పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/బాణాసురునితో యుద్ధంబు

వికీసోర్స్ నుండి

బాణాసురునితో యుద్ధంబు

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/బాణాసురునితో యుద్ధంబు)
రచయిత: పోతన



తెభా-10.2-391-వ.
అయ్యవసరంబున.
టీక:- ఆ = ఆ; అవసరంబునన్ = సమయము నందు.
భావము:- అలా అనిరుద్ధుని జాడకై యాదవులు ఎదురుచూస్తున్న ఆ సమయంలో....

తెభా-10.2-392-క.
శాద నిర్మల నీరద
పాద రుచి దేహుఁ డతుల భాగ్యోదయుఁ డా
నాదముని యేతెంచె న
పా దయామతి మురారిజనప్రీతిన్.

టీక:- శారద = శరత్కాలపు; నిర్మల = స్వచ్ఛమైన; నీరద = మేఘము యొక్క; పారద = పాదరసము యొక్క; రుచి = వర్ణము కల; దేహుడు = దేహము కలవాడు; అతుల = సాటిలేని; భాగ్య = అదృష్టము; ఉదయుడు = కలవాడు; ఆ = ఆ; నారద = నారదుడు అను; ముని = ఋషి; ఏతెంచెన్ = వచ్చెను; అపార = మేరలేని; దయా = దయగల; మతి = బుద్ధి కలవాడు; మురారి = కృష్ణుని; భజన = సేవించెడి; ప్రీతిన్ = కోరికతో.
భావము:- శరత్కాల మేఘంవంటి దేహంతో కూడిన మహానుభావుడు నారదమునీంద్రుడు, అపార దయాసముద్రుడు శ్రీకృష్ణుడిని పూజించే కుతూహలంతో ద్వారకకు విచ్చేసాడు.

