పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/కృష్ణుని భార్యాసహస్ర విహారంబు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

కృష్ణుని భార్యాసహస్రవిహారంబు

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/కృష్ణుని భార్యాసహస్ర విహారంబు)
రచయిత: పోతన


(తెభా-10.2-1323-వ.)[మార్చు]

అట్లు కృష్ణుండు ద్వారకానగరంబునఁ బూజ్యం బగు రాజ్యంబు సేయుచుఁ బురందరవిభవంబున నిరవొంది కనక మణిమయ విమాన మండప గోపుర ప్రాసాద సౌధ చంద్రశాలాంగణాది వివిధ భవనంబు లందును రంగదుత్తుంగతరంగ డోలావిలోల కలహంస చక్రవాక కారండవ సారస క్రౌంచముఖ జలవిహంగ విలసదుచ్చలిత గరు దనిల దరదమల కమల కుముద కహ్లార సందోహ నిష్యంద మకరందరసపాన మదవదిందిందిరకుల కల గాయక ఝంకార నినదంబులును, నిరంతర వసంతసమయ సముచిత పల్లవిత కోరకిత బాలరసాలజాల లాలిత కిసలయ విసర ఖాదన జాత కుతూహలాయమాన కషాయకంఠ కలకంఠ కలరవ మృదంగ ఘోషంబులును, నిశిత నిజచంచూపుట నిర్దళిత సకలజన నయనానంద సుందరనందిత మాకంద పరిపక్వ ఫలరంధ్ర విగళిత మధుర రసాస్వాదనముదిత రాజకీర శారికా నికర మృదు మధురవచన రచనావశకృత్యంబులును నమరఁ, బురపురంధ్రీజన పీన పయోధర మండల విలిప్త లలిత కుంకుమ పంక సంకుల సౌగంధ్యానుబంధ బంధురగంధానుమోదితుండును, జందనాచల సానుదేశసంజాత మంజుల మాధవీలతానికుంజ మంజుల కింజల్క రంజిత నివాస విసర విహరమాణ శబరికా కబరికా పరిపూర్ణ సురభి కుసుమమాలికా పరిమళ వహుండును, గళిందకన్యకా కల్లోల సందోహ పరిస్పంద కందళిత మందగమనుండును నగు మందానిల విదూషకునిచేఁ బోషితాభ్యాసిత లాలిత లగు నేలా లతా వితాన నటుల నటనంబుల విరాజితంబులగు కాసారతీర భాసురోద్యానంబులందును, జారు ఘనసార పటీర బాలరసాల సాల నీప తాపింఛ జంబూ జంబీర నింబ కదంబప్రముఖ ముఖ్య శాఖి శాఖాకీర్ణ శీతలచ్ఛాయా విరచిత విమల చంద్రకాంతోపల వేదికాస్థలంబులందును, నుదంచిత పింఛవిభాసిత బాలనీలకంఠ కేకార వాకులీకృత కృతక మహీధరంబు లందును, లలితమణి వాలుకానేక పులినతలంబు లందును, గప్పురంపుం దిప్పలను, గురువేరు చప్పరంబులను, విరచిత దారు యంత్ర నిబద్ధ కలశ నిర్యత్పయో ధారాశీకర పరంపరా సంపాదిత నిరంతర హేమంత సమయ ప్రదేశంబులందును, నిందిరారమణుండు షోడశ సహస్ర వధూయుక్తుండై యందఱ కన్ని రూపులై లలితసౌదామినీలతా సమేత నీలనీరదంబుల విడంబించుచుఁ గరేణుకాకలిత దిగ్గజంబు నోజ రాజిల్లుచు, సలిలకేళీవిహారంబులు మొదలుగా ననేక లీలా వినోదంబులు సలుపుచు, నంతఃపురంబునఁ గొలువున్న యవసరంబున వివిధ వేణువీణాది వాద్యవినోదంబులను, మంజుల గానంబులను, గవి గాయక సూత వంది మాగధజన సంకీర్తనంబులను, నటనటీజన నాట్యంబులను, విదూషక పరిహాసోక్తులను సరససల్లాప మృదుమధుర భాషణంబులను బ్రొద్దుపుచ్చుచు నానందరసాబ్ది నోలలాడు చుండె; నంత.

(తెభా-10.2-1324-మ.)[మార్చు]

విందాక్ష పదాంబుజాత యుగళధ్యానానురాగక్రియా
సాలాప విలోకనానుగత చంత్సౌఖ్య కేళీరతిం
రుణుల్ నూఱుపదాఱువేలు మహితోత్సాహంబునం జొక్కి త
త్ప లై యొండు దలంప కుండిరి సవిభ్రాంతాత్మ లై భూవరా!

