పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/రుక్మిణీదేవి విప్రలంభంబు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

రుక్మిణీదేవి విప్రలంభంబు

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/రుక్మిణీదేవి విప్రలంభంబు)
రచయిత: పోతన


(తెభా-10.2-230-మ.)[మార్చు]

' తి యే రూపము దాల్చినంద దనురూపంబైన రూపంబుతో
' తి దా నుండెడు నట్టి రూపవతి నా చంద్రాస్య నా లక్ష్మి నా
'సు నున్ రుక్ష్మిణి నా యనన్యమతి నా శుద్ధాంతరంగం గళా
' తురత్వంబున శౌరి యిట్లనియెఁ జంన్మందహాసంబుతోన్.

(తెభా-10.2-231-మ.)[మార్చు]

' శౌర్యంబుల భోగమూర్తి కులరూత్యాగ సంపద్గుణం
'బు దిక్పాలురకంటెఁ జైద్యముఖరుల్‌ పూర్ణుల్‌ ఘనుల్‌; వారికిన్
'నె లఁతా! తల్లియుఁదండ్రియుం సహజుఁడున్ నిన్నిచ్చినంబోక యీ
' వద్భీరుల వార్ధిలీనుల మముం బాటింప నీ కేటికిన్?

(తెభా-10.2-232-సీ.)[మార్చు]

'లోకుల నడవడిలోని వారము గాము;
'రులకు మా జాడ యలు పడదు;
'లమదోపేతులు గగొండ్రు మా తోడ;
'రాజపీఠములకు రాము తఱచు;
'రణంబు మాకు నీ లరాశి సతతంబు;
'నిష్కించనుల మేము; నిధులు లేవు;
'లవారు చుట్టాలు గారు; నిష్కించన;
'నబంధులము; ముక్తసంగ్రహులము;

(తెభా-10.2-232.1-ఆ.)[మార్చు]

'గూఢవర్తనులము; గుణహీనులము; భిక్షు
'లైన వారిఁ గాని నాశ్రయింప;
'మిందుముఖులు దగుల; రిటువంటి మముబోఁటి
'వారి నేల దగుల వారిజాక్షి!

(తెభా-10.2-233-క.)[మార్చు]

సి రియును వంశము రూపును
' రియైన వివాహసఖ్య సంబంధంబుల్‌
రుగును; సరి గాకున్నను
' గవు; లోలాక్షి! యెట్టి సంసారులకున్.

(తెభా-10.2-234-క.)[మార్చు]

దని యెఱుఁగవు మమ్ముం
' గిలితివి మృగాక్షి! దీనఁ ప్పగు; నీకుం
గిన మనుజేంద్రు నొక్కనిఁ
' గులుము; గుణహీనజనులఁ గునే తగులన్?

(తెభా-10.2-235-సీ.)[మార్చు]

'సాల్వ జరాసంధ చై ద్యాది రాజులు;
'చెలఁగి నన్ వీక్షించి మలయుచుండ
'ది గాక రుక్మి నీ న్నయు గర్వించి;
'వీర్యమదాంధుఁ డై వెలయుచున్న
'వారి గర్వంబులు వారింపఁగాఁ గోరి;
'చెలువ! నిన్నొడిచి తెచ్చితిమి; గాని
'కాంతా తనూజార్థ కాముకులము గాము;
'కామమోహాదులఁ గ్రందుకొనము;

(తెభా-10.2-235.1-తే.)[మార్చు]

'విను; ముదాసీనులము; క్రియావిరహితులము
'పూర్ణులము మేము; నిత్యాత్మబుద్ధితోడ
'వెలుఁగుచుందుము గృహదీపవిధము మెఱసి;
'వలతాతన్వి! మాతోడ వయ వలదు.

(తెభా-10.2-236-వ.)[మార్చు]

అని యిట్లు భగవంతుడైన హరి దన్నుఁ బాయక సేవించుటం బ్రియురాలను, పట్టంపుదేవి ననియెడి రుక్మిణి దర్పంబు నేర్పున నుపసంహరించి యూరకుండిన నమ్మానవతి యప్రియంబులు నపూర్వంబులు నైన మనోవల్లభు మాటలు విని దురంతంబైన చింతాభరంబున సంతాపంబు నొందుచు.

