరిష్ఠమై;
'రమొప్ప యోగీంద్రమ్య మగుచు
'రిపదధ్యాన పరాయణులైన త;
'ద్దాసుల కలరు నివాస మగుచుఁ

(తెభా-10.2-1251.1-తే.)[మార్చు]

'బ్రవిమలానంత తేజోవిరాజమాన
'దివ్యమణి హేమకలిత సందీప్త భవ్య
'సౌధమండపతోరణ స్తంభ విపుల
'గోపురాది భాసురము వైకుంఠపురము.

(తెభా-10.2-1252-వ.)[మార్చు]

కనుంగొని యమ్మహాస్థానంబు డాయంజనుటయు, నప్పుండరీ కాక్షుం డఖండవైభవంబునం గుండలీశ్వర భోగతల్పంబునం బరమానంద కందళితహృదయారవిందుం డై యిందిరానయన చకోరకంబుల నిజమందహాస సాంద్ర చంద్రికావితతిం దేల్చుచు, నార్తభక్తజన రక్షణంబు పనిగా మెలంగుచు, వివిధ వినోదంబులం దగిలి యుండియు, ఫాలలోచనుం డద్దనుజపాలునకుం దలంపక యిచ్చిన వరంబు దన తలమీఁదవచ్చినం గలంగి చనుదెంచుట తన దివ్యచిత్తంబున నెఱింగి, యక్కాలకంధరుని యవస్థ నివారింపం దలంచి యయ్యిందిరాదేవి తోడి వినోదంబు సాలించి యప్పుడు.

(తెభా-10.2-1253-సీ.)[మార్చు]

తాపింఛరుచితోడఁ ద్రస్తరించెడు మేనుఁ;
సిఁడిముంజియుఁ దగు ట్టుగొడుగు
వళాంశురుచి జన్నిదంబును దిన్నని;
దండంబుఁ జేతఁ గమండలువును
సుపుగోఁచియుఁ జిన్ని ట్టెవర్ధనమును;
రాజితంబైన మృగాజినంబుఁ
దూలాడు సిగయును వ్రేలుమాఱట గోఁచి;
వేలిమిబొట్టును వ్రేళ్ళ దర్భ

(తెభా-10.2-1253.1-తే.)[మార్చు]

'నర సందీప్త హవ్య వాన సమాన
'కాంతిఁ జెలువొంది యద్భుత క్రమ మెలర్పఁ
'తురగతి నప్డు వటుక వేషంబు దాల్చి
'చ్చి యా నీచ దానవరునిఁ జేరి.

(తెభా-10.2-1254-వ.)[మార్చు]

కైతవంబున నతనికి నమస్కరించి మృదుమధుర భాషణంబుల ననునయించుచు నయ్యసురవరున కిట్లను; నివ్విధంబున మార్గపరిశ్రాంతుండవై యింత దూరంబేల చనుదెంచితి? సకల సౌఖ్య కారణంబైన యీ శరీరంబు నిరర్థకంబు సేసి వృథాయాసంబున దుఃఖపఱుపం దగునే? యియ్యెడం గొంతతడవు విశ్రమింపు; మీ ప్రయాసంబునకుఁ గతంబెయ్యది? కపటహృదయుండవు గాక నీ యధ్యవసాయం బెఱింగింపందగునేని నెఱింగింపు” మని మృదు మధురంబుగాఁ బలికిన నమ్మహాత్ముని సుధారసతుల్యంబులయిన వాక్యంబులు విని సంతసిల్లి, యప్పిశితాశనుండు దన పూనినకార్యం బతని కెఱింగించిన.

(తెభా-10.2-1255-చ.)[మార్చు]

' రి దరహాస మొప్పఁ బిశితాశనుఁ గన్గొని పల్కె దానవే
'శ్వ ర! మును దక్షుశాపమునఁ జాలఁ బిశాచిప తౌట సూనృత
'స్ఫు ణము మాని సంతతము బొంకుచునుండు పురారిమాట నీ
' యక వెంట నేఁగఁ దగ దాతని చేఁతలు మాకు వింతలే?

