పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/బాణున కీశ్వర ప్రసాద లబ్ది

వికీసోర్స్ నుండి

బాణునకీశ్వర ప్రసాదలబ్ది

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/బాణున కీశ్వర ప్రసాద లబ్ది)
రచయిత: పోతన



తెభా-10.2-311-తే.
"నఘ! బలినందనులు నూర్వు రందులోన
గ్రజాతుండు బాణుఁ డత్యుగ్రమూర్తి
చిర యశోహారి విహితపూజిత పురారి
హిత తిమిరోష్ణకరుఁడు సస్రకరుఁడు.

టీక:- అనఘ = పుణ్యుడా; బలి = బలిచక్రవర్తి; నందనులు = కొడుకులు; నూర్వురు = వందమంది (100); అందున్ = వారి; లోనన్ = లో; అగ్రజాతుడు = పెద్దవాడు, మొదట పుట్టిన వాడు; బాణుడు = బాణుడు; అతి = మిక్కిలి; ఉగ్ర = భీకరమైన; మూర్తి = ఆకృతి కలవాడు; చిర = అధికమైన; యశోహారి = కీర్తిచేత మనోహరుడు; విహిత = పద్ధతిగా; పూజిత = పూజింపబడిన; పురారి = శివుడు కలవాడు {పురారి - త్రిపురములకు శత్రువు, శివుడు}; అహిత = శత్రువులు అను; తిమిర = చీకట్లకు; ఉష్ణకరుడు = సూర్యుడు {ఉష్ణ కరుడు - వేడిమి (ఎండ)ను కలిగించెడి వాడు, సూర్యుడు}; సహస్ర = వెయ్యి (1000); కరుడు = చేతులు కలవాడు.
భావము:- “అనఘా! పరీక్షిత్తూ! బలిచక్రవర్తికి వంద మంది కొడుకులు వారిలో పెద్దవాడు బాణుడు. అతడు మిక్కిలి ఉగ్రుడు, శత్రుభయంకరుడు, గొప్ప కీర్తిమంతుడు. అతనికి వేయి చేతులు. త్రిపురసంహారి అయిన మహాశివుని పూజించుటలో ధురంధరుడు.

తెభా-10.2-312-క.
బాణుఁడు విక్రమజిత గీ
ర్వాణుఁడు సని కాంచె భక్తి శుఁ డై సగణ
స్థాణున్ నిర్దళి తాసమ
బాణుం దాండవధురీణు క్తత్రాణున్.

టీక:- బాణుడు = బాణుడు; విక్రమ = పరాక్రమముతో; జిత = జయింపబడిన; గీర్వాణుడు = దేవతలు కలవాడు; చని = వెళ్ళి; కాంచెన్ = దర్శించెను; భక్తి = భక్తికి; వశుడు = వశ మగువాడు; ఐన = అయిన; సగణ = గణములతో ఉన్న; స్థాణున్ = శివుని {స్థాణుడు - ప్రళయకాలమునను స్థిరముగ ఉండువాడు, శివుడు}; నిర్దళితాసమబాణున్ = శివుని {నిర్దళి తాసమ బాణున్ - చంపబడిన మన్మథుడు కలవాడు}; తాండవధురీణున్ = శివుని {తాండవ ధురీణుడు - తాండవము అను నృత్యమున మిక్కిలి నేర్పరి, శివుడు}; భక్త = భక్తులను; త్రాణున్ = తరింపజేయువానిని.
భావము:- పరాక్రమంతో దేవతలను ఓడించిన బాణాసురుడు, భక్తిభావంతో భక్తవశంకరుడు, శాశ్వతుడు, తాండవకేళీ శేఖరుడు, మన్మథుడిని మసిచేసిన వాడు అయిన పరమేశ్వరుడి దగ్గరకు వెళ్ళి ఆ దేవదేవుని దర్శించాడు,

తెభా-10.2-313-క.
ని యనురాగ వికాసము
మనమునఁ గడలుకొనఁగ రఁ జాఁగిలి వం
మాచరించి మోదము
రఁగఁ దాండవము సలుపు ఱి నయ్యభవున్.

