పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/నరకాసుర వధ కేగుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

నరకాసురవధకేగుట

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/నరకాసుర వధ కేగుట)
రచయిత: పోతన


(తెభా-10.2-150-వ.)[మార్చు]

అనిన నరేంద్రునకు మునీంద్రుం డిట్లనియె; నరకాసురునిచేత నదితి కర్ణకుండలంబులును, వరుణచ్ఛత్త్రంబును, మణిపర్వత మనియెడు నమరాద్రి స్థానంబును గోలుపడుటయు నింద్రుండు వచ్చి హరికి విన్నవించిన హరి నరకాసుర వధార్థంబు గరుడవాహనారూఢుండై చను సమయంబున హరికి సత్యభామ యిట్లనియె.

(తెభా-10.2-151-శా.)[మార్చు]

దే వా! నీవు నిశాటసంఘముల నుద్దీపించి చెండాడ నీ
ప్రా వీణ్యంబులు సూడఁ గోరుదుఁ గదా! ప్రాణేశ! మన్నించి న
న్నీ వెంటం గొనిపొమ్ము నేఁడు కరుణన్; నేఁ జూచి యేతెంచి నీ
దే వీ సంహతికెల్లఁ జెప్పుదు భవద్దీప్తప్రతాపోన్నతుల్‌,

(తెభా-10.2-152-వ.)[మార్చు]

అనినఁ బ్రాణవల్లభకు వల్లభుం డిట్లనియె.

(తెభా-10.2-153-సీ.)[మార్చు]

'మద పుష్పంధయ ఝంకారములు గావు;
'భీషణకుంభీంద్ర బృంహితములు
'వాయునిర్గత పద్మనరేణువులు గావు;
'తురగ రింఖాముఖోద్ధూతరజము
'లాకీర్ణజలతరం గాసారములు గావు;
'త్రుధనుర్ముక్త సాయకములు
'లహంస సారస కాసారములు గావు;
'నుజేంద్రసైన్య కదంబకములు

(తెభా-10.2-153.1-తే.)[మార్చు]

'మల కహ్లార కుసుమ సంములు గావు;
'టుల రిపు శూల ఖడ్గాది సాధనములు
'న్య! నీ వేడ? రణరంగ మన మేడ?
'త్తు వేగమ; నిలువుము; లదు వలదు.

(తెభా-10.2-154-వ.)[మార్చు]

అనినఁ బ్రియునకుం బ్రియంబు జనియింప డగ్గఱి.

(తెభా-10.2-155-ఉ.)[మార్చు]

'దా వులైన నేమి? మఱి దైత్యసమూహములైన నేమి? నీ
'మా నితబాహు దుర్గముల మాటున నుండగఁ నేమి శంక? నీ
'తో రుదెంతు నంచుఁ గరతోయజముల్‌ ముకుళించి మ్రొక్కె న
'మ్మా నిని దన్ను భర్త బహుమాన పురస్సరదృష్టిఁ జూడఁగన్.

(తెభా-10.2-156-వ.)[మార్చు]

ఇట్లు తనకు మ్రొక్కిన సత్యభామను గరకమలంబులఁగ్రుచ్చి యెత్తి తోడ్కొని గరుడారూఢుండై హరి గగన మార్గంబునం జని, గిరి శస్త్ర సలిల దహన పవన దుర్గమంబై మురాసురపాశ పరివృతం బయిన ప్రాగ్జ్యోతిషపురంబు డగ్గఱి.

(తెభా-10.2-157-మ.)[మార్చు]

' చేఁ బర్వతదుర్గముల్‌ శకలముల్‌ గావించి సత్తేజిత
'ప్ర రశ్రేణుల శస్త్రదుర్గచయమున్ భంజించి చక్రాహతిం
'జె రన్ వాయుజలాగ్ని దుర్గముల నిశ్శేషంబులం జేసి భీ
'ప్ర దుఁడై వాలునఁ ద్రుంచెఁ గృష్ణుఁడు మురప్రచ్ఛన్నపాశంబులన్.

(తెభా-10.2-158-వ.)[మార్చు]

మఱియును.

(తెభా-10.2-159-శా.)[మార్చు]

'ప్రా కారంబు గదా ప్రహారముల నుత్పాటించి యంత్రంబులున్
'నా కారాతుల మానసంబులును భిన్నత్వంబు సెందంగ న
'స్తో కాకారుఁడు శౌరి యొత్తె విలయోద్ధూతాభ్ర నిర్ఘాత రే
'ఖా కాఠిన్యముఁ బాంచజన్యము విముక్తప్రాణి చైతన్యమున్.

