పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/మృతవి ప్రసుతులఁ దెచ్చుట

వికీసోర్స్ నుండి

మృతవిప్రసుతులఁదెచ్చుట

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/మృతవి ప్రసుతులఁ దెచ్చుట)
రచయిత: పోతన


తెభా-10.2-1304-ఉ.
సుంరదివ్యరత్నరుచి శోభితమై తనరారు కాంచన
స్యంన మంబుజాప్తుఁ డుదయాచల మెక్కు విధంబు దోఁపఁ బౌ
రంరి దాను నెక్కి తను శ్ములు దిగ్వితతిన్ వెలుంగ గో
విందుఁ డుదారలీలఁ జనె విప్రతనూజ గవేషణార్థియై.

టీక:- సుందర = అందమైన; దివ్య = శ్రేష్ఠమైన; రత్న = మణుల; రుచి = కాంతులతో; శోభితము = ప్రకాశించుచున్నది; ఐ = అయ్యి; తనరారు = ఉన్నట్టి; కాంచన = బంగారు; స్యందనమున్ = రథమును; అంబుజాప్తుడు = సూర్యుడు {అంబుజాప్తుడు - పద్మబాంధవుడు, సూర్యుడు}; ఉదయాచలము = తూర్పుకొండను; ఎక్కు = ఎక్కెడి; విధంబున్ = విధము; తోపన్ = కనబడునట్లుగా; పౌరందరిన్ = అర్జునుడు {పౌరంధ్రి - పురందరుని (ఇంద్రుని) కొడుకు, అర్జునుడు}; తానున్ = అతను; ఎక్కి = ఎక్కి; తను = దేహ; రశ్ములు = కాంతులు; దిక్ = దిక్కులు; వితతిన్ = అన్నిటను; వెలుంగన్ = ప్రకాశించగా; గోవిందుడు = కృష్ణుడు; ఉదారలీలన్ = గొప్పగా; చనెన్ = బయలుదేరెను; విప్ర = బ్రాహ్మణుని; తనూజ = కొడుకులను; గవేషణ = వెతుకుట; అర్థి = కోసము; ఐ = అయ్యి.
భావము:- సూర్యుడు ఉదయపర్వతాన్నిఎక్కినట్లు, అందమైన దివ్యరత్నకాంతులతో ప్రకాశిస్తున్న బంగారు రథాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడితో కలిసి అధిరోహించాడు. తన దేహకాంతులు దిక్కుల ప్రకాశిస్తుండగా శ్రీకృష్ణుడు విప్రబాలురను వెదకటానికి బయలుదేరాడు.

తెభా-10.2-1305-చ.
ని పుర గోష్ఠ దుర్గ వన జానపదాచల పక్కణప్రభూ
ద నదీ సరోవర యుక్షితి నంతయు దాఁటి సప్త వా
రినిధుల దీవులం గులగిరిప్రకరంబుల నుత్తరించి మే
రుగము నాక్రమించుచు మరుద్గతితో రథ మేగ నత్తఱిన్.

టీక:- చని = వెళ్ళి; పుర = పట్టణములు; గోష్ఠ = ఆవులమందలు; దుర్గ = కోటలు; వన = అడవులు; జానపద = పల్లెలు; అచల = కొండలు; పక్కణ = బోయగూడెములు; ప్రభూత = చాలాగొప్పవైన; నదములు = పడమరకు పారు ఏరులు; నదీ = తూరుపుకు పారు ఏరులు; సరోవర = చెరువులు; యుత = తో కూడియున్న; క్షితి = భూమిని; అంతయున్ = అంతటిని; దాటి = దాటి; సప్త = సప్త; వారినిధుల = సముద్రముల; దీవులనున్ = ద్వీపములను; కులగిరి = కులపర్వతముల; ప్రకరంబులన్ = సమూహములను; ఉత్తరించి = దాటి; మేరునగమున్ = మేరుపర్వతమును; ఆక్రమించుచున్ = అతిక్రమించుచు; మరుత్ = వాయు; గతి = వేగము; తోన్ = తోటి; రథము = రథము; ఏగన్ = వెళ్ళుచుండగా; ఆ = ఆ; తఱిన్ = సమయము నందు.
భావము:- పట్టణాలతో పల్లెలతో దుర్గాలతో అరణ్యాలతో పర్వతాలతో నదీనదాలతో సరోవరాలతో నిండిన భూమండలం, సప్తసముద్రాలు, మహాదీవులు, కులపర్వతాలు, మేరుపర్వతం దాటి శ్రీకృష్ణుడి రథం మహావేగంతో ముందుకు సాగిపోయింది.

తెభా-10.2-1306-చ.
లక భూరిసంతమస మండలముం దఱియంగఁ జొచ్చి సా
మునఁ బోవఁబోవఁగ భయంకరమై మది గోచరింపమిన్
మఱి మోఁకరిల్లి రథవాజులు మార్గము దప్పి నిల్చినన్
బిరుహపత్త్రలోచనుఁ డభేద్యతమఃపటలంబు వాపఁగన్.

