పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/భద్ర లక్షణల పరిణయంబు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

భద్ర లక్షణల పరిణయంబు

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/భద్ర లక్షణల పరిణయంబు)
రచయిత: పోతన


(తెభా-10.2-145-మ.)[మార్చు]

వంద్యన్ శ్రుతకీర్తినంద్యఁ దరుణిన్ సందర్శనక్షోణి పా
ద్య నుజన్ మేనమఱందలిన్ విమలలోలాపాంగఁ గైకేయి ని
ద్ధ యోన్నిద్రఁ బ్రపూర్ణసద్గుణసముద్రన్ భద్ర నక్షుద్ర నా
జాతాక్షుఁడు పెండ్లియాడె నహితవ్రాతంబు భీతిల్లఁగన్.

(తెభా-10.2-146-వ.)[మార్చు]

మఱియును.

(తెభా-10.2-147-చ.)[మార్చు]

రులఁ బాఱఁదోలి భుజ గాంతకుఁడైన ఖగేశ్వరుండు ము
న్న మృతముఁ దెచ్చుకైవడి మదాంధుల రాజుల నుక్కడంచి యా
లదళాయతేక్షణుఁడు గైకొని తెచ్చెను మద్రకన్యకన్
దమృగేక్షణన్ నయవిక్షణ లక్షణఁ బుణ్యలక్షణన్.

(తెభా-10.2-148-వ.)[మార్చు]

ఇట్లు హరికి రుక్మిణియు, జాంబవతియు, సత్యభామయుఁ, గాళిందియు, మిత్రవిందయు, నాగ్నజితియు, భద్రయు, మద్ర రాజనందనయైన లక్షణయు ననంగ నెనమండ్రు భార్య లైరి; మఱియు నరకాసురుని వధియించి తన్నిరుద్ధకన్యల షోడశసహస్ర కన్యల రోహిణి మొదలైనవారిం బరిగ్రహించె” నన విని.

(తెభా-10.2-149-క.)[మార్చు]

కుం బ్రియనందనుఁ డగు
కుని హరి యేల చంపె? రకాసురుఁ డా
కుంతల లగు చామీ
కుంభస్తనుల నేల కారం బెట్టెన్?

21-05-2016: :
గణనాధ్యాయి 10:26, 12 డిసెంబరు 2016 (UTC)