Jump to content

పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/అటుకు లారగించుట

వికీసోర్స్ నుండి

అటుకులారగించుట

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/అటుకు లారగించుట)
రచయిత: పోతన


తెభా-10.2-1012-వ.
అవ్విప్రుండు సనుదెంచిన కార్యంబు కృష్ణుండు దన దివ్యచిత్తంబున నెఱింగి “యితండు పూర్వభవంబున నైశ్వర్యకాముండై నన్ను సేవింపండైన నిక్కుచేలుండు నిజకాంతాముఖోల్లాసంబుకొఱకు నా యొద్దకుఁ జనుదెంచిన వాఁ; డితనికి నింద్రాదులకుం బడయ రాని బహువిధంబులైన సంపద్విశేషంబు లీక్షణంబ యొడఁగూర్పవలయు” నని తలంచి యతండు జీర్ణవస్త్రంబు కొంగున ముడిచి తెచ్చిన యడుకుల ముడియఁ గని “యిది యేమి” యని యొయ్యన నమ్ముడియఁ దనకరకమలంబుల విడిచి యయ్యడుకులు కొన్ని పుచ్చుకొని “యివియ సకల లోకంబులను, నన్నును బరితృప్తిం బొందింపఁ జాలు” నని యప్పుడు.
టీక:- ఆ = ఆ; విప్రుండు = బ్రాహ్మణుడు; చనుదెంచిన = వచ్చిన; కార్యంబున్ = పని; కృష్ణుండు = కృష్ణుడు; తన = తన; దివ్య = దివ్యమైన; చిత్తంబునన్ = మనసు నందు; ఎఱింగి = తెలిసి; ఇతండు = ఇతను; పూర్వ = ముందటి; భవంబునన్ = జన్మము నందు; ఐశ్వర్యకాముండు = సంపదలు కోరినవాడు; ఐ = అయ్యి; నన్నున్ = నన్ను; సేవింపండు = సేవించినవాడు కాడు; ఐన = అయినట్టి; ఈ = ఈ; కుచేలుండు = కుచేలుడు; నిజ = తన; కాంతా = భార్య యొక్క; ముఖ = ముఖమున; ఉల్లాసంబు = సంతోషము; కొఱకున్ = కోసము; నా = నా; ఒద్ద = దగ్గర; కున్ = కు; చనుదెంచినాడు = వచ్చాడు; ఇతని = ఇతని; కిన్ = కి; ఇంద్ర = ఇంద్రుడు; ఆదుల = మున్నగువారి; కున్ = కి; పడయరాని = పొందలేని; బహు = పెక్కు; విధంబులు = విధములు; ఐన = అయిన; సంపత్ = సంపదల; విశేషంబులున్ = అధికములు కలుగుట; ఈ = ఈ; క్షణంబు = క్షణములోనే; ఒడగూర్పన్ = కలుగజేయవలెను; అని = అని; తలంచి = అనుకొని, ఆలోచించి; అతండు = అతను; జీర్ణ = శిధిలమౌతున్న; వస్త్రంబున్ = బట్ట యొక్క; కొంగునన్ = మూల యందు; ముడిచి = ముడివేసి; తెచ్చిన = తీసుకు వచ్చినట్టి; అడుకులున్ = అటుకులను; ముడియన్ = మూటను; కని = చూసి; ఇది = ఇది; ఏమి = ఏమిటి; అని = అని; ఒయ్యనన్ = మెల్లిగా; ఆ = ఆ; ముడియన్ = ముడిని; తన = తన యొక్క; కర = చేతులు అను; కమలంబులన్ = కమలములతోటి; విడిచి = విప్పి; ఆ = ఆ; అడుకులున్ = అటుకులను; కొన్ని = కొన్నిటిని; పుచ్చుకొని = తీసుకొని; ఇవియ = ఇవే; సకల = ఎల్ల; లోకంబులను = లోకములను; నన్నున్ = నన్ను; పరితృప్తిం = సంతృప్తి; పొందింపన్ = పొందించుటకు; చాలును = సరిపడును; అని = అని; అప్పుడు = అప్పుడు.
భావము:- కుచేలుడు వచ్చిన కారణాన్ని శ్రీకృష్ణుడు గ్రహించాడు. పూర్వజన్మ నుండి ఇతడు ఐశ్వర్యాన్ని కోరి నన్ను సేవించినవాడు కాదు. ఇప్పుడు తన భార్య సంతోషం కోసం నా దగ్గరకు వచ్చాడు. కావున ఇంద్రాదులకు సైతం లభించని సకల సంపదల్ని ఈక్షణమే ఇతనికి ఇవ్వాలని భగవంతుడు భావించాడు. తన చినిగిన ఉత్తరీయంలో ముడివేసి కుచేలుడు తీసుకువచ్చిన అటుకులను చూసి, కృష్ణుడు ఆలా అన్నాడు. ఇదేమిటి అని అడుగుతూ ముడి విప్పి అటుకులు గుప్పెడు తీసుకున్నాడు, “నాకూ సమస్త లోకాలకూ సంతృప్తి కలిగించడానికి ఇవి చాలు.” అంటూ కృష్ణుడు ఆ అటుకుల్ని ఆరగించాడు.

తెభా-10.2-1013-క.
ముహరుఁడు పిడికెఁ డడుకులు
మొప్పఁగ నారగించి కౌతూహలియై
ఱియునుఁ బిడికెఁడు గొనఁ ద
త్క మప్పుడు పట్టెఁ గమల రకమలములన్.

టీక:- మురహరుడు = కృష్ణుడు; పిడికెడు = గుప్పెడు; అడుకులు = అటుకులు; కరము = మిక్కిలి; ఒప్పగన్ = యుక్తముగా; ఆరగించి = తిని; కౌతూహలి = కుతూహలము కలవాడు; ఐ = అయ్యి; మఱియును = మరికొంచెము; పిడికెడు = గుప్పెడు; కొనన్ = తీసుకొనగా; తత్ = అతని; కరమున్ = చేతిని; అప్పుడు = అప్పుడు; పట్టెన్ = పట్టుకొనెను; కమల = రుక్మిణీదేవి; కర = చేతులు అను; కమలములన్ = పద్మములతో.
భావము:- శ్రీపతి తీసుకున్న ఆ పిడికెడు అటుకుల్ని ఆదరంగా తిన్న తరువాత, మళ్ళీ ఇంకొక్క పిడికెడు తీసుకుంటున్నాడు. ఇంతలో, రుక్మిణీదేవి తన రెండు చేతులతో భర్త చేయి పట్టుకుని వారిస్తూ ఇలా అన్నది.