(తెభా-10.2-1325-వ.)[మార్చు]

అదియునుం గాక.

(తెభా-10.2-1326-మ.)[మార్చు]

రినామాంకితమైన గీత మొకమా టాలించి మూఢాత్ములున్
వి తిం బొందఁగఁజాలి యుందురట; యా విశ్వాత్ము నీక్షించుచుం
రిరంభించుచు, నంటుచున్నగుచుసంభాషించుచున్నుండు సుం
రు లానంద నిమగ్ను లౌట కిలఁ జోద్యం బేమి? భూవల్లభా!

(తెభా-10.2-1327-వ.)[మార్చు]

అని చెప్పి మఱియు నిట్లనియె.

(తెభా-10.2-1328-ఉ.)[మార్చు]

వా క కృష్ణుఁ డిప్పగిది వైదికవృత్తి గృహస్థధర్మ మే
పా రఁగ బూని ధర్మమును ర్థముఁ గామము నందుఁ జూపుచుం
గో రిక మీఱ సజ్జనులకుం గతి దాన యనంగ నొప్పి సం
సా రిగతిన్ మెలంగె నృపత్తమ! లోకవిడంబనార్థమై.

(తెభా-10.2-1329-సీ.)[మార్చు]

రి యిట్లు గృహమేధి గుచు శతోత్తర;
షోడశసాహస్ర సుందరులను
మును నీకు నెఱుఁగ జెప్పినరీతి నందఱ;
న్నిరూపములు దా ర్థిఁ దాల్చి
కైకొని యొక్కక్క కామినీమణి యందు;
మణ నమోఘ వీర్యమునఁ జేసి
దురేసి కొడుకులం డసె రుక్మిణ్యాది;
ట్టమహిషులకుద్భవులు నైన

(తెభా-10.2-1329.1-తే.)[మార్చు]

నందనులలోన ధరణి నెన్నంగ బాహు
ల పరాక్రమ విజయ సంద్విశేష
మాని తాత్ములు పదునెనమండ్రు; వారి
నెఱుఁగ వినిపింతు, వినుము రాజేంద్రచంద్ర!

(తెభా-10.2-1330-వ. )[మార్చు]

అని మఱియు నిట్లను; వారలు ప్రద్యు మ్నానిరుద్ధ దీప్తిమ ద్భాను సాంబ మిత్ర బృహద్భాను మిత్రవింద వృ కారుణ పుష్కర దేవబాహు శ్రుతదేవ సునందన చిత్రబాహు వరూధ కవి న్యగ్రోధ నామంబులం బ్రసిద్ధు లైరి; వెండియుఁ ద్రివక్ర యందు సంభవించిన యుపశ్లోకుం డనువాఁడు దన జనకుండైన కృష్ణు పాదారవింద సేవారతుండగుచు నారదయోగీంద్రునకు శిష్యుండై యఖండిత దివ్యజ్ఞాన బోధాత్మకుం డగుచు, స్త్రీ శూద్ర దాసజన సంస్కారకంబై స్మరణమాత్రంబున ముక్తిసంభవించునట్టి సాత్త్వత తంత్రం బను వైష్ణవస్మృతిం గల్పించె; నిట్లు మధుసూదననందనులు బహుప్రజలును, నధికాయురున్నతులును, ననల్పవీర్యవంతులును, బ్రహ్మణ్యులునై విఖ్యాతింబొందిరి; వారిని లెక్క వెట్టఁ బదివేల వత్సరంబులకైనం దీఱదు, మున్ను నీకెఱింగించి నట్లు తత్కుమారులకు విద్యావిశేషంబుల నియమించు గురు జనంబులు మూఁడుకోట్లునెనుబదెనిమిదివేలనూర్గు రనం గల్గి యుందు; రక్కుమారుల లెక్కింప నెవ్వరికి శక్యం? బదియునుం గాక యొక్క విశేషంబు సెప్పెద విను" మని యిట్లనియె.

(తెభా-10.2-1331-క.)[మార్చు]

వర! దేవాసుర సం
' మును మును నిహతులైన క్రవ్యాద సము
త్క ము నరేశ్వరులై ద్వా
' మున జనియించి ప్రజల బాధలఁ బఱుపన్.

(తెభా-10.2-1332-క.)[మార్చు]

రి తద్వధార్థమై ని
'ర్జ రులను యదుకులము నందు నియింపింపం
నూటొక్క కులం బై
' రఁగిరి; వారిని గణింప బ్రహ్మకు వశమే?

21-05-2016: :
గణనాధ్యాయి 11:35, 12 డిసెంబరు 2016 (UTC)