తెభా-10.2-393-వ.
ఇట్లు సనుదెంచిన యద్దివ్యమునికి నిర్మల మణివినిర్మిత సుధర్మాభ్యంతరంబున యదువృష్టిభోజాంధక వీరులు గొలువం గొలువున్న గమలలోచనుండు ప్రత్యుత్థానంబు చేసి, యర్ఘ్యపాద్యాది విధులం బూజించి, సముచిత కనకాసనాసీనుంజేసిన నత్తాపసోత్తముండు పురుషోత్తము నుదాత్తతేజోనిధిం బొగడి, యనిరుద్ధు వృత్తాంతం బంతయుఁ దేటపడ నెఱింగించి, యప్పుండరీకాక్షుని చేత నామంత్రణంబు వడసి, యంతర్ధానంబు నొందెఁ; దదనంతరంబ కృష్ణుండు శుభముహూర్తంబున దండయాత్రాభిముఖుండై ప్రయాణభేరి వ్రేయించి, బలంబుల వెడలింప బ్రద్దలవారిం బనిచి; తానును గట్టాయితంబయ్యె; నంత.
టీక:- ఇట్లు = ఈ విధముగా; చనుదెందిన = వచ్చినట్టి; ఆ = ఆ; దివ్య = దేవతా; ముని = ఋషి; కిన్ = కి; నిర్మల = స్వచ్ఛమైన; మణి = రత్నాలచే; వినిర్మిత = బాగా చక్కగా తయారుచేసిన; సుధర్మ = సుధర్మసభ {సుధర్మసభ - ఇంద్రుడు కృష్ణునికి గోవర్ధనగిరి ధరించిన పిమ్మట బహూకరించిన దేవ సభ}; అభ్యంతరమునన్ = లోపల; యదు = యాదవ; వృష్ణి = వృష్ణిక; భోజ = భోజ; అంధక = అంధక; వీరులున్ = యోధులు; కొలువన్ = సేవించుచుండగా; కొలువున్న = కొలువుతీరి ఉన్నట్టి; కమలలోచనుండు = పద్మాక్షుడు, కృష్ణుడు; ప్రత్యుత్థానంబు = ఎదురేగుట; చేసి = చేసి; అర్ఘ్య = పూజకు తగినది ఇచ్చుట {అర్ఘ్యము – పూజ కొఱకైనది, అష్టార్ఘ్యములు - 1పెరుగు 2తేనె 3నెయ్యి 4అక్షతలు 5గఱిక 6నువ్వులు 7దర్భలు 8పుష్పము అను పూజకొరకైనది}; పాద్య = కాళ్ళకై జలాదిక మిచ్చుట; ఆది = మొదలగు; విధులన్ = మర్యాదలచేత; పూజించి = గౌరవించి; సముచిత = తగినట్టి; కనక = బంగారు; ఆసన = పీఠముపై; ఆసీనున్ = కూర్చున్నవానిగా; చేసినన్ = చేయగా; ఆ = ఆ ప్రసిద్ధుడైన; తాపస = మునులలో; ఉత్తముండు = గొప్పవాడు; పురుషోత్తమునున్ = కృష్ణుని; ఉదాత్త = ఉన్నతమైన; తేజస్ = తేజస్సునకు; నిధిన్ = ఉనికిపట్టైనవానిని; పొగిడి = స్తుతించి; అనిరుద్ధు = అనిరుద్ధుని; వృత్తాంతంబు = విషయము; అంతయున్ = అంతటిని; తేటపడన్ = విశద మగునట్లు; ఎఱింగించి = తెలిపి; ఆ = ఆ; పుండరీకాక్షుని = పద్మాక్షుని, కృష్ణుని; చేత = వలన; ఆమత్రణంబు = అనుమతి; పడసి = పొంది; అంతర్దానంబున్ = అదృశ్యము అగుట; ఒందెన్ = పొందెను; తదనంతరంబ = అటుపిమ్మట; కృష్ణుండు = కృష్ణుడు; శుభ = మంచి; ముహూర్తంబునన్ = ముహూర్తము నందు; దండయాత్ర = యుద్ధమునకై తరలెడి; అభిముఖుండు = సిద్ధ మగువాడు; ఐ = అయ్యి; ప్రయాణ = ప్రయాణమును తెలుపు; భేరి = పెద్దనగారా; వ్రేయించి = వాయింపించి; బలంబులన్ = సైన్యమును; వెడలింపన్ = బయలుదేరుటకు; బ్రద్దలవారిన్ = బెత్తాలు పట్టుకొను వారిని; పనిచినన్ = ఆజ్ఞాపించగా; తానునున్ = అతను కూడ; కట్టాయితంబు = సిద్ధమగుట; అయ్యెను = చేసెను; అంత = పిమ్మట.
భావము:- అప్పుడు శ్రీకృష్ణుడు స్వచ్ఛమైన మణులతో విశేషంగా నిర్మింపబడిన ఆ దివ్య సుధర్మసభ యందు యదు వృష్టి భోజాంధక వీరులతో కొలువుతీరి ఉన్నాడు. అప్పుడు విచ్చేసిన నారదమునీంద్రునకు శ్రీకృష్ణుడు వెంటనే లేచి ఎదురు వెళ్ళాడు. అర్ఘ్యపాద్యాదులతో పూజించి బంగారు ఆసనంపై ఆసీనుడిని చేసాడు. పిమ్మట నారదమునీంద్రుడు పురుషోత్తముడిని స్తుతించి అనిరుద్ధుడి వృత్తాంతం అంతా వివరించాడు. అనంతరం పుండరీకాక్షుని చెంత సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. అటుపిమ్మట శ్రీకృష్ణుడు ఒక శుభముహుర్తంలో బాణాసురునిపై దండయాత్ర చేయడానికి ప్రయాణభేరి వేయించాడు. సైన్యాన్ని సిద్ధం చేయించి, తాను చతురంగబలాలతో యుద్ధరంగానికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు.

తెభా-10.2-394-సీ.
హా కిరీట కేయూ కంకణ కట-
కాంగుళీయక నూపురాది వివిధ
భూషణప్రతతిచేఁ బొలుపారు కరముల-
నగదా శంఖ చక్రములు దనర
సురభి చందన లిప్త సురుచి రోరస్థ్సలిఁ-
బ్రవిమల కౌస్తుభ ప్రభలు నిగుడఁ
జెలువారు పీత కౌశేయచేలము కాసె-
లనుగా రింగులువాఱఁ గట్టి

తెభా-10.2-394.1-తే.
శైబ్య సుగ్రీవ మేఘ పుష్పక వలాహ
ములఁ బూన్చిన తే రాయిముగఁ జేసి
దారుకుఁడు దేర నెక్కె మోదం బెలర్ప
భానుఁ డుదయాచలం బెక్కు గిది మెఱసి.