తెభా-10.2-1014-క.
"సొం పారఁగ నతనికి బహు
సంద లందింప నివియ చాలును నిఁక భ
క్షింపఁగ వలవదు త్రిజగ
త్సంత్కర! దేవదేవ! ర్వాత్మ! హరీ! "

టీక:- సొంపారగన్ = చక్కగా కలుగను; అతని = అతని; కిన్ = కి; బహు = పెక్కు; సంపదలన్ = సంపదలను; అందింపన్ = ఇచ్చుటకు; ఇవియ = ఇవే; చాలునున్ = సరిపడును; ఇక = మరికొంచెము; భక్షింపగన్ = తినుట; వలవదు = వద్దు; త్రిజగత్సంపత్కర = కృష్ణ {త్రిజగత్సంపత్కరుడు - ముల్లోకములకు సంపదలను కలుగజేయువాడు, విష్ణువు}; దేవదేవ = కృష్ణ {దేవదేవుడు - దేవతలకు దేవుడు, విష్ణువు}; సర్వాత్మ = కృష్ణ {సర్వాత్మ - జగత్తు అంతయు తానైన వాడు, విష్ణువు}; హరీ = కృష్ణ.
భావము:- “దేవాదిదేవా! సకలాంతరాత్మా! శ్రీహరీ! ముజ్జగాలకు సంపద లొసగు వాడా! ఈ కుచేలుడికి సకల సంపదలను అందించడానికి మీరు ఆరగించిన గుప్పెడు అటుకులే చాలు. ఇక భక్షించకండి.”

తెభా-10.2-1015-వ.
అని యిట్లు వారించె; నక్కుచేలుండును నా రాత్రి గోవిందు మందిరంబునఁ దనకు హృదయానందకరంబు లగు వివిధ పదార్థంబు లనుభవించి, మృదుల శయ్యాతలంబున నిద్రించి తన మనంబునం దన్ను సమధిక స్వర్గభోగానుభవుంగాఁ దలంచుచు మఱునాఁ డరుణోదయంబున మేల్కని కాలోచితకృత్యంబులు దీర్చి, యిందిరారమణుండు దన్నుఁ గొంత దవ్వనిపి యామంత్రితుం జేయఁ జనుచు నందనందన సందర్శనానంద లోలాత్ముండై తన మనంబున నిట్లనియె.
టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగ; వారించెన్ = ఆపెను; ఆ = ఆ; కుచేలుండునున్ = కుచేలుడు; ఆ = ఆ; రాత్రి = రాత్రి; గోవిందు = కృష్ణుని; మందిరంబునన్ = గృహము నందు; తన = అతని; కున్ = కి; హృదయ = మనస్సున; కున్ = కు; ఆనంద = ఆనందమును; కరంబులు = కలిగించెడివి; అగు = ఐన; వివిధ = నానా విధములైన; పదార్థంబులన్ = వస్తువులను; అనుభవించి = భుజించి; మృదుల = సున్నితమైన; శయ్యాతలంబునన్ = మంచముమీద; నిద్రించి = నిద్రపోయి; తన = అతని యొక్క; మనంబునన్ = మనస్శు నందు; తన్ను = తనను; సమధిక = మిక్కిలి అధికమైన; స్వర్గ = స్వర్గలోకపు; భోగ = సుఖముల వంటివి; అనుభవున్ = అనుభవించువాని; కాన్ = ఐనట్లు; తలంచుచున్ = భావించుచు; మఱు = తరువాతి; నాడు = రోజు; అరుణోదయంబునన్ = తెల్లవారగట్ల; మేల్కని = నిద్రలేచి; కాల = సమయమునకు; ఉచిత = చేయవలసిన; కృత్యంబులు = పనులు (దంతధావన, సంధ్యోపాసనాది నిత్యకృత్యములు); తీర్చి = చేసుకొని; ఇందిరారమణుండు = కృష్ణుడు; తన్నున్ = తనను; కొంత = కొద్ది; దవ్వు = దూరము; అనిపి = సాగనంపి; ఆమంత్రితుంజేయగా = సెలవిచ్చి పంపగా; చనుచున్ = వెళ్తు; నందనందన = కృష్ణుని; సందర్శన = చూసిన; ఆనంద = ఆనందముతో; లోలాత్ముండు = చలిస్తున్న మనసు గల వాడు; ఐ = అయ్యి; తన = అతని యొక్క; మనంబునన్ = మనసు నందు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను;
భావము:- అలా భర్తను రుక్మిణీదేవి వారించింది. పిమ్మట, కుచేలుడు నాటి రాత్రి శ్రీకృష్ణుని మందిరంలో తనకు ఇష్టమైన రకరకాల పదార్ధాలు అన్నీ భుజించాడు. మెత్తని పానుపు మీద పవళించి తాను స్వర్గభోగాన్ని అనుభవిస్తున్నంతగా సంతోషించాడు. మరునాడు తెలవారగానే అతడు కాలకృత్యాలు అన్నీ తీర్చుకుని, తన ఊరికి బయలుదేరాడు. శ్రీకృష్ణుడు తన అప్తమిత్రుడిని కొంతదూరం కూడా వచ్చి సాగనంపాడు. ఆ నందనందనుడు అయిన శ్రీకృష్ణుని దర్శించిన ఆనందంతో నిండిన అక్కఱతో కుచేలుడు వెళుతూ తనలో తాను ఇలా అనుకున్నాడు.

తెభా-10.2-1016-క.
"నా పుణ్య మరయ నెట్టిదొ
యా పుణ్యనిధిం, బ్రశాంతు, చ్యుతు, నఖిల
వ్యాకు, బ్రహ్మణ్యునిఁ, జి
ద్రూకుఁ, బురుషోత్తమునిఁ, బరుం గనుఁగొంటిన్.

