పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/మహేశ వైష్ణవ జ్వర ప్రకారంబు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

మహేశవైష్ణవజ్వర ప్రకారంబు

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/మహేశ వైష్ణవ జ్వర ప్రకారంబు)
రచయిత: పోతన


(తెభా-10.2-425-క.)[మార్చు]

శి ములు మూఁడును ఘన భీ
' పదములు మూఁడుఁ గలిగి నలి మహేశ
జ్వ మురు ఘోరాకృతితో
' రుదేరఁగఁ జూచి కృష్ణుఁ ల్లన నగుచున్.

(తెభా-10.2-426-చ.)[మార్చు]

రువడి వైష్ణవజ్వరముఁ బంచిన నయ్యుభయజ్వరంబులున్
వె వును లావుఁ జేవయును వీరము బీరము గల్గి ఘోర సం
మొనరింప నందు గరకంఠకృతజ్వర ముగ్రవైష్ణవ
జ్వ మున కోడి పాఱె ననివారణ వైష్ణవివెంట నంటఁగన్.

(తెభా-10.2-427-తే.)[మార్చు]

పాఱి యే దిక్కుఁ గానక ప్రాణభీతి
నెనసి యేడ్చుచు నా హృషీకేశు పాద
కంజములఁ బడి ననుఁ గావు కావు మనుచు
నిటలతట ఘటితాంజలిపుటయు నగుచు.

(తెభా-10.2-428-వ.)[మార్చు]

ఇట్లు వినుతించె.

(తెభా-10.2-429-సీ.)[మార్చు]

వ్యయు ననఘు ననంతశక్తిని బరు;
యినట్టి బ్రహ్మ రుద్రామరేంద్ర
రుల కీశ్వరుఁ డైనవాని సర్వాత్మకు;
జ్ఞానస్వరూపు సమానరహితు
రదుని జగదుద్భస్థితి సంహార;
హేతుభూతుని హృషీకేశు నభవు
బ్రహ్మచిహ్నంబులై రఁగు సుజ్ఞాన శ;
క్త్యాదుల నొప్పు బ్రహ్మంబు నీశు

(తెభా-10.2-429.1-ఆ.)[మార్చు]

నజు షడూర్మిరహితు నిజయోగమాయా వి
మోహితాఖిలాత్ము ముఖ్యచరితు
హితతేజు నాదిధ్యాంతహీనునిఁ
జిన్మయాత్ము నిను భజింతుఁ గృష్ణ!

(తెభా-10.2-430-వ.)[మార్చు]

అదియునుం గాక లోకంబున దైవం బనేక ప్రకారంబులై యుండు; నది యెట్టిదనినం గళాకాష్ఠాముహూర్తంబులనంగల కాలంబును, సుకృత దుష్కృతానుభవ రూపంబు లైన జీవకర్మంబులును స్వభావంబును, సత్త్వరజస్తమోగుణాత్మకంబైన ప్రకృతియును, సుఖదుఃఖాశ్రయంబైన శరీరంబును, జగజ్జంతు నిర్వాహకంబైన ప్రాణంబును, సకలపదార్థ పరిజ్ఞాన కారణం బైన యంతఃకరణంబును, మహదహంకార శబ్ద స్పర్శ రూప రస గంధ తన్మాత్ర తత్కార్యభూత గగన పవ నానల సలిల ధరాది పంచభూతంబు లాదిగాఁ గల ప్రకృతి వికారంబులును, నన్నింటి సంఘాతంబును, బీజాంకుర న్యాయంబునం గార్యకారణరూప ప్రవాహంబును నై, జగత్కారణ శంకితం బై యుండు; నది యంతయు భవదీయ మాయా విడంబనంబు గాని యున్నయది కాదు; తదీయ మాయానివర్తకుండవైన నీవు నానావిధ దివ్యావతారాదిలీలలం జేసి దేవగణంబులను, సత్పురుషులను, లోకనిర్మాణచణులైన బ్రహ్మాదులను బరిరక్షించుచు లోకహింసాప్రవర్తకులైన దుష్టమార్గ గతులం గ్రూరాత్ముల హింసించుచుందువు; విశ్వ విశ్వంభరాభార నివారణంబు సేయుటకుఁ గదా భవదీయ దివ్యావతార ప్రయోజనంబు; గావున నిన్ను శరణంబు వేఁడెద.

(తెభా-10.2-431-సీ.)[మార్చు]

శాంతమై మహితతీక్ష్ణ సుదుస్సహంబై యు;
దారమై వెలుగొందు తావకీన
భూరిభాస్వత్తేజమునఁ దాప మొందితిఁ;
డుఁ గృశించితి, నన్ను రుణఁజూడుఁ
మితరదేవోపాస్తిరతి మాని మీ పాద;
కమలముల్‌ సేవించు విమలబుద్ధి
యెందాక మది దోఁప దందాఁకనే కదా;
ప్రాణులు నిఖిలతాములఁ బడుట?

(తెభా-10.2-431.1-తే.)[మార్చు]

విరళానన్యగతికుల రసి ప్రోచు
బిరుదుగల నీకు ననుఁ గాచు టరుదె? దేవ!
ప్రవిమలాకార! సంసారయవిదూర!
క్తజనపోషపరితోష! రమపురుష!