టీక:- కని = దర్శించి; అనురాగ = అనురక్తి వలని; వికాసము = వికసించుట; తన = తన యొక్క; మనమునన్ = మనసునందు; కడలుకొనగన్ = అతిశయింపగా; ధరన్ = భూమిపై; చాగిలి = సాగిలబడి; వందనము = నమస్కారము; ఆచరించి = చేసి; మోదము = సంతోషము; తనరగన్ = అతిశయింపగా; తాండవము = తాండవనాట్యము; సలుపు = చేయుచున్న; తఱిన్ = సమయము నందు; ఆ = ఆ; అభవున్ = శివుని.
భావము:- పరమేశ్వరుని దర్శించి భక్తిభావం పొంగిపొర్లుతుండగా తాండవ క్రీడ సలుపుతున్న సమయంలో ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసాడు.

తెభా-10.2-314-ఉ.
సంచిత భూరిబాహుబలసంపద పెంపున నారజంబు వా
యించి యనేకభంగుల నుమేశుఁ ద్రిలోకశరణ్యు నాత్మ మె
చ్చించి ప్రమోదియై నిజవశీకృత నిశ్చలితాంతరంగుఁ గా
వించి తదాననాంబురుహ వీక్షణుఁడై తగ మ్రొక్కి యిట్లనున్.

టీక:- సంచిత = కలిపి ఉంచిన; భూరి = అనేకమైన; బాహు = భుజముల; బల = బలము యొక్క; సంపదన్ = కలిమి అందలి; పెంపునన్ = అధిక్యముచేతను; ఆరజంబున్ = ఝంజ అను వాద్యమును; వాయించి = వాయించి; అనేక = పెక్కు; భంగులన్ = విధములుగా; ఉమేశున్ = శివుని; త్రిలోకశరణ్యున్ = శివుని; ఆత్మన్ = మనసులో; మెచ్చించి = మెచ్చుకొను నట్లు చేసి; ప్రమోది = మిక్కిలి సంతోషించినవాడు; ఐ = అయ్యి; నిజ = తనకు; వశీకృత = వశముగా చేయబడిన; నిశ్చలిత = చలింపని; అంతరంగున్ = మనస్సు కలవానిగా; కావించి = చేసి; తత్ = అతని (శివుని); ఆనన = మోము అనెడి; అంబురుహ = పద్మమును; వీక్షణుడు = చూచువాడు; ఐ = అయ్యి; తగన్ = తగినట్లు; మ్రొక్కి = నమస్కరించి; ఇట్లు = ఈ విధముగ; అనున్ = పలికెను.
భావము:- సంపాదించిన తన బహు బాహుబలం అంతా వాడి ఝంజ వాయించి, మఱియూ ఇంకా అనేక రకాలుగా ఆ త్రిలోకశరణ్యుడైన పరమేశ్వరుడిని మెప్పించాడు. ఆనంద పరవశుడైన ఆ దేవుడి ముఖపద్మం వైపు దృష్టి నిలిపి నమస్కరించి ఇలా స్తుతించాడు.

తెభా-10.2-315-ఉ.
"శంర! భక్తమానసవశంకర! దుష్టమదాసురేంద్ర నా
శంర! పాండునీలరుచిశంకరవర్ణ నిజాంగ! భోగి రా
ట్కంణ! పార్వతీహృదయకైరవ కైరవమిత్ర! యోగిహృ
త్పంజ పంకజాప్త! నిజతాండవఖేలన! భక్తపాలనా! "

