పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/కృష్ణకుమా రోత్పత్తి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

కృష్ణకుమారోత్పత్తి

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/కృష్ణకుమా రోత్పత్తి)
రచయిత: పోతన


(తెభా-10.2-275-వ.)[మార్చు]

మఱియు, ననేకవిధ విచిత్రమణివితానాభిశోభిత ప్రాసాదోపరిభాగంబులను, లాలిత నీలకంఠ కలకంఠ కలవింక శుక కలాప కలిత తీరంబులను, మకరందపానమదవదిందిందిర ఝంకార సంకుల కమల కహ్లార సుధాసార నీహా పూరిత కాసారంబులను, ధాతు నిర్ఝర రంజిత సానుదేశగిరి కుంజపుంజంబులను, గృతకశైలంబులను, గ్రీడాగృహంబులనుం జెలంగి నందనందనుండు విదర్భరాజనందనం దగిలి కందర్పకేళీలోలాత్ముండయ్యె; ననంతరంబా సుందరీలాలామంబువలనఁ బ్రద్యుమ్నుండు, చారుధేష్ణుండు, చారుదేవుండు, సుధేష్ణుండు, సుచారువు, చారుగుప్తుండు, భద్రచారువు, చారుభద్రుండు, విచారువు, చారువు ననియెడు పదుగురు తనయులం బడసె; నట్లు సత్యభామా జాంబవతీ నాగ్నజితీ కాళిందీ మాద్రి మిత్రవిందా భద్రలకు వేఱువేఱ పదుగురేసి భద్రమూర్తు లైన కుమారు లుదయించి; రవ్విధంబున మఱియును.

(తెభా-10.2-276-చ.)[మార్చు]

' ఘ! పదాఱువేల సతులందు జనించిరి వేఱువేఱ నం
' దశకంబు తత్సుత వితానము గాంచి రనేక సూనుల
'న్నె యఁగ నిట్లు పిల్లచెఱ కీనిన కైవడిఁ బుత్త్ర పౌత్త్ర వ
'ర్ధ మున నొప్పెఁ గృష్ణుఁడు ముదంబునఁ దామరతంపరై భువిన్.

(తెభా-10.2-277-తే.)[మార్చు]

'ట్లు యదు వృష్ణి భోజాంధకాది వివిధ
'నామధేయాంతరముల నెన్నంగ నూట
'యొక్కటై చాల వర్ధిల్లె నక్కులంబు
'నృపకుమారులఁ జదివించు నేర్పు గలుగు.

(తెభా-10.2-278-తే.)[మార్చు]

'గురుజనంబులు విను మూఁడుకోట్లమీఁద
'నెనుబదెనిమిదివేలపై నెసఁగ నూర్వు
'రన్నఁ దద్బాలకావలి నెన్నఁదరమె
'శూలికైనను దామరచూలికైన?

(తెభా-10.2-279-వ.)[మార్చు]

అందు గోవిందనందనుండయిన ప్రద్యుమ్నునకు రుక్మి కూఁతు వలన ననిరుద్ధుండు సంభవించె ననిన మునివరునకు భూవరుం డిట్లనియె.

(తెభా-10.2-280-క.)[మార్చు]

రమునఁ గృష్ణుచే ము
'న్న మానము నొంది రుక్మి చ్యుతు గెలువం
ది వురుచుఁ దన సుత నరిసం
' వునకు నెట్లిచ్చె? నెఱుఁగఁ లుకు మునీంద్రా!

21-05-2016: :
గణనాధ్యాయి 10:41, 12 డిసెంబరు 2016 (UTC)