పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/విప్రుని ఘనశోకంబు

వికీసోర్స్ నుండి

విప్రుని ఘనశోకంబు

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/విప్రుని ఘనశోకంబు)
రచయిత: పోతన


తెభా-10.2-1281-సీ.
రనాథ! యొకనాఁడు లినాయతాక్షుండు-
వొలుచు కుశస్థలీపురము నందు
సుఖముండ నొక్క భూసురవర్యు భార్యకుఁ-
బుత్త్రుండు జన్మించి పుట్టినపుడ
మృతుఁడైన ఘనశోకవితతిచేఁ గ్రాఁగుచు-
నా డింభకునిఁ గొంచు వనిసురుఁడు
నుదెంచి పెలుచ రాద్వారమునఁ బెట్టి-
న్నుల బాష్పాంబుణము లొలుక

తెభా-10.2-1281.1-తే.
"బాపురే! విధి నను దుఃఖఱుపఁ దగునె?"
నుచు దూఱుచుఁ దనుఁ దిట్టుకొనుచు వగల
డెంద మందంద యెరియ నాక్రందనంబు
సేయుచును వచ్చి యా విప్రశేఖరుండు.

టీక:- నరనాథ = రాజా; ఒక = ఒకానొక; నాడు = దినమున; నళినాయతాక్షుండు = కృష్ణుడు {నళినాయతాక్షుడు - పద్మముల వలె విశాలమైన కన్నులు కలవాడు, కృష్ణుడు}; పొలుచు = ఉండునట్టి; కుశస్థలీ = ద్వారకా; పురమున్ = నగరము; అందున్ = లో; సుఖమున్ = సుఖముగా; ఉండన్ = ఉండగా; ఒక్క = ఒకానొక; భూసుర = విప్ర; వర్యు = ఉత్తముని; భార్య = పెండ్లామున; కున్ = కు; పుత్త్రుండు = కొడుకు; జన్మించి = పుట్టి; పుట్టిన = పుట్టిన; అపుడ = అప్పుడే, వెంటనే; మృతుడు = మరణించినవాడు; ఐనన్ = కాగా; ఘన = అధికమైన; శోక = దుఃఖముల; వితతి = సముదాయము; చేన్ = చ్త; క్రాగుచున్ = తపించుచు; ఆ = ఆ; డింభకుని = పిల్లవానిని; కొంచున్ = తీసుకొని; అవనిసురుడు = విప్రుడు; చనుదెంచి = వచ్చి; పెలుచన్ = గట్టిగా; రాజద్వారమునన్ = ముఖద్వారమువద్ద; పెట్టి = పెట్టి; కన్నులన్ = కళ్ళమ్మట; బాష్ప = కన్నీటి; కణంబులు = బిందువులు; ఒలుకన్ = కారుతుండగా.
బాపురే = అయ్యో, ఔరా; విధి = దైవమా; ననున్ = నన్ను; దుఃఖపఱుపన్ = దుఃఖపెట్టుట; తగునె = యుక్తమా, కాదు; అనుచున్ = అని; దూఱుచున్ = నిందించుచు; తనున్ = తననుతానే; తిట్టికొనుచున్ = నిందించుకొనుచు; వగలన్ = దుఃఖములచేత; డెందము = మనసు; అందంద = అక్కడక్కడ; ఎరియన్ = పగులగా; ఆక్రందనంబు = ఏడ్చుట; చేయుచున్ = చేస్తు; వచ్చి = వచ్చి; ఆ = ఆ; విప్ర = బ్రాహ్మణ; శేఖరుండు = ఉత్తముడు.
భావము:- “మహారాజా! తామరల వంటి విశాల నయనాల వాడు శ్రీకృష్ణుడు కుశస్థలిలో సుఖంగా ఉంటున్న రోజులలో, ఒక విప్రుని భార్యకు పుత్రుడు పుట్టి పుట్టగానే చనిపోయాడు. శోకంతో కన్నీళ్ళు పెట్టుకుని మృతబాలుడిని ఎత్తుకుని వచ్చి, ఆ బాలుడి శవాన్ని రాజద్వారం ముందు పెట్టి, విధిని నిందిస్తూ, తనను తాను తిట్టుకుంటూ, బ్రాహ్మణుడు గుండెబ్రద్దలయ్యేలా “అయ్యో” అంటూ దుఃఖించసాగాడు.

తెభా-10.2-1282-సీ.
ధికశోకంబున లమటఁ బొందుచు-
చ్చటి జనులతో నియెఁ బెలుచ
"బ్రాహ్మణ విద్వేషరుఁ డయి తగ శాస్త్ర-
ద్ధతి నడవక పాపవర్తి
యై క్షత్రబంధువుఁ గు వాని దురితంబు-
చే మత్పుత్త్రుండు జామైన
ప్పుడ మృతుఁ డయ్యె క్కట! హింసకు-
రోక యెప్పు డన్యాకారి

తెభా-10.2-1282.1-తే.
గుచు విషయానుగతచిత్తుఁ డైన యట్టి
రాజుదేశంబు ప్రజలు నిరాశు లగుచు
దుఃఖములఁ జాల వనటఁ బొందుదు రటంచు
నేడ్చుచును నట నిల్వక యేగె నపుడు.

