పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/సత్యభామ యుద్ధంబు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

సత్యభామ యుద్ధంబు

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/సత్యభామ యుద్ధంబు)
రచయిత: పోతన


(తెభా-10.2-170-శా.)[మార్చు]

వే ణిం జొల్లెము వెట్టి సంఘటిత నీవీబంధయై భూషణ
శ్రే ణిం దాల్చి ముఖేందుమండల మరీచీజాలముల్‌ పర్వఁగాఁ
బా ణిం బయ్యెదఁ జక్కగాఁ దుఱిమి శుంద్వీరసంరంభయై
యే ణీలోచన లేచి నిల్చెఁ దన ప్రాణేశాగ్ర భాగంబునన్.

(తెభా-10.2-171-క.)[మార్చు]

న్యంబున దనుజుల దౌ
ర్జ న్యము లుడుపంగఁ గోరి నుదెంచిన సౌ
న్యవతిఁ జూచి యదురా
న్యశ్రేష్ఠుండు సరసల్లాపములన్.

(తెభా-10.2-172-క.)[మార్చు]

లే మా! దనుజుల గెలువఁగ
లే మా ? నీ వేల కడఁగి లేచితి? విటు రా
లే మాను మాన వేనిన్
లే మా విల్లందికొనుము లీలం గేలన్.

(తెభా-10.2-173-వ.)[మార్చు]

అని పలికి.

(తెభా-10.2-174-క.)[మార్చు]

రిణాక్షికి హరి యిచ్చెను
సు నికరోల్లాసనమును శూరకఠోరా
సు సైన్యత్రాసనమును
గర్వనిరాసనమును బాణాసనమున్.

(తెభా-10.2-175-శా.)[మార్చు]

విల్లంది బలంబు నొంది తదగణ్యానంత తేజోవిశే
షా విర్భూత మహాప్రతాపమున వీరాలోక దుర్లోకయై
తా వేగన్ సగుణంబుఁ జేసె ధనువుం న్వంగి దైత్యాంగనా
గ్రీ వాసంఘము నిర్గుణంబుగ రణక్రీడా మహోత్కంఠతోన్.

(తెభా-10.2-176-క.)[మార్చు]

నా రి మొరయించె రిపు సే
నా రింఖణ హేతువైన నాదము నిగుడన్
నా రీమణి బలసంప
న్నా రీభాదికము మూర్ఛనంద నరేంద్రా!

(తెభా-10.2-177-సీ.)[మార్చు]

సౌవర్ణ కంకణ ణఝణ నినదంబు;
శింజినీరవముతోఁ జెలిమి సేయఁ
దాటంక మణిగణ గధగ దీప్తులు;
గండమండలరుచిఁ ప్పికొనఁగ
వళతరాపాంగ ళధళ రోచులు;
బాణజాలప్రభాటలి నడఁప
రపాత ఘుమఘుమబ్దంబు పరిపంథి;
సైనిక కలకల స్వనము నుడుప

(తెభా-10.2-177.1-తే.)[మార్చు]

వీర శృంగార భయ రౌద్ర విస్మయములు
లసి భామిని యయ్యెనో కాక యనఁగ
నిషువుఁ దొడుగుట దివుచుట యేయుటెల్ల
'నెఱుఁగరా కుండ నని సేసె నిందువదన.

(తెభా-10.2-178-మ.)[మార్చు]

రుఁ' జూచున్ వరుఁ జూచు నొంప నలరింపన్''''', రోషరాగోదయా
వి తభ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్
గం; గన్నులఁ గెంపు సొంపుఁ బరఁగం జండాస్త్రసందోహమున్
సాలోక సమూహమున్ నెఱపుచుం, జంద్రాస్య హేలాగతిన్.

(తెభా-10.2-179-మ.)[మార్చు]

లినీలాలక చూడ నొప్పెసఁగెఁ బ్రత్యాలీఢ పాదంబుతో
లికస్వేద వికీర్ణకాలకలతో నాకర్ణికానీత స
ల్ల లితజ్యానఖపుంఖ దీధితులతో క్ష్యావలోకంబుతో
యాకార ధనుర్విముక్త విశిఖవ్రాతాహతారాతియై.