(తెభా-10.2-160-వ.)[మార్చు]

అంత లయకాల కాలాభ్రగర్జనంబు పగిది నొప్పు నమ్మహా ధ్వని విని పంచశిరుం డైన మురాసురుండు నిదుర సాలించి యావులించి నీల్గి లేచి జలంబులు వెడలివచ్చి హరిం గని ప్రళయకాల కీలికైవడి మండుచు దుర్నిరీక్ష్యుండై కరాళించుచుం దన పంచముఖంబులం పంచభూతమయం బయిన లోకంబుల మ్రింగ నప్పళించు చందంబునం గదిసి యాభీల కీలాజటాలంబగు శూలంబున గరుడుని వైచి భూనభోంతరంబులు నిండ నార్చుచు.

(తెభా-10.2-161-క.)[మార్చు]

దు దురఁ బరువిడి బిరుసున
' రి హరి! నిలు నిలువు మనుచు సురయుఁ గదిసెన్
ము ముర! దివిజుల హృదయము
'మె మెర యిదె యడఁగు ననుచు మెఱసెన్ హరియున్.

(తెభా-10.2-162-వ.)[మార్చు]

అప్పుడు.

(తెభా-10.2-163-క.)[మార్చు]

రుడునిపైఁ బడ వచ్చిన
'ము శూలము నడుమ నొడిసి ముత్తునియలుగాఁ
ముల విఱిచి ముకుందుఁడు
'ము ముఖముల నిశితవిశిఖములు వడిఁ జొనిపెన్.

(తెభా-10.2-164-మ.)[మార్చు]

' వ్రేసెన్ మురదానవుండు హరిపైఁ; గంసారియుం దద్గదన్
' చేఁ ద్రుంచి సహస్రభాగములుగాఁ ల్పించె; నాలోన వాఁ
'డె దురై హస్తము లెత్తికొంచు వడి రా నీక్షించి లీలాసమ
'గ్ర శన్ వాని శిరంబులైదును వడిన్ ఖండించెఁ జక్రాహతిన్.

(తెభా-10.2-165-వ.)[మార్చు]

ఇట్లు శిరంబులు చక్రిచక్రధారాచ్ఛిన్నంబు లయిన వజ్రివజ్రధారా దళితశిఖరంబై కూలెడి శిఖరిచందంబున మురాసురుండు జలంబులందుఁ గూలిన, వాని సూనులు జనకవధజనిత శోకాతురులై జనార్దను మర్దింతు మని రణకుర్దనంబునం దామ్రుండు, నంతరిక్షుండు, శ్రవణుండు, విభావసుండు, వసుండు, నభస్వంతుండు, నరుణుండు నననేడ్వురు యోధులు సక్రోధులై కాలాంతకచోదితం బైన ప్రళయపవన సప్తకంబు భంగి నరకాసుర ప్రేరితులై రయంబునఁ బీఠుండనియెడు దండనాథుం బురస్కరించుకొని, పఱతెంచి హరిం దాఁకి శర శక్తి గదా ఖడ్గ కరవాల శూలాది సాధనంబులు ప్రయోగించిన.

(తెభా-10.2-166-ఉ.)[మార్చు]

నుజేంద్రయోధ వివిధాయుధసంఘము నెల్ల నుగ్రతన్
మే దినిఁ గూలనేయుచు సమిద్ధనిరర్గళ మార్గణాళిఁ గ్ర
వ్యా కులాంతకుండసుర స్త భుజానన కంఠ జాను జం
ఘా దులఁ ద్రుంచివైచెఁ దిలలంతలు ఖండములై యిలం బడన్.

(తెభా-10.2-167-వ.)[మార్చు]

మఱియు హరి శరజాలచక్రనిహతులయి తనవారలు మడియుటకు వెఱంగుపడి రోషించి గరుడగమనుని దూషించి తన్ను భూషించుకొని సరకు సేయక నరకుండు వరకుండలప్రముఖాభరణభూషితుండయి దానసలిలధారాసిక్త గండంబులును, మహోద్దండశుండాదండంబులు నైన వేదండంబులు తండంబులై నడువ వెడలి భండనంబునకుం జని.

(తెభా-10.2-168-మ.)[మార్చు]

వంతుండు ధరాసుతుండు గనె శుంద్రాజ బింబోపరి
స్థ శంపాన్వితమేఘమో యన ఖగేంద్రస్కంధపీఠంబుపై
నారత్నముఁ గూడి సంగరకథాలాపంబులం జేయు ను
జ్జ్వ నీలాంగుఁ గనన్నిషంగుఁ గుహనాచంగున్ రణాభంగునిన్.

(తెభా-10.2-169-వ.)[మార్చు]

కని కలహంబునకు నరకాసురుండు గమకింపం దమకింపక విలోకించి సంభ్రమంబున.

21-05-2016: :
గణనాధ్యాయి 10:27, 12 డిసెంబరు 2016 (UTC)