టీక:- హార = కంఠాభరణములు; కిరీట = కిరీటము; కేయూర = భుజకీర్తులు; కంకణ = చేతి గాజులు; కటక = ముంజేతి కడియములు; అంగుళీయక = ఉంగరములు; నూపుర = కాలి అందెలు; ఆది = మున్నగు; వివిధ = నానా విధమైన; భూషణ = ఆభరణముల; ప్రతతి = సమూహము; చేన్ = చేత; పొలుపారు = చక్కనైన; కరములన్ = చేతులతో; ఘన = గొప్ప; గదా = గద; శంఖ = శంఖము; చక్రములున్ = చక్రములు; తనరన్ = ఒప్పుచుండగా; సురభి = ముర అనెడి సుగంధద్రవ్యము, మనోహరమైన; చందన = మంచి గంధము; లిప్త = పూయబడిన; సు = మంచి; రుచిర = ప్రకాశించుచున్న; ఉరస్థ్సలిన్ = వక్షస్థలమున; ప్ర = మిక్కిలి; విమల = స్వచ్ఛమైన; కౌస్తుభ = కౌస్తుభమణి యొక్క; ప్రభలు = కాంతులు; నిగుడన్ = ప్రసరించుచుండగా; చెలువారు = అందగించునట్టి; పీత = పచ్చటి; కౌశేయ = పట్టు; చేలమున్ = వస్త్రమును; కాసె = గోచీపెట్టి; వలనుగాన్ = విధముగా; రింగులువాఱన్ = కుచ్చెళ్ళు పోసి; కట్టి = ధరించి;
శైబ్య = శైబ్య; సుగ్రీవ = సుగ్రీవ; మేఘ = మేఘ; పుష్పక = పుష్పక; వలాహకములన్ = వలాహకమను గుఱ్ఱాలు; ఫూన్చిన = కట్టిన; తేరు = రథమును; ఆయితముగన్ = సిద్ధముగ; చేసి = చేసి; దారుకుడు = దారుకుడు; తేరన్ = తీసుకురాగా; ఎక్కెన్ = అధిరేహించెను; మోదంబు = సంతోషము; ఎలర్పన్ = అతిశయించగా; భానుడు = సూర్యుడు; ఉదయాచలంబున్ = తూర్పుకొండను; ఎక్కు = ఎక్కెడి; పగిదిన్ = విధముగా; మెఱసి = అతిశయించి.
భావము:- శ్రీకృష్ణుడు హారములు, కిరీటము, దండకడియములు, కంకణములు, అంగుళీయకములు, కాలి అందెలు మున్నగు సకల ఆభరణాలను ధరించాడు; శంఖచక్రగదాది ఆయుధాలను ధరించాడు; చందనం అలదిన వక్షస్థలంమీద కౌస్తుభరత్న కాంతులు ప్రసరిస్తూ ఉండగా, పీతాంబరాన్ని రింగులు వారగట్టాడు; శైబ్యము, సుగ్రీవము, మేఘ పుష్పకము, వలాహకము అనే నాలుగు గుఱ్ఱాలను కట్టిన రథాన్ని సిద్ధం చేసి దారుకుడు తీసుకుని వచ్చాడు; సూర్యుడు ఉదయ పర్వతాన్ని ఆరోహించినట్లు, శ్రీకృష్ణుడు ఆ రథాన్ని అధిరోహించాడు.