టీక:- మసలక = ఆలస్యము చేయకుండ; భూరి = మిక్కుటమైన; సంతమస = దట్టమైన చీకటి; మండలమున్ = ప్రదేశమును; తఱియంగజొచ్చి = సమీపమునకు వెళ్ళి; సాహసమునన్ = ధైర్యముతో; పోవబోవగన్ = చాలాదూరము పోగా; భయంకరము = భయము కలిగించెడిది; ఐ = అయ్యి; మదిన్ = మనసునకు; గోచరింపన్ = కనబడగా, అనిపిస్తుండగా; వసమఱి = స్వస్వాధీనత తప్పి; మోకరిల్లి = మోకాళ్ళపై కూర్చుండి; రథ = రథమునకు కట్టిన; వాజులు = గుఱ్ఱములు; మార్గమున్ = దారి; తప్పి = తప్పి; నిల్చినన్ = ఆగిపోగా; బిసరుహపత్రలోచనుడు = కృష్ణుడు; అభేద్య = భేదింపరాని; తమః = చీకట్ల; పటలంబున్ = తెరలను; పాపగన్ = తొలగించుటకు.
భావము:- శ్రీకృష్ణార్జునులు దట్టమైన చీకటిమండలాన్ని ప్రవేశించారు. వారు సాహసంగా ముందుకు వెళ్తూ ఉంటే, చీకటి మరింత భయంకరంగా తయారైంది. కళ్ళకేదీ కనిపించ లేదు. గుఱ్ఱాలు శక్తి కోల్పోయి దారితప్పి నిలబడిపోయాయి. శ్రీకృష్ణుడు భేదించరాని ఆ చీకట్లను రూపుమాపడం కోసం...

తెభా-10.2-1307-సీ.
బాలభానుప్రభా భాసమానద్యుతిఁ-
రమొప్ప నిజ రథాంగంబుఁ బనుప
మ్మహాస్త్రం బేగి చిమ్మచీఁకటి నెల్ల-
ఱిముఱి నందంద ఱికి వైచి
గ్రభాగంబున తులిత గతి నేగ-
నా మార్గమున నిజస్యందనంబు
డువడిఁదోలి యా డిఁదితమోభూమిఁ-
డవ ముందఱకడఁ గానరాక

తెభా-10.2-1307.1-తే.
మిక్కుటంబుగ దృష్టి మిర్మిట్లు గొనఁగఁ
దల వెలుఁగొందు దివ్యతేజంబుఁ జూచి
మొనసి గాండీవి కన్నులు మూసికొనుచు
నాత్మ భయమంది కొంతద వ్వరిగి యరిగి.

టీక:- బాలభాను = ఉదయకాలసూర్యుని; ప్రభా = ప్రకాశముతో; సమాన = సమానమైన; ద్యుతిన్ = కాంతితో; కరము = మిక్కిలి; ఒప్పన్ = చక్కగా; నిజ = తన; రథాంగంబున్ = చక్రాయుధమును; పనుపన్ = పంపగా, ప్రయోగించగా; ఆ = ఆ; మహా = గొప్ప; అస్త్రంబు = ఆయుధము; ఏగి = వెళ్ళి; చిమ్మ = కటిక; చీకటిన్ = చీకట్లను; ఎల్లన్ = అన్నిటిని; అఱిముఱిన్ = త్వరతో; అందంద = క్రమముగా; నఱికివైచి = ఖండించేసి; అగ్ర = ముందర; భాగంబునన్ = తట్టు; అతులిత = సాటిలేని; గతిన్ = వేగముగా; ఏగన్ = వెళ్తుండగా; ఆ = ఆ; మార్గమున్ = దారమ్మట; నిజ = తన; స్యందనంబున్ = రథము; కడు = మిక్కిలి; వడిన్ = వేగముగా; తోలి = నడిపి; ఆ = ఆ; కడిది = అసాధ్యమైన; తమః = చీకటి; భూమిన్ = నేలను; కడవన్ = దాటగా; ముందఱ = ఎదుట; కడన్ = చివరభాగము; కానరాక = కనిపించనంత.
మిక్కుటంబుగన్ = అత్యధికముగ; దృష్టిన్ = చూపు; మిర్మిట్లుగొనగన్ = చెదురునట్లుగ; చదలన్ = ఆకాశమున; వెలుగొందన్ = కాంతివంతమగు; దివ్య = మహా; తేజంబున్ = తేజస్సును; చూచి = చూసి; మొనసి = మొగ్గి; గాండీవి = అర్జునుడు {గాండీవి - గాండీవము అను విల్లు కలవాడు, అర్జునుడు}; కన్నులున్ = కన్నులను; మూసికొనుచున్ = మూసుకొంటు; ఆత్మ = మనసునందు; భయమున్ = భయ; అంది = పడి; కొంత = కొంత; దవ్వు = దూరము; అరిగియరిగి = పోయి పోయి.
భావము:- బాలసూర్యుడి కాంతికి సాటివచ్చే కాంతితో వెలిగే తన చక్రాయుధాన్ని శ్రీకృష్ణుడు ప్రయోగించాడు. అది విజృంభించి చిమ్మచీకటిని తొలగిస్తూ పైనుండి ముందుకు దూసుకుని పోసాగింది. కృష్ణార్జునులు చక్రాయుధం వెళ్ళే మార్గం వెంట అమితివేగంగా రథాన్ని నడిపించుకుంటూ వెళ్ళి చీకటిని దాటారు. అప్పుడు వారి ముందు కన్నులు మిరుమిట్లు కొలిపే దివ్యతేజస్సు కనిపించింది. అర్జునుడు భయంతో కళ్ళు మూసుకున్నాడు. అతని ఆ స్థితిలో కొంత దూరం వెళ్ళారు.

తెభా-10.2-1308-తే.
డఁగి దుర్వార మారుతోత్కట విధూత
టుల సర్వంకషోర్మి భీణ గభీర
వారిపూరంబు సొచ్చి తన్నీమధ్య
భాగమునఁ గోటిసూర్యప్రలు వెలుంగ.