(తెభా-10.2-432-చ.)[మార్చు]

నినఁ బ్రసన్నుఁడై హరి యనంతుఁడు దైత్యవిభేది దాని కి
ట్ల నియె మదీయ సాధన మన్యనివారణమౌట నీ మదిం
ని నను నార్తిఁ జొచ్చితివి గావున మజ్జ్వర తీవ్ర దాహ వే
నినుఁ బొంద దింకఁ బరితాపము దక్కుము నీ మనంబునన్.

(తెభా-10.2-433-వ.)[మార్చు]

అని మఱియు నప్పుండరీకాక్షుండిట్లను“నెవ్వరేనియు నీ యుభయజ్వర వివాదంబును, నీవు మత్ప్రపత్తింజొచ్చుటయునుఁ జిత్తంబులం దలంతు రట్టి పుణ్యాత్ములు శీతోష్ణజ్వరాది తాపంబులఁ బొర య” రని యానతిచ్చిన నమ్మహేశ్వరజ్వరంబు పరమానందభరిత హృదయంబై యారథాంగపాణికి సాష్టాంగదండప్రణామం బాచరించి నిజేచ్ఛం జనియె; నంత బాణాసురుండు నక్కడ.

(తెభా-10.2-434-సీ.)[మార్చు]

మనీయ కింకిణీఘంటికా సాహస్ర;
ణఘణధ్వనిచేత గన మగల
న్యజనాలోకనాభీలతరళోగ్ర;
కాంచనధ్వజపతాలు వెలుంగఁ
బృథునేమి ఘట్టనఁ బృథివి కంపింపంగ;
లనొప్పు పటుజవాశ్వములఁ బూన్చి
ట్టి యున్నతరథం త్యుగ్రగతి నెక్కి;
రసహస్రమున భీరతరాసి

(తెభా-10.2-434.1-తే.)[మార్చు]

ర శరాసనముఖ దివ్యసాధనములు
నరఁ జలమును బలము నుత్కటము గాఁగ
ర్ష మిగురొత్తఁ గయ్యంపుటాయితమునఁ
బురము వెలువడె బలిపుత్త్రుఁ డురుజవమున.

(తెభా-10.2-435-క.)[మార్చు]

ని రణభూమిని మధ్యం
ది మార్తాండప్రచండ దీప్తాకృతితోఁ
రుచుఁ బరిపంథిబలేం
దవశిఖియైన కృష్ణుఁ దాఁకెం బెలుచన్.

(తెభా-10.2-436-ఉ.)[మార్చు]

తాఁ కి భుజావిజృంభణము ర్పము నేర్పును నేర్పడంగ నొ
క్కూఁ కున వేయిచేతుల మహోగ్రశరావళి పింజ పింజతోఁ
దాఁ కఁగ నేసినన్ మురవిదారుఁడు తోడన తచ్ఛరావళి
న్నాఁ గొనాకఁ ద్రుంచె నిశితార్ధశశాంక శిలీముఖంబులన్.

(తెభా-10.2-437-వ.)[మార్చు]

అంత.

(తెభా-10.2-438-చ.)[మార్చు]

ను నవపుండరీకనయనుం డన నొప్పు మురారి రోష ఘూ
ర్ణి మహితారుణాబ్జదళనేత్రుఁడు దా నటు పంచె దైత్యుపై
ది తిసుత కాననప్రకరదీపితశుక్రము రక్షితాంచితా
శ్రి జన చక్రమున్ సతతసేవితశక్రము దివ్యచక్రమున్.

(తెభా-10.2-439-వ.)[మార్చు]

అదియునుం బ్రచండమార్తాండమండల ప్రభావిడంబితంబును, భీషణ శతసహస్రకోటి దంభోళినిష్ఠురనిబిడనిశితధారాసహస్ర ప్రభూతజ్వలన జ్వాలికాపాస్త సమస్తకుటిల పరిపంథి దుర్వార బాహాఖర్వ గర్వాంధకారంబును, సకల దిక్పాల దేవతాగణ జేగీయమానంబును, సమదదానవజన శోకకారణ భయంకర దర్శనంబును, సమంచిత సజ్జనలోకప్రియంకర స్పర్శనంబును నగు సుదర్శనం బసురాంతక ప్రేరితంబై చని, యారామకారుండు కదళికా కాండంబుల నేర్చు చందంబునం బేర్చి సమద వేదండ శుండాదండంబుల విడంబించుచుఁ గనకమణివలయ కేయూర కంకణాలంకృతంబు నగు తదీయ బాహా సహస్రంబుఁ గరచతుష్ట యావశిష్టంబుగాఁ దునుము నవసరంబున.

(తెభా-10.2-440-తే.)[మార్చు]

కాలకంఠుఁడు బాణుపైఁ రుణ గలఁడు
గాన నఖిలాండపతిఁ గృష్ణుఁ దియవచ్చి
పురుషసూక్తంబు సదివి సంపుటకరాబ్జుఁ
గుచుఁ బద్మాయతాక్షు నిట్లని స్తుతించె.

21-05-2016: :
గణనాధ్యాయి 10:57, 12 డిసెంబరు 2016 (UTC)