టీక:- శంకర = శివా {శంకరుడు - శుభమును చేయువాడు, శివుడు}; భక్తమానసవశంకర = శివా {భక్త మానస వశంకరుడు - భక్తుల మనసులను వశపరచుకొనువాడు, శివుడు}; దుష్టమదాసురేంద్రనాశంకర = శివా {దుష్ట మదాసురేంద్ర నాశంకరుడు - దుర్మార్గులైన మదించిన రాక్షసరాజులను నాశనము చేయువాడు, శివుడు}; పాండునీలరుచిశంకరవర్ణనిజాంగ = శివా {పాండు నీల రుచి శంకరవర్ణ నిజాంగుడు - పాండు (తెలుపు) నీల (నలుపు) రుచి (కాంతులచే) శంకర (శుభము కలుగ జేయుచున్న) వర్ణ (రంగులు కల) నిజ (తన) అంగ (దేహము కలవాడు), శివుడు}; భోగిరాట్కంకణ = శివా {భోగిరా ట్కంకణుడు - భోగిరాట్ (సర్పరాజు, వాసుకి) కంకణముగా కలవాడు, శివుడు}; పార్వతీహృదయకైరవకైరవమిత్ర = శివా {పార్వతీ హృదయ కైరవకైరవమిత్రుడు - పార్వతి మనస్సు అను కైరవ (తెల్ల కలువకు) కైరవమిత్రుడు (చంద్రుడు వంటి వాడు), శివుడు}; యోగిహృత్పంకజపంకజాప్త = శివా {యోగి హృత్పంకజ పంకజాప్తుడు - యోగుల హృదయములను పంకజ (పద్మముల)కు పంకజాప్తుడు (సూర్యుని వంటి వాడు), శివుడు}; నిజతాండవఖేలన = శివా {నిజ తాండవ ఖేలనుడు - నిజ (స్వకీయమైన) తాండవమను నాట్యమును ఖేలన (ఆడు వాడు), శివుడు}; భక్తపాలనా = శివా {భక్త పాలనుడు - భక్తులను పాలించువాడు, శివుడు}.
భావము:- “శంకరా! భక్తవశంకరా! దుష్ట మదోన్మత్త రాక్షసులను నశింపచేయువాడా! ధవళాంగా! నీలకంఠా! సర్పభూషణా! పార్వతీ ప్రాణవల్లభా! యోగిజనుల హృదయ పంకజాలకు సూర్యునివంటివాడా! తాండవ కేళీ ప్రియా! భక్తపరిపాలకా!”

తెభా-10.2-316-వ.
అని వినుతించి.
టీక:- అని = అని; వినుతించి = స్తుతించి.
భావము:- అంటూ స్తుతించి.... ఇంకా ఇలా అన్నాడు.

తెభా-10.2-317-ఉ.
"దే! మదీయ వాంఛితము తేటపడన్నిటు విన్నవించెదన్
నీవును నద్రినందనయు నెమ్మిని నా పురి కోటవాకిటం
గాలియుండి నన్నుఁ గృపఁ గావుము భక్తఫలప్రదాత! యో
భాభవారి! నీ చరణద్మము లెప్పుడు నాశ్రయించెదన్. "

టీక:- దేవ = శివా; మదీయ = నా యొక్క; వాంఛితము = కోరికను; తేటపడన్ = విశద మగునట్లు; ఇటు = ఈ విధముగ; విన్నవించెదన్ = మనవి చేసికొనెదను; నీవునున్ = నీవు; అద్రినందనయున్ = పార్వతీదేవి {అద్రి నందన - అద్రి (హిమవంతుడు అను పర్వత రాజు) నందన (కూతురు), పార్వతి}; నెమ్మినిన్ = ప్రీతితో; నా = నా యొక్క; పురి = పట్టణములోని; కోటవాకిటన్ = కోటగుమ్మం వద్ద; కావలి = కాపలాకాస్తూ; ఉండి = ఉండి; నన్నున్ = నన్ను; కృపన్ = దయతో; కావుము = కాపాడుము; భక్త = భక్తుల; ఫల = కోరిన ఫలితములను; ప్రదాత = ఇచ్చువాడ; ఓ = ఓ; భావభవారి = శివా {భావభవారి - భావభవుని (మన్మథుని) అరి (శత్రువు), శివుడు}; నీ = నీ యొక్క; చరణ = పాదములు అను; పద్మములు = పద్మములను; ఎప్పుడున్ = ఎప్పుడు; ఆశ్రయించెదన్ = ఆశ్రయిస్తాను.
భావము:- “ఓ దేవా! భక్తుల కోరికలు తీర్చువాడ! నాకోరిక విన్నవిస్తాను, విను. నీవు పార్వతీ సమేతంగా, నా కోట ముందర రక్షకుడివై ఉండి నన్ను రక్షించుతూ ఉండు. నా మనోవాంఛ ఇదే. కాముని భస్మం చేసినవాడా! నీ పాదపద్మాలను ఎప్పుడూ ఆశ్రయించుకొని ఉంటాను. దయజూడు.”

