పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/ప్రద్యుమ్న వివాహంబు

వికీసోర్స్ నుండి

ప్రద్యుమ్న వివాహంబు

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/ప్రద్యుమ్న వివాహంబు)
రచయిత: పోతన



తెభా-10.2-281-సీ.
నావుడు శుకయోగి "రనాయకోత్తమ!-
నీవు చెప్పిన యట్ల నెమ్మనమునఁ
ద్మాయతాక్షుచేఁ డిన బన్నమునకుఁ-
నలుచు నుండియు నుజతోడి
నెయ్యంబునను భాగినేయున కిచ్చెను-
గూఁతు నంచితపుష్ప కోమలాంగిఁ
న పూన్కి దప్పినఁ గ విదర్భేశుండు-
విను మెఱింగింతు న వ్విధము దెలియఁ

తెభా-10.2-281.1-తే.
రఁగ రుక్మవతీ స్వయంరమున కొగి
రుగుదెం డని భీష్మభూరసుతుండు
రుస రప్పించె రాజన్యర కుమార
రుల నను వార్త కలరి యా రిసుతుండు.

టీక:- నావుడు = అనగా; శుక = శుక; యోగి = ముని; నరనాయక = రాజ; ఉత్తమా = శ్రేష్ఠుడా; నీవు = నీవు; చెప్పిన = చెప్పిన; అట్ల = విధముగ; నెఱ = నిండు; మనమునన్ = మనసునందు; పద్మాయతాక్షు = కృష్ణుని; చేన్ = చేత; పడిన = పొందిన; బన్నమున్ = అవమానమున; కున్ = కు; కనలుచుండియున్ = తపించుచున్నను; అనుజ = తోబుట్టువు; తోడి = తోటి; నెయ్యంబునను = స్నేహముచేత; భాగినేయున్ = మేనల్లుని, సోదరి పుత్రుని; కిన్ = కి; ఇచ్చెను = ఇచ్చెను; కూతున్ = పుత్రికను; అంచిత = ఒప్పిదమైన; పుష్ప = పూలవంటి; కోమల = మృదువైన; అంగిన్ = దేహము కలామెను; తన = తన యొక్క; పూన్కి = ప్రతిజ్ఞ; తప్పినన్ = తప్పిపోయినను; తగన్ = యుక్తమగునట్లు; విదర్భేశుండు = రుక్మి {విదర్భేశుడు - విదర్భకు రాజు, రుక్మి}; వినుము = వినుము; ఎఱిగింతున్ = తెలిపెదను; ఆ = ఆ; విధము = విధమును; తెలియన్ = విశద మగునట్లు; పరగన్ = ప్రసిద్ధముగ; రుక్మవతీ = రుక్మవతి యొక్క {రుక్మవతి - రుక్మి కూతురు}; స్వయంవరమున = స్వయంవరసమయమున; కున్ = కు; ఒగిన్ = పూనికతో; అరుగుదెండు = రండు; అని = అని; భీష్మభూవరసుతుండు = రుక్మి {భీష్మభూవరసుతుడు - భీష్మకమహారాజు కొడుకు, రుక్మి}; వరుసన్ = క్రమముగా; రప్పించెన్ = రప్పించెను; రాజన్య = రాజులలో; వర = ఉత్తములైనవారి; కుమార = పుత్రులలో; వరులను = ముఖ్యులను; అను = అనెడి; వార్త = వృత్తాంతమున; కున్ = కు; అలరి = సంతోషించి; ఆ = ఆ; హరిసుతుండు = కృష్ణుని కొడుకు (ప్రద్యుమ్నుడు).
భావము:- ఇలా అడిగిన పరీక్షిత్తు మహారాజుతో శుకముని ఇలా చెప్పనారంభించాడు “ఓ రాజేంద్రా! నీవు అన్నట్లుగానే రుక్మి శ్రీకృష్ణుని వలన పొందిన అవమానానికి మనసులో బాధపడుతూనే వున్నాడు. అయినా తాను చేసిన ప్రయత్నం ఫలించకపోగా ఆ విదర్భరాజు తన చెల్లెలిపై గల అభిమానంతో తన మేనల్లుడికి కుసుమ కోమలయైన తన కుమార్తెను ఇచ్చాడు. అ విషయం తెలియజేస్తాను, విను. రుక్మి తన కుమార్తె అయిన రుక్మవతి స్వయంవరానికి రాజకుమారులను అందరినీ ఆహ్వానించాడు. ఆ వార్త విని కృష్ణనందనుడు ప్రద్యుమ్నుడు సంతోషించాడు.