టీక:- నా = నా యొక్క; పుణ్యము = అదృష్టము; ఎట్టిదో = ఎంత గొప్పదో; అరయన్= విచారించగా; ఎట్టిదొ = ఎటువంటిదో; ఆ = ఆ; పుణ్య = పుణ్యములకు; నిధిన్ = ఉనికి పట్టయినవాని; ప్రశాంతున్ = మిక్కిలి శాంతరూపుని; అచ్యుతున్ = కృష్ణుని; అఖిలవ్యాపకున్ = సర్వవ్యాపి యైనవానిని; బ్రహ్మణ్యునిన్ = వేదప్రదిపాదకుని; చిద్రూపకున్ = జ్ఞానస్వరూపు డైనవానిని; పురుషోత్తమునిన్ = కృష్ణుని; పరున్ = సర్వాతీతుని; కనుగొంటిని = చూసితిని;
భావము:- “ఆహా ఏమి నాపుణ్యం? ఆ పుణ్యల రాశిని; పరమ శాంతుని; అచ్యుతుని; అఖిల వ్యాపకుని; చిన్మయ స్వరూపుని; పర మాత్మను; పురు షోత్తముని; శ్రీకృష్ణపరమాత్మను దర్శించ గలిగాను.

తెభా-10.2-1017-సీ.
రికింపఁ గృపణస్వభావుండ నై నట్టి-
యే నేడ? నిఖిలావనీశ్వరి యగు
నిందిరాదేవికి నెనయంగ నిత్య ని-
వాసుఁడై యొప్పు న వ్వాసుదేవుఁ
డే? న న్నర్థిమైఁ దోడఁబుట్టిన వాని-
కైవడిఁ గౌఁగిటఁ దియఁ జేర్చి
దైవంబుగా నన్ను భావించి నిజతల్ప-
మున నుంచి సత్క్రియల్‌ పూనినడపి

తెభా-10.2-1017.1-తే.
చారు నిజవధూ కరసరోజాత కలిత
చామరానిలమున గతశ్రమునిఁ జేసి
శ్రీకుచాలిప్త చందనాంచితకరాబ్జ
లములను నడ్గు లొత్తె వత్సలత మెఱసి.

టీక:- పరికింపన్ = తరచిచూసినచో; కృపణ = లోభపూరితమైన; స్వభావుండన్ = లక్షణములు కలవాడను; ఐన = అయినట్టి; ఏన్ = నేను; ఏడన్ = ఎక్కడ; నిఖిల = సమస్తమైన; అవనీ = లోకములకు; ఈశ్వరి = సర్వనియామకురాలు; అగు = ఐన; ఇందిరాదేవి = లక్ష్మీదేవి; కిన్ = కి; ఎనయంగన్ = పొందికగా; నిత్య = శాశ్వతమైన; నివాసుడు = నివాసస్థానమైనవాడు; ఐ = అయ్యి; ఒప్పు = ఉండెడి; ఆ = ఆ; వాసుదేవుడు = కృష్ణుడు; ఏడన్ = ఎక్కడ; అర్థిమైన్ = ప్రీతితో; తోడబుట్టిన = సహోదరుడైన; వాని = అతని; కైవడిన్ = వలె; కౌగిటన్ = కౌగిట్లో; కదియన్ = దగ్గరకు; చేర్చి = తీసుకొని; దైవంబు = దేవుని; కాన్ = ఐనట్లు; నన్నున్ = నన్ను; భావించి = అనుకొని; నిజ = తన; తల్పమునన్ = పాన్పుపైన; ఉంచి = కూర్చుండపెట్టి; సత్క్రియల్ = మర్యాదలు; పూని = పట్టుగా; నడపి = జరిపించి.
చారు = మనోజ్ఞమైన; నిజ = తన; వధూ = భార్య యొక్క; కర = చేయి అను; సరోజాత = పద్మమునందు; కలిత = ఉన్నట్టి; చామర = వింజామర, విసనకఱ్ఱ; అనిలమునన్ = గాలి వలన; గత = తొలగిన; శ్రముని = శ్రమకలవానిని; చేసి = చేసి; శ్రీ = లక్మీ అంశయైన రుక్మిణి; కుచ = స్తనములందు; ఆలిప్త = పూయబడిన; చందన = మంచిగంధముచేత; అంచిత = అలంకరింపబడిన; కర = చేతులను; అబ్జములను = కమలములచేత; అడ్గులు = కాళ్ళు, అడుగులు; ఒత్తెన్ = పిసికెను; వత్సలతన్ = ప్రేమతో; మెఱసి = అతిశయించి.
భావము:- మందుడను అయిన నే నెక్కడ? లక్ష్మికి నిత్యనివాస మైన వాసుదేవు డెక్కడ? అచ్యుతుడు అనురాగంతో నన్ను తన తోడబుట్టినవాడిలా కౌగిట చేర్చాడు. దేవుడితో సమానమైన వాడిలా భావించి తన పానుపు మీద కూర్చోబెట్టుకున్నాడు. పూని నన్ను గొప్పగా సత్కరించాడు. ఆయన పట్టపుదేవి రుక్మిణీదేవి నాకు వింజామర వీచింది. నా శ్రమను పోగొట్టింది. అతిశయించిన వాత్సల్యంతో శ్రీకృష్ణుడే సాక్షాత్తూ లక్ష్మీదేవిని లాలించే తన చందనాలు అలదిన పాణిపల్లవాలతో ఆప్యాయంగా నా పాదా లొత్తాడు.

తెభా-10.2-1018-వ.
కావున.
టీక:- కావునన్ = అందుచేత.
భావము:- కాబట్టి....

తెభా-10.2-1019-ఉ.
శ్రీనిధి యిట్లు నన్నుఁ బచరించి ఘనంబుగ విత్త మేమియు
న్నీని తెఱంగు గానఁబడె; నెన్న దరిద్రుఁడు సంపదంధుఁడై
కాక తన్నుఁ జేరఁ డని కాక శ్రితార్తి హరుండు సత్కృపాం
భోనిధి సర్వవస్తుపరిపూర్ణునిఁగా ననుఁ జేయకుండునే? "

