పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/గురుప్రశంస చేయుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

గురుప్రశంస చేయుట

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/గురుప్రశంస చేయుట)
రచయిత: పోతన


(తెభా-10.2-994-తే.)[మార్చు]

తివిరి యజ్ఞానతిమిర ప్రదీపమగుచు
వ్యయంబైన బ్రహ్మంబు నుభవించు
భరితసత్త్వుండు సత్కర్మనిరతుఁ డతుల
భూసురశ్రేష్ఠుఁ డలఘుండు బుధనుతుండు.

(తెభా-10.2-995-వ.)[మార్చు]

అమ్మహాత్మునివలన సకల వర్ణాశ్రమంబులవారికి నేను విజ్ఞానప్రదుండ నగు గురుండనై యుండియు గురుభజనంబు పరమధర్మం బని యాచరించితి; నదిగావున.

(తెభా-10.2-996-క.)[మార్చు]

భూ సురులకెల్ల ముఖ్యుఁడ
నై కల కులాశ్రమంబు లందును నెపుడున్
ధీ సుజ్ఞానప్రదుఁ డన
దే శికుఁ డన నొప్పుచుందు ధృతి నెల్లెడలన్.

(తెభా-10.2-997-తే.)[మార్చు]

ట్టి వర్ణాశ్రమంబులయందు నర్థ
కుశలు లగువారు నిఖిలైక గురుఁడ నైన
నాదు వాక్యంబుచే భవార్ణవము పెలుచ
దాఁటుదురు మత్పదాంబుజ ధ్యానపరులు.

(తెభా-10.2-998-వ.)[మార్చు]

అదియునుం గాక, సకల భూతాత్మకుండ నైన యేను దపోవ్రత యజ్ఞ దాన శమ దమాదులచేత సంతసింపను; గురుజనంబులఁ బరమభక్తి సేవించువారలం బరిణమింతు” ననిచెప్పి మఱియు “మనము గురుమందిరమున నున్న యెడ నొక్కనాఁడు గురుపత్నీ నియుక్తులమై యింధనార్థం బడవికిం జనిన నయ్యవసరంబున.

(తెభా-10.2-999-సీ.)[మార్చు]

ఘుమఘుమారావ సంకుల ఘోర జీమూత;
టల సంఛన్నాభ్రభాగ మగుచుఁ
టుల ఝంఝానిలోత్కట సముద్ధూత నా;
నావిధ జంతుసంతాన మగుచుఁ
జండ దిగ్వేదండ తుండ నిభాఖండ;
వారిధారాపూర్ణ సుధ యగుచు
విద్యోతమానోగ్రఖద్యోత కిరణజి;
ద్విద్యుద్ద్యుతిచ్ఛటావిభవ మగుచు

(తెభా-10.2-999.1-తే.)[మార్చు]

డరి జడిగురియఁగ నినుఁ స్తమింప
భూరినీరంధ్రనిబిడాంధకార మేచి
సూచికాభేద్యమై వస్తుగోచరంబు
గాని యట్లుండ మనము న వ్వానఁ దడిసి.

(తెభా-10.2-1000-తే.)[మార్చు]

యలు గొందియుఁ బెను మిఱ్ఱుల్లములును
హిత సహితస్థలంబు లేర్పఱుపరాక
యున్న యత్తఱి మనము నొండొరుల చేతు
లూతఁగాఁ గొని నడచుచు నుండునంత.

(తెభా-10.2-1001-క.)[మార్చు]

బి బిస నెప్పుడు నుడుగక
వి రెడి వలిచేత వడఁకు విడువక మనముం
చెడి మార్గముఁ గానక
లితి మంతటను నంశుమంతుఁడు పొడిచెన్.

(తెభా-10.2-1002-క.)[మార్చు]

తె తెలవాఱెడి వేళం
' కల మని పలికెఁ బక్షిణ మెల్లెడలన్
మి మిలని ప్రొద్దుపొడువున
' ధళ మను మెఱుఁగు దిగ్వితానము నిండెన్.

