పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/అనిరుద్ధుని నాగపాశ బద్ధంబు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

అనిరుద్ధుని నాగపాశబద్ధంబు

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/అనిరుద్ధుని నాగపాశ బద్ధంబు)
రచయిత: పోతన


(తెభా-10.2-380-సీ.)[మార్చు]

నియె శుభోపేతుఁ గందర్పసంజాతు;
మానితదేహు నాజానుబాహు
కరకుండలకర్ణు, హితప్రభాపూర్ణుఁ;
జిరయశోల్లాసుఁ గౌశేయవాసుఁ
స్తూరికాలిప్తు నకాంతికుముదాప్తు;
హారశోభితవక్షు నంబుజాక్షు
దువంశతిలకు మత్తాలినీలాలకు;
వపుష్పచాపుఁ బూర్ణప్రతాపు

(తెభా-10.2-380.1-తే.)[మార్చు]

భినవాకారు నక్షవిద్యావిహారు
హితగుణవృద్ధు మన్మథమంత్రసిద్ధుఁ
లితపరిశుద్ధు నఖిలలోప్రసిద్ధు
తురు ననిరుద్ధు నంగనాననిరుద్ధు.

(తెభా-10.2-381-చ.)[మార్చు]

ని కన లగ్గలింప సురకంటకుఁ డుద్ధతి సద్భటావళిం
నుఁగొని యీనరాధమునిఁట్టుఁడు; పట్టుఁడు; కొట్టుఁడన్న వా
నుపమ హేతిదీధితు లర్పతి తేజము మాయఁ జేయ డా
సి నృపశేఖరుండు మదిఁ జేవయు లావును నేర్పు దర్పమున్.

(తెభా-10.2-382-చ.)[మార్చు]

లిగి మహోగ్రవృత్తిఁ బరిఘంబు గరంబున లీలఁ దాల్చి దో
ర్బ ఘనవిక్రమప్రళయభైరవు భంగి విజృంభణక్రియా
న నెదిర్చె దానవ నికాయముతోఁ దలపాటుఁ బోటునుం
ముబలంబు దైర్యమునుశౌర్యము వ్రేటునువాటుఁజూపుచున్

(తెభా-10.2-383-చ.)[మార్చు]

ములుబాహులుందలలు ప్రక్కలుచెక్కులుజానుయుగ్మముల్‌
ములుగర్ణముల్‌ మెడలురంబులుమూఁపులువీఁపులూరువుల్‌
చి దురుపలై ధరం దొఱఁగఁ జిందఱవందఱ సేయ సైనికుల్‌
న పరాఙ్ముఖక్రమముఁ గైకొని పాఱిరి కాందిశీకులై.

(తెభా-10.2-384-వ.)[మార్చు]

ఇవ్విధంబున సైన్యంబు దైన్యంబునొంది వెఱచియుం, బఱచియు, విచ్చియుం, జచ్చియుఁ, గలంగియు, నలంగియు, విఱిగియు, సురిఁగియుఁ, జెదరియుబెదరియుఁ, జేవదఱిఁగి నుఱుములై తన మఱుఁగు సొచ్చిన, బాణుండు శౌర్యధురీణుండును, గోపోద్దీపిత మానసుండునై కదిసి యేసియు, వ్రేసియుఁ, బొడిచియు, నడిచియుఁ, బెనంగి

(తెభా-10.2-385-క.)[మార్చు]

క్రు ద్ధుండై యహిపాశ ని
ద్ధుం గావించె నసురపాలుఁడు రణ స
న్న ద్ధున్ శరవిద్ధున్నని
రు ద్ధున్ మహితప్రబుద్ధు రూపసమృద్ధున్.

(తెభా-10.2-386-వ.)[మార్చు]

ఇట్లు కట్టిత్రోచిన నుషాసతి శోకవ్యాకులితచిత్తయై యుండె నంత.

(తెభా-10.2-387-క.)[మార్చు]

నీ పటాంచితమై సువి
శా లంబై వాయునిహతిఁ జండధ్వని నా
భీ మగు నతని కేతన
మా లోన నకారణంబ వనిం గూలెన్.

(తెభా-10.2-388-క.)[మార్చు]

ది చూచి దనుజపాలుఁడు
నాంతకుఁ డాడినట్టి మాట నిజముగాఁ
నంబు గలుగు ననుచును
నె దురెదురే చూచుచుండె నెంతయుఁ బ్రీతిన్.

(తెభా-10.2-389-వ.)[మార్చు]

అంత నక్కడ.

(తెభా-10.2-390-క.)[మార్చు]

ద్వా కలో ననిరుద్ధకు
మా రుని పోకకును యదుసమాజము వగలం
గూ రుచు నొకవార్తయు విన
నే క చింతింప నాల్గునెల లరిగె నృపా!

21-05-2016: :
గణనాధ్యాయి 10:48, 12 డిసెంబరు 2016 (UTC)