పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/భృగుమహర్షి శోధనంబు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

భృగుమహర్షి శోధనంబు

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/భృగుమహర్షి శోధనంబు)
రచయిత: పోతన


(తెభా-10.2-1267-క.)[మార్చు]

వి తక్రియ లొప్పఁగ స
'త్క్ర తువుల నొనరించు చచటఁ గైకొని లక్ష్మీ
తి భవ పితామహులలో
' తులితముగ నెవ్వ రధికు ని తమలోనన్.

(తెభా-10.2-1268-వ.)[మార్చు]

ఇట్లు దలపోసి తన్మమహత్త్వం బంతయుం తెలిసి రమ్మని భృగు మహాముని నమ్మువ్వురు వేల్పులకడకుం బంపిన నత్తాపసోత్త ముండు సనిచని ముందట.

(తెభా-10.2-1269-క.)[మార్చు]

రుహసంజాత సభా
స్థ మున కొగి నేఁగి యతని త్త్వగుణంబుం
దె లియుటకై నుతివందన
ము లు సేయక యున్న నజుఁడు ముసముస యనుచున్.

(తెభా-10.2-1270-క.)[మార్చు]

మునఁ గలఁగుచు భృగుఁ దన
నుజాతుం డనుచు బుద్ధిఁ లఁచినవాఁడై
రోషస్ఫురితాగ్నిని
యము శాంతోదకముల ల్లన నార్చెన్.

(తెభా-10.2-1271-చ.)[మార్చు]

హితతపోధనుండు మునిమండనుఁ డయ్యెడఁ బాసి వెండియు
న్న హిపతిభూషుఁ గాన రజతాద్రికి నేగిన నగ్గిరీంద్రుపైఁ
దు హినమయూఖశేఖరుఁడు దుర్గయుఁ దానును విశ్రమించుచున్
దృ హిణతనూభవుండు సనుదెంచుట కాత్మఁ బ్రమోదమందుచున్.

(తెభా-10.2-1272-క.)[మార్చు]

నుఁగొని భ్రాతృస్నేహం
బు నఁ గౌఁగిటఁ జేర్చు ననుచు ముక్కంటి రయం
బు నెదురేగిన ముని రు
ద్రు ని యందలి సత్త్వగుణ మెఱుంగుటకొఱకై.

(తెభా-10.2-1273-వ.)[మార్చు]

అతనిం గైకొనక యూరకుండిన.

(తెభా-10.2-1274-ఉ.)[మార్చు]

నిటలాంబకుండు గమలాసన నందనుఁ జూచి భూరి కా
లా ల రోషవేగ భయదాకృతిఁ దాల్చి పటుస్ఫులింగ సం
తా ము లొల్క శూలమునఁ దాపసముఖ్యు నురంబు వ్రేయఁగాఁ
బూ నినఁ బార్వతీరమణి బోరన నడ్డము వచ్చి చెచ్చెరన్;

(తెభా-10.2-1275-క.)[మార్చు]

విభుపాదములకు వం
ముం గావించి సముచిప్రియముల న
య్య లాక్షుని కోపము మా
న్చి నమ్మునినాథుఁ డచట నిలువక చనియెన్.

(తెభా-10.2-1276-సీ.)[మార్చు]

పొలుపొందు వైకుంఠపురమున కర్థితోఁ;
ని యందు సమధికైశ్వర్య మొప్పఁ
మలాంక పర్యంకతుఁడై సుఖించు న;
క్కౌస్తుభభూషు వక్షస్థ్సలంబుఁ
న పాదమున బిట్టు న్నెఁ దన్నినఁ బాన్పు;
డిగి వచ్చి మునిఁ జూచి నగధరుండు
దముల కెఱఁగి యో! రమతపోధన! ;
యీగతి నీ వచ్చు టెఱుఁగ లేక

(తెభా-10.2-1276.1-తే.)[మార్చు]

యున్న నా తప్పు మన్నించి నన్నుఁ గరుణఁ
జూచి యీ దివ్యమణిమయస్ఫూర్తిఁ దనరు
రుచిర సింహాసనమునఁ గూర్చుండు దివ్య
తాపసోత్తమ! యభయప్రదాననిపుణ!

(తెభా-10.2-1277-క.)[మార్చు]

ఘుపవిత్ర! భవత్పద
ములు నను నస్మదీయ ఠరస్థ జగం
బు లోకపాలురను బొలు
రఁగఁ బుణ్యులను జేయు నఘచరిత్రా!

(తెభా-10.2-1278-వ.)[మార్చు]

మునీంద్రా! భవదీయ పాదాబ్జహతి మద్భుజాంతరంబునకు భూషణం బయ్యె; భవదాగమనంబు మాఁబోటివారికి శుభావహం బగుంగాదె; యేను ధన్యుండ నైతినని మృదుమధురాలాపంబుల ననునయించిన నమ్మునివరుండు లక్ష్మీనాథు సంభాషణంబులకుఁ జిత్తంబునం బరమానందంబు నొంది, యమ్ముకుందు ననంతకల్యాణగుణనిధి నభినందించి, యానందబాష్పధారాసిక్త కపోలుం డగుచుఁ దద్భక్తి పారవశ్యంబున నొండు పలుకనేరక యతనిచేత నామంత్రణంబువడసి మరలి సరస్వతీతీరంబున నున్న మునుల సన్నిధికిం జనుదెంచి వారలం గనుంగొని.

(తెభా-10.2-1279-సీ.)[మార్చు]

మునినాయకులతోడఁ దన పోయి వచ్చిన;
తెఱఁగును దనమది దృష్టమైన
మూఁడుమూర్తుల విధంబును నెఱింగించిన;
విని వారు మనముల విస్మయంబు
నంది చిత్తంబున సందేహమును బాసి;
చిన్మయాకారుండు శ్రీసతీశుఁ
నుపముఁ డనవద్యుఁ ఖిల కల్యాణగు;
ణాకరుఁ డాదిమధ్యాంతరహితుఁ

(తెభా-10.2-1279.1-తే.)[మార్చు]

డై తనర్చిన పుండరీకాక్షుఁ డొకఁడ
కాక గణుతింప దైవ మొక్కరుఁడు వేఱ
లఁడె యనుబుద్ధి విజ్ఞాన లితు లగుచు
రిపదాబ్జాతయుగళంబు ర్థిఁ గొలిచి.

(తెభా-10.2-1280-వ.)[మార్చు]

అట్లు సేవించి యవ్యయానందంబయిన వైకుంఠధామంబు నొంది; రని చెప్పి వెండియు నిట్లనియె.

21-05-2016: :
గణనాధ్యాయి 11:33, 12 డిసెంబరు 2016 (UTC)