పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/జాంబవతి పరిణయంబు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

జాంబవతి పరిణయంబు

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/జాంబవతి పరిణయంబు)
రచయిత: పోతన


(తెభా-10.2-63-వ.)[మార్చు]

అంత నా ధ్వని విని బలవంతుండైన జాంబవంతుఁడు వచ్చి తన స్వామి యని కృష్ణు నెఱుంగక ప్రాకృత పురుషుండని తలంచి కృష్ణునితో రణంబు చేసె; నందు.

(తెభా-10.2-64-క.)[మార్చు]

లమునకుఁ బోరెడు డే
క్రియ శస్త్రములఁ దరులఁ రముల విజయే
చ్ఛ నిరువదియెనిమిది దిన
ము లు వోరిరి నగచరేంద్రముఖ్యుఁడు హరియున్.

(తెభా-10.2-65-క.)[మార్చు]

డిదములుఁ దరులు విఱిగిన
బె డిదము లగు మగతనములు బిఱుతివక వడిం
బి డుగులవడువునఁ బడియెడి
పి డికిటిపోటులను గలన బెరసి రిరువురున్.

(తెభా-10.2-66-శా.)[మార్చు]

స్ప ష్టాహంకృతు లుల్లసిల్ల హరియున్ ల్లూకలోకేశుఁడున్
ము ష్టాముష్టి నహర్నిశంబు జయసమ్మోహంబునం బోరుచోఁ
బు ష్టిం బాసి ముకుంద ముష్టిహతులం బూర్ణశ్రమోపేతుఁడై
పి ష్టాంగోరు శరీరుఁడై యతఁడు దా భీతాత్ముఁడై యిట్లనున్.

(తెభా-10.2-67-వ.)[మార్చు]

“దేవా! నిన్నుఁ బురాణపురుషు నధీశ్వరు విష్ణుం బ్రభవిష్ణు నెఱుంగుదు; సర్వభూతంబులకుం బ్రాణ ప్రతాప ధైర్యబలంబులు నీవ; విశ్వంబునకు సర్గస్థితిలయంబు లెవ్వరాచరింతురు, వారికి సర్గ స్థితిలయంబులఁ జేయు నీశ్వరుండవు నీవ; యాత్మవు నీవ” యని మఱియును.

(తెభా-10.2-68-సీ.)[మార్చు]

బాణాగ్ని నెవ్వఁడు ఱపి పయోరాశి;
నింకించి బంధించి యేపు మాపెఁ
రఁగ నెవ్వఁడు ప్రతాప్రభారాశిచే;
దానవగర్వాంధమస మడఁచెఁ
గంజాతములు ద్రెంచు రిభంగి నెవ్వఁడు;
శకంఠుకంఠబృంములు ద్రుంచె
నా చంద్రసూర్యమై మరు లంకారాజ్య;
మునకు నెవ్వఁడు విభీషణుని నిలిపె

(తెభా-10.2-68.1-తే.)[మార్చు]

న్ను నేలిన లోకాధినాథుఁ డెవ్వఁ
డంచితోదారకరుణారసాబ్ధి యెవ్వఁ
డాతఁడవు నీవ కావె; మహాత్మ! నేఁడు
మాఱుపడి యెగ్గు సేసితి ఱవవలయు.

(తెభా-10.2-69-వ.)[మార్చు]

అని యిట్లు పరమభక్తుండయిన జాంబవంతుండు వినుతించిన నతని శరీర నిగ్రహ నివారణంబుగా భక్తవత్సలుండైన హరి దన కరంబున నతని మేను నిమిరి గంభీరభాషణంబుల నిట్లనియె.

(తెభా-10.2-70-క.)[మార్చు]

ణి మాచేఁ బడె నని
తా సు లొనరించు నింద ప్పెడు కొఱకై
నీ మందిర మగు బిలమున
కే రుదెంచితిమి భల్లుకేశ్వర! వింటే!

(తెభా-10.2-71-వ.)[మార్చు]

అనిన విని సంతసించి జాంబవంతుఁడు మణియునుం, దన కూఁతు జాంబవతి యను కన్యకామణియునుం దెచ్చి హరికిం గానికఁగా సమర్పించె; నటమున్న హరివెంట వచ్చిన వారలు బిలంబువాకిటం బండ్రెండు దినంబులు హరిరాక కెదురుచూచి వేసరి వగచి పురంబునకుం జని; రంత దేవకీవసుదేవులును రుక్మిణియును మిత్ర బంధు జ్ఞాతి జనులును గుహ సొచ్చి కృష్ణుండు రాక చిక్కె నని శోకించి.

(తెభా-10.2-72-క.)[మార్చు]

దు ర్గమ మగు బిలమున హరి
ని ర్గతుఁడై చేరవలయు నేఁ డని పౌరుల్‌
ర్గములై సేవించిరి
దు ర్గం గృతకుశలమార్గఁ దోషితభర్గన్.

(తెభా-10.2-73-క.)[మార్చు]

డో లాయిత మానసులై
జా లింబడి జనులు గొలువఁ జండిక పలికెన్
బా లామణితో మణితో
హే లాగతి వచ్చు నంబుజేక్షణుఁ డనుచున్.

(తెభా-10.2-74-క.)[మార్చు]

త్నము సఫలం బయిన స
త్న సమూహములు బెగడఁ ద్మాక్షుం డా
త్నముతోఁ గన్యాజన
త్నముతోఁ బురికి వచ్చె యమున నంతన్.

(తెభా-10.2-75-క.)[మార్చు]

మృ తుఁ డైనవాఁడు పునరా
తుఁడైన క్రియం దలంచి న్యామణి సం
యు తుఁడై వచ్చిన హరిఁ గని
వి తోత్సవ కౌతుకముల వెలసిరి పౌరుల్‌.

21-05-2016: :
గణనాధ్యాయి 10:20, 12 డిసెంబరు 2016 (UTC)