టీక:- కడగి = సిద్ధపడి; దుర్వార = తట్టుకోలేని; మారుత = గాలులచే; ఉత్కట = అధికముగా; విధూత = ఎగురగొట్టబడిన; చటుల = చలిస్తున్న; సర్వంకష = అంతటను ఒరయుచున్న; ఊర్మి = అలలచేత; భీషణ = భయంకరమైన; గభీర = లోతైన; వారి = నీటి; పూరంబున్ = ప్రవాహము; చొచ్చి = ప్రవేశించి; తత్ = ఆ యొక్క; నీర = నీటి; మధ్య = నడుమ; భాగమునన్ = ప్రదేశము నందు; కోటి = కోట్లసంఖ్యలో, పెక్కు; సూర్య = సూర్యుల; ప్రభలున్ = కాంతులతో; వెలుంగన్ = ప్రకాశింపగా.
భావము:- పిమ్మట, పూని మహావేగంగా వీచే గాలులతో, చెలరేగే కెరటాలతో గంభీరంగా ఉన్న జలరాశిని కృష్ణార్జునులు ప్రవేశించారు. ఆ నీటి నడిమిభాగంలో కోటిసూర్యుల కాంతులు ప్రకాశిస్తున్నాయి.

తెభా-10.2-1309-వ.
అది మఱియును జారు దివ్యమణి సహస్రస్తంభాభిరామంబును, నాలంబిత కమనీయ నూత్న రత్నమాలికాలంకృతంబును, భాను శశి మయూఖాగమ్యంబును, ననంత తేజోవిరాజితంబును, బునరావృత్తిరహిత మార్గంబును, నిత్యైశ్వర్య దాయకంబును, నవ్యయంబును, నత్యున్నతంబును, ననూనవిభవంబును, బరమయోగీంద్ర గమ్యంబును, బరమభాగవత నివాసంబునునై యొప్పు దివ్యధామంబు నందు.
టీక:- అదిమఱియును = అదిగాక; చారు = మనోజ్ఞమైన; దివ్య = గొప్ప; మణి = రత్నాలు పొదిగిన; సహస్ర = వేయి; స్తంభ = స్తంభములచే; అభిరామంబును = చక్కగా నున్నది; ఆలంబిత = వేలాడదీసిన; కమనీయ = మనోజ్ఞమైన; నూత్న = సరికొత్త; రత్న = రత్నాల; మాలికా = దండలచేత; అలంకృతంబును = అలంకరింపబడినది; భాను = సూర్యుని; శశి = చంద్రుని; మయూఖ = కిరణములకు; అగమ్యంబున్ = ప్రవేశింపరానిది; అనంత = అంతులేని; తేజస్ = తేజస్సుచేత; విరాజితంబును = వెలుగునదియు; పునరావృత్తి = పునర్జన్మకు; రహిత = లేనట్టి; మార్గంబును = పథము; నిత్య = శాశ్వతమైన; ఐశ్వర్య = ఐశ్వర్యములను; దాయకంబును = ఇచ్చునది; అవ్యయంబును = తరుగుదలలు లేనిది; అత్యున్నతంబును = ఉత్కృష్ఠతమమైనది; అనూన = సాటిలేని; విభవంబును = వైభవములు కలది; పరమ = ఉత్తమమైన; యోగి = యోగులలో; ఇంద్ర = శ్రేష్ఠులకు; గమ్యంబును = పొందదగినది; పరమ = ఉత్తమమైన; భాగవత = భగవద్భక్తులకు; నివాసంబును = నివాసస్థలము; ఐ = అయ్యి; ఒప్పు = ఒప్పెడి; దివ్య = దివ్యమైన; ధామంబున్ = భవనము; అందున్ = లోపల.
భావము:- అక్కడ ఆ జలరాశిమధ్యలో ఒక దివ్యభవనం కనబడింది. దానిలో తేజోమయమైన వేలకొలది మనోహరమైన మణిస్తంభాలు ఉన్నాయి రమణీయ రత్నహారాలు అలంకృతమై వ్రేలాడుతున్నాయి. అది అనంత తేజస్సుతో విరాజిల్లుతోంది. సూర్యచంద్ర కిరణాలకు ప్రవేశింపరానిది, జన్మరాహిత్యానికి మార్గము, నిత్యైశ్వర్యదాయకము, అవ్యయము, మహోన్నతము, సాటిలేని వైభవోపేతము, పరమ యోగీంద్రులకు ప్రవేశయోగ్యము, భాగవతోత్తములకు నివాసస్థానము అయి విరాజిల్లుతోంది. ఆయొక్క మహాసౌధంలో...

తెభా-10.2-1310-సీ.
సాంద్రశరచ్చంద్ర చంద్రికా కర్పూర-
నీహార హారాభ దేహ మమర
నిందింది రేందీవ రేంద్ర నీలద్యుతిఁ-
ర మొప్పు మేచక కంఠసమితి
రుణాంశుబింబ భాసు పద్మరాగ వి-
స్యస్త సహస్రోరు స్తకములు
వివృతాననోద్గత విషధూమరేఖల-
లీలఁ జూపట్టిన నాలుకలును

తెభా-10.2-1310.1-తే.
లిత సాయంతనజ్వలజ్జ్వలన కుండ
ముల విడంబించు వేఁడి చూపులును గలిగి
భూరి కలధౌత గిరినిభాకా మమరఁ
రఁగు భోగీంద్రభోగతల్పంబు నందు.