టీక:- అధిక = మిక్కుటమైన; శోకంబునన్ = దుఃఖముచేత; అలమట = సంకట; పొందుచున్ = పడుతు; అచ్చటి = అక్కడి; జనుల = ప్రజల; తోన్ = తోటి; అనియెన్ = చెప్పెను; పెలుచన్ = గట్టిగా; బ్రాహ్మణ = విప్రుల యందు; విద్వేష = విరోధభావము; పరుడు = గలవాడు; అయి = ఐ; తగ = తగినట్లు; శాస్త్ర = శాస్త్రములు చెప్పిన; పద్దతిని = పద్దతిలో; నడవకన్ = వర్తింపకుండ; పాప = పాపపుపనులందు; వర్తి = మెలగెడివాడు; ఐ = అయ్యి; క్షత్రబంధువుడు = అల్పుడైన రాజవంశస్థుడు {క్షత్రబంధువుడు - రాచకులమున పుట్టి క్షత్రియుడన అర్హుడు కానివానిని ఉద్దేశించి నిందాపూర్వకముగా వాడబడును.}; అగు = ఐన; వాని = వాడి యొక్క; దురితంబు = పాపములు; చేత = వలన; మత్ = నా యొక్క; పుత్రుండు = కొడుకు; జాతమైన = పుట్టిన; అప్పుడే = అప్పుడే, వెంటనే; మృతుడు = చనిపోయినవాడు; అయ్యెన్ = అయ్యెను; అక్కట = అయ్యో; హింస = హింసించుట; కున్ = కు; రోయక = వెనుదీయక; ఎప్పుడు = ఎప్పుడైతే; అన్యాయకారి = అన్యాయము చేయువాడు.
అగుచున్ = ఔతు; విషయ = ఇంద్రియచాపల్యమును; గత = పొందిన; చిత్తుడు = మనసు కలవాడు; ఐనయట్టి = అయినట్టి; రాజు = రాజు యొక్క; దేశంబు = దేశమునందలి; ప్రజలు = జనులు; నిరాశులు = ఆశలుతీరనివారు; అగుచున్ = ఔతు; దుఃఖములన్ = దుఃఖములచేత; చాలన్ = చాలా ఎక్కువగా; వనటన్ = తాపములను; పొందుదురు = పొందుతారు; అట = అని; అంచున్ = అనుచు; ఏడ్చుచున్ = ఏడుస్తు; అటన్ = అక్కడ; నిల్వక = నిలబడకుండ; ఏగెను = వెళ్ళిపోయెను; అపుడు = అప్పుడు.
భావము:- దుర్భరశోకంతో కుమిలిపోతున్న ఆ విప్రుడు అక్కడి ప్రజలతో “బ్రాహ్మణద్వేషి, శాస్త్రాచారాన్ని పాటించని వాడు, పాపాత్ముడు అయిన క్షత్రబంధువు చేసిన పాపం వలన నా కుమారుడు పుట్టగానే చచ్చిపోయాడు. దేశాన్ని ఏలే రాజు హింసను ఏవగించుకోకుండా, న్యాయానికి దూరుడు, ఇంద్రియలోలుడు అయితే ఆ ప్రజలు నిరాశతో దుఃఖాలవలన అధికమైన కష్టాలను పొందుతారు.” అని ఏడుస్తూ ఇక అక్కడ ఉండకుండా వెళ్ళిపోయాడు.

తెభా-10.2-1283-వ.
ఇవ్విధంబున మఱియు దన సుతులు మృతులయినపు డెల్ల వారలం గొనివచ్చి యవ్విప్రుండు రాజుమొగసాలంబెట్టి రోదనంబు సేయుచు నెప్పటియట్ల కొన్నిగాథలు సదివిపోవుచుండె; నివ్విధంబున నెనమండ్రు సుతులు మృతులైనపిదపం దొమ్మిదవ సుతుండును మృతుండైన వాని నెత్తికొని వచ్చి యెప్పటి విధంబునఁ బలవరించుచున్న యా బ్రాహ్మణునిం గని యర్జునుం డిట్లనియె.
టీక:- ఈ = ఈ; విధంబునన్ = విధముగా; మఱియున్ = ఇంకను; తన = తన; సుతులు = పుత్రులు; మృతులు = చనిపోయినవారు; అయిన = ఐన; అప్పుడు = అప్పుడు; ఎల్లన్ = ప్రతిసారి; వారలన్ = వారిని; కొని = తీసుకొని; వచ్చి = వచ్చి; ఆ = ఆ; విప్రుండు = బ్రాహ్మణుడు; రాజు = రాజు యొక్క; మొగసాలన్ = నగరి తలవాకిట్లో; పెట్టి = పెట్టి; రోదనంబు = ఏడ్చుట; చేయుచున్ = చేస్తూ; ఎప్పటియట్లన్ = ఎప్పట్లానే; కొన్ని = కొన్ని; గాథలు = కథలు; చదివి = చెప్పి; పోవుచుండెన్ = వెళ్ళిపోతుండెను; ఈ = ఈ; విధంబునన్ = విధముగా; ఎనమండ్రు = ఎనిమిదిమంది (8); సుతులు = కొడుకులు; మృతులు = చనిపోయినవారు; ఐన = అయిన; పిదపన్ = పిమ్మట; తొమ్మిదవ = తొమ్మదో (9); సుతుండును = కొడుకు; మృతుండు = చనిపోయినవాడు; ఐనన్ = కాగా; వానిన్ = వానిని; ఎత్తికొని = తీసికొని; వచ్చి = వచ్చి; ఎప్పటి = ఎప్పటి; విధంబునన్ = లాగనే; పలవరించుచున్న = ప్రలాపించుచుండగా; ఆ = ఆ; బ్రాహ్మణునిన్ = విప్రుని; కని = చూసి; అర్జునుండు = అర్జునుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఈ విధంగా తనకు కొడుకులు పుట్టి మరణించిన ఎనమండుగురు కొడుకులను ప్రతిసారి, వారిని తీసుకు వచ్చి రాజమందిర ద్వారం ముందు పెట్టి, ఆ బ్రాహ్మణుడు ఏడుస్తూ మునుపటిలాగే కొన్ని కథలు చదివి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇలా అతనికి పుట్టి చనిపోయిన తొమ్మిదవకొడుకును కూడ ఆ బాలుని శవాన్ని తెచ్చి ఆక్రందిస్తున్న బ్రాహ్మణుడిని చూసిన అర్జునుడు ఇలా అన్నాడు.