తెభా-10.2-395-వ.
ఇట్లు రథారోహణంబు సేసి, భూసురాశీర్వచన పూతుండును, మహితదుర్వాంకు రాలంకృతుండును, లలితపుణ్యాంగనా కరకిసలయకలిత శుభాక్షత విన్యాస భాసురమస్తకుండును, మాగధ మంజుల గానానుమోదితుండును, వందిజనసంకీర్తనా నందితుండును, బాఠక పఠనరవ వికాసిత హృదయుండును నయి వెడలు నవసరంబున.
టీక:- ఇట్లు = ఈ విధముగా; రథా = రథమును; ఆరోహణంబు = ఎక్కుట; చేసి = చేసి; భూసుర = విప్రుల; ఆశీర్వచన = దీవెనలచే; పూతుండును = పవిత్రుండును; మహిత = పూజనీయమైన; దుర్వాంకుర = గఱికపోచలచే; అలంకృతుండును = అలంకరింపబడినవాడును; లలిత = మనోజ్ఞమైన; పుణ్యాంగనా = పునిస్త్రీల యొక్క; కర = చేతులు అను; కిసలయ = చిగుళ్ళ అందు; కలిత = కలిగిన; శుభ = శుభసూచకములైన; అక్షత = అక్షంతలు; విన్యాస = ఉంచబడిన; భాసుర = ప్రకాశించుచున్న; మస్తకుండును = తల కలవాడు; మాగధ = స్తుతిపాఠకుల యొక్క; మంజుల = రమణీయమైన; గానా = పాటలచేత; అనుమోదితుండును = సంతోషించినవాడు; వందిజన = బిరుదు లుగ్గడించువారి; సంకీర్తనా = పొగడ్తలచేత; ఆనందితుండును = సంతోషించినవాడు; పాఠక = వేదపాఠకుని; పఠన = చదివెడి; రవ = నాదములచేత; వికాసిత = తేటబారిన; హృదయుండును = మనస్సు కలవాడు; అయి = అయ్యి; వెడలు = బయలుదేరెడి; అవసరంబునన్ = సమయము నందు;
భావము:- అలా రథాన్ని ఎక్కిన శ్రీకృష్ణుడు, బ్రాహ్మణుల ఆశీర్వచనాలు పొందాడు; పుణ్యాంగనలు తలమీద శుభాక్షతలు చల్లారు; వందిమాగధులు కైవారాలు చేసారు; స్తోత్ర పాఠకులు స్తుతించారు ఈవిధంగా ముకుందుడు ఆనందంగా ముందుకు సాగాడు; అప్పుడు....

తెభా-10.2-396-సీ.
లభద్ర సాత్యకి ప్రద్యుమ్న ముఖ యదు-
వృష్ణి భోజాంధక వీరవరులు
దుర్వార పరిపంథి ర్వ భేదన కళా-
తురబాహాబలోత్సాహలీల
వారణ స్యందన వాజి సందోహంబు-
వరణ సేయించి సంభ్రమమున
ముచిత ప్రస్థాన టుల భేరీ భూరి-
ఘోష మంభోనిధి ఘోష మఁడఁప

తెభా-10.2-396.1-తే.
ద్వాదశాక్షౌహిణీ బలోత్కరము లోలి
డచెఁ గృష్ణునిరథము వెన్నంటి చెలఁగి
పృథులగతి మున్ భగీరథు ము వెనుక
నుగమించు వియన్నది నుకరించి.

టీక:- బలభద్ర = బలరాముడు; సాత్యకి = సాత్యకి; ప్రద్యుమ్న = ప్రద్యుమ్నుడు; ముఖ = మొదలగు; యదు = యదువులు; వృష్ణి = వృష్ణికులు; భోజ = భోజులు; అంధక = అంధకులు లోని; వీర = శూరులలో; వరులు = శ్రేష్ఠులు; దుర్వార = నివారింపరాని; పరిపంథి = శత్రువుల యొక్క; గర్వ = అహంకారమును; భేదన = భేదింపజేసెడి; కళా = విద్యయందు; చతుర = నేర్పుగల; బాహాబల = భుజబలముతోటి; ఉత్సాహ = విడువని పూనిక కల; లీలన్ = విధముగ; వారణ = ఏనుగుల; స్యందన = రథముల; వాజి = గుఱ్ఱముల; సందోహంబున్ = సమూహమును; సవరణ = సమాయత్తము; చేయించి = చేయించి; సంభ్రమమున = వేగిరపాటుతో; సముచిత = తగినట్టి; ప్రస్థాన = యుద్ధయాత్రకైన; చటుల = అదిరెడి; భేరీ = నగారాల; భూరి = అతిమిక్కిలి; ఘోషము = ధ్వని; అంభోనిధి = సముద్రపు {అంభోనిధి - నీటికి ఉనికిపట్టు, సముద్రము}; ఘోషమున్ = ధ్వనిని; అడపన్ = అణచివేయుచుండ;
ద్వాదశా = పన్నెండు (12); అక్షౌహిణీ = అక్షౌహిణుల; బలోత్కరములు = సేనాసమూహములు; ఓలిన్ = వరుసగా; నడచెన్ = నడచినవి; కృష్ణుని = కృష్ణుని; రథము = రథమును; వెన్నంటి = అనుసరించుచు; చెలగి = విజృంభించి; పృథుల = అధికమైన; గతిన్ = వేగముతో; మున్ = పూర్వము; భగీరథు = భగీరథుని; రథము = రథమును; వెనుకన్ = వెనుకనే; అనుగమించు = అనుసరించిన; వియన్నది = ఆకాశగంగను {వియన్నది - వియత్ (ఆకాశ) నది, గంగ}; అనుకరించి = పోలి.
భావము:- బలరాముడు, సాత్యకి, ప్రద్యుమ్నుడు మొదలైన యాదవ వీరులు, మదోన్మత్తులయిన శత్రువీరులను అణచివేయాలనే అఖండ బలోత్సాహాలతో చతురంగ బలాలను సమకూర్చుకుని యుద్ధభేరి మ్రోగించారు. ఆ భేరీల ధ్వని సముద్రఘోషను మించిపోయింది శ్రీకృష్ణుని రథం వెంట బయలుదేరిన పన్నెండు అక్షౌహిణుల సైన్యం భగీరథుడి వెంట బయలుదేరిన ఆకాశగంగా ప్రవాహంలా తోచింది.

