పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/సత్రాజితుని నిందారోపణ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

సత్రాజితుని నిందారోపణ

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/సత్రాజితుని నిందారోపణ)
రచయిత: పోతన


(తెభా-10.2-57-వ.)[మార్చు]

అంత సత్రాజితుండు తన సహోదరుండైన ప్రసేనునిం గానక దుఃఖించుచు.

(తెభా-10.2-58-మ.)[మార్చు]

ణి కంఠంబునఁ దాల్చి నేఁ డడవిలో మావాఁడు వర్తింపఁగా
ణికై పట్టి వధించినాఁడు హరికిన్ ర్యాద లే దంచు దూ
ముం జేయఁగ వాని దూషణముఁ గంధ్వంసి యాలించి యే
వ్ర మున్ నా యెడ లేదు, నింద గలిగెన్ వారించు టే రీతియో?

(తెభా-10.2-59-వ.)[మార్చు]

అని వితర్కించి.

(తెభా-10.2-60-మ.)[మార్చు]

వారెల్లఁ బ్రసేనుజాడఁ దెలుపం ర్కించుచున్ వచ్చి త
ద్వ వీథిం గనె నేలఁ గూలిన మహాశ్వంబుం బ్రసేనుం బ్రసే
ను ని హింసించినసింహమున్ మృగపతిన్ నొప్పించిఖండించి యేఁ
గి భల్లూకము సొచ్చియున్న గుహయుం గృష్ణుండు రోచిష్ణుఁడై.

(తెభా-10.2-61-వ.)[మార్చు]

కని తన వెంట వచ్చిన ప్రజల నెల్ల గుహాముఖంబున విడిచి, సాహసంబున మహానుభావుం డైన హరి నిరంతర నిబిడాంధకార బంధురంబయి, భయంకరంబై, విశాలంబయిన గుహాంతరాళంబు సొచ్చి; చని యక్కడ నొక్క బాలున కెదురు దర్శనీయ కేళీకందుకంబుగా వ్రేలంగట్టఁబడిన యమ్మణి శ్రేష్ఠంబుఁ గని హరింప నిశ్చయించి.

(తెభా-10.2-62-క.)[మార్చు]

మె ల్లన పదము లిడుచు యదు
ల్లభుఁ డా శిశువుకడకు చ్చిన గుండెల్‌
ల్లనఁగఁ జూచి కంపము
మొ ల్లంబుగ దానిదాది మొఱపెట్టె నృపా!

21-05-2016: :
గణనాధ్యాయి 10:19, 12 డిసెంబరు 2016 (UTC)