తెభా-10.2-1284-క.
"ఈ గిది నీవు వగలన్
వాపోవఁగఁ జూచి యకట! వారింపంగా
నోపిన విలుకాఁ డొక్కం
డీ పురి లేఁ డయ్యె నయ్య! యిది పాపమగున్.

టీక:- ఈ = ఈ; పగిదిన్ = విధముగా; నీవు = నీవు; వగలన్ = దుఃఖములతో; వాపోవగన్ = రోదిస్తుండగా; చూచి = చూసి; అకట = అయ్యో; వారింపంగా = మాన్పుటకు; ఓపిన = చాలిన; విలుకాడు = యోధుడు; ఒక్కండున్ = ఒక్కడైనా; ఈ = ఈ; పురిన్ = పట్టణములో; లేడయ్యెన్ = లేకపోయెను; అయ్య = నాయనా; ఇది = ఇది; పాపము = పాపము; అగున్ = అగును.
భావము:- “అయ్యా! ఇలా నీవు దుఃఖిస్తుంటే చూసి ఈ అన్యాయాన్ని వారించే సమర్ధత గల విలుకాడు ఒక్కడు అయినా ఈ నగరంలో లేడా? ఇది పాపము.

తెభా-10.2-1285-సీ.
పుత్త్రులఁ గోల్పోయి భూరిశోకంబున-
నటఁ బొందుచు విప్రరులు సాల
నే రాజురాజ్య మందేని వసించుదు-
రా రాజుఁ దలపోయ వనిమీఁద
టునిఁగా నాత్మ నెన్నం దగు; నీ పుత్త్రు-
నే బ్రతికించెద నిపుడ పూని
టు సేయనైతి నే నలంబు సొచ్చెద"-
ని భూసురుఁడు వెఱఁగందఁ బలుక

తెభా-10.2-1285.1-తే.
తఁడు విని "యీ వెడఁగుమాట లాడఁ దగునె?
భూరివిక్రమశాలి రాముండు మేటి
లుఁడు హరియును శౌర్యసంన్ను లనఁగఁ
నరు ప్రద్యుమ్నుఁ డతని నంనుఁడు మఱియు.

టీక:- పుత్రులన్ = కొడుకులను; కోల్పోయి = పోగొట్టుకొని; భూరి = మిక్కుటమైన; శోకంబునన్ = శోకముతో; వనటన్ = పరితాపమును; పొందుచున్ = పొందుతు; విప్ర = బ్రాహ్మణ; వరులు = ఉత్తములు; చాలన్ = మిక్కిలిగా; ఏ = ఏ; రాజు = రాజు యొక్క; రాజ్యము = దేశము; అందేని = లోనైనా; వసించుదురు = ఉంటారో; ఆ = ఆ; రాజున్ = రాజు; తలపోయన్ = విచారించినచో; అవని = నేల; మీద = పై; నటుని = నటించు (రాజైన) వాడు; కాన్ = ఐనట్లు; ఎన్నన్ = ఎంచుటకు; తగున్ = తగును; నీ = నీ; పుత్రున్ = కొడుకును; నేన్ = నేను; బ్రతికించెదన్ = బ్రతికించెదను; ఇపుడన్ = ఇప్పుడే; పూని = ప్రయత్నించి; అటు = అలా; చేయనైతిని = చేయలేకపోతే; అనలంబున్ = అగ్నిలో; చొచ్చెదన్ = ప్రవేశింతును; అని = అని; భూసురుడు = బ్రాహ్మణుడు; వెఱగందన్ = ఆశ్చర్యపోవునట్లు; పలుకన్ = చెప్పగా; అతడు = అతను.
విని = విని; ఈ = ఇలాంటి; వెడగు = అవివేకపు; మాటలు = మాటలు; ఆడన్ = పలుకుట; తగునె = తగినపనేనా; భూరి = మిక్కుటమైన; విక్రమశాలి = పరాక్రమవంతుడు; రాముండు = బలరాముడు; మేటి = అత్యధికమైన; బలుడు = బలశాలి; హరియునున్ = కృష్ణుడు; శౌర్య = వీరత్వమునందు; సంపన్నులు = మిక్కుటముగా గలవారు; అనగన్ = అని; తనరు = అతిశయించు; ప్రద్యుమ్నుడు = ప్రద్యుమ్నుడు; అతని = అతని; నందనుడు = కొడుకు (అనిరుద్ధుడు); మఱియున్ = ఇంకను.
భావము:- ఈలోకంలో అధికంగా ఎవరి రాజ్యంలో కన్నబిడ్డల్ని పోగొట్టుకుని దుర్భరశోకంతో పరితపించే బ్రాహ్మణులు ఉంటారో, ఆ రాజు రాజు కాడు కేవలం వేషగాడు మాత్రమే. నీ కుమారుడిని నేను బ్రతికిస్తాను అలా చేయకపోతే నేను అగ్నిప్రవేశం చేస్తాను.” ఈ పలుకులు వినిన బ్రాహ్మణుడు ఆశ్చర్యపడి ఇలాగా అన్నాడు. “అయ్యా! ఇలాంటి అవివేకపు మాటలు పలుక తగదు. మహా వీరులు, మహా బలశాలురు అయిన బలరామకృష్ణులు, కృష్ణకుమారుడు ప్రద్యుమ్నాదులు ఉండగా, ఇంకా...