తెభా-10.2-282-చ.
మణిభూషణప్రభలర్గ మనర్గళ భంగిఁ బర్వఁ బ్ర
స్ఫురిత రథాధిరోహణవిభూతి దలిర్ప మనోహరైక సు
స్థిశుభలీల నేగె యదుసింహకిశోరము రాజకన్యకా
రిణయవైభవాగత నృపాలక కోటికి రుక్మివీటికిన్.

టీక:- వర = శ్రేష్ఠమైన; మణి = రత్నాల; భూషణ = ఆభరణముల; ప్రభల = కాంతుల; వర్గము = సమూహము; అనర్గళ = అడ్డము లేని; భంగిన్ = విధముగా; పర్వన్ = వ్యాపించగా; ప్రస్ఫురిత = మిక్కిలి ప్రకాశించునట్టి; రథ = రథమును; అధిరోహణ = ఎక్కు; విభూతిన్ = వైభవము; తలిర్పన్ = చిగురించగా; మనోహర = మనోజ్ఞముగా; ఏక = ఒంటరిగా; సుస్థిర = మిక్కిలి నిలుకడతో; శుభ = మేలైన; లీలన్ = విధముగా; ఏగెన్ = వెళ్ళెను; యదు = యాదవవంశపు; సింహకిశోరము = సింహపుపిల్ల; రాజకన్యకా = రాకుమారి యొక్క; పరిణయ = పెండ్లి; వైభవ = వేడుకలకి; ఆగత = వచ్చిన; నృపాలక = రాజుల; కోటి = సమూహము కలదాని; కిన్ = కి; రుక్మి = రుక్మి యొక్క; వీడు = పట్టణమున; కిన్ = కు.
భావము:- మహోజ్వల మణిభూషణాలకాంతులతో శోభిస్తూ రమణీయమైన రథాన్ని ఎక్కి మనోహర సౌందర్య విలాసాలతో యదుకుల సింహకిశోరం ప్రద్యుమ్నుడు రుక్మవతిని వివాహమాడాలనే కోరికతో మేనమామ పట్టణం కుండిననగరం వెళ్ళాడు. అప్పటికే స్వయంవరానికి రాజులందరూ విచ్చేసి ఉన్నారు.

తెభా-10.2-283-చ.
ని పురిఁజొచ్చి వృష్ణికులత్తముఁ డచ్చట మూఁగియున్న య
మ్మనుజవరేణ్యనందనుల మానము దూలి భయాకులాత్ము లై
నఁగ ననేక చండతర సాయకసంపదఁ జూపి రుక్మి నం
నఁ గొనివచ్చి వేడ్క నిజధామము సొచ్చె నవార్యశౌర్యుఁ డై.

