పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/శివ కృష్ణులకు యుద్ధ మగుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

శివకృష్ణులకు యుద్ధమగుట

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/శివ కృష్ణులకు యుద్ధ మగుట)
రచయిత: పోతన


(తెభా-10.2-402-చ.)[మార్చు]

' దుఁ డుదార భక్తజనత్సలుఁడైన హరుండు బాణునిం
' మనురక్తి నాత్మజులకంటె దయామతిఁ జూచుఁ గానఁ దా
'దు మొనరించువేడ్క బ్రమథుల్‌ గుహుఁడున్ నిజభూతకోటియున్
' స భజింప నుజ్జ్వల నిశాతభయంకరశూలహస్తుఁ డై.

(తెభా-10.2-403-సీ.)[మార్చు]

'రపుటాహతి రేఁగు రణీపరాగంబు;
'పంకేరుహాప్తబింబంబుఁ బొదువ
'విపులవాలాటోప విక్షేపజాత వా;
'తాహతి వారివాములు విరయఁ
'గుఱుచ తిన్నని వాఁడికొమ్ములఁ జిమ్మిన;
'బ్రహ్మాండభాండ కర్పరము వగుల
'లవోక ఖణి ఖణిల్లని ఱంకె వైచిన;
'రోదసీకుహరంబు భేదిలంగ

(తెభా-10.2-403.1-తే.)[మార్చు]

'ళ చలద్భర్మఘంటికా ణఘణప్ర
'ఘోషమున దిక్తటంబు లాకులత నొంద
'లీల నడతెంచు కలధౌతశైల మనఁగ
'నుక్కు మిగిలిన వృషభేంద్రు నెక్కి వెడలె.

(తెభా-10.2-404-వ.)[మార్చు]

ఇట్లు వెడలి సమరసన్నాహ సముల్లాసంబు మొగంబులకు వికాసంబు సంపాదింపం బ్రతిపక్షబలంబులతోడం దలపడిన ద్వంద్వయుద్ధం బయ్యె; నప్పుడ ప్పురాతన యోధుల యా యోధనంబుఁ జూచు వేడ్కం జనుదెంచిన, సరసిజసంభవ శక్ర సుర యక్ష సిద్ధ సాధ్య చారణ గంధర్వ కిన్నర కింపురుష గరుడోర గాదులు నిజ విమానారూఢులై వియత్తలంబున నిలిచి; రట్టియెడం గృష్ణుండును హరుండును, మారుండును గుమారుండును, గూపకర్ణ కుంభాండులును, గామపాలుండును బాణుపుత్త్రుండగు బలుండును, సాంబుండును; సాత్యకియును బాణుండును, రథికులు రథికులును, నాశ్వికులు నాశ్వికులును, గజారోహకులు గజారోహకులును, బదాతులు పదాతులునుం దలపడి యితరేతర హేతిసం ఘట్టనంబుల మిణుఁగుఱులు సెదరం బరస్పరాహ్వాన బిరుదాం కిత సింహనాద హుంకార శింజినీటంకార వారణ ఘీంకార వాజి హేషారవంబులను, బటహ కాహళ భేరీ మృదంగ శంఖ తూర్య ఘోషంబులను బ్రహ్మాండకోటరంబు పరిస్ఫోటితంబయ్యె; నయ్యవసరంబున.

(తెభా-10.2-405-చ.)[మార్చు]

' రుహనాభుఁ డార్చి నిజ శార్‌ఙ్గ శరాసన ముక్త సాయకా
' లి నిగుడించి నొంచెఁ బురవైరి పురోగములన్ రణక్రియా
' లితుల గుహ్యకప్రమథ ర్బుర భూతపిశాచ డాకినీ
' వ దరాతియోధులను బ్రమ్మెరపోయి కలంగి పాఱఁగన్.

(తెభా-10.2-406-వ.)[మార్చు]

ఇట్లేసి యార్చిన కుంభినీధరు భూజావిజృంభణ సంరంభంబునకు సహింపక, నిటలాంబకుం డనలకణంబు లుమియు నిశితాంబకంబులం బీతాంబరునినేసిన, వానినన్నింటి నడుమన ప్రతిబాణంబు లేసి చూర్ణంబు సేసినం గనుంగొని మఱియును.

(తెభా-10.2-407-మ.)[మార్చు]

' లాక్షుండు త్రిలోకపూజ్యమగు బ్రహ్మాస్త్రం బరింబోసి యా
' జాతేక్షణు మీఁదఁ గ్రోధమహిమవ్యాకీర్ణుఁ డై యేసె; నే
'సి నఁ దద్దివ్యశరంబుచేతనె మఱల్చెం గృష్ణుఁ డత్యుద్ధతిన్
' నితాశ్చర్య రసాబ్ధిమగ్ను లగుచున్ క్రాదు లగ్గింపఁగన్.