తెభా-10.2-1286-తే.
వినుతబలు లైన యాదవ వీరవరులుఁ
లుగ వారలచేఁ గాని కార్య మీవు
క్కఁ బెట్టుట యెట్లు? నీనెడు త్రోవఁ
బొమ్ము"నావుడు నయ్యింద్రపుత్త్రుఁ డపుడు

టీక:- వినుత = ప్రసిద్ధమైన; బలులు = బలవంతులు; ఐన = అయిన; యాదవ = యాదవవంశపు; వీర = వీరులలో; వరులున్ = ఉత్తములు; కలుగన్ = ఉండగా; వారల = వారి; చేన్ = చేత; కాని = కాకుండునట్టి; కార్యమున్ = పనిని; ఈవు = నీవు; చక్కబెట్టుట = సాధించుట; ఎట్లు = ఎలా సాధ్యము; నీ = నీవు; చనెడు = పోయెడి; త్రోవన్ = మార్గమున; పొమ్ము = వెళ్ళిపొమ్ము; నావుడు = అనగా; ఆ = ఆ ప్రసిద్ధుడైన; ఇంద్రపుత్రుడు = అర్జునుడు; అపుడు = అప్పుడు.
భావము:- ప్రశంసించదగిన బలం కలిగిన యాదవవీరులు ఉండగా, వారిచేతనే కాని పనిని చక్కపెట్టడం నీవు ఎలా చేయగలవు కానీ, నీ దారిన నీవు వెళ్ళు.” ఇలా అంటున్న ఆ బ్రాహ్మణుడి మాటలు వినిన ఇంద్రతనయుడు...

తెభా-10.2-1287-క.
మున దురహంకారము
ముగఁ బొడముటయు, నపుడు వ్వడి విప్రుం
నుఁగొని యచ్చటిజనములు
వినఁగా నిట్లనియె రోషవిహ్వలమతియై.

టీక:- మనమునన్ = మనసు నందు; దురహంకారము = చెడ్డగర్వము; ఘనముగన్ = అధికముగా; పొడముటయున్ = కలుగుటచేత; అపుడు = అప్పుడు; కవ్వడి = అర్జునుడు {కవ్వడి - కవ + వడి, రెండు చేతులలోను వడి కలవాడు, అర్జునుడు}; విప్రున్ = బ్రాహ్మణుని; కనుగొని = చూసి; అచ్చటి = అక్కడి; జనములు = ప్రజలు; వినగా = వినుచుండగా; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; రోష = కోపముచేత; విహ్వల = స్వాధీనత తప్పిన; మతి = బుద్ధికలవాడు; ఐ = అయ్యి.
భావము:- అర్జునుడి మనసులో దురహంకారం పెచ్చుమీరింది. రెండు చేతులతో వడిగా బాణాలు వేయగలిగిన ఆ మహావీరుడు రోషంతో వశంతప్పి, అక్కడి జనాలు అందరు వినేలా విప్రుడితో ఇలా అన్నాడు.

తెభా-10.2-1288-మ.
"లుఁడంగాను; మురాసురాంతకుఁడఁగాఁ; బ్రద్యుమ్నుఁడంగాను; నేఁ
దెలియం దత్తనయుండఁగా"నని "విరోధివ్రాతమున్ భీషణో
జ్జ్వగాండీవ ధనుర్విముక్త నిశితాస్త్రశ్రేణిచేఁ బీన్గుపెం
లు గావించు పరాక్రమప్రకటచంస్ఫూర్తి నేఁ బార్థుఁడన్.

టీక:- బలుడన్ = బలరాముడను; కాను = కాను; మురాసురాంతకుఁడన్ = కృష్ణుని; కాన్ = కాను; ప్రద్యుమ్నుడన్ = ప్రద్యుమ్నుడుని; కాను = కాను; నేన్ = నేను; తెలియన్ = విచారించగా; తత్తనయుండన్ = అనిరుద్ధుని; కాను = కాను; అనిన్ = యుద్ధములో; విరోధి = శత్రువుల; వ్రాతమున్ = సమూహమును; భీషణ = భయంకరమైన; ఉజ్జ్వల = వెలిగిపోతుండెడి; గాండీవ = గాండీవము అను; ధనుః = విల్లునుండి; విముక్త = వదలబడిన; నిశిత = వాడియైన; అస్త్ర = బాణముల; శ్రేణి = సమూహముచేత; పీన్గుపెంటలు = చాలామందిని చంపుట; కావించు = చేసెడి; పరాక్రమ = పరక్ర ముచేత; ప్రకట = ప్రసిద్ధమైన; చండ = తీక్షణమైన; స్ఫూర్తిన్ = ప్రకాశముగల; నేన్ = నేను; పార్థుడన్ = అర్జునుడను {పార్థుడ - పృథు (కుంతి) కొడుకు, అర్జునుడు}.
భావము:- “నేను బలరాముడినికాను కృష్ణుడిని కాను; ప్రద్యుమ్నుడిని కాను; అతని కొడుకైన అనిరుద్ధుడిని కాను. యుద్ధంలో నా భీకరమైన గాండీవం నుండి వెలువడే వాడిబాణాలతో శత్రువులను చీల్చిచెండాడే మహాపరాక్రమం కలిగిన నేను అర్జునుడిని.

తెభా-10.2-1289-వ.
అదియునుం గాక.
టీక:- అదియునున్ = అంతే; కాక = కాకుండ.
భావము:- అంతేకాక.....