తెభా-10.2-397-వ.
ఇవ్విధంబునం గదలి కతిపయప్రయాణంబుల శోణపురంబు సేరంజని వేలాలంఘనంబు సేసి యదువీరు లంత.
టీక:- ఈ = ఈ; విధంబునన్ = రీతిని; కదిలి = బయలుదేరి; కతిపయి = అనేకమైన; ప్రయాణంబులన్ = ప్రయాణములచేత; శోణపురంబున్ = శోణపురమును; చేరన్ = దగ్గరకు; చని = వెళ్ళి; వేలాలంఘనంబు = పొలిమేరదాటుటు; చేసి = చేసి; యదు = యాదవ; వీరులు = యోధులు; అంతన్ = అంతట.
భావము:- ఈ విధంగా పయనమైన యదువీరులు కొన్నాళ్ళకు శోణపురం చేరి, పొలిమేర దాటారు.

తెభా-10.2-398-మ.
రిదారామ సరోవరోపవన యజ్ఞస్థానముల్‌ మాపి వే
రిఖల్‌ పూడిచి యంత్రముల్‌ దునిమి వప్రవ్రాతముల్‌ ద్రొబ్బి గో
పుముల్‌ గూలఁగఁ ద్రోచి సౌధ భవనంబుల్‌ నూకి ప్రాకారముల్‌
ణిం గూల్చి కవాటముల్‌ విఱిచి రుద్దండక్రియాలోలురై.

టీక:- సరిత్ = నదులు; ఆరామ = ఉద్యానవనములు; సరోవర = చెరువులు; ఉపవన = తోటలు; యజ్ఞ = యాగ; స్థానముల్ = శాలలు; మాపి = పాడుచేసి; వేన్ = శీఘ్రముగా; పరిఖల్ = అగడ్తలు; పూడిచి = మట్టితో నింపేసి; యంత్రముల్ = కీలు కల సాధనములు; తునిమి = ముక్కలుచేసి; వప్ర = కోటబురుజుల; వ్రాతముల్ = సమూహములను; ద్రొబ్బి = పడగొట్టి; గోపురముల్ = తోరణ ద్వారములను; కూలంగద్రోచి = కూలగొట్టి; సౌధ = అంతస్థుల; భవనంబుల్ = ఇళ్ళు; నూకి = తోసేసి; ప్రాకారముల్ = ప్రహారీ గోడలను; ధరణింగూల్చి = నేలగూల్చి; కవాటముల్ = తలుపులను; విఱిచి = విరగ్గొట్టి; ఉద్దండ = ఉద్ధండమైన; క్రియన్ = పనులు చేయు టందు; లోలురు = లగ్నమైనవారు; ఐ = అయ్యి.
భావము:- యాదవవీరులు అత్యుత్సాహంగా శోణపురంలోని నదులను, సరోవరాలను, ఉద్యానవనాలను, యజ్ఞవాటికలను చిందరవందర చేశారు; అగడ్తలను పూడ్చివేశారు; యంత్రాలను చెడగొట్టారు; కోటలను పడగొట్టారు; గోపురాలను కూలద్రోశారు; సౌధాలను, ప్రాకారాలను నేలకూల్చారు; కవచాలు విరగగొట్టారు.