టీక:- సాంద్ర = దట్టమైన; శరత్ = శరత్కాలపు; చంద్ర = చంద్రుని; చంద్రికా = వెన్నెలతో; కర్పూర = కర్పూరముతో; నీహార = మంచుబిందువులతో; హార = ముత్యాలదండలతో; ఆభ = సరిపోలినట్టి; దేహము = శరీరము; అమరన్ = ఒప్పగా; ఇందిందిర = తుమ్మెదల వంటి {ఇందిందిరము - పద్మసంపదతో కూడినది, తుమ్మెద (విద్యార్థి కల్పతరువు)}; ఇందీవర = నల్లకలువల వంటి; ఇంద్రనీల = ఇంద్రనీలముల వంటి; ద్యుతిన్ = కాంతులతో; కరము = మిక్కిలి; ఒప్పు = చక్కగా నుండు; మేచక = నల్లని; కంఠ = మెడల; సమితి = సమూహము; అరుణాంశు = ఎఱ్ఱని కిరణముల సూర్యుని; బింబ = మండలమువలె; భాసుర = ప్రకాశించెడి; పద్మరాగ = పద్మరాగమణులు; విన్యస్త = ఉంచబడిన; సహస్ర = వెయ్యి; ఉరు = పెద్ద, గొప్ప; మస్తకములున్ = తలలు, పడగలు; వివృత = తెరచిన; ఆనన = నోరులనుండి; ఉద్గత = వెలువడుచున్న; విష = విషమువలన కలిగిన; ధూమ = పొగల; రేఖలన్ = తెరలతో; లీలన్ = విలాసముగా; చూపట్టిన = కనబడుచున్న; నాలుకలును = నాలుకలు; కలిత = కలిగిన.
సాయంతన = సాయంకాలమునందు; జ్వలత్ = వెలుగుచున్న; జ్వలన = అగ్ని; కుండములన్ = కుండములను; విడంబించు = సరిపోలునట్టి; వేడి = వేడిగా ఉన్న; చూపులును = చూపులు; కలిగి = కలిగిన; భూరి = మిక్కిలిపెద్దదైన; కలధౌత = వెండి; గిరి = కొండను; నిభ = పోలిన; ఆకారమున్ = స్వరూపము; అమరన్ = ఒప్పుచుండగా; పరగు = ప్రసిద్ధమైన; భోగీంద్ర = ఆదిశేషుని; భోగ = దేహము అను; తల్పంబున్ = పాన్పు; అందున్ = అందు.
భావము:- అటువంటి ఆ దివ్యభవనంలో దట్టమైన శరత్కాలపు పండువెన్నెల, కర్పూరం, మంచులకు సాటివచ్చే తెల్లనిదేహము; తుమ్మెదల్లాగా నల్లకలువల్లాగా ఇంద్రనీలమణులలాంటి నల్లని కంఠాలు; ఉదయకాలం సూర్యుడిలాగా ప్రకాశించే పద్మరాగమణులతో కూడిన పడగలు; తెరచుకున్న నోళ్ళ నుంచి వెలువడే విషపు పొగలలా ఉన్న నాలుకలు; యాగగుండాలలోని జ్వాలలాగ ప్రకాశించే వేడిచూపులు; వెండికొండలాగా ఉన్న భారీ ఆకారము కలిగిన ఆదిశేషుడు. ఆ ఆదిశేషుడనే పాన్పు....

తెభా-10.2-1311-వ.
సుఖాసీనుండై యున్నవాని డాయంజని యప్పుడు.
టీక:- సుఖ = సుఖముగా; ఆసీనుండు = కూర్చున్నవాడు; ఐ = అయ్యి; ఉన్న = ఉన్న; వానిన్ = వాడిని; డాయన్ = దగ్గరకు; చని = చేరి; అప్పుడు = పిమ్మట.
భావము:- ఆ ఆదిశేషుని పాన్పుగా కొని సుఖంగా ఆసీనుడై ఉన్న తేజోమూర్తి దగ్గరకు శ్రీకృష్ణార్జునులు వెళ్ళి దర్శించారు.

తెభా-10.2-1312-సీ.
జల నీలాంబుద శ్యామాయమానాంగు,-
నాశ్రితావన ముదితాంతరంగు,
నకాది యోగిహృద్వనజ మదాళీంద్రు,-
ముఖపద్మ రుచిజిత పూర్ణచంద్రుఁ,
మనీయ నిఖిలజద్ధితచారిత్రుఁ,-
బ్రత్యూషసంఫుల్లద్మనేత్రు,
నిందిరాహృదయారవిందారుణోల్లాసు,-
శ్రీకర పీత కౌశేయవాసు,

తెభా-10.2-1312.1-తే.
హా కుండల కటక కేయూ మకుట
కంక ణాంగద మణిముద్రికా వినూత్న
త్ననూపుర కాంచీ విరాజమాను,
వమహార్ణవశోషు, సద్భక్తపోషు.

