పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/చిత్రరేఖ పటంబున చూపుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

చిత్రరేఖ పటంబున చూపుట

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/చిత్రరేఖ పటంబున చూపుట)
రచయిత: పోతన


(తెభా-10.2-346-వ.)[మార్చు]

అని యొడంబఱిచి మిలమిలని మంచుతోడం బురుడించు ధళధళ మను మెఱుంగులు దుఱంగలిగొను పటంబు నావటంబు సేసి, వజ్రంబున మేదించి, పంచవన్నియలు వేఱువేఱ కనక రజత పాత్రంబుల నించి కేలం దూలిక ధరించి యొక్క విజనస్థలంబునకుం జని ముల్లోకంబులం బేరు గలిగి వయో రూప సంపన్నులైన పురుషముఖ్యుల నన్వయ గోత్ర నామధేయంబులతోడ వ్రాసి, యాయితంబయిన యప్పటంబు దన ముందటఁ దెచ్చి పెట్టి, “యిప్పటంబునం దగులని వారు లేరు; వారిం జెప్పెద, సావధానంబుగ నాకర్ణింపు” మని యిట్లనియె.

(తెభా-10.2-347-సీ.)[మార్చు]

'మనీయ సంగీత లిత కోవిదులు కిం;
'పురుష గంధర్వ కిన్నరులు వీరె
'తత యౌవన యదృచ్ఛావిహారులు సిద్ధ;
'సాధ్య చారణ నభశ్చరులు వీరె
'ప్రవిమల సౌఖ్య సంద్వైభవులు సుధా;
'న మరు ద్యక్ష రాక్షసులు వీరె
'నిరుపమ రుచి కళాన్విత కామరూపులై;
'పొగడొందునట్టి పన్నగులు వీరె

(తెభా-10.2-347.1-తే.)[మార్చు]

'చూడు మని నేర్పుఁ దీపింపఁ జూపుటయును
'జిత్తము నిజమనోరథసిద్ధి వడయఁ
'జాలకుండిన మధ్యమ క్ష్మాతలాధి
'తులఁ జూపుచు వచ్చె న ప్పద్మనయన.

(తెభా-10.2-348-ఉ.)[మార్చు]

మా వ కొంకణద్రవిడ త్స్య పుళింద కళింగ భోజ నే
పా విదేహ పాండ్య కురు ర్బర సింధు యుగంధ రాంధ్ర బం
గా కరూశ టేంకణ త్రిర్త సుధేష్ణ మరాట లాట పాం
చా నిషాద ఘూర్జరక సాళ్వ మహీశులు వీరె కోమలీ!

(తెభా-10.2-349-ఉ.)[మార్చు]

సిం ధురవైరివిక్రముఁడు శీతమయూఖ మరాళికా పయ
స్సిం ధుపటీర నిర్మలవిశేష యశోవిభవుండు శౌర్య ద
ర్పాం రిపుక్షితీశ నికరాంధతమః పటలార్కుఁ డీ జరా
సం ధునిఁ జూడు మాగధుని ద్బృహదశ్వసుతుం గృశోదరీ!

(తెభా-10.2-350-మ.)[మార్చు]

లోర్వీతలనాథ సన్నుతుఁడు శశ్వద్భూరి బాహాబలా
ధి కుఁడుగ్రాహవకోవిదుండు త్రిజగద్విఖ్యాతచారిత్రకుం
లంకోజ్జ్వల దివ్యభూషుఁడు విదర్భాధీశ్వరుండైన భీ
ష్మ భూపాలకుమారుఁ జూడు మితనిన్ త్తద్విరేఫాలకా!

(తెభా-10.2-351-ఉ.)[మార్చు]

సం రరంగ నిర్దళిత చండవిరోధి వరూధినీశ మా
తం తురంగ సద్భట రప్రకరైక భుజావిజృంభణా
భం పరాక్రమప్రకట వ్యయశోమహనీయమూర్తి కా
ళిం గుఁడు వీఁడె చూడు తరళీకృత చారుకురంగలోచనా!

(తెభా-10.2-352-మ.)[మార్చు]

సు గుణాంభోనిధి ఫాలలోచను నుమేశున్నాత్మ మెప్పించి శ
క్తి రిష్ఠంబగు శూలముం బడసె నక్షీణప్రతాపోన్నతిన్
తిన్ మిక్కిలి మేటివీరుఁడు రణోత్సాహుండు భూపౌత్త్రుఁ డీ
దత్తుం గనుఁగొంటె! పంకజముఖీ! ప్రాగ్జ్యోతిషాధీశ్వరున్.

(తెభా-10.2-353-మ.)[మార్చు]

వి చాంభోరుహపత్రనేత్రుఁ డగు గోవిందుండు దాఁ బూను నం
చక్రాబ్జ గదాది చిహ్నములచేతన్ వాసుదేవాఖ్య ను
త్సు కుఁడై యెప్పుడుమచ్చరించు మదిఁగృష్ణుండన్ననేమేటి పౌం
డ్ర కుఁ గాశీశసఖుం గనుంగొనుము వేడ్కం జంద్రబింబాననా!