(తెభా-10.2-408-శా.)[మార్చు]

'వా వ్యాస్త్ర ముపేంద్రుపై నలిగి దుర్వారోద్ధతిన్నేయ దై
'తే ధ్వంసియుఁ బార్వతాశుగముచేఁ ద్రెంచెం; గ్రతుధ్వంసి యా
'గ్నే యాస్త్రం బడరించె నుగ్రగతి లక్ష్మీనాథుపై; దాని వే
'మా యం జేసెను నైంద్రబాణమునఁ బద్మాక్షుండు లీలాగతిన్.

(తెభా-10.2-409-వ.)[మార్చు]

మఱియును.

(తెభా-10.2-410-ఉ.)[మార్చు]

'పా ని కిన్కతో హరుఁడు పాశుపతాస్త్రము నారిఁ బోసినన్;
'దో రుహాయతాక్షుఁడును దోడన లోకభయంకరోగ్ర నా
'రా ణబాణరాజము రయంబున నేసి మరల్చె దానిఁ జ
'క్రా యుధుఁ డిత్తెఱంగునఁ బురారి శరావలి రూపుమాపినన్.

(తెభా-10.2-411-క.)[మార్చు]

కలంగియు విగతో
'త్సా హుండగు హరునిమీఁద లజాక్షుడు స
మ్మో న శిలీముఖం బ
'వ్యా త జయశాలి యగుచు డరించె నృపా!

(తెభా-10.2-412-వ.)[మార్చు]

అట్లేసిన.

(తెభా-10.2-413-క.)[మార్చు]

జృం ణశరపాతముచే
'శం భుఁడు నిజతనువు పరవశం బయి సోలన్
జృం భితుఁడై ఘననిద్రా
'రం త వృషభేంద్రు మూఁపుముపై వ్రాలెన్.

(తెభా-10.2-414-వ.)[మార్చు]

ఇట్లు వ్రాలినం జక్రపాణి పరబలంబుల నిశితబాణ పరంపరలం దునిమియు, నొక్కయెడం గృపాణంబులం గణికలు సేసియు, నొక్కచో గదాహతులం దుత్తుమురుగా మొత్తియు నివ్విధంబునఁ బీనుంగుపెంటలఁ గావించె; నంత.

(తెభా-10.2-415-చ.)[మార్చు]

ఱిమి మురాంతకాత్మజుఁ డుదాత్తబలంబున బాహులేయుపైఁ
కరిఁ దాఁకి తీవ్రశితకాండ పరంపరలేసి నొంపఁగా
నె ఱఁకులు గాఁడిపైఁ దొరఁగు నెత్తుటఁ జొత్తిలి వైరు లార్వఁగాఁ
చె మయూరవాహనముఁ బైకొని తోలుచు నాజిభీతుఁడై.

(తెభా-10.2-416-ఉ.)[మార్చు]

'పం బి రణక్షితిన్ శరవిపాటిత శాత్రవవీరుఁ డైన యా
'సాం బుఁడు హేమపుంఖశిత సాయకజాలము లేర్చి భూరి కో
'పం బున నేసినన్ బెదరి బాణతనూభవుఁ డోడి పాఱె శౌ
'ర్యం బును బీరముం దగవు నాఱడివోవ బలంబు లార్వఁగన్.

(తెభా-10.2-417-మ.)[మార్చు]

' బాహాబలశాలి యా హలి రణాష్టంభ సంరంభ వి
'స్ఫు దుగ్రాశనితుల్యమైన ముసలంబుం బూన్చి వ్రేసెన్ బొరిం
'బొ రిఁ గుంభాండక కూపకర్ణులు శిరంబుల్‌ వ్రస్సి మేదంబు నె
'త్తు రుఁ గర్ణంబుల వాతనుం దొరఁగ సంధుల్‌ వ్రీలి వే చావఁగన్.

(తెభా-10.2-418-వ.)[మార్చు]