(తెభా-10.2-1003-క.)[మార్చు]

ప్పుడు సాందీపని మన
'చొ ప్పరయుచు వచ్చి వానసోఁకునను వలిం
దె ప్పిఱిలుటఁ గని ఖేదం
'బు ప్పతిలం బలికె నకట! యో! వటులారా!

(తెభా-10.2-1004-చ.)[మార్చు]

' కట! యిట్లు మా కొఱకుఁగాఁజనుదెంచి మహాటవిన్ సము
'త్క పరిపీడ నొందితిరి; గావున శిష్యులు! మీ ఋణంబు నీఁ
'గు కిది కారణంబు సమకూరెడిఁ బో; యిట మీఁద మీకు వి
'స్ఫు ధనబంధుదారబహుపుత్త్ర విభూతి జయాయురున్నతుల్‌.

(తెభా-10.2-1005-క.)[మార్చు]

ని గారవించి యాయన
' లం దోడ్కొనుచు నాత్మమందిరమునకుం
నుదెంచుట లెల్లను నీ
' మునఁ దలఁతే యటంచు ఱియుం బలికెన్.

(తెభా-10.2-1006-వ.)[మార్చు]

“అనఘ! మన మధ్యయనంబు సేయుచు నన్యోన్య స్నేహ వాత్స ల్యంబులం జేయు కృత్యంబులు మఱవవు గదా!” యని యవి యెల్లం దలంచి యాడు మాధవు మధురాలాపంబులు విని యతనిం గనుంగొని కుచేలుం డిట్లనియె.

(తెభా-10.2-1007-క.)[మార్చు]

జోదర! గురుమందిర
'ము మనము వసించునాఁడు ముదమునఁ గావిం
ని పను లెవ్వియుఁ గలవే?
'వి ను మవి యట్లుండనిమ్ము విమలచరిత్రా!

(తెభా-10.2-1008-క.)[మార్చు]

గు రుమతిఁ దలఁపఁగఁ ద్రిజగ
'ద్గు రుఁ డవనం దగిన నీకు గురుఁ డనఁగా నొం
డొ రుఁ డెవ్వ? డింతయును నీ
' యంగ విడంబనంబ గుఁ గాదె హరీ!

(తెభా-10.2-1009-వ.)[మార్చు]

అని సాభిప్రాయంబుగాఁ బలికిన పలుకులు విని సమస్త భావాభిజ్ఞుండైన పుండరీకాక్షుండు మందస్మితవదనారవిందుం డగుచు నతనిం జూచి “నీవిచ్చటికి వచ్చునప్పుడు నాయందుల భక్తింజేసి నాకు నుపాయనంబుగ నేమి పదార్థంబు దెచ్చితి? వప్పదార్థంబు లేశమాత్రంబైనఁ బదివేలుగా నంగీకరింతు; నట్లుగాక నీచవర్తనుండై మద్భక్తిం దగులని దుష్టాత్ముండు హేమాచలతుల్యంబైన పదార్థంబు నొసంగిన నది నా మనంబునకు సమ్మతంబు గాదు; కావున.

(తెభా-10.2-1010-క.)[మార్చు]

మైనఁ బుష్పమైనను
' మైనను సలిలమైనఁ బాయని భక్తిం
గొ లిచిన జను లర్పించిన
'నె మిన్ రుచిరాన్నముగనె యేను భుజింతున్.

(తెభా-10.2-1011-క.)[మార్చు]

ని పద్మోదరుఁ డాడిన
'వి నియోక్తుల కాత్మ నలరి విప్రుఁడు దాఁ దె
చ్చి యడుకులు దగ నర్పిం
' ను నేరక మోము వాంచి లుకక యున్నన్.

21-05-2016: :
గణనాధ్యాయి 11:24, 12 డిసెంబరు 2016 (UTC)