తెభా-10.2-1290-చ.
లిమిఁ బురాంతకుం దొడరి బాహువిజృంభణమొప్ప నెక్కటిం
పడి పోరినట్టి రణధైర్యుని నన్ను నెఱుంగ వక్కటా!
పెలుకుఱ మృత్యుదేవతను బింకమడంచి భవత్తనూజుల
న్నవుఁజలంబుఁ జూపి కొనియాడఁగ నిప్పుడతెచ్చియిచ్చెదన్. "

టీక:- బలిమిన్ = బలముచేత; పురాంతకున్ = శివుని; తొడరి = ఎదిరించి; బాహు = భుజబలముయొక్క; విజృంభణమున్ = పరాక్రమము; ఒప్పన్ = తోచునట్లు; ఎక్కటిన్ = ఒక్కడినే; తలపడి = తాకి; పోరినట్టి = యుద్ధముచేసినట్టి; రణ = యుద్ధము నందు; ధైర్యుని = ధీరత్వము కలవానిని; నన్నున్ = నన్ను; ఎఱుంగవు = తెలిసికొనలేవు; అక్కటా = అయ్యో; పెలుకుఱన్ = మిక్కిలిగా బెదురునట్లు {పెలుకుఱ - భయముచేత అవయవములు స్వాధీనము తప్పుట, మిక్కిలి భయపడుట}; మృత్యుదేవతను = మృత్యుదేవతను; బింకము = గర్వమును; అడంచి = అణచివేసి; భవత్ = నీ యొక్క; తనూజులన్ = కొడుకులను; అలవు = సమర్థత; చలంబున్ = పట్టుదల; చూపి = చూపించి; కొనియాడగన్ = పొగడునట్లుగ; ఇప్పుడ = ఇప్పుడే; తెచ్చి = తీసికొనివచ్చి; ఇచ్చెదన్ = ఇస్తాను.
భావము:- అయ్యా! ఆ పరమశివుడినే ఎదిరించి పోరాడి భుజబలం చూపిన నన్నే ఎరుగవా? మృత్యుదేవత పొగరు అణచి, నా పట్టు ప్రదర్శించి, నీ పుత్రులను ఇప్పుడే తీసుకు వచ్చి ఇస్తాను.”

తెభా-10.2-1291-వ.
అని నమ్మంబలికిన యర్జును ప్రతిజ్ఞకు భూసురుండు మనంబున నూఱడిల్లి యతని నభినందించుచు నిజ మందిరంబునకు జని; కొన్ని దినంబు లుండునంత భార్యకుం బ్రసూతివేదనా సమయంబయినం జనుదెంచి వివ్వచ్చుం గని తద్విధం బెఱింగించిన నయ్యింద్రనందనుం డప్పుడు.
టీక:- అని = అని; నమ్మన్ = నమ్మకంగా; పలికినన్ = చెప్పగా; అర్జును = అర్జునుని; ప్రతిజ్ఞ = పంతమున; కున్ = కు; భూసురుండు = బ్రాహ్మణుడు; మనంబునన్ = మనస్సు నందు; ఉఱడిల్లి = ఊరటపొంది; అతనిన్ = అతనిని; అబినందించుచున్ = శ్లాఘించుచు; నిజ = తన; మందిరంబున్ = గృహమున; కున్ = కు; చని = వెళ్ళి; కొన్ని = కొద్ది; దినంబులు = రోజులు; ఉండునంతన్ = జరుగగా; భార్య = భార్య; కున్ = కు; ప్రసూతి = పురిటి; వేదనా = నొప్పుల; సమయంబు = సమయము; అయినన్ = కాగా; చనుదెంచి = వచ్చి; వివ్వచ్చున్ = అర్జునుని; కని = చూసి; తత్ = ఆ; విధంబున్ = విషయమును; ఎఱింగించినన్ = తెలుపగా; ఆ = ఆ ప్రసిద్ధుడైన; ఇంద్రనందనుండు = అర్జునుడు; అప్పుడు = అప్పుడు;
భావము:- ఇలా నమ్మకంగా పలికిన పార్థుడి మాటలపై బ్రాహ్మణుడి మనసు శాంతించింది. అతడు నరుని కొనియాడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు. కొన్నిదినాలు గడిచాయి. విప్రుడి భార్యకు మళ్ళీ ప్రసవించే సమయం సమీపించింది. భూసురుడు వెంటనే వచ్చి పరమ భీభత్సంగా యుద్ధంచేసే వాడైన అర్జునుడికి ఈ విషయం చెప్పాడు. ఆ ఇంద్రపుత్రుడు అంతట...

తెభా-10.2-1292-చ.
లిత విశిష్ట సంచిత జలంబుల నాచమనంబు సేసి, సు
స్థమున నిల్చి రుద్రునకు మ్మతి మ్రొక్కి మహాస్త్రవేది ని
ర్మ శుభమంత్ర దేవతల మానసమందుఁ దలంచి గాండివం
వడ నెక్కు ద్రోచి బిగియం గదియించి నిషంగయుగ్మమున్.

టీక:- లలిత = మనోజ్ఞమైన; విశిష్ట = ప్రత్యేకముగా; సంచిత = తెచ్చుకొన్న; జలంబులన్ = నీటితో; ఆచమనంబు = ఆచమనము; చేసి = చేసి; సు = మంచి; స్థలమునన్ = ప్రదేశమునందు; నిల్చి = నిలబడి; రుద్రున్ = శివుని; కున్ = కి; సమ్మతిన్ = ప్రీతితో; మ్రొక్కి = నమస్కరించి; మహా = గొప్ప; అస్త్ర = అస్త్రములను; వేది = తెలిసినవాడు; నిర్మల = పరిశుద్ధమైన; శుభ = మంచివియైన; మంత్ర = అస్త్రాల మంత్రముల; దేవతలన్ = దేవతలను; మానసము = మనస్సు; అందున్ = లో; తలంచి = తలచుకొని; గాండీవంబున్ = గాండీవ మను విల్లును; అలవడన్ = అనువుగా; ఎక్కుద్రోచి = ఎక్కుపెట్టి; బిగియన్ = వింటినారిని బిగియునట్లుగా; కదియించి = దగ్గరకు లాగి కట్టి; నిషంగ = అమ్ములపొది; యుగ్మమున్ = రెంటిని.
భావము:- విశిష్టమైన పవిత్రజలాలతో ఆచమనం చేసాడు. పరిశుద్ధ ప్రదేశంలో నిలబడి శివుడికి నమస్కరించాడు. గొప్పగొప్ప అస్త్రాలను వేయగలిగిన అర్జునుడు శుభప్రదులైన మంత్రదేవతలను మనసున తలచుకుని గాండీవాన్ని ఎక్కుపెట్టి పట్టుకున్నాడు. అమ్ముల పొదులు రెంటినీ కట్టుకున్నాడు.