అట్టియెడ సైన్యంబు దైన్యంబు నొంది యనాథం బయి చెడి, విఱిగి పాఱినం గని బాణుండు సాత్యకిం గేడించి ప్రళయాగ్నియుం బోలె విజృంభించి చెయి వీచి బలంబుల మరలం బురిగొల్పి తానును ముంగలి యై నడచె; నప్పు డుభయసైన్యంబు లన్యోన్య జయకాంక్షం దలపడు దక్షిణోత్తర సముద్రంబుల రౌద్రంబున వీఁకం దాఁకినం బోరు ఘోరం బయ్యె; నట్టియెడ గదల నడిచియుఁ, గుఠారంబులఁ బొడిచియు; సురియలం గ్రుమ్మియు, శూలంబులం జిమ్మియు; శక్తుల నొంచియుఁ, జక్రంబులం ద్రుంచియు, ముసలంబుల మొత్తియు, ముద్గరంబుల నొత్తియుఁ; గుంతంబుల గ్రుచ్చియుఁ, బంతంబు లిచ్చియుఁ; బరిఘంబుల నొంచియుఁ, బట్టిసంబులం ద్రుంచియు శరంబుల నేసియుఁ, గరవాలంబుల వ్రేసియు, సత్రాసులై పాసియు, విత్రాసులై డాసియుఁ బెనఁగినం దునిసిన శిరంబులును, దునుకలైన కరంబులును, దెగిన కాళ్ళును, ద్రెస్సిన వ్రేళ్ళును; దుమురులైన యెముకలును, బ్రోవులైన ప్రేవులును, నులిసిన మేనులును, నలిసిన జానువులును, నొగిలిన వర్మంబులును, బగిలిన చర్మంబులును, వికలంబు లయిన సకలావయవంబులును, వికీర్ణంబులయిన కర్ణంబులును, విచ్ఛిన్నంబులైన నయనంబులును, వెడలు రుధిరంబులును, బడలుపడు బలంబులును, గొండల వడువునంబడు మాంసఖండంబులును, వాచఱచు కొఱప్రాణంబులును, వ్రాలిన తేరులును,గూలిన కరులును, నొఱగిన గుఱ్ఱంబులును, దెరలిన కాలుబలంబులును గలిగి; పలలఖాదన కుతూహల జనిత మదాంధీభూత పిశాచ డాకినీ భూత బేతాళ సమాలోల కోలాహల భయంకరారావ బధిరీకృత సకలదిశావకాశం బయి సంగరాంగణంబు భీషణంబయ్యె; నయ్యవసరంబున.

(తెభా-10.2-419-చ.)[మార్చు]

' కుముదంబు లుల్లసితచామర ఫేనము లాతపత్ర భా
'సు నవపుండరీకములు శోణితతోయము లస్థి సైకతో
'త్క ము భుజాభుజంగమనికాయము కేశకలాప శైవల
'స్ఫు ణ రణాంగణం బమరెఁ బూరిత శోణనదంబు పోలికన్.

(తెభా-10.2-420-వ.)[మార్చు]

అట్టియెడ బాణుండు గట్టలుకం గృష్ణునిపైఁ దనరథంబుఁ బఱపించి, యఖర్వబాహాసహస్ర దుర్వారగర్వాటోప ప్రదీప్తుండై కదిసి.

(తెభా-10.2-421-మ.)[మార్చు]

' యేనూఱు కరంబులన్ ధనువు లత్యుగ్రాకృతిం దాల్చి త
'క్క యొక్కొక్కట సాయకద్వయము వీఁకంబూన్చు నాలోన నం
' హస్తుండు తదుగ్రచాపచయ విధ్వంసంబు గావించి కొం
' తత్సారథిఁ గూలనేసి రథముం క్కాడి శౌర్యోద్ధతిన్.

(తెభా-10.2-422-తే.)[మార్చు]

'ప్రళయ జీమూత సంఘాత యద భూరి
'భైరవారావముగ నొత్తెఁ బాంచజన్య
'ఖిలజనులు భయభ్రాంతుయి చలింపఁ
'డఁగి నిర్భిన్న రాక్షసీర్భముగను.

(తెభా-10.2-423-వ.)[మార్చు]

అట్టి యవక్ర విక్రమ పరాక్రమంబునకు నెగడుపడి బాణుండు లేటమొగంబు వడి చేయునదిలేక విన్ననయి యున్నయెడ.

(తెభా-10.2-424-సీ.)[మార్చు]

'త్తఱిఁ గోటర ను బాణ జనయిత్రి;
'సుతుఁ గాచు మతము సన్మతిఁ దలంచి
'వీడి శిరోజముల్‌ వ్రేలంగ నిర్ముక్త;
'పరిధానయై మురాసురవిభేది
'యెదుర నిల్చినఁ జూడ మదిఁ జూల రోసి ప;
'రాఙ్ముఖుఁడై యున్న నువు వేచి
'తల్లడించుచు బాణుఁడుల్లంబు గలగంగఁ;
'లచీర వీడ యావులు నవ్వ

(తెభా-10.2-424.1-తే.)[మార్చు]

'వ్యకాంచనమణిభూషములు రాలఁ
'బాదహతి నేలఁ గంపింపఁ బాఱి యాత్మ
'పురము వడిఁజొచ్చె నప్పుడు భూతగణము
'లాకులతతోడ నెక్కడే రుగుటయును.

21-05-2016: :
గణనాధ్యాయి 10:57, 12 డిసెంబరు 2016 (UTC)