టీక:- సజల = నీటితో కూడియున్న; నీల = నల్లని; అంబుద = మేఘమువలె; శ్యామాయమాన = నల్లగా నున్న; అంగున్ = దేహము కలవానిని; ఆశ్రిత = ఆశ్రయించినవారిని; అవన = రక్షించుటచేత; ముదిత = సంతోషించు; అంతరంగున్ = మనసు కలవానిని; సనకాది = సనకాదులైన; యోగి = ఋషుల; హృత్ = హృదయములు అను; వనజ = పద్మము లందలి; మద = మత్తెక్కిన; ఆళి = తుమ్మెద; ఇంద్రున్ = శ్రేష్ఠమైన వానిని; ముఖ = ముఖము అనెడి; పద్మ = పద్మము యొక్క; రుచిన్ = కాంతిచేత; జిత = జయింపబడిన; పూర్ణ = నిండు; చంద్రున్ = చంద్రుడు కలవానిని; కమనీయ = మనోజ్ఞమైన; నిఖిల = ఎల్ల; జగత్ = లోకములందు; ఇద్ధ = ప్రకాశించెడి; చారిత్రున్ = నడవడిక కలవానిని; ప్రత్యూష = తెల్లవారగట్ల, వేకువన; సంఫుల్ల = బాగా వికసించిన; పద్మ = పద్మములవంటి; నేత్రున్ = కన్నులు కలవానిని; ఇందిరా = లక్ష్మీదేవి; హృదయ = హృదయము అను; అరవింద = పద్మమునకు; అరుణ = సూర్యునివలె; ఉల్లాసున్ = ఉత్సాహము కలవానిని; శ్రీకర = సంపత్కరమైన; పీత = పచ్చని; కౌశేయ = పట్టు; వాసున్ = వస్త్రములు కలవానిని.
హార = ముత్యాలదండలతో; కుండల = చెవికుండలములతో; కటక = చేతికడియములతో; కేయూర = భుజకీర్తులతో, వంకీలుతో; మకుట = కిరీటముతో; కంకణ = ముంజేతి కంకణములతో; అంగద = బాహుమురులతో; మణి = రత్నాల; ముద్రికా = ఉంగరములతో; వినూత్న = సరికొత్త; రత్న = మణులు పొదిగిన; నూపుర = కాలి అందెలతో; కాంచీ = మొలతాడులతో; విరాజమానున్ = తేజరిల్లుతున్నవానిని; భవ = సంసారము అను; మహా = గొప్ప; ఆర్ణవ = సముద్రమును; శోషున్ = ఇంకింపజేయువానిని; సత్ = మంచి; భక్త = భక్తులను; పోషున్ = కాపాడువానిని.
భావము:- నీలమేఘశ్యాముడు, ఆశ్రితజనరక్షకుడు, పద్మాలలో తుమ్మెదలాగ సనకాది మునీంద్రుల హృదయపద్మాలలో నివసించేవాడు, పూర్ణ చంద్రుని మించిన ముఖకాంతి కలవాడు, విశ్వవిఖ్యాత చారిత్రుడు, ప్రాతఃకాలంలో వికసించిన పద్మపత్రాల వంటి నేత్రాలు కలవాడు, లక్ష్మీమనోహరుడు, శ్రీకరుడు, పీతాంబరధరుడు, హారాలు కేయూరాలు కటక కంకణాలు కిరీటాలతో భూషణుడు, భవసాగర శోషణుడు, భక్తజన సంపోషణుడు అయిన మహావిష్ణువును వారు చూసారు.

తెభా-10.2-1313-వ.
మఱియు సునందాది పరిజన సంతత సేవితు, నానందకందళిత హృదయారవిందు, నరవిందవాసినీ వసుంధరాసుందరీ సమేతు, నారదయోగీంద్రసంకీర్తనానందితు, నవ్యయు, ననఘు, ననంతు, నప్రమేయు, నజితు, నవికారు, నాదిమాధ్యాంతరహితు, భవలయాతీతుఁ, గరుణాసుధాసముద్రు, నచ్యుతు, మహానుభావుఁ, బరమపురుషుఁ, బురుషోత్తము, నిఖిలజగదుత్పత్తి స్థితిలయ కారణుఁ, జిదచిదీశ్వరు, నష్టభుజుఁ, గౌస్తుభశ్రీవత్సవక్షు, శంఖచక్ర గదా పద్మ శార్ఙ్గాది దివ్యసాధను, సర్వ శక్తి సేవితుఁ, బరమేష్ఠి జనకు, నారాయణుం గనుంగొని దండప్రణామంబులు సేసి కరకమలంబులు మొగిచి భక్తి పూర్వకంబుగా నభినందించిన, నయ్యాది దేవుండును వారలం గరుణావలోకనంబులు నిగుడ నవలోకించి, దరహాసపూరంబు దోరంబుగా సాదరంబుగ నిట్లనియె.
టీక:- మఱియునున్ = ఇంకను; సునంద = సునందుడు; ఆది = మున్నగు; పరిజన = సేవకులచేత {సునందాది పరిజనులు - సునంద, నంద, జయ, విజయ, జయంత మున్నగువారు}; సంతత = ఎల్లప్పుడు; సేవితున్ = సేవింపబడువానిని; ఆనంద = ఆనందముతో; కందళిత = వికసించిన; హృదయ = హృదయము అను; అరవిందున్ = పద్మము కలవానిని; అరవిందవాసినీ = శ్రీదేవి తో {అరవిందవాసిని - పద్మములందు వసించునామె, లక్ష్మీదేవి}; వసుంధరాసుందరీ = భూదేవి తో; సమేతున్ = కూడినవానిని; నారద = నారదుడు అను; యోగి = ముని; ఇంద్ర = ఉత్తముని యొక్క; సంకీర్తన = స్తోత్రములచే; ఆనందితున్ = సంతోషించు వానిని; అవ్యయున్ = నశించుట లేనివానిని; అనఘున్ = పుణ్యాత్ముని; అనంతున్ = మేరలు లేనివానిని; అప్రమేయు = ఇంతవాడని చెప్ప రాని వానిని; అజితున్ = జయింప వీలుకాని వానిని; అవికారున్ = వికారములు లేని వానిని; ఆది = మొదలు; మధ్య = నడుమ; అంత = తుది; రహితున్ = లేనివానిని; భవ = పుట్టుక; లయ = నశించుట, మరణము; అతీతున్ = అతిక్రమించినవానిని; కరుణాసముద్రున్ = దయాసముద్రుని; అచ్యుతున్ = చ్యుతము లేనివానిని {అచ్యుతుడు - శ్రు. శాశ్వతం శివమచ్యుతం.}; మహానుభావున్ = గొప్పవానిని; పరమ = సర్వాతీతమైన; పురుషున్ = కారణభూతుని; పురుషోత్తమున్ = పురుషులలోఉత్తముని; నిఖిల = ఎల్ల; జగత్ = లోకములకు; ఉత్పత్తి = కలుగుటకు; స్థితి = ఉండుటకు; లయ = నశించుటకు; కారణున్ = కారణభూతుని; చిత్ = చిత్తు; అచిత్ = అచిత్తులకు; ఈశ్వరున్ = నియమించువానిని; అష్ట = ఎనిమిది (8); భుజున్ = చేతులు కలవానిని; కౌస్తుభ = కౌస్తుభ మణి; శ్రీవత్స = శ్రీవత్సము అను మచ్చ; వక్షున్ = వక్షస్థలమున కలవానిని; శంఖ = శంఖ; చక్ర = చక్ర; గదా = గదా; పద్మ = పద్మ; శార్ఙ్గా = శార్ఙ్గము; ఆది = మున్నగు; దివ్య = దివ్యమైన; సాధనునన్ = ఆయుధములు కలవానిని; సర్వ = సమస్తమైన; శక్తి = శక్తులచేత; సేవితున్ = సేవింపబడువానిని; పరమేష్ఠి = బ్రహ్మదేవుని; జనకున్ = పుట్టించినవానిని; నారాయణున్ = విష్ణుమూర్తిని {నారాయణుడు - మహాజలము స్థానముగా నుండునట్టి వటపత్రశాయి, నారం విజ్ఞానం తదయసమాశ్రయో యస్యసః నారాయణః (వ్యుత్పత్తి), నారము అనగా విజ్ఞానము దానికి సమాశ్రయుడు నారయణుడు, విష్ణువు}; కనుంగొని = చూసి; దండప్రణామంబులు = సాగిలపడి మొక్కుటలు; చేసి = చేసి; కర = చేతులు అను; కమలంబులున్ = కమలములను; మొగిచి = జోడించి; భక్తి = భక్తి; పూర్వకంబుగా = నిండుగా కనబడునదిగా; అభినందించినన్ = స్తోత్రము చేయగా; ఆ = ఆ; ఆదిదేవుడును = ఆదినారాయణుని {ఆదిదేవుడు - సృష్టికి పూర్వమునుండి స్వయంప్రకాశముతో ఉండువాడు, విష్ణువు}; వారలన్ = వారిని; కరుణా = దయతోకూడిన; అవలోకనంబులున్ = చూపులు; నిగుడన్ = వ్యాపించగా; అవలోకించి = చూసి; దరహాస = చిరునవ్వుల; పూరంబు = ప్రవాహములు; తోరంబుగా = అధికము కాగా; సాదరంబునన్ = ఆదరణతో; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అంతేకాదు, సదా సునందాది పరిజనులచే సేవించబడువాడు, నిత్యానంద కందళిత హృదయుడు, శ్రీదేవి భూదేవి సమేతుడు, నారదయోగీంద్ర గానలోలుడు, కరుణాసముద్రుడు, అవ్యయుడు, అనఘుడు, అనంతుడు, అప్రమేయుడు, అజితుడు, అవికారుడు, పరమ పురుషుడు, పురుషోత్తముడు, సకల లోకాల సృష్టి స్థితి లయ కారకుడు, చిత్తు అచిత్తులకు ఈశ్వరుడు, అష్టభుజుడు, వక్షమున కౌస్తుభమణి అలంకృతుడు, శంఖచక్రగదాశార్ఙ్గాది దివ్యాయుధ సంపన్నుడు, సర్వశక్తి సేవితుడు, బ్రహ్మదేవుని జనకుడు అయిన ఆ శ్రీమన్నారాయణునికి శ్రీకృష్ణార్జునులు భక్తితో సాష్టాంగ నమస్కారం చేసి, చేతులు జోడించి స్తుతించారు. ఆ ఆదినారాయణుడు వారిని దయాదృష్టితో చూసి, మందహాసం చేసి, సాదరంగా ఇలా అన్నాడు.