తెభా-10.2-1293-వ.
ఇవ్విధంబునఁ గట్టాయితంబై యప్పుడు.
టీక:- ఈ = ఈ; విధంబునన్ = రీతిగా; కట్టాయితంబు = సిద్ధపడినవాడు; ఐ = అయ్యి; అప్పుడు = అప్పుడు.
భావము:- ఈ విధంగా సంసిద్ధుడు అయిన అర్జునుడు అంతట....

తెభా-10.2-1294-సీ.
భూసురు వెంట నిమ్ముల నేగి సూతికా-
వనంబు చుట్టును బాణవితతి
రికట్టి దిక్కులు నాకాశపథము ధ-
రాతలం బెల్ల నీరంధ్రముగను
రపంజరముఁ గట్టి శౌర్యంబు దీపింపఁ-
డు నప్రమత్తుఁ డై కాచియున్న
యెడ న మ్మహీసురు నింతికిఁ బుత్త్రుండు-
నియించె; నప్పు డచ్చటి జనంబు

తెభా-10.2-1294.1-తే.
పోయెఁ బోయెఁ గదే యని బొబ్బ లిడఁగ
బొంది తోడన యాకాశమునకు మాయఁ
జెందె నప్పుడు; దుఃఖంబు నొంది, భూమి
సురుఁడు విలపించుచును మురరుని కడకు.

టీక:- భూసురు = విప్రుని; వెంటన్ = కూడా; ఇమ్ములన్ = అనుకూల్యముగా; ఏగి = వెళ్ళి; సూతికా = పురిటి; భవనంబున్ = ఇంటి; చుట్టును = చుట్టూర; బాణ = బాణముల; వితతిన్ = సమూహముచేత; అరికట్టి = అడ్డుకట్టి; దిక్కులున్ = అన్నిపక్కల; ఆకాశపథమున్ = ఆకాశమార్గమును; ధరాతలంబున్ = నేలమీద; ఎల్లన్ = అన్నిటిని; నీరంధ్రముగను = సందులేకుండ; శర = బాణములతోచేసిన; పంజరమున్ = పంజరమును; కట్టి = కట్టి; శౌర్యంబు = పరాక్రమము; దీపింపన్ = ప్రకాశించునట్లు; కడున్ = మిక్కిలి; అప్రమత్తుడు = ఎచ్చరికకలవాడు; ఐ = అయ్యి; కాచి = కాపాలాకాసి; ఉన్న = ఉన్నట్టి; ఎడన్ = సమయమునందు; ఆ = ఆ; మహీసురుని = విప్రుని; ఇంతి = భార్య; కిన్ = కు; పుత్రుండు = కొడుకు; జనియించెన్ = పుట్టెను; అప్పుడు = అప్పుడు; అచ్చటి = అక్కడున్న; జనంబు = వారు.
పోయెపోయె = చనిపోయెను; కదే = కదా; అని = అని; బొబ్బలిడగన్ = కేకలుపెట్టగా; బొంది = దేహము; తోడనన్ = తోటి; ఆకాశమున్ = ఆకాశమున; కున్ = కు; మాయచెందెను = మాయమయ్యెను; అప్పుడు = అప్పుడు; దుఃఖంబున్ = దుఃఖమును; ఒంది = పొంది; భూమిసురుడు = విప్రుడు; విలపించుచు = రోదించుచు; మురహరుని = కృష్ణుని; కడ = వద్ద; కున్ = కు.
భావము:- బ్రాహ్మణుడి కూడా వెళ్ళి ఆ ప్రసవమందిరం చుట్టూ దట్టమైన బాణాలతో కప్పివేశాడు. మిక్కిలి జాగరూకతతో ప్రసూతిగృహానికి కావలి కాస్తున్నాడు. అప్పుడా బ్రాహ్మణుని భార్యకు మగ పిల్లాడు పుట్టి వెంటనే చనిపోయాడు. అక్కడి జనం ఆర్తనాదాలు చేశారు. మరణించిన పిల్లాడు శరీరంతోసహా ఆకాశంలోనికి అదృశ్యం అయ్యాడు. బ్రాహ్మణుడు విలపిస్తూ మురాసురుడు కృష్ణుడి దగ్గరకు వచ్చాడు.

తెభా-10.2-1295-వ.
అప్పుడు సని.
టీక:- అప్పుడు = పిమ్మట; చని = వెళ్ళి.
భావము:- అలా వెళ్ళిన విప్రోత్తముడు....

తెభా-10.2-1296-క.
ముంట నిల్చి "ముకుంద! స
నంనమునివినుత! నందనందన! పరమా
నం! శరదిందు చందన
కుం యశస్సాంద్ర! కృష్ణ! గోవింద! హరీ!

