పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/చిత్రరేఖ అనిరుద్ధుని దెచ్చుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

చిత్రరేఖ అనిరుద్ధునిదెచ్చుట

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/చిత్రరేఖ అనిరుద్ధుని దెచ్చుట)
రచయిత: పోతన


(తెభా-10.2-364-వ.)[మార్చు]

అని చెప్పి “యే నతిత్వరితగతిం జని యక్కుమారరత్నంబుఁ దొడ్కొనివచ్చు నంతకు సంతాపింపకుండు” మని యా క్షణంబ వియద్గమనంబునం జని ముందట.

(తెభా-10.2-365-క.)[మార్చు]

సిజముఖి గనుఁగొనె శుభ
' రిత విలోకన విధూత వ వేదనముం
సాధనమును సుకృత
'స్ఫు ణాపాదనముఁ గృష్ణు పుటభేదనమున్.

(తెభా-10.2-366-వ.)[మార్చు]

కని డాయం జని తదీయ సుషమావిశేషంబులకుం బరితోషంబు నొందుచుం గామినీచరణ రణితమణినూపుర ఝణంఝణధ్వనిత మణిగోపురంబును, నతి విభవ విజితగోపురంబునునగు ద్వారకాపురంబు నిశాసమయంబునం బ్రచ్ఛన్నవేషంబునం జొచ్చి కనకకుంభకలితసౌధాగ్రంబున మణిదీపనిచయంబు ప్రకాశింపఁ జంద్ర కాంత శిలాభవనంబున సుధాధామ రుచిరరుచి నిచయంబున పహసించు హంసతూలికాతల్పంబున నిజాంగనా రతిశ్రమంబున నిద్రాసక్తుండై యున్న యనిరుద్ధుం జేరి తన యోగవిద్యా మహత్త్త్వంబున నతని నెత్తుకొని మనోవేగంబున శోణపురంబునకుం జని బాణాసురనందనయగు నుషాసుందరి తల్పంబునం దునిచి యిట్లనియె.

(తెభా-10.2-367-క.)[మార్చు]

జాక్షి! చూడు నీ విభు
' నిమిషనగధీరు శూరు భినవమారున్
ధి గభీరు నుదారుని
' నిరుద్ధకుమారు విదళితాహితవీరున్.

(తెభా-10.2-368-క.)[మార్చు]

నిన నుషాసతి దన మన
'ము ననురాగిల్లి మేనఁ బులకాంకురముల్‌
మొ యఁగ నానందాశ్రులు
' నుఁగవ జడి గురియ ముఖవికాస మెలర్పన్.

(తెభా-10.2-369-వ.)[మార్చు]

ఇట్లు మనంబున నుత్సహించి చిత్రరేఖం గనుంగొని యయ్యింతి యిట్లనియె.

(తెభా-10.2-370-సీ.)[మార్చు]

'తివ! నీ సాంగత్య ను భానురుచి నాకుఁ;
'లుగుటఁ గామాంధకార మడఁగెఁ
'రలాక్షి! నీ సఖిత్వం బను నావచేఁ;
'డిఁది వియోగాబ్ధిఁ డవఁ గంటి
'బల! నీ యనుబంధ ను సుధావృష్టిచే;
'నంగజ సంతాప మార్పఁ గంటి
'నిత! నీ చెలితనం ను రసాంజనముచే;
'నా మనోహర నిధానంబుఁ గంటిఁ

(తెభా-10.2-370.1-తే.)[మార్చు]

'లలఁ దోఁచిన రూపు గ్రక్కన లిఖించు
'వారు నౌ నన్నఁ దోడ్తెచ్చు వారు గలరె?
'నీటిలో జాడఁ బుట్టించు నేర్పు నీక
'కాక గల్గునె మూఁడు లోములయందు?

(తెభా-10.2-371-వ.)[మార్చు]

అని వినుతించి చిత్రరేఖను నిజమందిరమునకుఁబోవం బనిచినం జనియె; ననంతరంబ వింతజనులకెవ్వరికింబ్రవేశింపరాని యంతఃపుర సౌధాంతరంబున ననిరుద్ధుండు మేల్కని యయ్యింతిం గనుంగొని, యప్పుడు.

(తెభా-10.2-372-క.)[మార్చు]

సు రుచిర మృదుతల్పంబునఁ
' రిరంభణ సరసవచన భావకళా చా
తు రి మెఱయ రాకుమారుఁడు
' రుణీమణిఁ బొందె మదనతంత్రజ్ఞుండై.

(తెభా-10.2-373-వ.)[మార్చు]

ఇవ్విధంబున నతిమనోహర విభవాభిరామంబులగు దివ్యాంబరాభరణ మల్యానులేపనంబులను, గర్పూర తాంబూలంబులను, వివిధాన్నపానంబులను, సురుచిర మణిదీప నీరాజనంబులను, సుగంధబంధురాగరుధూపంబులను, నాటపాటల వీణావినోదంబులను, బరితుష్టిం బొంది కన్యాకుమారకు లానంద సాగరాంతర్ని మగ్నమానసులై యుదయాస్తమయ నిరూపణంబుసేయనేరక, ప్రాణంబు లొక్కటియైన తలంపులం గదిసి యిష్టోపభోగంబుల సుఖియించుచుండి; రంత.

(తెభా-10.2-374-క.)[మార్చు]

లోనన నతిచిర మగు
'కా ము సుఖలీల జరుగఁగా వరుస నుషా
బా లాలలామ కొయ్యనఁ
'జూ లేర్పడి గర్భ మొదవె సురుచిరభంగిన్.

(తెభా-10.2-375-క.)[మార్చు]

చిన్నె లంగజాలలు
'సూ చి భయాకులత నొంది స్రుక్కుచుఁ దమలో
నో చెల్ల! యెట్టులో? యీ
'రా చూలికిఁ జూలు నిలిచెరా! యిబ్భంగిన్

(తెభా-10.2-376-క.)[మార్చు]

ని గుజగుజ వోవుచు ని
'ప్ప ని దప్పక దనుజలోక పాలునితోడన్
వి నిపింపవలయు నని వే
' ని బాణునిఁ జేరి మ్రొక్కి ద్వినయమునన్.

(తెభా-10.2-377-క.)[మార్చు]

మం నమున దేవర! క
న్యాం తఃపుర మేము గాచి రయుచు నుండన్
విం జనములకుఁ జొరఁగ దు
రం ము విను పోతుటీఁగకైన సురారీ!

(తెభా-10.2-378-తే.)[మార్చు]

ట్టిచోఁ గావలున్న మే మెవ్వరమును
నేమి కనుమాయయో కాని యెఱుఁగ మధిప!
నీ కుమారిక గర్భంబు నివ్వటిల్ల
యున్న దన్నను విని రోషయుక్తుఁ డగుచు.

(తెభా-10.2-379-వ.)[మార్చు]

అట్టియెడ దానవేంద్రుండు రోషభీషణాకారుండై, కటము లదర, బొమలుముడివడం, గనుంగవల ననలకణంబు లుప్పతిల్ల, సటలు వెఱికినం జటులగతి నెగయు సింగంబు విధంబున లంఘించుచు, భీకర కరవాలంబు గేలందాల్చి సముద్దండగతిం గన్యాసౌధాంతరంబునకుం జని.

21-05-2016: :
గణనాధ్యాయి 10:47, 12 డిసెంబరు 2016 (UTC)