టీక:- శ్రీనిధి = కృష్ణుడు {శ్రీనిధి - సంపదలకు నిలయమైనవాడు, కృష్ణుడు}; ఇట్లు = ఈ విధముగా; నన్నున్ = నన్ను; పచరించి = గౌరవించి; విత్తము = ధనము, డబ్బులు; ఏమియున్ = ఏమికూడ; ఈని = ఇవ్వని; తెఱంగు = విధము; కానబడెన్ = కనబడుతున్నది; ఎన్నన్ = తరచిచూడగా; దరిద్రుడు = పేదవాడు; సంపద = సంపదలచేత; అంధుడు = కళ్ళు కనబడనివాడు; ఐ = అయ్యి; కానక = తెలిసికొనలేక; తన్నున్ = తనను; చేరడు = ఆశ్రయించడు; అని = అని; కాక = తప్పించి; శ్రిత = ఆశ్రయించినవారి; ఆర్తిన్ = ఆర్తిని; హరుండు = తొలగించువాడు; సత్ = మిక్కిలి; కృపా = దయకు; అంభోనిధి = సముద్రుడు; సర్వ = సమస్తమైన; వస్తు = పదార్థములు; పరిపూర్ణునిన్ = సమృద్ధిగా కలవాని; కాన్ = ఔనట్లు; ననున్ = నన్ను; చేయకుండునె = చేయకుండా ఉండునా.
భావము:- మహా సంపన్నుడు అయిన శ్రీకృష్ణుడు నన్ను గొప్పగా సత్కరించాడు. కానీ దరిద్రుడుకి సంపదలు లభిస్తే గర్వాంధుడై తనను సేవించడని కాబోలు ధనము మాత్రం ఏమీ ఇవ్వలేదు అనుకుంటాను. లేకపొతే ఆశ్రితజనుల ఆర్తిని బాపే అంబుజాక్షుడు, అపార కృపా సముద్రుడు, నాకు సకల సంపదలు అనుగ్రహించకుండా ఉంటాడా?”

తెభా-10.2-1020-వ.
అని తన మనంబున వితర్కించుచు నిజపురంబునకుఁ జనిచని ముందట.
టీక:- అని = అని; తన = తన యొక్క; మనంబునన్ = మనస్సునందు; వితర్కించుచున్ = తలపోసికొనుచు; నిజ = తన; పురంబున్ = ఊరికి; చనిచని = వెళ్ళిపోయి; ముందటన్ = ఎదుట.
భావము:- ఈ మాదిరి ఆలోచనలతో కుచేలుడు పయనించి తన ఊరికి చేరుకున్నాడు. అక్కడ కుచేలుడు తన కట్టెదుట....

తెభా-10.2-1021-సీ.
భానుచంద్రప్రభా భాసమానస్వర్ణ-
చంద్రకాంతోపల సౌధములునుఁ
లకంఠ శుక నీలకంఠ సముత్కంఠ-
మానిత కూజితోద్యానములును
ఫుల్లసితాంభోజ ల్లక కహ్లార-
కైరవోల్లసిత కాసారములును
ణిమయ కనక కంణ ముఖాభరణ వి-
భ్రాజిత దాసదాసీనములుఁ

తెభా-10.2-1021.1-తే.
లిగి చెలువొందు సదనంబుఁ గాంచి విస్మ
మునుఁ బొందుచు "నెట్టి పుణ్యాత్ముఁ డుండు
నిలయ మొక్కొ! యపూర్వమై నెగడె మహిత
వైభవోన్నత లక్ష్మీనివాస మగుచు."

టీక:- భాను = సూర్యునివంటి; చంద్ర = చంద్రునివంటి; ప్రభా = కాంతులచే; భాసమాన = ప్రకాశించుచున్న; స్వర్ణ = బంగారు; చంద్రకాంతోపల = చలువరాళ్ళ; సౌధములను = మేడలు; కలకంఠ = పావురముల; శుక = చిలుకల; నీలకంఠ = నెమళ్ళ; సమ = మిక్కిలి; ఉత్కంఠ = తహతహలతో; మానిత = గౌరవింపబడిన; కూజిత = కూతలు కల; ఉద్యానములును = ఉద్యానవనములు; ఫుల్ల = వికసించిన; సిత = తెల్లని; అంభోజ = తామరలతోచేత; హల్లక = ఎఱ్ఱకలువలు చేత; కహ్లార = కలువపూలచేత; కైరవ = తెల్లకలులవలు చేత; ఉల్లసిత = ప్రకాశించునట్టి; కాసారములును = చెరువులును; మణి = రత్నాలు; మయ = పొదిగిన; కనక = బంగారు; కంకణ = చేతిగాజులు; ముఖ = మున్నగు; ఆభరణ = భూషణములచేత; విభ్రాజిత = మిక్కిలిమెరుస్తున్న; దాస = సేవకులు; దాసీ = సేవకురాళ్ళు; కలిగి = ఉండి.
చెలువొందు = అందగించుచున్న; సదనంబున్ = భవనమును; కాంచి = చూసి; విస్మయమునున్ = ఆశ్చర్యమును; పొందుచున్ = పొందుతు; ఎట్టి = ఎంతటి గొప్ప; పుణ్యాత్ముడు = పుణ్యపురుషుడు; ఉండు = ఉండెడి; నిలయమొక్కొ = నివాసమోకదా; అపూర్వము = అద్భుతమైనది; ఐ = అయ్యి; నెగడెన్ = అతిశయించెన్; మహిత = గొప్ప; వైభవ = వైభవములతో; ఉన్నత = మేలైన; లక్మీ = సంపదలకు; నివాసము = నిలయము; అగుచున్ = ఔతు.
భావము:- సూర్యచంద్రుల కాంతితో ప్రకాశించే పాలరాతి మేడలు, శుక, పిక, మయూరాల కూజితాలతో అలరారే చక్కటి ఉద్యానవనాలు, వికసించిన అనేక వన్నెల తామరలతో కలువలతో కనులపండువుగా ఉన్న సరోవరాలు, మణికంకణాలు మున్నగు రకరకాల భూషణాలూ ధరించి ప్రకాశిస్తున్న దాస దాసీజనము కలిగిన భవనాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. “ఏ పుణ్యాత్ముని భవనమో ఇది సిరిసంపదలకు నిలయముగా అపూర్వంగా ప్రకాశిస్తున్నది.”

తెభా-10.2-1022-వ.
అని తలపోయుచున్న యవసరంబున.
టీక:- అని = అని; తలపోయుచున్న = అనుకొనుచున్నట్టి; అవసరంబునన్ = సమయము నందు.
భావము:- ఇలా అనుకుంటూ సంకోచిస్తున్న సమయంలో...