తెభా-10.2-399-వ.
ఇట్లనేక ప్రకారంబులు గాసిచేసి, పురంబు నిరోధించి పేర్చి యార్చినంజూచి యాగ్రహసమగ్రోగ్రమూర్తియై బాణుండు సమరసన్నాహసంరంభ విజృంభమాణుండై సంగరభేరి వ్రేయించిన.
టీక:- ఇట్లు = ఇలా; అనేక = నానా; ప్రకారంబులన్ = విధములుగా; గాసి = వేధించుట; చేసి = చేసి; పురంబున్ = పట్టణమును; నిరోధించి = ముట్టడించి; పేర్చి = విజృంభించి; ఆర్చినన్ = బొబ్బలు పెట్టగా; చూచి = కనుగొని; ఆగ్రహ = కోపముచేత; సమగ్ర = పూర్తిగా; ఉగ్ర = భయంకరమైన; మూర్తి = ఆకారము కలవాడు; ఐ = అయ్యి; బాణుండు = బాణాసురుడు; సమర = యుద్ధమునకై; సన్నాహ = సిద్ధపడుటలోని; సంరంభ = వేగిరపాటుతో; విజృంభమాణుండు = చెలరేగుచున్నవాడు; ఐ = అయ్యి; సంగర = యుద్ధ; భేరిన్ = భేరీని; వ్రేయించినన్ = కొట్టించగా.
భావము:- ఈ ప్రకారంగా యాదవవీరులు శోణపురాన్ని చుట్టుముట్టి రకరకాలుగా వేధిస్తూ విజృంభించారు. అది చూసిన బాణుడు మిక్కిలి ఆగ్రహంతో సమర సన్నాహంచేసి విజృంభించి యుద్ధభేరి వేయించాడు.

తెభా-10.2-400-సీ.
చక్రవాళాచలాచక్ర మంతయు-
లసి కుమ్మరిసారె గిదిఁ దిరిగె
న ఘోణి ఖుర కోటిట్టిత నదముల-
రణి నంభోనిధుల్‌ లఁగి పొరలెఁ
గాలరుద్రాభీల ర శూలహతి రాలు-
పిడుగుల గతి రాలె నుడుగణంబు
టులానిలోద్ధూత శాల్మలీతూలంబు-
చాడ్పున మేఘముల్‌ దలఁ దూలె

తెభా-10.2-400.1-తే.
గిరులు వడఁకాడె దివి పెల్లగిల్లె సురల
గుండె లవిసె రసాతలక్షోభ మొదవె
దిక్కు లదరె విమానముల్‌ తెరలి చెదరెఁ
లఁగి గ్రహరాజ చంద్రుల తులు దప్పె.