తెభా-10.2-318-వ.
అని యభ్యర్థించినం బ్రసన్నుండై భక్తవత్సలుం డగు పురాంతకుండు గౌరీసమేతుండై తారకాంతక గజాననాది భూతగణంబుల తోడ బాణనివాసం బగు శోణపురంబు వాకిటం గాఁపుండెఁ; బదంపడి యొక్కనాఁడ బ్బలినందనుండు.
టీక:- అని = అని; అభ్యర్థించినన్ = కోరగా; ప్రసన్నుండు = అనుగ్రహము కలవాడు; ఐ = అయ్యి; భక్త = భక్తుల; వత్సలుండు = వాత్సల్యము కలవాడు; పురాంతకుండు = శివుడు {పురాంతకుడు - పురములను నాశముచేసిన వాడు, శివుడు}; గౌరీ = పార్వతీదేవితో {గౌరి - గౌరవర్ణము కలామె, పార్వతి}; సమేతుండు = కూడినవాడు; ఐ = అయ్యి; తారకాంతక = కుమారస్వామి; గజానన = వినాయకుడు; ఆది = మున్నగువారు; భూత = ప్రమథుల; గణంబుల్ = సమూహము; తోడన్ = తోటి; బాణ = బాణుని; నివాసంబు = ఉండు ప్రదేశము; అగు = ఐన; శోణపురంబున్ = శోణపురమును {శోణపురము - బాణుని పట్టణము}; వాకిటన్ = కోటగుమ్మం వద్ద; కాపుండెన్ = కాపలా ఉండెను; పదంపడి = అటుపిమ్మట; ఒక్క = ఒకానొక; నాడు = రోజు; ఆ = ఆ; బలినందనుండు = బాణాసురుని {బలి నందనుడు - బలిచక్రవర్తి యొక్క కొడుకు, బాణుడు}.
భావము:- బాణాసురుడు ఇలా ప్రార్థంచగా భక్తవత్సలుడైన పరమేశ్వరుడు పార్వతీ సమేతుడై బాణుడి పట్టణం శోణపురం చేరాడు. భూతగణాలతో వేంచేసిన శంకరుడు కోట ద్వారం చెంత కాపలా ఉన్నాడు. అటుపిమ్మట, ఒకసారి ఆ బలిచక్రవర్తి కొడుకు బాణాసురుడు....

తెభా-10.2-319-తే.
ర్పమునఁ బొంగి రుచిర మార్తాండ దీప్త
మండలముతోడ మార్పడు హితశోణ
ణికిరీటము త్రిపురసంరుని పాద
నజములు సోఁక మ్రొక్కి యిట్లని నుతించె.

టీక:- దర్పమునన్ = మదముచేత; పొంగి = విజృంభించి; రుచిర = ప్రకాశించుచున్న; మార్తాండ = సూర్యుని యొక్క; దీప్త = వెలుగునట్టి; మండలము = బింబము; తోడన్ = తోటి; మార్పడు = మారు రూప మైనవాడు; మహిత = గొప్ప; శోణమణి = కెంపుల; కిరీటము = కిరీటము; త్రిపురసంహరుని = శివుని {త్రిపుర సంహారుడు - త్రిపురాసురుల సంహరించిన వాడు, శివుడు}; పాద = పాదములు అను; వనజములున్ = పద్మములు {వనజము - వన (నీట) జము (పుట్టినది), పద్మము}; సోకన్ = తాకునట్లుగా; మ్రొక్కి = నమస్కరించి; ఇట్లు = ఈ విధముగ; అని = అని; నుతించెన్ = స్తోత్రము చేసెను.
భావము:- ఆ బాణాసురుడు గర్వంతో ఉప్పొంగిపోతూ, సూర్యకాంతిని ధిక్కరించే తన మణికిరీటం త్రిపుర సంహారుడు అయిన శివుడి పాదపద్మాలకు సోకేలా నమస్కరించి ఇలా స్తుతించాడు.