టీక:- చని = వెళ్ళి; పురిన్ = పట్టణమును; చొచ్చి = ప్రవేశించి; వృష్ణి = వృష్ణి; కుల = వంశపు; సత్తముడు = శ్రేష్ఠుడు; అచ్చటన్ = అక్కడ; మూగి = చేరి; ఉన్న = ఉన్నట్టి; ఆ = ఆ; మనుజవరేణ్య = రాజ; నందనుల = కుమారుల; మానము = గౌరవము; తూలన్ = తొలగిపోగా; భయ = భయముచేత; ఆకులాత్ములు = కలత చెందినవారు; ఐ = అయ్యి; చనగన్ = పారిపోవునట్లు; అనేక = పెక్కు; చండతర = మిక్కిలి తీక్షణములైన {చండ - చండతరము - చండతమము}; సాయక = బాణముల; సంపదన్ = కలిమిని; చూపి = కనబరచి; రుక్మినందనన్ = రుక్మావతిని; కొనివచ్చి = తీసుకువచ్చి; వేడ్కన్ = లీలగా; నిజ = తన; ధామమున్ = నివాసమును; చొచ్చెన్ = ప్రవేశించెను; అవార్య = నివారింపరాని; శౌర్యుడు = పరాక్రమము కలవాడు; ఐ = అయ్యి.
భావము:- అలా కుండిన నగరంలో ప్రవేశించిన ఆ ప్రద్యుమ్నుడు వృష్ణివంశోత్తముడు, అక్కడ చేరిన రాజకుమారులపై తీవ్రమైన బాణాలు ప్రయోగించి తన పరాక్రమాన్ని ప్రదర్శించాడు. ఆ రాకుమారులు ధైర్యం కోల్పోయి భయంతో పారిపోయారు. ప్రద్యుమ్నుడు అవక్ర పరాక్రముడై మేనమామ రుక్మి పుత్రిక రుక్మవతిని తన నగరానికి తీసుకుని వచ్చాడు,

తెభా-10.2-284-వ.
ఇట్లు తెచ్చి ప్రద్యుమ్నుండు హరినయనం బరిణయంబంది నిఖిల సుఖంబు లనుభవింపుచుండె; యనంతరంబ.
టీక:- ఇట్లు = ఈ విధముగ; తెచ్చి = తీసుకువచ్చి; ప్రద్యుమ్నుండు = ప్రద్యుమ్నుడు; హరినయనన్ = రుక్మావతిని {హరినయన - లేడి వంటి కన్నులు కలామె, రుక్మావతి}; పరిణయంబు = పెండ్లి; అంది = ఆడి; నిఖిల = ఎల్ల; సుఖంబులన్ = సుఖములను; అనుభవించుచుండెన్ = అనుభవించుచుండెను; అనంతరంబ = తరువాత.
భావము:- ఆ విధంగా ఆ హరిణాక్షి రుక్మవతిని తన నగరానికి తెచ్చిన ప్రద్యుమ్నుడు ఆమెని వివాహమాడి, సకల సౌభాగ్యాలను అనుభవిస్తున్నాడు

తెభా-10.2-285-క.
ధీరుఁడు కృతవర్ముని సుకు
మారుఁడు వరియించె రుచిరమండనయుత నం
భోరుహముఖి రుక్మిసుతం
జారుమతీకన్యఁ బ్రకటజ్జనమాన్యన్.

టీక:- ధీరుడు = ధైర్యవంతుడు; కృతవర్ముని = కృతవర్మ యొక్క; సు = మంచి; కుమారుడు = కొడుకు; వరియించెన్ = కోరి పెండ్లాడెను; రుచిర = ప్రకాశించుచున్న; మండన = ఆభరణములతో; యుతన్ = కూడి నామెను; అంభోరుహముఖిన్ = పద్మాక్షిని; రుక్మి = రుక్మి యొక్క; సుతన్ = కూతురును; చారుమతీ = చారుమతి అను; కన్యన్ = యువతిని; ప్రకట = ప్రసిద్ధులైన; సజ్జన = సజ్జనులు; మాన్యన్ = గౌరవించునామెను.
భావము:- రుక్మి మరొక కుమార్తె పద్మముఖి సజ్జన సమ్మాన్య “చారుమతి”ని ధీరుడైన కృతవర్మ కుమారుడు వివాహమాడాడు.