తెభా-10.2-1314-క.
"ధణికి వ్రేఁ గగు దైత్యులఁ
బొరిబొరి వధియించి ధర్మమున్ నిలుపుటకై
జనియించితి రిరువురు
నారాయణు లనంగ నా యంశమునన్.

టీక:- ధరణి = భూదేవికి; కిన్ = కి; వ్రేగు = భారమైపోయినవారు; అగు = ఐన; దైత్యులన్ = రాక్షసులను; పొరిపొరి = వరుసపెట్టి, క్రమముగా; వధియించి = చంపి; ధర్మమున్ = ధర్మమును; నిలుపుట = నిలబెట్టుట; కై = కోసము; ధరన్ = భూమిపై; జనియించితిరి = పుట్టితిరి; ఇరువురున్ = ఇద్ధరు (2); నర = నరుడు, అర్డునుడు; నారాయణులు = కృష్ణుడు; అనంగన్ = అనగా; నా = నా యొక్క; అంశమునన్ = అంశతో.
భావము:- “భూమికి భారమైపోయిన రాక్షసులను వధించి, ధర్మాన్ని రక్షించడం కోసం నా అంశతో మీరిద్దరు నరనారాయణులుగా జన్మించారు.

తెభా-10.2-1315-క.
రూఢ నియతితోఁ బెం
పారిన మిము నిమ్మునీంద్రు ర్థిం జూడం
గోరిన మీ వచ్చుటకై
ధారుణిసురసుతుల నిటకుఁ గఁ దేవలసెన్. "

టీక:- ఆరూఢ = మిక్కిలి అధికమైన; నియతి = నియమముల; తోన్ = తోటి; పెంపారిన = గొప్పవారైన; మిమ్మున్ = మిమ్ములను; ఈ = ఈ యొక్క; ముని = యోగి; ఇంద్రులున్ = ఉత్తములు; అర్థిన్ = కోరి; చూడన్ = చూడవలెనని; కోరినన్ = కోరుటచేత; మీ = మీరు; వచ్చుట = వచ్చుట; కై = కొరకు; ధారుణిసుర = విప్ర; సుతులన్ = కొడుకులను; ఇట = ఇక్కడ; కున్ = కు; తగన్ = తగునట్లు; తేవలసె = తీసుకురావలసి వచ్చినది.
భావము:- మహానిష్ఠతో ఉన్నతులైన మిమ్మల్ని ఈ మునీశ్వరులు చూడాలని కోరారు. అందుకని, మీరిక్కడకు రావాలనే ఉద్దేశంతో ఆ బ్రాహ్మణుని కుమారులను ఇక్కడకు తెప్పించవలసివచ్చింది.”