తెభా-10.2-320-సీ.
"దేవ! జగన్నాథ! దేవేంద్రవందిత!-
వితచారిత్ర! సం పవిత్ర!
హాలాహలాహార! హిరాజకేయూర!-
బాలేందుభూష! సద్భక్తపోష!
ర్వలోకాతీత! ద్గుణసంఘాత!-
పార్వతీహృదయేశ! వవినాశ!
జతాచలస్థాన! జచర్మపరిధాన!-
సురవైరివిధ్వస్త! శూలహన్త!

తెభా-10.2-320.1-తే.
లోకనాయక! సద్భక్తలోకవరద!
సురుచిరాకార! మునిజనస్తుతవిహార!
క్తజనమందిరాంగణపారిజాత!
నిన్ను నెవ్వఁడు నుతిసేయ నేర్చు నభవ!"

టీక:- దేవ = శివా; జగత్ = సర్వలోకములకు; నాథ = ప్రభువైనవాడ; దేవేంద్ర = దేవేంద్రునిచే; వందిత = స్తుతింపబడువాడ; వితత = గొప్ప; చారిత్ర = చరిత్ర కలవాడ; సంతత = సదా; పవిత్ర = పవిత్రమైన వాడా; హాలాహల = హాలాహలము అను విషమును; ఆహార = తినువాడ; అహిరాజ = సర్పరాజు; కేయూర = భుజకీర్తులు కల వాడ; బాలేందు = బాలచంద్రుడు; భూష = ఆభరణముగా కలవాడ; సత్ = మంచి; భక్త = భక్తులను; పోష = కాపాడువాడ; సర్వ = ఎల్ల; లోక = లోకములకు; అతీత = అతీతమైన వాడా; సద్గుణ = సుగుణముల; సంఘాత = సమూహము కలవాడా; పార్వతీ = పార్వతీ దేవి యొక్క; హృదయ = హృదయమునకు; ఈశ = ప్రభువైనవాడ; భవ = సంసారబంధములు; వినాశ = తొలగించువాడ; రజతాచల = వెండికొండ, కైలాసపర్వతం; స్థాన = నివసించువాడ; గజ = ఏనుగు; చర్మ = చర్మమును; పరిధాన = కట్టుకొనువాడ; సురవైరి = రాక్షసులను {సురవైరి - దేవతల శత్రువు, రాక్షసుడు}; విధ్వస్త = సంహరించువాడ; శూల = త్రిశూలమును; హస్త = చేతపట్టుకొనువాడ;
లోక = లోకములకు; నాయక = ప్రభువా; సత్ = మంచి; భక్త = భక్తులు; లోక = అందరికి; వరద = వరములిచ్చువాడ; సు = మంచి; రుచిర = ప్రకాశించు; ఆకార = స్వరూపము కల వాడ; ముని = ఋషులైన; జన = వారి; స్తుత = స్తోత్రములందు; విహార = విహరించువాడ; భక్త = భక్తులు; జన = అందరికి; మందిర = ఇంటి; అంగణ = ముంగిళ్ళ యందలి; పారిజాత = కల్పవృక్షము వంటి వాడ; నిన్నున్ = నిన్ను; ఎవ్వడు = ఎవరు మాత్రము; నుతి = స్తోత్రము; చేయన్ = చేయుటను; నేర్చును = శక్తికలవాడు; అభవ = శివా {అభవ - పుట్టుక లేని వాడు, శివుడు}.
భావము:- “ఓ దేవా! జగన్నాథా! దేవేంద్ర వందితా! పరిశుద్ధ చారిత్రా! పరమ పవిత్ర! హాలాహల భక్షకా! నాగభూషణ! చంద్రశేఖర! భక్తజనసంరక్షకా! సర్వలోకేశ్వరా! పార్వతీపతి! కైలాసవాసా! గజచర్మధారీ! రాక్షసాంతకా! త్రిశూలధారీ! భక్తజనుల ముంగిటి పారిజాతమా! జన్మరహితుడా! నిన్ను ఎవరు మాత్రం స్తుతించ గలరు?”

తెభా-10.2-321-వ.
అని స్తుతియించి.
టీక:- అని = అని; స్తుతియించి = కీర్తించి.
భావము:- ఈ విధంగా అనేక రకాల బాణుడు శివుడిని స్తుతించి...