(తెభా-10.2-237-సీ.)[మార్చు]

'కాటుక నెఱయంగఁ న్నీరు వరదలై;
'కుచకుంభయుగళ కుంకుమము దడియ
'విడువక వెడలెడు వేఁడినిట్టూర్పుల;
'లాలితాధర కిసయము గందఁ
'జెలువంబు నెఱిదప్పి చిన్నఁవోవుచు నున్న;
'దనారవిందంబు వాడు దోఁప
'మారుతాహతిఁ దూలు హిత కల్పకవల్లి;
'డువున మేన్ వడడ వడంకఁ

(తెభా-10.2-237.1-తే.)[మార్చు]

'జిత్త మెఱియంగఁ జెక్కిటఁ జేయ్యి సేర్చి
'కౌతుకం బేది పదతలాగ్రమున నేల
'వ్రాసి పెంపుచు మో మరవాంచి వగలఁ
'బొందె మవ్వంబు గందిన పువ్వుఁబోలె.

(తెభా-10.2-238-చ.)[మార్చు]

లికుల వేణి తన్నుఁ బ్రియుఁ డాడిన యప్రియభాష లిమ్మెయిన్
సొ వక కర్ణరంధ్రముల సూదులు చొచ్చిన రీతిఁగాఁగ బె
బ్బు లి రొద విన్న లేడి క్రియఁ బొల్పఱి చేష్టలు దక్కి నేలపై
నఱి వ్రాలెఁ గీ లెడలి వ్రాలిన పుత్తడిబొమ్మ కైవడిన్.

(తెభా-10.2-239-వ.)[మార్చు]

ఇట్లు వ్రాలిన.

(తెభా-10.2-240-మ.)[మార్చు]

ప్ర తామ్నాయుఁడు కృష్ణుఁ డంతఁ గదిసెన్ బాష్పావరుద్ధారుణే
క్ష విస్రస్త వినూత్నభూషణ దురుక్తక్రూర నారాచ శో
నాలింగితధారుణిన్ నిజకులాచారైక సద్ధర్మ చా
రి ణి విశ్లేషిణి వీతతోషిణిఁ బురంధ్రీగ్రామణిన్ రుక్మిణిన్.

(తెభా-10.2-241-సీ.)[మార్చు]

ని సంభ్రమంబునఁ నువునం దనువుగా;
నువునఁ జందనం ల్ల నలఁది
న్నీరు పన్నీటఁ డిగి కర్పూరంపుఁ;
లుకులు సెవులలోఁ బాఱ నూఁది
రమొప్ప ముత్యాలరుల చి క్కెడలించి;
యురమునఁ బొందుగా నిరవుకొలిపి
తిలకంబు నునుఫాలఫలకంబుపైఁ దీర్చి;
దలిన భూషణాళులఁ దొడిగి

(తెభా-10.2-241.1-తే.)[మార్చు]

మలదళ చారు తాలవృంమున విసరి
పొలుచు పయ్యెదఁ గుచములఁ బొందుపఱిచి
చిత్త మిగురొత్త నొయ్యన సేదఁదీర్చి
బిగియఁ గౌఁగిటఁ జేర్చి నె మ్మొగము నిమిరి.

(తెభా-10.2-242-తే.)[మార్చు]

నెరులు గలమరునీలంపు టురుల సిరుల
రులుగొనఁ జాలి నరులను రులు కొలుపు
యిరులు గెలిచిన తుమ్మెద గఱులఁ దెగడు
కురుల నులిదీర్చి విరు లిడి కొప్పువెట్టి.

(తెభా-10.2-243-క.)[మార్చు]

ము సంహరుఁ డిందిందిర
రుదనిలచలత్ప్రసూనలికాంచిత సుం
శయ్యఁ జేర్చె భీష్మక
పుత్రిన్ నుతచరిత్ర వారిజనేత్రన్.

(తెభా-10.2-244-వ.)[మార్చు]

ఇట్లు పానుపునం జేర్చి మృదుమధుర భాషణంబుల ననునయించిన.

(తెభా-10.2-245-క.)[మార్చు]

పు రుషోత్తము ముఖకోమల
సిజ మయ్యిందువదన వ్రీడా హా
రుచిస్నిగ్ధాపాంగ
స్ఫు దవలోకనము లొలయఁ జూ చిట్లనియెన్.

21-05-2016: :
గణనాధ్యాయి 10:38, 12 డిసెంబరు 2016 (UTC)