(తెభా-10.2-1256-ఆ.)[మార్చు]

'నిజము పలికె నేని నెఱిఁ దన తలమీఁద
'నీ కరంబు మోపనీక తలఁగి
'చ్చునోటు! నితనిలనఁ బ్రత్యయమునఁ
'గుల నేమి గలదు నుజవర్య!

(తెభా-10.2-1257-ఆ.)[మార్చు]

'శుచి యగుచు నతని నంటఁగఁ బని గాదు
'కాలుఁ జేయిఁ గడిగి డఁక వార్చి
'తనివెంట వేడ్క రుగుదువే నీవు
'వల నంటఁ దగును సురనాథ!

(తెభా-10.2-1258-మ.)[మార్చు]

' తి దుశ్శంకలు మాని పొమ్మనిన దైత్యారాతి మాయా విమో
'హి తుఁడై విస్మృతి నొంది తామసముచే నేపారి వాఁ డాత్మ పా
'ణి లంబుం దన నెత్తి మోపికొని తా నేలన్ వెసం గూలె వి
'శ్రు దంభోళిహతిన్ వడింబడు మహా క్షోణీధరంబో యనన్.

(తెభా-10.2-1259-వ.)[మార్చు]

అట్లు దన తల నూఱువ్రయ్యలై నేలం గూలిన యసురం గని యప్పుడు.

(తెభా-10.2-1260-క.)[మార్చు]

సు లసురాంతకు మీఁదన్
' మందారప్రసూన ర్షము లోలిం
గు రిసిరి తుములంబై దివి
'మొ సెన్ సురదుందుభిప్రముఖతూర్యంబుల్‌.

(తెభా-10.2-1261-క.)[మార్చు]

పా డిరి గంధర్వోత్తము
'లా డిరి దివి నప్సరసలు న్యోన్యములై
కూ డిరి గ్రహములు భయముల
'వీ డిరి మునికోటు లంత విమలచరిత్రా!

(తెభా-10.2-1262-క.)[మార్చు]

ము హరుఁ డెల నవ్వొలయఁగఁ
'బు రుహరుఁ దగఁ జూచి పలికె భూతేశ్వర! యీ
భోజనుండు నీ కి
'త్త ఱి నెగ్గొనరింపఁ దలఁచి తానే పొలిసెన్.

(తెభా-10.2-1263-వ.)[మార్చు]

అది యట్టిద కాదె! యిజ్జగంబున నధికుండయిన వానికి నపకారంబు గావించిన మానవునకు శుభంబు గలుగునే? యదియునుంగాక జగద్గురుండవగు నీ కవజ్ఞ దలంచు కష్టాత్ముండు వొలియుటం జెప్పనేల? యిట్టి దుష్టచిత్తుల కిట్టి వరంబులిచ్చుట కర్జంబు గాదని యప్పురాంతకు వీడ్కొలిపిన, నతండు మురాంతకు ననేక విధంబుల నభినందించి నిజ మందిరంబునకుం జనియె" నని చెప్పి యిట్లనియె.

(తెభా-10.2-1264-క.)[మార్చు]

మా వనాయక! యీ యా
'ఖ్యా ముఁ జదివినను వినిన నపుణ్యులు ని
త్యా నంద సౌఖ్యములఁ బెం
'పూ నుదు రటమీఁద ముక్తి నొందుదు రెలమిన్!

(తెభా-10.2-1265-వ.)[మార్చు]

అని చెప్పి శుకయోగీంద్రుండు పరీక్షిన్నరేంద్రున కిట్లనియె.

(తెభా-10.2-1266-క.)[మార్చు]

నాయక! యింకఁ బురా
' వృత్తం బొకటి నీకుఁ గ నెఱిఁగింతున్.
వి నుము తపోమహిమలఁ జెం
'ది మునిజనములు సరస్వతీనది పొంతన్.

21-05-2016: :
గణనాధ్యాయి 11:33, 12 డిసెంబరు 2016 (UTC)