టీక:- ముందట = ఎదురుగా; నిల్చి = నిలబడి; ముకుంద = కృష్ణా; సనందన = సనందనుడు అను; ముని = దేవర్షిచేత; వినుత = స్తుతింపబడువాడ; నందనందన = నందుని కొడుక; పరమానంద = పరమానంద స్వరూప; శరత్ = శరదృతువు నందలి; ఇందు = చంద్రుని వంటి తెల్లని; చందన = మంచిగంధమువంటి సువాసనల; కుంద = మొల్లపూల వంటి చక్కటి; యశస్సు = కీర్తి; సాంద్రా = దట్టముగా కలవాడా; కృష్ణ = కృష్ణ; గోవింద = గోవులకు ఒడయుడ; హరీ = భక్తుల ఆర్తి హరించివాడ.
భావము:- శ్రీకృష్ణుడి సమక్షంలో నిలబడి. “ముకుందా! నందనందనా! సనందాది ముని వందితా! పరమానంద! శ్రీకృష్ణా! గోవిందా! హరీ! శరశ్చంద్రుని వెన్నెల వంటి గొప్ప సత్కీర్తి కలవాడా!
ఒకటి, అంతకన్నా ఎక్కువ హల్లులు పెక్కుమార్లు ఆవృత్తి చేయుట వృత్యనుప్రాస. అనగా ఒకే హల్లు అనేకసార్లు తిరిగితిరిగి వస్తే అది వృత్యనుప్రాస. ఇక్కడ విప్రుడు శ్రీకృష్ణుని స్తుతించు సందర్భంలో కంద పద్యంలో "పూర్ణానుస్వార పూర్వక ద"పది పర్యాయాలు వాడుతూ నింద చేయబోతున్నాడు అని సూచిస్తున్నాడా అన్నట్లు వృత్యనుప్రాస మన పోతన అలంకరించాడు.

తెభా-10.2-1297-వ.
అవధరింపుము దేవా! యర్జునుం డనెడి పౌరుషవిహీనుం డాడిన వృథాజల్పంబులు నమ్మి పుత్త్రుం గోలువడి బేలనైన నన్ను నే మందు? నిఖిల విశ్వోత్పత్తి స్థితి లయంబులకుఁ బ్రధాన హేతుభూతుండవయిన నీవు సమర్థుండవయ్యు, వారింపంజాలక చూచుచుండ, నొక్క మనుష్యమాతృండు దీర్పంజాలెడువాఁడు గలఁడె?” యని వెండియు.
టీక:- అవధరింపుము = వినుము; దేవా = దేవుడా; అర్జునుండు = అర్జునుడు; అనెడి = అను పేరుగల వాడు; పౌరుష = మగతనము; విహీనుండు = లేనివాడు; ఆడిన = పలికినట్టి; వృథా = అనవసరపు; జల్పంబులు = ప్రలాపములు; నమ్మి = విశ్వసించి; పుత్రున్ = కొడుకును; కోలుపడి = పోగొట్టుకొని; బేలను = మూఢుడను; ఐన = అయినట్టి; నన్నున్ = నన్ను; ఏమి = ఏమని; అందున్ = అనగలను; నిఖిల = సమస్తమైన; విశ్వ = లోకములకు; ఉత్పత్తి = సృష్టి; స్థితి = స్థితి; లయంబుల్ = లయముల; కున్ = కు; ప్రధాన = మూల; హేతుభూతుండవు = కారణమైనవాడవు; అయిన = ఐన; నీవు = నీవు; సమర్థుండవు = శక్తి కలవాడవు; అయ్యున్ = ఐ ఉండినను; వారింపంజాలక = నిలుపలేక; చూచుచుండన్ = చూస్తుండగా; ఒక్క = ఒక; మనుష్యమాతృండు = సామాన్య మానవుడు; తీర్పన్ = చక్కబెట్టగ; చాలెడు = శక్తికలవాడు; కలడె = ఉంటాడా, ఉండడు; అని = అని; వెండియున్ = ఇంకను.
భావము:- మహాత్మా! నా విన్నపాన్నిఆలకించు. పౌరుషహీనుడైన పార్థుని డాంబిక వచనాలను నమ్మి అమాయకుడిని అయి కొడుకును పోగొట్టుకున్న నన్ను నేను ఏమని నిందించుకోవాలి. సమస్త జగత్తు సృష్టి స్థితి లయాలకు మూలకారకుడవు అయిన నీవు సమర్థుడివే అయినా వారించలేక ఊరకున్నావు. మానవమాతృడు ఇంతటి మహాకార్యం ఎక్కడ నెరవేర్చగలడు?” అని ఇంకా ఇలా అన్నాడు....

తెభా-10.2-1298-క.
"ఎక్కడి పాండుతనూభవుఁ?
డెక్కడి విలుకాఁడు? వీని కెక్కడి సత్త్వం?
బెక్కడి గాండీవము? దన
కెక్కడి దివ్యాస్త్ర సమితి? యే మనవచ్చున్? "

టీక:- ఎక్కడి = ఎక్కడి; పాండుతనూభవుడు = పాండురాజు కొడుకు; ఎక్కడి = ఎక్కడి; విలుకాడు = శూరుడు; వీని = ఇతని; కిన్ = కి; ఎక్కడి = ఎక్కడిది; సత్త్వంబు = బలము; ఎక్కడి = ఎక్కడిది; గాండీవమున్ = గాండీవమును; తన = అతని; కిన్ = కి; ఎక్కడి = ఎక్కడివి; దివ్య = మహిమాన్వితమైన; అస్త్ర = అస్త్రముల; సమితి = సమూహము; ఏమి = ఏమి; అనవచ్చున్ = అనగలము.
భావము:- “ఈ పాండుతనయుడు ఒక విలుకాడట; ఇతగాడి మాటలు యదార్థ మట; ఇదొక గాండీవ మట; ఇతగాడికి దివ్యాస్త్రాలంటూ ఉన్నాయిట; ఏ మనగలం.”

తెభా-10.2-1299-క.
ని తను నోడక నిందిం
చి విని యయ్యర్జునుండు చిడిముడిపడుచుం
విద్యమహిమ పెంపునఁ
నియెన్ వెస దండపాణి దనంబునకున్.