తెభా-10.2-286-తే.
ప్రకటచరితుండు భీష్మభూపాలసుతుఁడు
నము మోదింపఁ దన కూర్మినుమరాలి
రుక్మలోచన నసమాన రుక్మకాంతిఁ
జెలిమి ననిరుద్ధునకుఁ బెండ్లి సేయు నపుడు.

టీక:- ప్రకట = ప్రసిద్ధమైన; చరితుండు = వర్తన కలవాడు; భీష్మభూపాలసుతుడు = రుక్మి; మనము = మనస్సు; మోదింపన్ = సంతోషించగా; తన = తన యొక్క; కూర్మి = ప్రియమైన; మనుమరాలిన్ = మనుమరాలిని; రుక్మలోచనన్ = రుక్మలోచన అనునామెను; అసమాన = సాటిలేని; రుక్మ = బంగారమువంటి; కాంతిన్ = రంగు కలామెను; చెలిమిన్ = ఇష్టముగా; అనిరుద్ధున్ = అనిరుద్దున; కున్ = కు; పెండ్లి = వివాహము; చేయున్ = చేసెడి; అపుడు = సమయము నందు.
భావము:- సుప్రసిద్ధుడైన భీష్మక మహారాజు కుమారుడు రుక్మి, బంగారు కాంతులతో శోభిస్తున్న తన మనుమరాలు “రుక్మలోచన”ను అనిరుద్ధుడికి ఇచ్చి వివాహం చేయించాడు. ఆ సమయంలో..

తెభా-10.2-287-క.
పొలుపుగ రత్నవిభూషో
జ్జ్వలుఁలయి శుభవేళ నవ్వివాహార్థము ని
ర్మ బహు వైభవ శోభన
లితవిదర్భావనీశ టకంబునకున్.

టీక:- పొలుపుగన్ = చక్కగా; రత్న = మణులు పొదిగిన; విభూష = ఆభరణములచే; ఉజ్జ్వలులు = వెలుగుచున్నవారు; అయి = ఐ; శుభవేళ = మంచి ముహూర్తమున; ఆ = ఆ; వివాహ = పెళ్ళి; అర్థమున్ = కోసము; నిర్మల = పరిశుద్ధమైన; బహు = పెక్కు; వైభవ = వేడుకలతో; శోభన = శుభకరములైన వానితో; కలిత = కూడిన; విదర్భ = విదర్భదేశపు; అవనీశ = రాజు (రుక్మి) యొక్క; కటకంబున్ = రాజధాని (కుండిన); కున్ = కి.
భావము:- ఆ వివాహ శుభసందర్భంలో ఆ విదర్భ రాజధాని కుండిన పట్టణానికి, రత్నఖచిత భూషణాలు అలంకరించుకుని నిర్మల బహువిధ శోభలతో శుభముహూర్తాన బయలుదేరి....

తెభా-10.2-288-చ.
రియును రుక్మిణీసతియు నా బలభద్రుఁడు శంబరారియు
న్నరిమదభేది సాంబుఁడును నాదిగ రాజకుమారకోటి సిం
ధు రథవాజి సద్భటులతోఁ జని యందు సమగ్రవైభవా
రిత వివాహయుక్త దివసంబులు వేడుకఁ బుచ్చి యంతటన్.