టీక:- ఆచక్రవాళాచల చక్రము = భూమండలము {ఆచక్రవాళాచలచక్రము - అచల (పర్వతముల) చక్రము (గుంపుల) పర్యంతము కల చక్రవాళము (మండలము), భూమండలము}; అంతయున్ = సర్వము; బలసి = విజృంభించి; కుమ్మరిసారె = కుండలు చేయు చక్రము {కుమ్మరిసారె - కుండలు చేయువాని చక్రము}; పగిదిన్ = వలె; తిరిగెన్ = తిరిగిపోయినది; ఘన = గొప్ప; ఘోణి = వరాహము యొక్క; ఖుర = గిట్టల; కోటి = సమూహముచేత; ఘట్టిత = కొట్టబడిన; నదముల = కాలువల; కరణిన్ = వలె; అంభోనిధుల్ = సముద్రములు; కలగి = అల్లకల్లోలములై; పొరలెన్ = పొర్లిపోయెను; కాల = ప్రళయకాలపు; రుద్ర = రుద్రుని యొక్క; ఆభీల = భయంకరమైన; కర = చేతిలోని; శూల = త్రిశూలము యొక్క; హతిన్ = దెబ్బకు; రాలు = పడెడి; పిడుగుల = పిడుగుల; గతిన్ = వలె; రాలెన్ = రాలిపోయెను; ఉడు = నక్షత్రముల; గణంబున్ = సమూహములు; చటుల = తీవ్రమైన; అనిల = గాలిచేత; ఉద్ధూత = ఎగురగొట్టబడిన; శాల్మలీ = బూరుగు; తూలంబు = దూది; చాడ్పునన్ = రీతిని; మేఘముల్ = మేఘములు; చదలన్ = ఆకాశమునందు; తూలెన్ = చెదిరిపోయినవి; గిరులు = కొండలు; వడకాడెన్ = అదిరినవి; దివి = ఆకాశము; పెల్లగిలెలన్ = ఉన్మీలితమయ్యె; సురల = దేవతల; గుండెలు = హృదయములు; అవిసెన్ = పగిలెను; రసాతల = పాతాళము యొక్క; క్షోభము = అల్లకల్లోలమగుట; ఒదవెన్ = కలిగెను; దిక్కులు = దిక్కులు; అదరెన్ = అదరెను; విమానముల్ = విమానములు; తెరలి = తుళ్ళి; చెదరెన్ = చెదిరినవి; కలగి = కలతనొంది; గ్రహరాజ = సూర్యుని; చంద్రుల = చంద్రుడుల; గతులు = గమనములు; తప్పెన్ = తప్పినవి.
భావము:- ఈ యుద్ధ సన్నాహానికి ధరణీచక్రమంతా కుమ్మరిసారెలాగా తిరిగింది; ఆదివరాహపు గిట్టల తాకిడి తగిలిన నదులవలె సముద్రాలు కలగిపోయాయి; కాలరుద్రుడి శూలపు దెబ్బలకు రాలిన పిడుగుల వలె చుక్కలు విచ్ఛిన్నమై నేలరాలాయి; భయంకరమైన గాలికి ఎగిరిన బూరుగుదూది పింజలవలె మేఘాలు చెదిరి పోయాయి; పర్వతాలు వణికిపోయాయి; ఆకాశం పెల్లగిల్లింది; దేవతల గుండెలు అవిసిపోయాయి; పాతాళం క్షోభించింది; దిక్కులు సంచలించాయి; విమానాలు చెల్లాచెదరయ్యాయి; సూర్యచంద్రులు గతి తప్పారు.