టీక:- అని = అని; తనున్ = తనను; ఓడక = వెనుదీయక; నిందించిన = దూషించగా; విని = విని; ఆ = ఆ; అర్జునుండు = అర్జునుడు; చిడిముడిపడుచున్ = తొట్రుబాటుచెంది; తన = తను నేర్చిన; విద్య = విద్యల యొక్క; మహిమ = మహిమ; పెంపునన్ = అధిక్యముచేత; చనియెన్ = వెళ్ళెను; వెసన్ = వెంటనే; దండపాణి = యముని; సదనంబున్ = గృహమున; కున్ = కు.
భావము:- ఈలాగున బ్రాహ్మణుడు తనను నిందిస్తుంటే, కోపం వచ్చిన అర్జునుడు తన విద్యాప్రభావంతో వెంటనే బయలుదేరి యమమందిరానికి వెళ్ళాడు.

తెభా-10.2-1300-క.
ని యందు ధారుణీసుర
యులు లేకుంటఁ దెలిసి డయక యింద్రా
గ్ని నిరృతి వరుణ సమీరణ
దేశానాలయములు గఁ బరికించెన్.

టీక:- చని = వెళ్ళి; అందున్ = అక్కడ; ధారుణీసుర = బ్రాహ్మణుని; తనయులు = కొడుకులు; లేకుంటన్ = లేకపోవుట; తెలిసి = తెలిసికొని; తడయక = వెనుదీయక, ఆలస్యము చేయకుండ; ఇంద్ర = ఇంద్రుని; అగ్ని = అగ్నిదేవుని; నిరృతి = నిరృతి యొక్క; వరుణ = వరుణదేవుని; సమీరణ = వాయుదేవుని; ధనద = కుబేరుని; ఈశాన = ఈశానుని యొక్క; ఆలయములు = గృహములు; తగన్ = యుక్తముగా; పరికించెన్ = వెతికెను.
భావము:- అక్కడ బ్రాహ్మణపుత్రులు లేకపోడంతో పార్థుడు వెంటనే ఇంద్ర, అగ్ని, నిరృతి, వరుణ, వాయు, కుబేర, ఈశానుల నివాసాలకు వెళ్ళి అన్వేషించాడు.

తెభా-10.2-1301-వ.
వెండియు.
టీక:- వెండియున్ = అటుపిమ్మట.
భావము:- అనంతరం.

తెభా-10.2-1302-చ.
సుర యక్ష కింపురుష నాగ నిశాచర సిద్ధ సాధ్య ఖే
విహగేంద్ర గుహ్యక పిశాచ నివాసములందు రోసి భూ
సుసుత లేగినట్టి గతి సొప్పడకుండుటఁ జూచి క్రమ్మఱన్
ణికి నేగుదెంచి బెడిదంబుగ నగ్ని సొరంగఁ బూనినన్.

టీక:- నర = నరుల; సుర = సురల; యక్ష = యక్షుల; కింపురుష = కింపురుషుల; నాగ = నాగుల; నిశాచర = నిశాచరుల; సిద్ధ = సిద్ధుల; సాధ్య = సాధ్యుల; ఖేచర = గగనచరుల; విహగేంద్ర = గరుడుల; గుహ్యక = గుహ్యకుల; పిశాచ = పిశాచముల; నివాసములు = నివాసములు; అందున్ = లోపల; రోసి = వెతికి; భూసుర = విప్రుని; సుతలు = కొడుకులు; ఏగినట్టి = పోయినట్టి; గతిన్ = జాడ; చొప్పడకన్ = దొరకక; ఉండుట = ఉండుట; చూచి = చూసి; క్రమ్మఱన్ = తిరిగి; ధరణి = భూలోకమున; కున్ = కి; ఏగుదెంచి = వచ్చి; బెడిదంబుగన్ = భయంకరముగా; అగ్నిన్ = నిప్పులలో; చొరంగన్ = ప్రవేశించుటకు; పూనినన్ = సిద్ధపడగా.
భావము:- దేవ, యక్ష, కింపురుష, నాగ, రాక్షస, సిద్ధ, సాధ్య, ఖేచరాదుల ఇళ్ళకు వెళ్ళి బ్రాహ్మణపుత్రుల కోసం వెదికాడు. కాని వారి జాడ అక్కడ కూడా దొరకలేదు. చివరకు మళ్ళీ భూలోకానికి వచ్చాడు. తన ప్రతిజ్ఞ ప్రకారం అగ్నిప్రవేశం చేయటానికి పట్టుదలగా సిద్ధపడ్డాడు,

తెభా-10.2-1303-వ.
అవ్విధంబంతయు నెఱింగి యమ్మురాంతకుండు “విప్రనందనుల నీకుం జూపెద” నని యనలంబు సొరకుండ నతని నివారించి యప్పుడు.
టీక:- ఆ = ఆ; విధంబున్ = విధము; అంతయున్ = ఎల్ల; ఎఱింగి = తెలిసి; ఆ = ఆ; మురాంతకుండు = కృష్ణుడు; విప్ర = బ్రాహ్మణుని; నందనులన్ = పుత్రులను; నీ = నీ; కున్ = కు; చూపెదను = చూపించెదను; అని = అని; అనలంబున్ = అగ్నిలో; చొరకుండన్ = పడకుండ; అతనిన్ = అతనిని; నివారించి = నిలిపి; అప్పుడు = పిమ్మట.
భావము:- శ్రీకృష్ణుడు ఈ విషయం తెలుసుకుని “బ్రాహ్మణ కుమారులను నేను నీకు చూపిస్తాను.” అని చెప్పి అర్జునుడిని మంటల్లో దూకకుండా వారించాడు. పిమ్మట...