టీక:- హరియున్ = కృష్ణుడు; రుక్మిణీసతియున్ = రుక్మిణీదేవి; ఆ = ఆ ప్రసిద్ధుడైన; బలభద్రుడు = బలరాముడు; శంబరారియున్ = ప్రద్యుమ్నుడు {శంబరారి - శంబరాసురుని శత్రువు, ప్రద్యుమ్నుడు}; అరి = శత్రువుల; మద = గర్వమును; భేది = అణచువాడు; సాంబుడునున్ = సాంబుడు; ఆదిగన్ = మున్నగు; రాజకుమార = రాకుమారుల; కోటి = సమూహము; సింధుర = ఏనుగులతో; రథ = రథములతో; వాజి = గుఱ్ఱములతో; సద్భటుల = సైనికుల; తోన్ = తోటి; చని = వెళ్ళి; అందున్ = అక్కడ; సమగ్ర = సంపూర్ణమైన; వైభవా = వేడుకలు; ఆచరిత = చేయబడుతున్నట్టి; వివాహ = పెళ్ళితోటి; యుక్త = కూడిన; దివసంబులున్ = రోజులను; వేడుకన్ = వినోదములతో; పుచ్చి = గడిపి; అంతటన్ = అటుపిమ్మట.
భావము:- రుక్మిణి, కృష్ణుడు, బలరాముడు, సాత్యకి, శంబరుని సంహరించిన ప్రద్యుమ్నుడు, అరివీర భయంకరుడు సాంబుడు మున్నగు రాకుమారులు అందరూ ఆ కుండిన పురానికి విచ్చేసారు. సర్వవైభవ యుక్తంగా వివాహం జరుగుతున్న ఆ రోజులలో అందరూ వేడుకలతో అనందంగా కాలం గడపసాగారు.

తెభా-10.2-289-క.
నాఁడు యదుకుమారకు
లంక సమగ్ర వైభవాటోప మహో
త్సుకులై యుండఁగఁ జూపో
యెకసెక్కెమున నవనిపాలురు వరుసన్.

టీక:- ఒక = ఒకానొక; నాడు = దినమున; యదు = యాదవ వంశమున; కుమారకులు = పుట్టినవారు; అకలంక = కళంకము లేని; సమగ్ర = పరిపూర్ణమైన; వైభవ = వైభవముల యొక్క; ఆటోప = సందడి యందు; మహా = మిక్కిలి; ఉత్సుకులు = ఉత్సాహముతో లగ్నమై; ఉండగన్ = ఉండగా; చూపు = చూసి; ఓపక = సహింపక; ఎకసెక్కెమునన్ = పరిహాసముతో; అవనిపాలురు = రాజులు (కొందరు); వరుసన్ = క్రమముగా.
భావము:- ఒక రోజున యాదవులంతా మహావైభవంతో ఉత్సాహ పూరితులై ఉండగా చూస్తున్న కొందరు రాజులు ఓర్వలేక పోతూ.....

తెభా-10.2-290-ఉ.
చ్చరికం గళింగధరణీశుఁడు రుక్మిమొగంబు సూచి నీ
యొచ్చెముఁ దీర్చుకో నిదియ యొప్పగువేళ బలుండు జూదమం
దిచ్చ గలండు; గాని పొలుపెక్కిననేర్పరి గాఁడు; గాన నీ
కిచ్చు నవశ్యమున్ జయము నీఁగుము తొల్లిటఁబడ్డ బన్నమున్.

టీక:- ఎచ్చరికన్ = జాగ్రత్తతో; కళింగ = కళింగదేశపు; ధరణీశుడు = రాజు; రుక్మి = రుక్మి; మొగంబున్ = వైపు; చూచి = చూసి; నీ = నీ యొక్క; ఒచ్చెమున్ = భంగపాటును; తీర్చుకోన్ = బదులు తీర్చుకొనుటకు; ఇదియ = ఇదే; ఒప్పు = సరి; అగు = అయినది; వేళన్ = సమయము; బలుండు = బలరాముడు; జూదము = ద్యూతకేళి; అందున్ = లో; ఇచ్చ = కోరిక; కలండు = ఉన్నవాడు; కాని = కాని; పొలుపెక్కిన = అతిశయించిన; నేర్పరి = సమర్థుడు; కాడు = కాడు; కాన = కాబట్టి; నీ = నీ; కున్ = కు; ఇచ్చున్ = కలుగజేయును; అవశ్యము = తప్పకుండా; జయమున్ = జయమును; ఈగుము = పోగొట్టుకొనుము; తొల్లిటన్ = మునుపు; పడ్డ = అనుభవించిన; బన్నమున్ = అవమానమును.
భావము:- కళింగాధీశుడు రుక్మితో ఇలా అన్నాడు “నీకు ఇంతకు ముందు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఇదే తగిన సమయం. బలరాముడికి జూదం మీద ఇష్టం ఎక్కువ కాని, ఆటలో నేర్పరి కాదు. అందుచేత నీకే విజయం లభిస్తుంది. ఇంతకు ముందు పొందిన అవమానాన్ని ఇప్పుడు ఇలా తొలగించుకో.”

