పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/శమంతకపంచకమున కరుగుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

శమంతకపంచకమునకరుగుట

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/శమంతకపంచకమున కరుగుట)
రచయిత: పోతన


(తెభా-10.2-1034-వ.)[మార్చు]

అనిన మఱియుం బరాశరపౌత్రున కర్జునపౌత్రుం డిట్లనియె.

(తెభా-10.2-1035-ఆ.)[మార్చు]

దుష్టశిక్షణంబు దురితసంహరణంబు
శిష్టరక్షణంబుఁ జేయఁ దలఁచి
భువిని మనుజుఁ డగుచుఁ బుట్టిన శ్రీ కృష్ణు
విమలచరిత మెల్ల విస్తరింపు.

(తెభా-10.2-1036-వ.)[మార్చు]

అనిన శుకుం డిట్లనియె.

(తెభా-10.2-1037-సీ.)[మార్చు]

రణీశ! బలుఁడును రసిజోదరుఁడు న;
వోన్నతసుఖలీల నుండునంతఁ
టులోగ్రకల్పాంత మయమందును బోలె;
దృగసహ్యమై సముద్దీప్త మగుచు
రాజిల్లు సూర్యోపరాగంబు సనుదెంచు;
టెఱిఁగి భూజను లెల్ల వరుసఁ గదలి
మును జమదగ్ని రాముఁడు పూని ముయ్యేడు;
మాఱులు ఘనబలోదారుఁ డగుచు

(తెభా-10.2-1037.1-తే.)[మార్చు]

నిజభుజాదండ మండిత నిబిడ నిశిత
టుల దంభోళిరుచిరభాస్వత్కుఠార
హితధారావినిర్భిన్న నుజపాల
దేహనిర్ముక్త రుధిర ప్రవాహములను.

(తెభా-10.2-1038-తే.)[మార్చు]

ను మడువులు గావించె నెచటనేని
ట్టి పావనసుక్షేత్రగు శమంత
పంచకంబున కపుడు సంభ్రమముతోడఁ
నిరి బలకృష్ణులును సంతసం బెలర్ప.

(తెభా-10.2-1039-వ.)[మార్చు]

ఇట్లు నిష్కర్ములైన రామకృష్ణులు లోక ధర్మానుపాలన ప్రవర్తనులై ద్వారకానగర రక్షణంబునకుం బ్రద్యుమ్న గద సాంబ సుచంద్ర శుక సార ణానిరుద్ధ కృతవర్మాది యోధవరుల నియమించి తాము నక్రూర వసుదేవోగ్రసేనాది సకల యాదవులుం గాంతాసమేతులై స్రక్చంద నాభరణ వస్త్రాదులు ధరియించి, శోభనాకారంబులతోడం బుష్పక విమానంబులనం బొలుచు నరదంబులను, మేఘంబుల ననుకరించు గజంబులను, మనోవేగంబులైన తురగంబుల నెక్కి వియచ్చరులం బురుడించు పురుషులు దమ్ము సేవింపం జని య ప్పుణ్య తీర్థంబుల నవగాహనంబు సేసి యుపవసించి, యనంతరంబ.

(తెభా-10.2-1040-క.)[మార్చు]

భూ సురవరులకు ననుపమ
వా సోలంకార ధేను సు రత్న ధరి
త్రీ సుమహిత వస్తువు లు
ల్లా సంబున దాన మిచ్చి లాలితు లగుచున్.

(తెభా-10.2-1041-క.)[మార్చు]

పు రవగాహనములు పెం
పొ రం గావించి బంధుయుక్తముగా భో
కృత్యంబులు దీర్చి స
నురాగము లుల్లసిల్ల చ్చోటఁ దగన్.

(తెభా-10.2-1042-క.)[మార్చు]

శాఖాకీర్ణములై
యి రశ్ములు దూఱనీక యెసకం బెసఁగన్
నిచిన పొన్నల నీడల
నిచిన వేడుకల నందనందన ముఖ్యుల్‌.

(తెభా-10.2-1043-క.)[మార్చు]

రిన పల్లవ రుచిరా
ముల నాసీను లగుచు త్సుఖగోష్ఠిం
బె నుపొందఁగ నట వసియిం
చి చోఁ దత్పుణ్యతీర్థ సేవారతులై.