తెభా-10.2-1023-తే.
దివిజ వనితలఁ బోలెడు తెఱవ లపుడు
డా నేతెంచి "యిందు విచ్చేయుఁ" డనుచు
విల సంగీత నృత్య వాద్యములు సెలఁగ
రిమఁ దోడ్కొని చని రంతిపుమునకును.

టీక:- దివిజ = దేవతా; వనితలన్ = స్త్రీలను; పోలెడు = పోలుచున్నట్టి; తెఱవలు = యువతులు {తెఱవ - తెఱ (తీరైన) వా (ఆమె), స్త్రీ}; అపుడు = అప్పుడు; డాయన్ = దగ్గరకు; ఏరెంచి = వచ్చి; ఇందు = ఇటువైపు; విచ్చేయుడు = రండి; అనుచు = అంటు; విమల = నిర్మలమైన; సంగీత = పాటలు; నృత్య = ఆటలు; వాద్యములు = వాయిద్యములు; చెలగన్ = చెలరేగగా; గరిమన్ = గౌరవముతో; తోడ్కొని = కూడా తీసుకొని; చనిరి = వెళ్ళిరి; అంతిపురమున్ = లోపలి గృహమున; కును = కు.
భావము:- దేవకాంతల వంటి యువతులు కుచేలుని దగ్గరకు వచ్చి, “ఇటు దయచేయండి.” అంటూ స్వాగతం పలికారు. సంగీత నృత్య వాద్యాలతో అతడిని అంతఃపురం లోనికి తీసుకుని వెళ్ళారు.

తెభా-10.2-1024-వ.
ఇట్లు సనుదేర నతని భార్య యైన సతీలలామంబు దన మనంబున నానందరసమగ్న యగుచు.
టీక:- ఇట్లు = ఈ విధముగా; చనుదేర = రాగా; అతని = అతని యొక్క; భార్య = పెండ్లాము; ఐన = అయినట్టి; సతీ = స్త్రీ; లలామంబు = ఉత్తమురాలు; తన = తన యొక్క; మనంబునన్ = మనస్సు నందు; ఆనందరస = ఆనందరసమున; మగ్న = మునిగిన ఆమె; అగుచున్ = ఔతు.
భావము:- కుచేలుడు ఇలా వస్తుండటం చూసిన ఆయన భార్య చాలా సంతోషించింది.

తెభా-10.2-1025-సీ.
న విభురాక ముంటఁ గని మనమున-
ర్షించి వైభవం లర మనుజ
కామినీరూపంబు గైకొన్న యిందిరా-
నిత చందంబునఁ నరుచున్న
లకంఠి తన వాలుఁన్నుల క్రేవల-
నానందబాష్పంబు లంకురింప
తని పాదంబుల కాత్మలో మ్రొక్కి భా-
వంబున నాలింగనంబు సేసె

తెభా-10.2-1025.1-తే.
నా ధరాదేవుఁ డతుల దివ్యాంబరాభ
ణ విభూషితలై రతిరాజు సాయ
ముల గతి నొప్పు పరిచారిలు భజింప
లిత సౌభాగ్య యగు నిజ లనఁ జూచి.

టీక:- తన = తన యొక్క; విభు = భర్త; రాకన్ = వచ్చుటను; ముందటన్ = ఎదురుగా; కని = చూసి; మనమునన్ = మనస్సునందు; హర్షించి = ఆనందించి; వైభవంబులు = వైభవములు; అలరన్ = వికసించగా; మనుజ = మానవ; కామినీ = స్త్రీ; రూపంబున్ = రూపమును; కైకొన్న = వహించినట్టి; ఇందిరా = లక్ష్మీ; వనిత = దేవి; చందంబునన్ = వలె; తనరుచున్న = ఒప్పుచున్న; కలకంఠి = స్త్రీ {కలకంఠి - కోకిల వంటి కంఠస్వరము కలామె, స్త్రీ}; తన = తన యొక్క; వాలుఁగన్నులక్రేవల = కడకన్నులందు {వాలుఁగన్నులక్రేవలు - దీర్ఘములైనకన్నుల చివరలు, కడకన్నులు}; ఆనంద = సంతోషమువలని; బాష్పంబులున్ = కన్నీరు; అంకురింపన్ = ఊరుతుండగ; అతనిన్ = అతని; పాదంబుల్ = కాళ్ళ; కున్ = కు; ఆత్మ = మనస్సు; లోన్ = అందు; మ్రొక్కి = నమస్కరించి; భావంబునన్ = మనస్సునందు; ఆలింగనంబు = కౌగలించుకొనుట; చేసెన్ = చేసెను; ఆ = ఆ.
ధరాదేవుడు = బ్రాహ్మణుడు {ధరాదేవుడు - భూమిపైని దేవుడు, విప్రుడు}; అతుల = సాటిలోని; దివ్య = దివ్యమైన; అంబర = బట్టలు; ఆభరణ = అలంకారములతో; విభూషితలు = అలంకరింపబడినవారు; ఐ = అయ్యి; రతిరాజు = మన్మథుని; సాయకముల = బాణముల; గతిన్ = వలె; ఒప్పు = చక్కగా ఉన్న; పరిచారికలు = సేవకురాండ్రు; భజింపన్ = సేవిస్తుండగా; లలిత = మనోజ్ఞమైన; సౌభాగ్య = సౌభాగ్యవతి; అగు = ఐన; నిజ = తన; లలనన్ = భార్యను, స్త్రీని; చూచి = చూసి.
భావము:- ఆ ఇల్లాలు తన భర్త ఎదురుగా వస్తుంటే చూసి, ఎంతో ఆనందంతో ఎదురువచ్చింది. అప్పుడు ఆమె అపర మహాలక్ష్మిలా ఉంది. ఆమె కనుకొలకుల్లో ఆనందభాష్పాలు రాలుతున్నాయి. మనస్సులోనే భర్త పాదాలకు నమస్కరించి, కౌగలించుకుంది. దివ్యాంబరాలూ ఆభరణాలు ధరించి మన్మథుడి బాణాల లాగ ఉన్న పరిచారికల సేవలందుకుంటూ ఐశ్వర్యంతో తులతూగే తన భార్యను కుచేలుడు చూసాడు.

తెభా-10.2-1026-క.
నారీరత్నంబునుఁ
దానును ననురాగరసము ళుకొత్తఁగ ని
త్యానందము నొందుచుఁ బెం
పూనిన హరిలబ్ధ వైభవోన్నతి మెఱయన్.

