పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/ప్రసేనుడు వధింపబడుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ప్రసేనుడు వధింపబడుట

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/ప్రసేనుడు వధింపబడుట)
రచయిత: పోతన


(తెభా-10.2-54-వ.)[మార్చు]

అంత.

(తెభా-10.2-55-చ.)[మార్చు]

రెడు వేడ్కఁ గంఠమున మ్మణిఁ దాల్చి ప్రసేనుఁ డొక్క నాఁ
వికి ఘోరవన్యమృగయారతి నేగిన వానిఁ జంపి పైఁ
డి మణిఁ గొంచు నొక్క హరి పాఱఁగ దాని వధించి డాసి యే
ర్ప డఁ గనె జాంబవంతుఁడు ప్రభాత్తదిగంతము నా శమంతమున్.

(తెభా-10.2-56-క.)[మార్చు]

ని జాంబవంతుఁ డా మణిఁ
గొ నిపోయి సమీప శైలగుహఁ జొచ్చి ముదం
బు నఁ దన కూరిమిసుతునకు
కేళీకందుకంబుగాఁ జేసె, నృపా!

21-05-2016: :
గణనాధ్యాయి 10:18, 12 డిసెంబరు 2016 (UTC)