తెభా-10.2-1316-క.
ని "యా డింభకులను దో
కొని పొం"డని యిచ్చి వీడుకొలిపిన వారల్‌
వితు లయి పెక్కు విధముల
వినుతించుచు నచటు వాసి విప్రునిసుతులన్.

టీక:- అని = అని చెప్పి; ఆ = ఆ యొక్క; డింభకులన్ = పిల్లలను; తోకొని = వెంటబెట్టుకొని; పొండి = పొండి; అని = అని చెప్పి; ఇచ్చి = ఇచ్చి; వీడుకొలిపినన్ = సెలవు ఇవ్వగా; వారల్ = వారు; వినతులు = స్తుతించినవారు; అయి = ఐ; పెక్కు = అనేకమైన; విధములన్ = విధములుగా; వినుతించుచున్ = స్తోత్రములు చేయుచు; అచటున్ = ఆ చోటును; వాసి = వదలిపెట్టి; విప్రుని = బ్రాహ్మణుని; సుతులన్ = పుత్రులను.
భావము:- అని పిమ్మట “ఈ బాలకులను మీరు తీసుకుని వెళ్ళండి” అని పలికి ఆ బాలకులను అప్పజెప్పి విష్ణువు వారికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చాడు. శ్రీకృష్ణార్జునులు వినయంతో భగవంతుడిని అనేక విధాల స్తుతిస్తూ బ్రాహ్మణపుత్రులతో అక్కడ నుండి బయలుదేరారు.

తెభా-10.2-1317-వ.
తోడ్కొని సంప్రాప్త మనోరథు లయి య బ్బాలకులఁ ద త్తద్వయో రూపంబులతోడఁ దెచ్చి యాబ్రాహ్మణునకు సమర్పించిన నతండు సంతుష్టాంతరంగుం డయ్యె; న య్యవసరంబున.
టీక:- తొడ్కొని = కూడా తీసుకు వెళ్ళి; సంప్రాప్త = పొందబడిన; మనోరథులు = కోరికలు కలవారు; అయి = ఐ; ఆ = ఆ; బాలకులన్ = బాలురను; తత్తత్ = ఆయా; వయస్ = వయస్సులు, ఈడులు; రూపంబుల్ = రూపముల; తోడన్ = తోటి; తెచ్చి = తీసుకు వచ్చి; ఆ = ఆ; బ్రాహ్మణున్ = విప్రున; కున్ = కు; సమర్పించినన్ = ఇవ్వగా; అతండు = అతను; సంతుష్ట = సంతోషించిన; అంతరంగుండు = మనస్సు కలవాడు; అయ్యెన్ = అయ్యెను; ఆ = ఆ; అవసరంబునన్ = సమయమున నందు.
భావము:- కోరిన పని సాధించి సఫల మనోరథులు అయిన కృష్ణార్జునులు వారి వారి వయసులకు తగిన ఆకారాలతో ఉన్న ఆ విప్రసుతులను వెంటబెట్టుకుని వచ్చి బ్రాహ్మణుడికి అప్పజెప్పారు. ఆ బిడ్డలను చూసిన ఆ విప్రుడు ఎంతో ఆనందం పొందాడు. అంతట....

తెభా-10.2-1318-చ.
నిమిషనాథనందనుఁ, డర్పతితేజుఁడు గృష్ణుతోడఁ దాఁ
ని యచటం గనుంగొనిన ర్వశరణ్యునిఁ, బుండరీకనే
త్రుని, నిజధామ వైభవసదున్నత తన్మహనీయ కీర్తికిన్
మున మోదమంది పలుమాఱును సన్నుతిఁ జేసె భూవరా!

టీక:- అనిమిషనాథ నందనుడు = అర్జునుడు {అనిమిషనాథ నందనుడు - అనిమిషనాథుడు (దేవతలప్రభువు, ఇంద్రుని) నందనుడు, అర్జునుడు}; అహర్పతి = సూర్యుని వంటి; తేజుడు = తేజస్సు కలవాడు; కృష్ణు = కృష్ణుని; తోడన్ = తోటి; తాన్ = అతను; చని = వెళ్ళి; అచటన్ = అక్కడ; కనుంగొనిన = చూసిన; సర్వశరణ్యున్ = శ్రీమన్నారాయణుని {సర్వ శరణ్యుడు - ఎల్లవారికి రక్షకుడు, విష్ణువు}; పుండరీకనేత్రుని = శ్రీమన్నారాయణుని {పుండరీక నేత్రుడు - పద్మముల వంటి నేత్రములు కలవాడు, విష్ణువు}; నిజ = స్వంత; ధామ = నగరము యొక్క; వైభవ = వైభవము; సమృద్ధి = అధికముగా నుండుట; కిన్ = కు; తత్ = అతని; మహనీయ = మిక్కిలి మహిమ కలిగిన; మూర్తి = స్వరూపమున; కిన్ = కు; మనమునన్ = మనసు నందు; మోదమున్ = సంతోషమును; అంది = పొంది; పలు = పెక్కు; మాఱును = సార్లు; సన్నుతిన్ = స్తోత్రము; చేసెన్ = చేసెను; భూవరా = రాజా.
భావము:- ఓ మహారాజా పరీక్షిత్తు! ఇంద్రతనయుడు సూర్యసమతేజస్వి అయిన అర్జునుడు కృష్ణుడితో వెళ్ళి తను దర్శించిన ఆ లోకశరణ్యుడు విష్ణుమూర్తి సౌధవైభవం; ఆయన మహనీయ సమున్నత యశస్సునకు మనస్సులో ఆనందించి పెక్కుమార్లు స్తుతించాడు.