టీక:- ఆ = ఆ; నారీ = స్త్రీ; రత్నంబును = శ్రేష్ఠురాలు; తానునున్ = అతను; అనురాగరసము = ప్రేమరసము; తళుకొత్తగా = చిగురించగా; నిత్య = ఎన్నడు చెడని; ఆనందమున్ = ఆనందమును; ఒందుచున్ = పొందుతు; పెంపూనిన = అతిశయించిన; హరి = కృష్ణునివలన; లబ్ధ = లభించిన; వైభవ = వైభవముల; ఉన్నతిన్ = పెంపుతో; మెఱయన్ = ప్రకాశింపగా.
భావము:- కృష్ణుని అనుగ్రహంవలన కలిగిన ఐశ్వర్య వైభవాలకు ఆ భార్యాభర్తలు ఇద్దరకూ సరిక్రొత్త అన్యోన్యానురాగాలు చిగురిస్తుండగా అపారమైన ఆనందాన్ని పొందారు.

తెభా-10.2-1027-సీ.
మనీయ పద్మరాస్తంభకంబులుఁ-
గొమరారు పటికంపుఁ గుడ్యములును
రకత నవరత్నయ కవాటంబులుఁ-
గీలిత హరి నీల జాకములు
దీపిత చంద్రకాంతోల వేదులు-
నంచిత వివిధ పదార్థములును
గు హంసతూలికా ల్పంబులును హేమ-
లాలిత శయనస్థములుఁ దనరు

తెభా-10.2-1027.1-తే.
మధికోత్తుంగ భద్రపీముల సిరులు
మానితోన్నత చతురంతయానములును
లయు సద్వస్తు పరిపూర్ణ వాటికలును
లిగి చెలువొందు మందిరం బెలమిఁ జొచ్చి.

టీక:- కమనీయ = మనోహరమైన; పద్మరాగ = పద్మరాగమణులు పొదగబడిన; స్తంభకంబులు = స్తంభములును; కొమరారు = మనోజ్ఞమైన; పటికంపు = స్ఫటికముల; కుడ్యములును = గోడలును; మరకత = మరకతములును; నవరత్నమయ = వజ్రము, వైడూర్యము, గోమేధికము, పుష్యరాగము, నీలము, మరకతము, మాణిక్యము, విద్రుమము, మౌక్తికము అను తొమ్మిది మణులున్న; కవాటంబులున్ = తలుపులు; కీలిత = పొదగబడిన; హరినీల = ఇంద్రనీలాల; జాలకములు = కిటికీలు; దీపిత = ప్రకాశవంతమైన; చంద్రకాంతోపల = చలువరాళ్ళ; వేదులున్ = వేదికలు; అంచిత = ఒప్పిదమైన; వివిధ = అనేక రకములైన; పదార్థములును = పదార్థములును; తగు = సరియైన; హంసతూలికా = హంసల మెత్తని యీకలు నింపిన; తల్పంబులును = శయ్యలును; హేమ = బంగారపు; లాలిత = అందమైన; శయనస్థలములున్ = పడకటిళ్ళును ; తనరు = ఒప్పు;
సమధిక = మిక్కిల అధికమైన; ఉత్తుంగ = ఎత్తైన; భద్రపీఠముల = పీఠములు; సిరులు = వైభవములు; మానిత = చక్కటి; ఉన్నత = గొప్ప; చతురంతయానములును = పల్లకీలు {చతురంతయానము - నాలుగుకాళ్ళు (బొంగులు) కల పల్లకీ}; వలయు = అవసరమైన; సత్ = మంచి; వస్తు = వస్తువులతో; పరిపూర్ణ = నిండుగా ఉన్నట్టి; వాటికలును = గదుల వరుసలు; కలిగి = ఉండి; చెలువొందు = అందగించు; మందిరంబున్ = గృహమును; ఎలమిన్ = వికాసముతో; చొచ్చి = ప్రవేశించి.
భావము:- పద్మరాగాలు తాపిన చిరుస్తంభాలు; చలువరాతితో నిర్మించిన గోడలు; మరకతమణులు నవరత్నాలు పొదిగిన గుమ్మాలు, తలుపులు; ఇంద్రనీలాల కిటికీలు; అందగించే చంద్రకాంత శిలావేదికలు; బహువిధ పదార్ధాలు; హంసతూలికా తల్పాలు; స్వర్ణమయ శయన మందిరాలు; వైభవోపేతమైన ఉన్నత పీఠములు; చక్కటి నాలుగు బొంగుల పల్లకీలు; కావలసిన సమస్త వస్తువులతో నిండుగా ఉన్న వాటికలు; కలిగి అందాలు చిందే ఆ భవనం లోనికి కుచేలుడు సతీసమేతంగా ఆనందంగా ప్రవేశించాడు.

తెభా-10.2-1028-వ.
సుఖంబున నుండు నట్టియెడం దనకు మనోవికారంబులు వొడమకుండ వర్తించుచు, నిర్మలంబగు తన మనంబున నిట్లను; “నింతకాలం బత్యంత దురంతంబగు దారిద్య్రదుఃఖార్ణవంబున మునింగి యున్న నాకుం గడపటఁ గలిగిన విభవంబున నిప్పుడు.
టీక:- సుఖంబునన్ = సౌఖ్యములతో; ఉండునట్టి = ఉన్నట్టి; ఎడన్ = వేళ; తన = తన; కున్ = కు; మనః = మనస్సు నందు; వికారంబులు = వక్రతలు; పొడమకుండన్ = పుట్టకుండ; వర్తించుచున్ = మెలగుతు; నిర్మలంబు = స్వచ్ఛమైనది; అగు = ఐన; తన = తన; మనంబునన్ = మనస్సు నందు; ఇట్లు = ఈ విధముగా; అనున్ = అనుకొనును; ఇంతకాలంబు = ఇంతవరకు; దురంతంబు = దాటరానిది; అగు = ఐన; దారిద్ర్య = పేదరికము అను; దుఃఖ = దుఃఖపూరితమైన; ఆర్ణవంబునన్ = సముద్రము నందు; మునింగి = ములిగిపోయి; ఉన్న = ఉన్నట్టి; నా = నా; కున్ = కు; కడపటన్ = చివరకు; కలిగిన = లభించిన; విభవంబునన్ = వైభవముచేత; ఇప్పుడు = ఇప్పుడు.
భావము:- కుచేలుడు ఆ దివ్యభవనంలో ఎలాంటి మనోవికారాలకూ లోనుకాకుండా సుఖంగా జీవిస్తూ, తన నిర్మలమైన మనసున ఇలా అనుకున్నాడు “ఇన్నాళ్ళూ దుర్భరమైన దారిద్ర్య దుఃఖసాగరంలో తపించాను. ఇప్పుడు చివరికి ఈ వైభవం కలిగింది.

