పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/రుక్మిణీదేవి నూరడించుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

రుక్మిణీదేవినూరడించుట

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/రుక్మిణీదేవి నూరడించుట)
రచయిత: పోతన


(తెభా-10.2-263-చ.)[మార్చు]

లికులవేణి! నవ్వులకు నాడినమాటల కింత నీ మదిం
లఁగఁగ నేల? వేఁటలను య్యములన్ రతులందు నొవ్వఁగాఁ
లికినమాట లెగ్గు లని ట్టుదురే? భవదీయ చిత్తముం
దె లియఁగఁ గోరి యేఁ బలికితిన్ మదిలో నిటు గుంద నేఁటికిన్?

(తెభా-10.2-264-వ.)[మార్చు]

అదియునుం గాక.

(తెభా-10.2-265-ఉ.)[మార్చు]

కిం లు ముద్దుఁబల్కులును గెంపుఁగనుంగవ తియ్యమోవియున్
జం కెలు తేఱిచూపు లెకక్కెములున్ నెలవంక బొమ్మలుం
గొం క వీడనాడుటలుఁ గూరిమియుం గల కాంతఁ గూడుటల్‌
అం కిలి లేక జన్మఫల బ్బుట గాదె కురంగలోచనా!

(తెభా-10.2-266-వ.)[మార్చు]

అని మఱియు నిట్లనియె.

(తెభా-10.2-267-ఉ.)[మార్చు]

నీ వు పతిప్రతామణివి నిర్మల ధర్మవివేక శీల స
ద్భా వు నీ మనోగతులఁ బాయక యెప్పుడు నస్మదీయ సం
సే య కాని యన్యము భజింపవు; పుట్టిన నాఁటనుండి నీ
భా మెఱింగి యుండియును ల్కిన తప్పు సహింపు మానినీ!

(తెభా-10.2-268-వ.)[మార్చు]

అని వెండియు నిట్లనియె “నీవాక్యంబులు శ్రవణసుఖంబుగావించె; నీవు వివిధంబులైన కామంబులు గోరితివేని, నవియన్నియు నాయంద యుండుటం జేసి యేకాంతసేవాచతుర వైన నీకు నవి యన్నియు నిత్యంబులై యుండు; నీ పాతివ్రత్యంబును, నా యందలి స్నేహంబు నతివిశదంబు లయ్యె; నావాక్యములచేత భవ దీయచిత్తంబు చంచలంబు గాక నా యందలి బుద్ధి దృఢంబగుం గావున సకలసంపద్విలసితంబైన ద్వారకానగర దివ్యమందిరంబు లందు నీదు భాగ్యంబునం జేసి సంసారికైవడి నీ యందు బద్ధానురాగుండనై వర్తింతుఁ; దక్కిన ప్రాణేంద్రియ పరవశత్వంబున వికృత శరీరధారిణియైన సతి నన్నుం జెందుట దుష్కరం; బదియునుం గాక మోక్షప్రదుండనైన నన్నుఁ గామాతురలైన యల్పమతులు వ్రతతపోమహిమలచేత దాంపత్య యోగంబుకై సేవింతు; రదియంతయు నా మాయా విజృంభితంబు; దానంజేసి వారు మందభాగ్యలై నిరయంబు నొందుదు; రట్లుగావున నీ సమానయైన కాంత యే కాంతలందైనఁ గలదె? నీ వివాహకాలంబు ననేక రాజన్యవర్యులఁ గైకొనక భవదీయ మధురాలాప శ్రవణాత్మకుండనైన నా సన్నిధికి "నా శరీరం బితర యోగ్యంబు గాదు; నీకు శేషంబనయి యున్న దాన" నని యేకాంతంబునం బ్రాహ్మణుం బుత్తెంచిన నేనును జనుదెంచి, నీ పరిణయసమయంబున భవత్సహోదరుంబట్టి విరూపుం గావించిన నది గనుంగొనియును నా యందలి విప్రయోగ భయంబున నూరకుండితి; వదిగావున బహుప్రకారంబులై వర్తించు నీ సద్గుణంబులకు సంతసింతు!”నని యివ్విధంబున దేవకీసుతుండు నరలోక విడంబనంబుగ గృహస్థునిభంగి నిజగృహకృత్యంబు లాచరించుచుండె"నని శుకుండు మఱియు నిట్లనియె.

(తెభా-10.2-269-క.)[మార్చు]

ని యిట్లు కృష్ణుఁ డాడిన
వి య వివేకానులాప వితతామృత సే
ముదిత హృదయయై య
వ్వ నితామణి వికచ వదన నరుహ యగుచున్.

(తెభా-10.2-270-క.)[మార్చు]

వామతించు చూపులు
ధరు మోమునను నిలిపి యమునఁ గరముల్‌
మొ గిచి వినుతించెఁ గృష్ణున్
వాహున్ రుచిరదేహుఁ లితోత్సాహున్.

(తెభా-10.2-271-చ.)[మార్చు]

తుల విరాజమానముఖుఁడై వివిధాంబర చారుభూషణ
ప్ర తులతోఁడ గోరిన వరంబులు దద్దయుఁ నిచ్చెగృష్ణుఁ డు
న్న శుభమూర్తి దేవగణనందితకీర్తి దయానువర్తియై
తిమృదువాణికిం గిసలయారుణపాణికి నీలవేణికిన్.

(తెభా-10.2-272-వ.)[మార్చు]

ఇట్లుసమ్మానించి కృష్ణుండు రుక్మిణియుందానును దదనంతరంబ.

(తెభా-10.2-273-చ.)[మార్చు]

మి ఘటింపఁగాఁ గలసి యీడెల నీడల మల్లికా లతా
లిఁ గరవీరజాతి విరవాదుల వీథులఁ గమ్మ దెమ్మెరల్‌
వొ యు నవీనవాసములఁ బొన్నలఁ దిన్నెలఁ బచ్చరచ్చలం
గొ లఁకుల లేఁగెలంకులను గోరిక లీరిక లొత్తఁ గ్రొత్తలై.

(తెభా-10.2-274-క.)[మార్చు]

రామభూములందు వి
హా రామల సౌఖ్యలీల తిమోదముతో
నా రామానుజుఁ డుండెను
నా రామామణియుఁ దాను భిరామముగన్.

21-05-2016: :
గణనాధ్యాయి 10:39, 12 డిసెంబరు 2016 (UTC)