(తెభా-10.2-354-మ.)[మార్చు]

ద్వి శుశ్రూషయు సూనృతవ్రతము నుద్వృత్తిన్ భుజాగర్వమున్
వి యాటోపముఁ జాప నైపుణియు ధీవిస్ఫూర్తియుం గల్గు నీ
నీనాథకులప్రదీపకులఁ బాఱం జూడు పద్మాక్షి! ధ
ర్మ భీమార్జున మాద్రినందనుల సంగ్రామైకపారీణులన్.

(తెభా-10.2-355-మ.)[మార్చు]

లిమిన్ సర్వనృపాలురన్నదిమి కప్పంబుల్‌ దగం గొంచు ను
జ్జ్వ తేజో విభవాతిరేకమున భాస్వత్కీర్తి శోభిల్లఁగాఁ
బొ లుపొందం దను రాజరా జన మహా భూరిప్రతాపంబులుం
దుర్యోధనుఁ జూడు సోదరయుతుం గంజాతపత్త్రేక్షణా!

(తెభా-10.2-356-వ.)[మార్చు]

అని యిట్లు సకలదేశాధీశ్వరులగు రాజవరుల నెల్లఁ జూపుచు యదువంశసంభవులైన శూరసేన వసుదేవోద్ధవాదులం జూపి మఱియును.

(తెభా-10.2-357-ఉ.)[మార్చు]

శా ద నీరదాబ్జ ఘనసార సుధాకర కాశ చంద్రికా
సా పటీరవర్ణు యదుత్తము నుత్తమనాయకుం బ్రమ
త్తా రి నృపాల కానన హుతాశనమూర్తిఁ బ్రలంబదైత్య సం
హా రునిఁ గామపాలుని హలాయుధుఁ జూడుము దైత్యనందనా!

(తెభా-10.2-358-సీ.)[మార్చు]

మనీయశుభగాత్రుఁ గంజాతదళనేత్రుఁ;
సుధాకళత్రుఁ బానచరిత్రు
త్యసంకల్పు నిశాచరోగ్రవికల్పు;
తపన్నగాకల్పు నాగతల్పుఁ
గౌస్తుభమణిభూషు గంభీరమృదుభాషు;
శ్రితజనపోషు నంచితవిశేషు
నీలనీరదకాయు నిర్జితదైతేయు;
ధృతపీతకౌశేయు నతవిధేయు

(తెభా-10.2-358.1-తే.)[మార్చు]

ఘమహాగదవైద్యు వేదాంతవేద్యు
దివ్యమునిసన్నుతామోదుఁ దీర్థపాదు
జిష్ణు వర సద్గుణాలంకరిష్ణుఁ గృష్ణుఁ
జూడు దైతేయకులబాల! సుభగ లీల!

(తెభా-10.2-359-చ.)[మార్చు]

స్ఫు దళి శింజినీ రవ విభూషితపుష్పధనుర్విముక్త భా
స్వ నవచూత కోరక నిశాత శిలీముఖ పాతభీత పం
రుహభవాది చేతన నికాయు మనోజనిజాంశు రుక్మిణీ
సుతు రాజకీరపరివారుని మారునిఁ జూడు కోమలీ!

(తెభా-10.2-360-వ.)[మార్చు]

ఇవ్విధంబునం జూపిన.

(తెభా-10.2-361-మ.)[మార్చు]

నితారత్నము కృష్ణనందనుని భాప్రౌఢిఁ దాఁ జూచి గ్ర
ద్ద నఁ దన్నర్థి వరించి చన్న సుగుణోత్తంసంబ కా నాత్మలో
నుమానించి యనంతరంబ యనిరుద్ధాఖ్యున్ సరోజాక్షు నూ
చేతోభవమూర్తిఁ జూచి మది సంతాపించుచున్నిట్లనున్.

(తెభా-10.2-362-ఉ.)[మార్చు]

ఇం తి మదీయ మానధనమెల్ల హరించిన మ్రుచ్చు నిమ్మెయిం
బం మెలర్ప వ్రాసి పటభాగనిరూపితుఁ జేసినట్టి నీ
యం టి పుణ్యమూర్తిఁ గొనియాడఁగ నేర్తునె? నీ చరిత్రముల్‌
విం లె నాకు? నీ మహిత వీరుకులంబు బలంబుఁ జెప్పుమా!

(తెభా-10.2-363-చ.)[మార్చు]

' వుడుఁ జిత్రరేఖ జలజాక్షికి నిట్లను నీ కుమారకుం
' ఘుఁడు యాదవాన్వయ సుధాంబుధి పూర్ణసుధాకరుండునాఁ
' రిన కృష్ణపౌత్త్రకుఁ డుదారచరిత్రుఁడు భూరిసింహ సం
' నుఁ డరాతి సైన్య తిమిరార్కుఁడు, పే రనిరుద్ధుఁ డంగనా!

21-05-2016: :
గణనాధ్యాయి 10:46, 12 డిసెంబరు 2016 (UTC)