తెభా-10.2-1029-ఆ.
న్నఁ గ్రొత్త లైన యిట్టి సంపదలు నా
బ్బు టెల్ల హరిదయావలోక
మునఁ జేసి కాదె! ళినాక్షుసన్నిధి
ర్థి నగుచు నేను రుగుటయును.

టీక:- ఎన్నన్ = ఎంచి చూసినచో; క్రొత్తలు = నూతనములు; ఐన = అయిన; ఇట్టి = ఇటువంటి; సంపదలు = కలుములు; నా = నా; కున్ = కు; అబ్బుట = పట్టుట, కలుగుట; ఎల్లన్ = అంతా; హరి = కృష్ణుని; దయా = కృపతోకూడిన; అవలోకనమునన్ = చూపు; చేసి = వలన; కాదె = కాదా, అవును; నళినాక్షు = కృష్ణుని; సన్నిధి = వద్ద; కున్ = కు; అర్థిన్ = కోరువాడను; అగుచున్ = ఔతు; నేను = నేను; అరుగుటయున్ = వెళ్ళుట.
భావము:- ఈ సరిక్రొత్త సంపదలు సమస్తం శ్రీహరి కృపాకటాక్షం వలననే నాకు ప్రాప్తించాయి కదా. నేను శ్రీకృష్ణుని సన్నిధికి అర్థకాంక్షతో వెళ్ళడం....

తెభా-10.2-1030-క.
ను నా వృత్తాంతంబును
మనమునఁ గనియు నేమి డవక ననుఁ బొ
మ్మని యీ సంపద లెల్లను
నొరఁగ నొడఁగూర్చి నన్ను నొడయునిఁ జేసెన్.

టీక:- ననున్ = నన్ను; నా = నా యొక్క; వృత్తాంతంబును = విషయమును; తన = తన యొక్క; మనమునన్ = మనస్సు నందు; కనియున్ = తెలిసికొనినను; ఏమి = ఏమియును; తడవక= ఆలస్యము చేయక; ననున్ = నన్ను; పొమ్ము = వెళ్ళు; అని = అని; ఈ = ఈ; సంపదలు = సంపదలు; ఎల్లనున్ = సమస్తమును; ఒనరన్ = చక్కగా; ఒడగూర్చి = కలుగజేసి; నన్నున్ = నన్ను; ఒడయునిన్ = ప్రభువును; చేసెన్ = చేసెను.
భావము:- ఆ మహానుభావుడు నా సంగతి అంతా గ్రహించినా నన్నేమీ అడగలేదు. నాకు వీడ్కోలిచ్చి పంపాడు. ఈ సకల సంపదలూ అనుగ్రహించి ధనవంతుడిని చేసాడు.