తెభా-10.2-291-క.
ని పురికొల్పిన రుక్మియుఁ
చేటు దలంప లేక తాలాంకునితో
ను జూదమాడఁ దివిరెను
జాసను కృతము గడచు వారెవ్వ రిలన్?

టీక:- అని = అని; పురికొల్పినన్ = ప్రేరేపించగా; రుక్మియున్ = రుక్మి; తన = తన యొక్క; చేటున్ = నాశమును; తలంపలేక = తెలుసుకొనలేక; తాలాంకుని = బలరాముని {తాలాంకుడు - తాడిచెట్టు జండాపై కలవాడు, బలరాముడ}; తోడనున్ = తోటి; జూదము = ద్యూతకేళి; ఆడన్ = ఆడుటకు; తివిరెన్ = సిద్ధపడెను; వనజాసను = బ్రహ్మ {వనజాసనుడు - వనజము (పద్మము) ఆసనుడు (ఆసనముగా కలవాడు), బ్రహ్మ}; కృతమున్ = నిర్ణయమును; కడచు = మీరగల; వారు = వారు; ఎవ్వరు = ఎవరున్నారు; ఇలన్ = భూమ్మీద.
భావము:- కళింగదేశాధీశుడు ఈ మాదిరిగా పురికొల్పగా, రుక్మి తనకు కలిగే చేటు గమనించుకోకుండా, తాడిచెట్టు జండా గుర్తుగా కల ఆ బలరాముడితో జూదమాడడానికి సిద్ధమయ్యాడు. లోకంలో బ్రహ్మవ్రాత తప్పించుకో గలవారు ఎవరు లేరు కదా.

తెభా-10.2-292-వ.
అంత.
టీక:- అంతన్ = అప్పుడు.
భావము:- అటుపిమ్మట....

తెభా-10.2-293-క.
కోరి విదర్భుఁడు కుటిల వి
హారుండై పిలిచె జూదమాడ జితారిన్
హారిన్ సన్నుతసూరిన్
సీరిన్ రైవతసుతార్ద్ర చిత్తవిహారిన్.

టీక:- కోరి = కావాలని; విదర్భుడు = రుక్మి {విదర్భుడు - విదర్భదేశము వాడు, రుక్మి}; కుటిల = కపటముగ; విహారుండు = మెలగువాడు; ఐ = అయ్యి; పిలిచెన్ = ఆహ్వానించెను; జూదము = జూదము; ఆడన్ = ఆడుటకు; జిత = జయింపబడిన; అరిన్ = శత్రువులు కలవానిని; హారిన్ = ముత్యాలహారములు ధరించిన వానిని; సన్నుత = స్తుతించెడి; సూరిన్ = పండితులు కలవానిని; సీరిన్ = బలరాముని {సీరి - సీరము (నాగలి) ఆయుధముగా కలవాడు, బలరాముడు}; రైవతసుత = రేవతీదేవి యొక్క; ఆర్ద్ర = మృదువుగా యైన; చిత్త = మనసు నందు; విహారిన్ = విహరించువానిని.
భావము:- శత్రుసంహారకుడు, సజ్జన సేవితుడు, రేవతీవల్లభుడూ, హాలాయుధుడూ అయిన బలరాముణ్ణి జూదమాడడానికి రమ్మని, రుక్మి కుటిల స్వభావంతో కోరి....