పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/రుక్మిణిదేవి స్తుతించుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

రుక్మిణిదేవి స్తుతించుట

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/రుక్మిణిదేవి స్తుతించుట)
రచయిత: పోతన


(తెభా-10.2-246-క.)[మార్చు]

ము హర! దివసాగమ దళ
విందదళాక్ష! తలఁప ది యట్టి దగున్
ని వధిక విమలతేజో
మూర్తివి; భక్తలోకత్సల! యెందున్.

(తెభా-10.2-247-తే.)[మార్చు]

సంచితజ్ఞాన సుఖ బలైశ్వర్య శక్తు
లాదిగాఁ గల సుగుణంబు మరు నీకు;
నేను దగుదునె? సర్వలోకేశ్వరేశ!
లీలమై సచ్చిదానందశాలి వనఘ!

(తెభా-10.2-248-సీ.)[మార్చు]

రూఢిమైఁ బ్రకృతి పూరుష కాలములకు నీ;
శ్వరుఁడవై భవదీయ చారుదివ్య
లితకళా కౌశమున నభిరతుఁడై;
డఁగు నీ రూప మెక్కడ మహాత్మ!
త్త్వాది గుణసముచ్చయయుక్త మూఢాత్మ;
యిన నే నెక్కడ? నఘచరిత!
కోరి నీ మంగళ గుణభూతి గానంబు;
సేయంగఁబడు నని చెందు భీతి

(తెభా-10.2-248.1-తే.)[మార్చు]

నంబునిధి మధ్యభాగమం మృత ఫేన
టల పాండుర నిభమూర్తి న్నగేంద్ర
భోగశయ్యను బవ్వళింపుచును దనరు
ట్టి యున్నతలీల దివ్యంబు దలఁప.

(తెభా-10.2-249-వ.)[మార్చు]

శబ్ద స్పర్శ రూప రస గంధంబు లనియెడు గుణంబులచేతఁ బరిగ్రహింపఁబడిన మంగళ సుందర విగ్రహుండవై, యజ్ఞానాంధకార నివారకంబైన రూపంబుఁ గైకొని, భవదీయులైన సేవకులకు ననుభావ్యుండ వైతి; భవత్పాదారవింద మకరందరసాస్వాద లోలాత్ములైన యోగీంద్రులకైనను భవన్మార్గంబు స్ఫుటంబు గా; దట్లగుటం జేసి యీ మనుజపశువులకు దుర్విభావ్యంబగుట యేమిసెప్ప? నిట్టి యీశ్వరుండవైన నీకు నిచ్ఛ స్వతంత్రంబు గావున నదియును నా కభిమతంబు గావున నిన్ను నే ననుసరింతు; దేవా! నీవకించనుఁడవైతేని బలిభోక్తలయిన బ్రహ్మేంద్రాదు లెవ్వనికొఱకు బలిసమర్పణంబు సేసిరి? నీవు సమస్త పురుషార్థమయుండ వనియును, ఫలస్వరూపి వనియును నీ యందలి ప్రేమాతిశయంబులం జేసి విజ్ఞానదీపాంకురంబున నిరస్త సమస్త దోషాంధకారులై యిహసౌఖ్యంబులు విడిచి సుమతులు భవదీయదాస సంగంబు గోరుచుండుదు; రట్లు సేయనేరక నిజాధికారాంధకారమగ్ను లైన వారు భవత్తత్త్వంబు దెలిసి బలిప్రక్షేపణంబులు సేయంజాలక మూఢులై సంసారచక్రంబునం బరిభ్రమింతు; రదియునుంగాక.

(తెభా-10.2-250-ఆ.)[మార్చు]

'రమునీంద్ర యోగిర సురకోటిచే
'ర్ణితప్రభావవైభవంబు
'గలిగి యఖిలచేతనులకు విజ్ఞాన ప్ర
'దుండ వగుదు వభవ! దురితదూర!

(తెభా-10.2-251-వ.)[మార్చు]

దేవా! భవదీయ కుటిల భ్రూవిక్షేపోదీరిత కాలవేగంబుచేత విధ్వస్తమంగళు లగు కమలభవ భవ పాకశాసనాదులం దిరస్కరించినట్టి మదీయ చిత్తంబున.

(తెభా-10.2-252-చ.)[మార్చు]

'ని ను వరియించినం బెలుచ నీరజలోచన! శార్‌ఙ్గ సాయకా
' నినదంబులన్ సకల త్రుధరాపతులన్ జయించి బో
' పశుకోటిఁ దోలు మృగరాజు నిజాంశము భూరిశక్తిఁ గై
'కొ నిన విధంబునన్ నను నకుంఠిత శూరతఁ దెచ్చి తీశ్వరా!

(తెభా-10.2-253-ఉ.)[మార్చు]

' ట్టి నృపాల కీటముల నాజి నెదుర్పఁగ లేనివాని య
'ట్లొ ట్టిన భీతిమై నిటు పయోధిశరణ్యుఁడ వైతి వింతయున్
'నె ట్టన మాయ గాక యివి నిక్కములే? భవదీయ భక్తు లై
' ట్టి నరేంద్రమౌళిమణు లంచిత రాజఋషుల్‌ ముదంబునన్.