తెభా-10.2-1319-తే.
వారిజాక్షుని భక్తమందారు ననఘుఁ
గృష్ణు నఖిలేశుఁ గేశవు జిష్ణుఁ బరము
వినుతి సేయుచుఁ దత్పాదజములకు
వందనము లాచరించి యానంద మొందె.

టీక:- వారిజాక్షుని = పద్మాక్షుని, కృష్ణుని; భక్తమందారున్ = భక్తుల ఎడలి కల్పవృక్షమును; అనఘున్ = పుణ్యుని; కృష్ణున్ = కృష్ణుని; అఖిలేశున్ = సర్వనియామకుని; కేశవున్ = కేశి అను అసురుడిని చంపినవాని; జిష్ణున్ = జయశీలుని; పరమున్ = పరబ్రహ్మమును; వినుతి = స్తుతించుట; చేయుచున్ = చేస్తూ; తత్ = అతని; పాద = పాదములు అను; వనజములు = పద్మముల; కున్ = కు; వందనములున్ = నమస్కారములు; ఆచరించి = చేసి; ఆనందమున్ = సంతోషమును; ఒందెన్ = పొందెను.
భావము:- పద్మాక్షుడిని, భక్తమందారుని, పుణ్యాత్ముని, అఖిలేశుని, కేశవుని, జయశీలుని, పరమాత్ముని, శ్రీకృష్ణుడిని స్తుతించి; ఆయన పాదపద్మాలకు ప్రణామాలు చేసి అర్జునుడు మిక్కిలి ఆనందించాడు.

తెభా-10.2-1320-వ.
అంత.
టీక:- అంత = అంతట.
భావము:- అంతట....

తెభా-10.2-1321-మ.
రి, సర్వేశుఁ, డనంతుఁ, డాద్యుఁ, డభవుం, డామ్నాయసంవేది భూ
సు ముఖ్యప్రజలన్ సమస్త ధనవస్తుశ్రేణి నొప్పారఁగాఁ
రిరక్షించుచు ధర్మమున్ నిలుపుచుం బాపాత్ములం ద్రుంచుచుం
మోత్సాహ మెలర్ప భూరిశుభ విభ్రాజిష్ణుఁడై ద్వారకన్.

టీక:- హరి = కృష్ణుడు; సర్వేశుడు = ఎల్లర నియమించువాడు; అనంతుడు = తుది లేనివాడు; ఆద్యుడు = జగత్తుకు మూలకారణుడు; అభవుడు = పుట్టుక లేనివాడు; ఆమ్నాయసంవేది = వేదముల నెరిగినవాడు; భూసుర = విప్రులు; ముఖ్య = మొదలగు; ప్రజలన్ = జనుల నందరను; సమస్త = అన్ని రకాల; ధన = సంపదల; వస్తు = వస్తువుల; శ్రేణి = సమూహముచేత; ఒప్పారగా = ఒప్పునట్లు; పరిరక్షించుచు = కాపాడుతు; ధర్మమున్ = ధర్మమును; నిలుపుచున్ = స్థాపించుచు; పాపాత్ములన్ = పాపులను; త్రుంచుచున్ = చంపుతు; పరమ = మిక్కిలి; ఉత్సాహము = ఉత్సాహము; ఎలర్పన్ = అతిశయించగా; భూరి = అతిమిక్కిలి; శుభ = శుభములచేత; విభ్రాజిష్ణుడు = వెలుగువాడు; ఐ = అయ్యి; ద్వారకన్ = ద్వారకాపట్టణము నందు.
భావము:- అనంతుడు, వేదవేద్యుడు, సర్వేశ్వరుడు, ఆద్యుడు, అభవుడు అయిన శ్రీకృష్ణుడు బ్రాహ్మణులాదిగా గల సమస్త ప్రజలను సకల ధన వస్తు సంపన్నులను చేసాడు. వారిని సంరక్షిస్తూ ధర్మాన్ని సంస్థాపిస్తు పాపాత్ములను సంహరిస్తు, ద్వారకలో గొప్ప శుభసంతోషాలతో ప్రకాశించాడు.

తెభా-10.2-1322-క.
వినుతముగాఁ బెక్కు స
ములు దనుఁ దాన కూర్చి వైదిక యుక్తిం
బొరించుచు ననురాగము
మునఁ దళుకొత్త దైత్యర్దనుఁ డెలమిన్.

టీక:- జన = ప్రజలచేత; వినుతముగాన్ = కొనియాడబడునట్లుగా; పెక్కు = అనేకమైన; సవనములు = యాగములను; తనున్ = తనను, పరబ్రహ్మను {సవనములు + తనున్ – సవనములుదనున్, గసడదవాదేశ సంధి}; తాన = తనే; కూర్చి = ఉద్ధేశించి; వైదిక = వేదము లందు చెప్పబడిన; యుక్తిన్ = క్రమముగా; ఒనరించుచున్ = చేయుచు; అనురాగము = అనురక్తి; మనమునన్ = మనసున; తళుకొత్త = కలుగగా; దైత్యమర్దనుడు = కృష్ణుడు; ఎలమిన్ = సంతోషముతో (ఉండెను).
భావము:- సంతోషచిత్తుడై ప్రజలు మెచ్చేలాగ అనేక యజ్ఞ యాగాలను శ్రీకృష్ణుడు శాస్త్రోక్తంగా తనను ఉద్దేశించి తనే పరమోత్సాహంతో జరిపించాడు,