తెభా-10.2-401-వ.
అట్టి సమర సన్నాహంబునకుఁ గట్టాయితంబై, మణిఖచితభర్మ వర్మ నిర్మలాంశు జాలంబులును, శిరస్త్రాణ కిరీట కోటిఘటిత వినూత్న రత్నప్రభాపటలంబులును, గనకకుండల గ్రైవేయ హార కంకణ తులాకోటి వివిధభూషణవ్రాత రుచి నిచయంబులును, బ్రచండబాహుదండ సహస్రంబున వెలుంగుచు శర శరాసన శక్తి ప్రాస తోమర గదా కుంత ముసల ముద్గర భిందిపాల కరవాల పట్టిస శూల క్షురికా పరశు పరిఘాది నిశాత హేతివ్రాత దీధితులును, వియచ్చరకోటి నేత్రంబులకు మిఱుమిట్లు గొలుపం గనకాచలశృంగ సముత్తుంగం బగు రథంబెక్కి యరాతివాహినీ సందోహంబునకుం దుల్యంబైన నిజసేనాసమూహంబు లిరుగడల నడవ బాణుం డక్షీణప్రతాపంబు దీపింప ననికివెడలె; నయ్యవసరంబున.
టీక:- అట్టి = అలాంటి; సమర = యుద్ధ; సన్నాహంబున్ = ప్రయత్నమున; కున్ = కు; కట్టాయితంబు = సిద్ధపడినది; ఐ = అయ్యి; మణి = రత్నాలు; ఖచిత = పొదగబడిన; భర్మ = బంగారు; వర్మ = కవచముల; నిర్మల = స్వచ్ఛమైన; అంశు = కిరణముల; జాలంబులును = సమూహములు; శిరస్ త్రాణ = తలపాగాల; కిరీట = కిరీటముల; కోటి = సమూహము లందు; ఘటిత = కూర్చబడిన; వినూత్న = సరికొత్త; రత్న = రత్నముల యొక్క; ప్రభా = కాంతుల; పటలంబులును = సమూహములు; కనక = బంగారపు; కుండల = చెవికుండలములు; గ్రైవేయ = కంఠాభరణములు; హార = దండలు; కంకణ = చేతి కంకణములు; తులాకోటి = కాలి అందెలు; వివిధ = అనేకరకములైన; భూషణ = అలంకారముల; వ్రాత = సమూహముల; రుచి = కాంతుల; నిచయంబులును = సమూహములు; ప్రచండ = మిక్కిలి చురుకైన; బాహు = చేతులు అను; దండ = కఱ్ఱల; సహస్రంబును = వెయ్యితో; వెలుంగుచు = ప్రకాశించుచు; శర = అమ్ములు; శరాసన = విల్లులు; శక్తి = శక్తి అను ఆయుధములు {శక్తి - పలుచేతులు వంటి ప్రక్క యలుగులును నిడుపాటి మొనయును కలిగిన ఆయుధ విశేషము, ఇంకోలా గంటలు కట్టిన ఒక లాంటి బాణము, ఇంకోలా చర్నాకోల}; ప్రాస = బల్లెములు; తోమర = చర్నాకోలలు, సర్వలలు; గదా = గదలు; కుంత = ఈటెలు; ముసల = రోకళ్ళు; ముద్గర = ఇనుప గుదియలు; భిందిపాల = విడిచివాటు గుదియలు; కరవాల = కత్తులు; పట్టిస = అడ్డకత్తి; శూల = శూలము; క్షురికా = చురకత్తి; పరశు = గొడ్డలి; పరిఘ = ఇనపకట్ల గుదియ; ఆది = మున్నగు; నిశాత = మిక్కిలి వాడియైన; హేతి = ఆయుధముల; వ్రాత = సమూహముల; దీధితులును = కాంతులు; వియత్ = ఆకాశము నందు; చర = తిరుగుచున్నవారికి; కోటి = ఎల్లర; నేత్రంబుల్ = కళ్ళ; కున్ = కి; మిఱుమిట్లుగొలుపన్ = చీకట్లు కమ్ముచుండగా {మిఱుమిట్లు కొలుపు - మిక్కిలి అధికమైన కాంతిని చూచుటాదులచేత కన్నులందు చీకట్లు కమ్ముట}; కనకాచల = మేరుపర్వత; శృంగ = శిఖరములకు; సమ = సమనమైన; ఉత్తుంగంబు = ఎత్తైనవి; అగు = ఐన; రథంబున్ = రథమును; ఎక్కి = ఎక్కి; అరాతి = శత్రువుల యొక్క; వాహినీ = సేనల; సందోహంబున్ = సమూహముల; కున్ = కు; తుల్యంబు = సాటివచ్చునవి; ఐన = అయినట్టి; నిజ = తన యొక్క; సేనా = సైన్యముల; సమూహంబులు = సమూహములు; ఇరుగడలన్ = రెండువైపుల; నడవన్ = వస్తుండగా; బాణుండు = బాణుడు; అక్షీణ = తగ్గని, అధికమైన; ప్రతాపంబున్ = పరాక్రమము; దీపింపన్ = ప్రకాశించగా; వెడలెన్ = బయలుదేరెను; ఆ = ఆ; అవసరంబునన్ = సమయము నందు.
భావము:- అంతటి భీకరంగా యుద్ధానికి సిద్ధపడిన బాణాసురుడు మేరుపర్వత శిఖరంవలె ఉన్నతమైన రథాన్ని అధిరోహించాడు; మణులు పొదిగిన బంగారు కవచాన్ని ధరించాడు; రత్నకాంతులతో అతని కిరీటం శోభించింది; కుండలాలు, హారాలు, కంకణాలు మొదలైన బంగారు ఆభరణాల కాంతులు అంతటా వ్యాపించాయి; బాణ, కుంత, తోమర, ముసల, గదా, కరవాలం మున్నగు అనేక ఆయుధాలతో అతని వేయి చేతులు వెలిగిపోతూ దేవతల నేత్రాలకు మిరుమిట్లు గొల్పాయి; ఈవిధంగా ఆ రాక్షసేంద్రుడు శత్రుసైన్యంతో సమానమైన సైన్యం ఇరుదిక్కులా నడవగా అమిత పరాక్రమంతో రణరంగానికి బయలుదేరాడు.