పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/ఉషాకన్య స్వప్నంబు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఉషాకన్య స్వప్నంబు

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/ఉషాకన్య స్వప్నంబు)
రచయిత: పోతన


(తెభా-10.2-327-సీ.)[మార్చు]

' దానవేశ్వరు నుఁగుఁ గుమారి యు;
'షాకన్య విమలసౌన్యధన్య
'రూపవిభ్రమ కళారుచిర కోమలదేహ;
'తను నాఱవబాణ నఁగఁ బరఁగు
'సుందరీరత్నంబు నిందునిభానన;
'లినీలవేణి పద్మాయతాక్షి
'యొకనాఁడు రుచిరసౌధోపరివేదికా;
'స్థలమున మృదుశయ్య నెలమిఁ గూర్కి

(తెభా-10.2-327.1-తే.)[మార్చు]

'మున్ను దన చౌల నెన్నఁడు విన్న యతఁడుఁ
'న్నులారంగఁ దాఁ బొడన్న యతఁడుఁ
'గాని యసమానరూపరేఖావిలాస
'లితు ననిరుద్ధు నర్మిలిఁ విసినటులు.

(తెభా-10.2-328-చ.)[మార్చు]

' గని యంత మేలుకని న్నుల బాష్పకణంబు లొల్కఁగాఁ
' వలెఁ గాక నిశ్చయముగాఁ గమనీయ విలాస విభ్రమా
' లిత తదీయరూపము ముఖంబున వ్రేలిన యట్ల దోఁచినం
' వళ మందుచున్ బిగియఁ గౌఁగిటిచే బయ లప్పళించుచున్

(తెభా-10.2-329-వ.)[మార్చు]

మఱియును.

(తెభా-10.2-330-చ.)[మార్చు]

' సమృదూక్తులుం గుసుమసాయకకేళియు శాటికా కచా
' షణముల్‌ నఖక్రియలుఁ మ్రకపోల లలాట మేఖలా
' కుచ బాహుమూలములుఁ గైకొని యుండుట లాదిగాఁ దలో
' రి మది గాఢమై తగిలె ర్పకుఁ డచ్చుననొత్తినట్లయై.

(తెభా-10.2-331-సీ.)[మార్చు]

'లికిచేష్టలు భావర్భంబు లైనను;
'బ్రియుమీఁది కూరిమి బయలుపఱుపఁ
'బిదపిదనై లజ్జ మదిఁ బద నిచ్చినఁ;
'జెలిమేనఁ బులకలు చెక్కు లొత్త
'దనాగ్ని సంతప్త మానస యగుటకు;
'గురుకుచహారవల్లరులు గందఁ
'జిత్తంబు నాయకాయత్తమై యుంటకు;
'ఱుమాట లాడంగ ఱపు గదుర

(తెభా-10.2-331.1-తే.)[మార్చు]

'తివ మనమున సిగ్గు మోహంబు భయముఁ
'బొడమ నునుమంచు నెత్తమ్మిఁ బొదువు మాడ్కిఁ
'బ్రథమచింతాభరంబునఁ ద్మనయన
'కోరి తలచీర వాటింప నేరదయ్యె.

(తెభా-10.2-332-వ.)[మార్చు]

ఇట్లు విరహవేదనా దూయమాన మానసయై యుండె; నంత నెచ్చెలులు డాయం జనుదెంచినం దన మనంబునం బొడము మనోజవికారంబు మఱువెట్టుచు నప్పుడు.

(తెభా-10.2-333-చ.)[మార్చు]

'పొ రిఁబొరిఁ బుచ్చు నూర్పుగమిఁ బుక్కిటనుంచి కుచాగ్రసీమపై
'బె సిన సన్న లేఁజెమటబిందువు లొయ్యన నార్చుఁ గన్నులం
'దొ రఁగెడు బాష్పపూరములు దొంగలిఱెప్పల నాని చుక్కలం
' రుణులు రండు చూతమని తా మొగ మెత్తును గూఢరాగ యై.