తెభా-10.2-322-మ.
"నిలో నన్ను నెదిర్చి బాహుబలశౌర్యస్ఫూర్తిఁ బోరాడఁ జా
లి వీరుం డొకఁ డైనఁ బందెమునకున్ లేఁడయ్యె భూమండలి
న్నయంబున్ భవదగ్రదత్తకరసాస్రంబు కండూతి వా
యునుపాయంబునులేద యీభరము నెట్లోర్తున్నుమానాయకా!

టీక:- అని = యుద్ధము; లోన్ = అందు; నన్నున్ = నన్ను; ఎదిర్చి = ఎదిరించి; బాహుబల = భుజబలము; శౌర్య = పరాక్రమము; స్ఫూర్తిన్ = ప్రకాశముతో; పోరాడన్ = యుద్ధము చేయుటకు; చాలిన = శక్తి కలిగిన; వీరుడు = పరాక్రమవంతుడు; ఒకడు = ఒక్కడు; ఐనన్ = అయినప్పటికి; పందెమున్ = పందెమున; కున్ = కైనను; లేడు = లేనివాడు; అయ్యెన్ = అయ్యెను; భూమండలిన్ = మొత్తం భూలోక మంతట; అనయంబున్ = సతతము; భవత్ = నీ చేత; అగ్ర = ముందుగా, తొల్లి; దత్త = ఇయ్యబడిన; కర = చేతులు; సహస్రంబున్ = వేయింటి యొక్క; కండూతి = దురద, తీట; పాయు = తొలగునట్టి; ఉపాయంబున్ = ఉపాయము; లేద = లేకపోయెను; ఈ = ఈ; భరమున్ = బరువును; నేన్ = నేను; ఎట్లు = ఏ విధముగ; ఓర్తున్ = తట్టుకొనగలను; ఉమానాయకా = శివా {ఉమా నాయకుడు - ఉమ (పార్వతీదేవి) యొక్క నాయకుడు (భర్త), శివుడు}.
భావము:- బాణుడు ఇలా అన్నాడు “ఓ పార్వతీపతీ! యుద్ధంలో నన్ను ఎదిరించి నిలిచి తన బాహుబలాన్ని ప్రదర్శింప జాలిన వీరాధివీరుడు ఒక్కడు కూడా ఈ భూమండలంలో ఎంత వెతికినా కనిపించడం లేదు. నీవు ప్రసాదించిన ఈ నా వెయ్యి చేతులు రణకండూతి తీర్చుకొనే ఉపాయం ఏదీ లేదయ్యా. ఈ కండూతి తీరని భారం ఎలా ఓర్చుకోగల నయ్యా? ఈశ్వరా!

తెభా-10.2-323-సీ.
హుంకార కంకణ క్రేంకార శింజినీ-
టంకార నిర్ఘోషసంకులంబు
చండ దోర్దండ భాస్వన్మండలాగ్ర ప్ర-
కాండ ఖండిత రాజమండలంబు
శూలాహతక్షతోద్వే కీలాల క-
ల్లోల కేళీ సమాలోకనంబు
శుంభ దున్మద కుంభి కుంభస్థలధ్వంస-
సంభూత శౌర్య విజృంభణంబు

తెభా-10.2-323.1-తే.
లుగు నుద్దామ భీమ సంగ్రామ కేళి
న పరాక్రమ విక్రమక్రమము గాఁగ
రపలేనట్టి కరములు రము దుఃఖ
రము లగుఁ గాక సంతోషరము లగునె?