(తెభా-10.2-254-ఆ.)[మార్చు]

'వితత రాజ్యగరిమ విడిచి కాననముల
'నాత్మలందు మీ పదాబ్జయుగము
'లఁతి గాఁగ నిలిపి వాతాంబు పర్ణాశ
'నోగ్రనియతు లగుచు నుందు రభవ!

(తెభా-10.2-255-మ.)[మార్చు]

'వి లజ్ఞాననిరూఢులైన జనముల్‌ వీక్షింప మీ పాద కం
' రందస్ఫుట దివ్యసౌరభము నాస్వాదించి నిర్వాణ రూ
' ము సత్పూరుష వాగుదీరితము శోభాశ్రీనివాసంబు నౌ
'మి ము సేవింపక మానవాధముని దుర్మేధాత్ము సేవింతునే?

(తెభా-10.2-256-వ.)[మార్చు]

మఱియును దేవా! భూలోకంబునందును, నిత్యనివాసంబునందును, సకల ప్రదేశంబులందును జగదీశ్వరుండ వయిన నిన్ను నభిమతంబులయిన కామరూపంబులు గైకొని వరియింతు; భవదీయ చరణారవింద మకరందాస్వాదన చాతుర్యధుర్యభృంగియైన కామిని యతి హేయంబైన త్వక్‌ శ్మశ్రు రోమ నఖ కేశంబులచేతఁ గప్పంబడి యంతర్గతంబయిన మాంసాస్థి రక్త క్రిమి విట్కఫ పిత్త వాతంబుగల జీవచ్ఛవంబయిన నరాధముని మూఢాత్మయై కామించునే? యదియునుంగాక.

(తెభా-10.2-257-సీ.)[మార్చు]

'నీరదాగమమేఘనిర్యత్పయః పాన;
'చాతకం బేగునే చౌటి పడెకుఁ?
'రిపక్వ మాకంద లరసంబులు గ్రోలు;
'కీరంబు సనునె దుత్తూరములకు?
'నర వాకర్ణనోత్కలిక మయూరము;
'గోరునే కఠిన ఝిల్లీరవంబుఁ?
'రికుంభ పిశిత సద్గ్రాస మోదిత సింహ;
'రుగునే శునక మాంసాభిలాషఁ

(తెభా-10.2-257.1-తే.)[మార్చు]

'బ్రవిమలాకార! భవదీయ పాదపద్మ
'యుగ సమాశ్రయ నైపుణోద్యోగచిత్త
'న్యుఁ జేరునె తన కుపాస్యంబు గాఁగ?
'క్తమందార! దుర్భర వవిదూర!

(తెభా-10.2-258-క.)[మార్చు]

వా వవందిత! భవ కమ
'లా న దివ్యప్రభా సభావలి కెపుడున్
నీ మధిక చారిత్ర క
'థా సురుచిరగాన మవితథం బయి చెల్లున్.

(తెభా-10.2-259-క.)[మార్చు]

ణీనాథులు దమతమ
' వనితామందిరముల సియించుచు గో
మార్జాలంబుల గతి
'స్థి బద్ధు లగుదురు నిన్నుఁ దెలియని కతనన్.

(తెభా-10.2-260-ఆ.)[మార్చు]

'లజనాభ! సకల గ దంతరాత్మవై
'ట్టి దేవ! నీ పదారవింద
'యుగళి సానురాగయుక్తమై నా మదిఁ
'లుగునట్లు గాఁగఁ లఁపు మనఘ!

(తెభా-10.2-261-ఆ.)[మార్చు]

పృథు రజోగుణప్రవృద్ధమైనట్టి నీ
దృష్టిచేత నన్నుఁ దేఱుకొనఁగఁ
జూచు టెల్ల పద్మలోచన! నా మీఁద
నదయార్ద్రదృష్టిగాఁ దలంతు.

(తెభా-10.2-262-వ.)[మార్చు]

అదియునుంగాక, మధుసూదనా! నీవాక్యంబులు మిథ్యలుగావు; తల్లి వచనంబు కూఁతున కభిమతంబుగాదె? యౌవనారూఢమదంబున స్వైరిణి యగు కామిని పురుషాంతరాసక్త యగుట విచారించి పరిజ్ఞాని యైనవాఁడు విడుచు; నవివేకి యయిన పురుషుం డింద్రియలోలుండై రతిం దగిలి దాని విడువనేరక పరిగ్రహించి యుభయలోకచ్యుతుండగు; నట్లుగావున నీ యెఱుంగని యర్థంబు గలదే?” యని విన్నవించిన రుక్ష్మిణీదేవి వచనంబులకుఁ గృష్ణుండు సంతసిల్లి యిట్లనియె.

21-05-2016: :
గణనాధ్యాయి 10:39, 12 డిసెంబరు 2016 (UTC)