(తెభా-10.2-1044-వ.)[మార్చు]

మున్న చనుదెంచి యున్న మత్స్యౌశీనర కోసల విదర్భ కురు సృంజయ కాంభోజ కేకయ మద్ర కుంత్యారట్ట కేరలాది భూపతులును, మఱియుం దక్కిన రాజవరులును, హితులును, నంద గోపాది గోపాలురును, గోపికాజనంబులును, ధర్మరాజానుగతులై వచ్చిన భీష్మ ద్రోణ ధృతరాష్ట్ర గాంధారీ కుంతీ పాండవ తద్దార నివహ సంజయ విదుర కృప కుంతిభోజ విరాట భీష్మక నగ్నజి ద్ద్రుపద శైబ్య ధృష్టకేతు కాశిరాజ దమ ఘోష విశాలాక్ష మైథిల యుధామన్యు సుశర్మలును, సపుత్త్రకుండైన బాహ్లికుండును మొదలుగాననేకులు నుగ్రసేనాది యాదవ ప్రకరంబులం బూజలం దృప్తులం జేసిన వారునుం బ్రముదితాత్ములై; రయ్యెడ.

(తెభా-10.2-1045-క.)[మార్చు]

రాజులు గాంచిరి నిజ
'నా రీయుతు లగుచు నంగనాపరివారున్
ధీ రున్ దానవకులసం
'హా రున్ గోపీమనోవిహారు నుదారున్.

(తెభా-10.2-1046-వ.)[మార్చు]

కని య మ్మాధవ బలదేవులు సేయు సముచిత పూజావిధానంబులం బరితృప్తులై, యమ్ముకుందు సాన్నిధ్యంబు గలిగి, తదీయ సంపద్విభవాభిరాము లై విలసిల్లుచున్న యుగ్రసేనాది యదు వృష్ణి పుంగవులం జూచి, వారలతోడ నా రాజవరులు మాధవుండు విన నిట్లనిరి.

(తెభా-10.2-1047-మ.)[మార్చు]

' శాస్త్రంబులువాక్కులున్మనములున్మాంగల్యముంబొందిపా
' మై యొప్పెడి నే రమావిభుని భాస్వత్పాదపంకేజ సే
' తోయంబుల నే మహాత్ముని పదాబ్జాతంబు లెందేని సోఁ
'కి చో టెల్లను ముక్తి హేతువగు, నీ కృష్ణుండె పో! చూడఁగన్.

(తెభా-10.2-1048-చ.)[మార్చు]

' క సనందనాది మునిత్తము లంచిత యోగదృష్టిచేఁ
' నివడి యాత్మలన్ వెదకి ట్ట నగోచరమైన మూర్తి యి
'ట్ల వరతంబు మాంస నయనాంచల గోచరుఁ డయ్యెనట్టె! యే
' నగు? వీరిపుణ్యమున కాదట నెట్టితపంబు సేసిరో?

(తెభా-10.2-1049-మ.)[మార్చు]

'ని యస్వర్గము లాత్మఁ గైకొనక తా నిర్వాణమూర్తైన యీ
' రిఁ జూడన్, హరితోడఁ బల్క, హరిమే నంటన్, హరిం బాడఁగా
' రితో నేఁగ, సహాసనాస్తరణ శయ్యావాసులై యుండఁగన్
' రి బంధుత్వసఖిత్వముల్ గలుగు భాగ్యం బెట్లు సిద్ధించెనో?

(తెభా-10.2-1050-తే.)[మార్చు]

'నుచు యాదవ వృష్ణి భోజాంధకులును
'రిదయాలబ్ధనిఖిలార్థు గుచు నున్న
'నికిఁ దమ చిత్తములఁ బలుమాఱుఁ బొగడి
'రిణమించిరి; యంత న ప్పాండుమహిషి.

(తెభా-10.2-1051-వ.)[మార్చు]

అప్పడు.

(తెభా-10.2-1052-క.)[మార్చు]

సుతులకు గాంధారీ
' యులు గావించు నపకృతంబుల కాత్మన్
ముగ నెరియుచు నచ్చటఁ
' నుఁగొనె వసుదేవు విగతల్మషభావున్.

(తెభా-10.2-1053-వ.)[మార్చు]

అట్లు గనుంగొని యతనితో నిట్లనియె.

21-05-2016: :
గణనాధ్యాయి 11:26, 12 డిసెంబరు 2016 (UTC)