టీక:- హుంకార = హుమ్మనిబలంగావేయుట; కంకణ = చేతికడియాల; క్రేంకార = క్రేమ్మను శబ్దము; శింజినీ = వింటితాటి; టంకార = టమ్మను శబ్దముల; నిర్ఘోష = ధ్వనుల; సంకులంబు = కోలాహలము; చండ = భయంకరములైన; దోర్దండ = కఱ్ఱల్లాంటి చేతులందు; భాస్వత్ = ప్రకాశించుచున్న; మండలాగ్ర = కత్తుల యొక్క; ప్రకాండ = సమూహముల చేత; ఖండిత = నరకబడిన; రాజ = రాజుల; మండలంబు = సమూహముల చేత; శూల = శూలాయుధములచే; ఆహత = కొట్టబడుటచేత; క్షత = గాయములనుండి; ఉద్వేల = కారుతున్న; కీలాల = నెత్తురును; కల్లోల = యుద్ధ; కేళీ = క్రీడ యందు; సమాలోకనంబు = చూచుట; శుంభత్ = మిక్కిలి; ఉన్మద = మదము కల; కుంభి = ఏనుగుల; కుంభస్థల = కుంభస్థలములను; ధ్వంస = భేదించుటచేత; సంభూత = పుట్టిన; శౌర్య = శూరత్వము యొక్క; విజృంభణంబు = రేగుట, ఉప్పొంగుట; కలుగు = కలిగినట్టి; ఉద్దామ = గంభీరమైన; భీమ = భయంకరమైన; సంగ్రామ = యుద్ధ; కేళి = క్రీడను; ఘన = గొప్ప; పరా = శత్రువులను; ఆక్రమ = ఆక్రమించుట; విక్రమ = శూరత్వము యొక్క; క్రమము = వరుసగా; కాగన్ = కలుగునట్లు; జరపలేని = చేయలేని; అట్టి = అటువంటి; కరములున్ = చేతులు; కరము = మిక్కిలి; దుఃఖ = దుఃఖమును; కరములు = కలుగించునవి; కాక = కాకుండా; సంతోష = సంతోషమును; కరములు = కలుగించునవి; అగునె = అవుతాయా, కావు.
భావము:- దిక్కులుదద్దరిల్లే హూంకారాలు, చేతి కడియాల కణకణ ధ్వనులు, ధనుష్టంకారాలు చేసే కోలాహలంతో నిండినదీ; చండప్రచండ బాహుదండాలలో ప్రకాశించే ఖడ్గాలతో ఖండింపబడిన శత్రు రాజుల శిరస్సులు కలదీ; శూలపు పోట్లకు శరీరాల నుండి జలజల ప్రవహించే రక్తధారలతో భయంకరమైనదీ; మదించిన ఏనుగుల కుంభస్థలాలను బద్దలుకొట్టే వీరవిజృంభణం కలదీ అయిన భీకర యుద్ధరంగంలో పరాక్రమాన్ని ప్రదర్శించలేనట్టి వట్టి చేతుల వలన ఉపయోగము ఏముంటుంది చెప్పు. అలాంటి చేతులు నా వంటి వీరులకు దుఃఖము కలిగించేవి అవుతాయి కాని సంతోషము కలిగించేవి కావు కదా.

తెభా-10.2-324-ఉ.
కా మదీయ చండభుజర్వ పరాక్రమ కేళికిన్ సముం
డీ నిఖిలావనిం గలఁడె యిందుకళాధర! నీవు దక్కఁగా;"
నా నిటలాంబకుండు దనుజాధిపు మాటకుఁ జాల రోసి లో
నూనిన రోషవార్ధి గడ లొత్తఁ గ నిట్లని పల్కె భూవరా!

టీక:- కాన = కనుక; మదీయ = నా యొక్క; చండ = భయమకరమైన; భుజగర్వ = బాహుబలము; పరాక్రమ = వీరత్వముల యొక్క; కేళికిన్ = విలాసములకు; సముండు = సమానుడు; ఈ = ఈ; నిఖిల = ఎల్ల; అవనిన్ = భూలోకము నందు; కలడె = ఉన్నాడా; ఇందుకళాధర = శివా {ఇందుకళాధర - ఇందుకళ (చంద్రవంక) ధరించిన వాడు, శివుడు}; నీవున్ = నీవు; తక్కగాన్ = తప్పించి; ఆ = ఆ; నిటలాంబకుండు = శివుడు {నిట లాంబకుడు - నిటల (నుదుట) అంబకుడు (కన్ను కలవాడు), శివుడు}; దనుజాధిపున్ = బాణాసురుని; మాట = మాటలు; కున్ = కు; రోసి = అసహ్యించుకొని; లోన్ = మనసులో; ఊనిన = నాటుకొనన; రోష = కోపము అను; వార్ధి = సముద్రము; కడలు = గట్లు; ఒత్తుకొనగన్ = ఒరుసుకొనగ (ఉప్పొంగగా); పల్కెన్ = చెప్పెను; భూవరా = రాజా.
భావము:- ఓ ఇందుధరా! నా ఈ ప్రచండ బాహుదండాల పరాక్రమకేళిని ఎదిరించగల వీరుడు ఈ ప్రపంచం మొత్తంలో నీవు తప్ప మరెవ్వరూ లేరు.” అంటున్న బాణుడి ప్రగల్భపు మాటలకు ఫాలనేత్రుడు అసహ్యించుకుని, లోపలి రోషం పొంగిపొరలగా ఆ దోషాచరుడితో ఇలా అన్నాడు. పరీక్షిన్నరవరా!