(తెభా-10.2-334-వ.)[మార్చు]

ఇవ్విధంబునం జరియించుచుండె నట్టియెడ.

(తెభా-10.2-335-తే.)[మార్చు]

'అంతకంతకు సంతాప తిశయించి
'లుఁద చన్నులు గన్నీటి ఱదఁ దడియఁ
'జెలులదెసఁ జూడఁ జాల లజ్జించి మొగము
'వాంచి పలుకక యుండె న వ్వనరుహాక్షి.

(తెభా-10.2-336-వ.)[మార్చు]

అంత.

(తెభా-10.2-337-తే.)[మార్చు]

'లితనూభవుమంత్రి కుంభాండుతనయ
'న బహిఃప్రాణ మిది యనఁ నరునట్టి
'కామినీ మణి ముఖపద్మకాంతి విజిత
'శిశిరకర చారు రుచిరేఖ చిత్రరేఖ.

(తెభా-10.2-338-వ.)[మార్చు]

కదియవచ్చి య బ్బాల నుపలక్షించి.

(తెభా-10.2-339-తే.)[మార్చు]

భామినీమణి! సొబగుని యల వెదకు
విధమునను నాత్మ విభుఁ బాసి విహ్వలించు
గను జేతికి లోనైనవానిఁ బాసి
భ్రాంతిఁ బొందిన భావంబు ప్రకటమయ్యె.

(తెభా-10.2-340-తే.)[మార్చు]

'నిత! నా కన్న నెనరైన వారు నీకుఁ
'గలుగ నేర్తురె? నీ కోర్కిఁ దెలియఁ జెప్ప
'కున్న మీయన్నతో డన్నఁ గన్నుఁగవను
'లరు నునుసిగ్గుతో నగ వామతింప.

(తెభా-10.2-341-వ.)[మార్చు]

ఇవ్విధంబునఁ జిత్రరేఖం గనుంగొని యిట్లనియె.

(తెభా-10.2-342-చ.)[మార్చు]

'చె లి కలలోన నొక్క సరసీరుహనేత్రుఁడు రత్నహార కుం
' కటకాంగుళీయక రన్మణినూపురభూషణుండు ని
'ర్మ కనకాంబరుండు సుకుమారతనుండు వినీలదేహుఁ డు
'జ్జ్వ రుచి నూతనప్రసవసాయకుఁ డున్నతవక్షుఁ డెంతయున్.

(తెభా-10.2-343-చ.)[మార్చు]

' ను బిగియారఁ గౌఁగిట మనం బలరారఁగఁ జేర్చి మోదముం
' నుకఁగ నంచితాధరసుధారస మిచ్చి మనోజకేళికిం
' నుపడఁ జేసి మంజుమృదుభాషలఁ దేలిచి యంతలోననే
' నియెను దుఃఖవార్ధిఁ బెలుచన్ ననుఁ ద్రోచి సరోరుహాననా!

(తెభా-10.2-344-వ.)[మార్చు]

అనుచు నమ్మత్తకాశిని చిత్తంబు చిత్తజాయత్తంబయి తత్తరంబున విరహానలం బుత్తలపెట్టఁ గన్నీరుమున్నీరుగా వగచుచు విన్ననైన వదనారవిందంబు వాంచి యూరకున్నఁ జిత్రరేఖ దన మనంబున న య్యింతి సంతాపంబు చింతించి యిట్లనియె.

(తెభా-10.2-345-చ.)[మార్చు]

' సిజనేత్ర! యేటికి విచారము? నా కుశలత్వ మేర్పడన్
' సుర యక్ష కింపురుష నాగ నభశ్చర సిద్ధ సాధ్య కి
'న్న వర ముఖ్యులం బటమునన్ లిఖియించినఁ జూచి నీ మనో
' రుఁ గని వీడె పొమ్మనిన ప్పుడె వానిని నీకుఁ దెచ్చెదన్.

21-05-2016: :
గణనాధ్యాయి 10:46, 12 డిసెంబరు 2016 (UTC)