పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/సత్రాజితుకు మణి తిరిగిచ్చుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

సత్రాజితుకు మణితిరిగిచ్చుట

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/సత్రాజితుకు మణి తిరిగిచ్చుట)
రచయిత: పోతన


(తెభా-10.2-76-వ.)[మార్చు]

ఇట్లు హరి దన పరాక్రమంబున జాంబవతీదేవిం బరిగ్రహించి, రాజసభకు సత్రాజిత్తుం బిలిపించి, తద్వృత్తాంతం బంతయు నెఱిగించి, సత్రాజిత్తునకు మణి నిచ్చె; నతండును సిగ్గువడి మణిం బుచ్చుకొని పశ్చాత్తాపంబు నొందుచు బలవద్విరోధంబునకు వెఱచుచు నింటికిఁ జని.

(తెభా-10.2-77-క.)[మార్చు]

పా పాత్ముల పాపములం
బా పంగా నోపునట్టి ద్మాక్షునిపైఁ
బా ము గల దని నొడివిన
పా పాత్ముని పాపమునకుఁ బారము గలదే?

(తెభా-10.2-78-మ.)[మార్చు]

మి భాషిత్వము మాని యేల హరిపై మిథ్యాభియోగంబు సే
సి తిఁ ? బాపాత్ముఁడ నర్థలోభుఁడను దుశ్చిత్తుండ మత్తుండ దు
ర్మ తి నీ దేహముఁ గాల్పనే? దురితమే మార్గంబునం బాయు? నే
తిఁ గంసారి ప్రసన్నుఁ డై మనుచు నన్ గారుణ్య భావంబునన్?

(తెభా-10.2-79-ఆ.)[మార్చు]

ణిని గూఁతు నిచ్చి మాధవు పదములు
ట్టుకొంటినేని బ్రదుకు గలదు
సంతసించు నతఁడు దుపాయమగు నిది
త్య మితర వృత్తిఁ క్కఁబడదు.

21-05-2016: :
గణనాధ్యాయి 10:21, 12 డిసెంబరు 2016 (UTC)