(తెభా-10.2-180-సీ.)[మార్చు]

బొమ్మ పెండిండ్లకుఁ బో నొల్ల నను బాల;
ణరంగమున కెట్లు రాఁ దలంచె?
గవారిఁ గనినఁ దా ఱుఁగు జేరెడు నింతి;
గవారి గెల్వనే గిదిఁ జూచెఁ?
సిఁడియుయ్యెల లెక్క య మందు భీరువు;
గపతి స్కంధమే డిఁది నెక్కె?
ఖుల కోలాహల స్వనము లోర్వని కన్య;
టహభాంకృతుల కెబ్భంగి నోర్చె?

(తెభా-10.2-180.1-ఆ.)[మార్చు]

నీలకంఠములకు నృత్యంబుఁ గఱపుచుఁ
లసి తలఁగిపోవు లరుఁబోఁడి
యే విధమున నుండె నెలమి నాలీఢాది
మానములను రిపులమాన మడఁప?

(తెభా-10.2-181-సీ.)[మార్చు]

వీణెఁ జక్కఁగఁ బట్ట వెర వెఱుంగని కొమ్మ;
బాణాసనం బెట్లు ట్ట నేర్చె?
మ్రాఁకునఁ దీగెఁ గూర్పంగ నేరని లేమ;
గుణము నే క్రియ ధనుఃకోటిఁ గూర్చె?
రవి ముత్యము గ్రువ్వఁ జాలని యబల యే;
నిపుణత సంధించె నిశితశరముఁ?
జిలుకకుఁ బద్యంబు సెప్ప నేరని తన్వి;
స్త్రమంత్రము లెన్నఁ భ్యసించెఁ?

(తెభా-10.2-181.1-ఆ.)[మార్చు]

లుకు మనినఁ బెక్కు లుకని ముగుద యే
తి నొనర్చె సింహర్జనములు?
నఁగ మెఱసెఁ ద్రిజగభిరామ గుణధామ
చారుసత్యభామ త్యభామ.

(తెభా-10.2-182-శా.)[మార్చు]

జ్యా ల్లీధ్వని గర్జనంబుగ; సురల్‌ సారంగయూథంబుగా;
నా విల్లింద్రశరాసనంబుగ; సరోజాక్షుండు మేఘంబుగాఁ;
దా విద్యుల్లతభంగి నింతి సురజిద్దావాగ్ని మగ్నంబుగాఁ
బ్రా వృట్కాలము సేసె బాణచయ మంశ్శీకరశ్రేణిగాన్.

(తెభా-10.2-183-సీ.)[మార్చు]

రాకేందుబింబమై విబింబమై యొప్పు;
నీరజాతేక్షణ నెమ్మొగంబు;
కందర్పకేతువై న ధూమకేతువై;
లరుఁ బూఁబోఁడి చేలాంచలంబు;
భావజు పరిధియై ప్రళయార్కు పరిధియై;
మెఱయు నాకృష్టమై మెలఁత చాప;
మృత ప్రవాహమై నల సందోహమై;
నరారు నింతిసంర్శనంబు;

(తెభా-10.2-183.1-తే.)[మార్చు]

ర్షదాయియై మహారోషదాయియై
రఁగు ముద్దరాలి బాణవృష్ణి;
రికి నరికిఁ జూడ నందంద శృంగార
వీరరసము లోలి విస్తరిల్ల.

(తెభా-10.2-184-వ.)[మార్చు]

ఇవ్విధంబున.

(తెభా-10.2-185-క.)[మార్చు]

శం పాలతాభ బెడిదపు
టం ఱచే ఘోరదానవానీకంబుల్‌
పెం ఱి సన్నాహంబుల
సొం ఱి భూసుతుని వెనుకఁ జొచ్చెన్ విచ్చెన్.

21-05-2016: :
గణనాధ్యాయి 10:27, 12 డిసెంబరు 2016 (UTC)