తెభా-10.2-1031-వ.
అట్టి పురుషోత్తముండు భక్తినిష్ఠులైన సజ్జనులు లేశమాత్రంబగు పదార్థంబైన భక్తి పూర్వకంబుగా సమర్పించిన నది కోటిగుణితంబుగాఁ గైకొని మన్నించుటకు నిదియ దృష్టాంతంబు గాదె! మలిన దేహుండును, జీర్ణాంబరుండు నని చిత్తంబున హేయంబుగాఁ బాటింపక నా చేనున్న యడుకు లాదరంబున నారగించి నన్నుం గృతార్థునిం జేయుట యతని నిర్హేతుక దయయ కాదె! యట్టి కారుణ్యసాగరుండైన గోవిందుని చరణారవిందంబుల యందుల భక్తి ప్రతిభవంబునఁ గలుగుంగాక!” యని యప్పుండరీకాక్షుని యందుల భక్తి తాత్వర్యంబునం దగిలి పత్నీసమేతుండై నిఖిల భోగంబులయందు నాసక్తిం బొరయక, రాగాది విరహితుండును నిర్వికారుండును నై యఖిలక్రియలందు ననంతుని యనంత ధ్యాన సుధారసంబునం జొక్కుచు విగత బంధనుండై యపవర్గ ప్రాప్తి నొందె; మఱియును.
టీక:- అట్టి = అటువంటి; పురుషోత్తముండు = కృష్ణుడు {పురుషోత్తముడు - పురుషులలో ఉత్తముడు, విష్ణువు}; భక్తి = భక్తి యందు; నిష్ఠులు = నిష్ఠ కలవారు; ఐన = అయిన; సజ్జనులు = సత్పురుషులు; లేశమాత్రంబు = రవ్వంత; అగు = ఐన; పదార్థంబు = వస్తువు; ఐనన్ = అయినప్పటికి; భక్తి = భక్తి; పూర్వకంబు = తోకూడినది; కాన్ = అగునట్లు; సమర్పించినన్ = ఇచ్చినట్లైతే; అది = దానిని; కోటి = వందలక్షలు (1,00,00,000); గుణితంబు = రెట్లు; కాన్ = ఐనట్లు; కైకొని = పరిగ్రహించి; మన్నించుట = మన్ననచేయు ననుట; కున్ = కు; ఇదియ = ఇదే; దృష్టాంతంబు = ఉదాహరణ; కాదె = కాదా, అవును; మలిన = మాసిపోయిన; దేహుండును = శరీరము కలవాడు; జీర్ణ = చిరిగిపోయిన; అంబరుండును = బట్టలు కట్టుకున్నవాడు; అని = అని; చిత్తంబునన్ = మనస్సు నందు; హేయంబుగాన్ = రోతగా; పాటింపక = తలపక; నా = నా; చేన్ = చేతిలో; ఉన్న = ఉన్నట్టి; అడుకులున్ = అటుకులను; ఆదరంబునన్ = మన్ననతో; ఆరగించి = తిని; నన్నున్ = నన్ను; కృతార్థునిన్ = ధన్యునిగా; చేయుట = చేయుట; అతని = అతని యొక్క; నిర్హేతుక = అకారణమైన; దయయ = కృపయే; కాదె = కాదా, అవును; అట్టి = అటువంటి; కారుణ్య = దయకు; సాగరుండు = సముద్రమువంటివాడు; ఐన = అయిన; గోవిందుని = కృష్ణుని; చరణ = పాదములను; అరవిందంబులన్ = పద్మముల; అందులన్ = ఎడలి; భక్తి = భక్తి; ప్రతి = ప్రతీ ఒక్క; భవంబునన్ = జన్మ యందు; కలుగుంగాక = కలగవలెను; అని = అని; ఆ = ఆ; పుండరీకాక్షున్ = కృష్ణుని; అందులన్ = ఎడల; భక్తి = భక్తి; తాత్పర్యంబులన్ = భావన లందు; తగిలి = లగ్నమై; పత్నీ = భార్యతో; సమేతుండు = కూడినవాడు; ఐ = అయ్యి; నిఖిల = సర్వ; భోగంబుల = సౌఖ్యముల; అందున్ = లోను; ఆసక్తిన్ = ఆపేక్ష యందు; పొరయక = పొర్లక, పొందకుండ; రాగ = తగులములు; విరహితుండును = లేనివాడు; నిర్వికారుండునున్ = వికారము లేని వాడు; ఐ = అయ్యి; అఖిల = సమస్తమైన; క్రియలు = పనులు; అందున్ = లోను; అనంతుని = కృష్ణుని {అనంతుడు - దేశ కాల వస్తు భేదము లందును అంతము లేని వాడు, విష్ణువు}; అనంత = ఎడతెగని; ధ్యాన = ధ్యానించుటలోని; సుధారసంబునన్ = అమృతము నందు; చొక్కుచు = సోలుతు; విగత = తొలగిన; బంధనుడు = బంధనములు కలవాడు; ఐ = అయ్యి; అపవర్గప్రాప్తిన్ = మోక్షమును {అపవర్గప్రాప్తి - పరలోకము లభించుట, మోక్షము}; ఒందెన్ = పొందెను; మఱియును = ఇంకను.
భావము:- భగవంతుడు, భక్తితత్పరులైన సజ్జనులు సమర్పించిన వస్తువు రవ్వంతే అయినా దానిని కోటానుకోట్లుగా స్వీకరించి, భక్తులను అనుగ్రహిస్తాడు అనడానికి నా వృత్తాంతమే తార్కాణం. మాసిన నా శరీరాన్ని చినిగిన బట్టలను చూసి శ్రీకృష్ణుడు మనస్సులో నైనా ఏవగించుకోలేదు. నా దగ్గర ఉన్న అటుకులను ప్రీతిగా ఆరగించాడు. నన్ను ధన్యుణ్ణి చేయడం దామోదరుని నిర్హేతుకవాత్సల్యం మాత్రమే. అంతటి కరుణాసాగరుడైన గోవిందుని పాదారవిందాల మీద నాకు నిండైన భక్తి నెలకొని ఉండు గాక.” అని ఈ మాదిరి తలుస్తూ హరిస్మరణం మరువకుండా కుచేలుడు తన ఇల్లాలితో కలసి జీవించాడు. భోగాలపై ఆసక్తి లేకుండా, రాగద్వేషాది ద్వంద్వాలకు అతీతుడై, నిర్వికారుడై, హరిభక్తి సుధారస వాహినిలో ఓలలాడుతూ, భవబంధాలను బాసి మోక్షాన్ని అందుకున్నాడు. మఱియును...

తెభా-10.2-1032-ఆ.
దేదేవుఁ, డఖిల భాజ్ఞుఁ, డాశ్రిత
రదుఁ డైన హరికి రణిసురులు
దైవతములు గాన ధారుణీదివిజుల
కంటె దైవ మొకఁడు లడె భువిని?

టీక:- దేవదేవుడు = భగవంతుడు {దేవదేవుడు - దేవతలకు దేవుడు, విష్షువు}; అఖిలభావజ్ఞుడు = భగవంతుడు {అఖిల భావజ్ఞుడు - సర్వుల తాత్పర్యములు తెలిసిన వాడు, విష్ణువు}; ఆశ్రితవరదుడు = భగవంతుడు {ఆశ్రిత వరదుడు - ఆశ్రయించినవారికి కోరికలు తీర్చు వాడు}; ఐన = అయినట్టి; హరి = కృష్ణుని; కిన్ = కి; ధరణిసురులు = బ్రాహ్మణులు; దైవతములు = దేవతలు; కానన్ = కాబట్టి; ధారుణీదివిజుల = బ్రాహ్మణుల; కంటెన్ = కంటె; దైవము = దేవుడు; ఒకడు = మరొకడు; కలడె = ఉన్నాడా, లేడు; భువిని = భూలోకము నందు.
భావము:- దేవదేవుడైన వాసుదేవుడికి తెలియని విషయం లేదు; భక్తవత్సలు డగు హరికి బ్రాహ్మణులు అంటే దైవ సమానులు; తరచిచూస్తే, భూలోకంలో వారి కంటే వేరే దైవం లేడు.

తెభా-10.2-1033-క.
ముహరుఁ డిట్లు కుచేలుని
రితార్థునిఁ జేసినట్టి రితము విను స
త్పురుషుల కిహపరసుఖములు
రిభక్తియు యశముఁ గలుగు వనీనాథా!"

టీక:- మురహరుడు = కృష్ణుడు; ఇట్లు = ఈ విధముగా; కుచేలుని = కుచేలుడిని; చరితార్థునిన్ = ధన్యునిగా; చేసినట్టి = చేసిన; చరితము = వృత్తాంతము; విను = వినెడి; సత్పురుషుల = సజ్జనుల; కున్ = కు; ఇహ = ఇహలోకపు; పర = పరలోకపు; సుఖములు = సౌఖ్యములు; హరి = కృష్ణుని; భక్తియున్ = భక్తి; యశము = కీర్తి; కలుగున్ = లభించును; అవనీనాథ = రాజా.
భావము:- ఓ రాజా! మురాసురుని సంహరించిన శ్రీకృష్ణుడు కుచేలుని చరితార్థుడినిగా చేసిన ఈ వృత్తాంతం విన్న వారికి ఇహపర సుఖాలూ, హరిభక్తి, యశస్సూ కలుగుతాయి.” అని శుకుడు పరీక్షిత్తుతో చెప్పాడు.