తెభా-10.2-325-క.
"విను మూఢహృదయ! నీ కే
మెప్పు డకారణంబ ధారుణిపైఁ గూ
లును నపుడ నీ భుజావలి
దునియఁగ నా యంత వానితో నని గల్గున్. "

టీక:- విను = వినుము; మూఢ = తెలివితక్కువ; హృదయ = మనసు కలవాడ; నీ = నీ యొక్క; కేతనము = జండాకఱ్ఱ; ఎప్పుడున్ = ఎప్పుడైతే; అకారణంబు = కారణము లేకుండ; ధారుణి = భూమి; పైన్ = మీద; కూలునున్ = పడిపోవునో; అప్పుడ = అప్పుడే; నీ = నీ యొక్క; భుజ = బాహువుల; ఆవలి = వరుసలు; తునియగన్ = తెగగొట్టగ; నా = నాతో; అంత = సమానుడైన; వాని = వాడి; తోన్ = తోటి; అని = యుద్ధము; కల్గున్ = సంభవించును.
భావము:- “ఓ మూఢహృదయా! తొందరపడకు నీకేతనం అకారణంగా ఎప్పుడు భూమిపై కూలిపోతుందో, అప్పుడు నీకు నా అంత వాడితో నీ భుజాలు తెగే యుద్ధం జరుగుతుందిలే.”

తెభా-10.2-326-వ.
అని పలికిన నట్లు సంప్రాప్తమనోరథుండై నిజభుజవినాశకార్య ధురీణుం డగు బాణుండు సంతుష్టాంతరంగుం డగుచు నిజనివాసంబు నకుం జని, తన ప్రాణవల్లభల యుల్లంబులు పల్లవింపఁ జేయుచు నిజధ్వజనిపాతంబు నిరీక్షించుచుండె, తదనంతరంబ.
టీక:- అని = అని; పలికినన్ = చెప్పగా; అట్లు = ఆ విధముగ; సంప్రాప్త = లభించిన; మనోరథుండు = కోరిక కలవాడు; ఐ = అయ్యి; నిజ = తన; భుజ = చేతులు; నాశ = నశించెడి; కార్య = పనిని; ధురీణుండు = పూనిన వాడు; అగు = ఐన; బాణుండు = బాణాసురుడు; సంతుష్ట = తృప్తిచెందిన; అంతరంగుడు = మనసు కలవాడు; అగుచున్ = ఔతు; నిజ = తన; నివాసంబు = గృహమున; కున్ = కు; చని = వెళ్ళి; తన = తన యొక్క; ప్రాణవల్లభల = భార్యల; ఉల్లంబులున్ = మనసులు; పల్లవింప = చిగురింప; చేయుచున్ = చేయుచు; నిజ = తన; ధ్వజ = జండాకఱ్ఱ; నిపాతంబున్ = పడిపోవుటను; నిరీక్షించుచుండెన్ = ఎదురుచూచు చుండెను; తదనంతరంబ = అటుపిమ్మట.
భావము:- ఆ పరమేశ్వరుని పలుకులు విని బాణాసురుడు తన కోరిక తీరబోతున్నందుకు చాలా సంతోషించాడు. తన సౌధానికి వెళ్ళిపోయాడు. తన ప్రియురాండ్రతో కూడి ఆనంద డోలికలలో తూగుతూ, ఎప్పుడు తన రథం మీది జండాకొయ్య నేలకొరుగుతుందా అని ఎదురుచూడసాగాడు. అటుపిమ్మట...