పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/రతీ ప్రద్యుమ్ను లాగమనంబు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

రతీప్రద్యుమ్నులాగమనంబు

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/రతీ ప్రద్యుమ్ను లాగమనంబు)
రచయిత: పోతన


(తెభా-10.2-24-వ.)[మార్చు]

ఇట్లు శంబరుని వధియించి విలసిల్లుచున్న యించువిలుకానిం గొంచు నాకాశచారిణియైన యా రతీదేవి, గగనపథంబుఁబట్టి ద్వార కానగరోపరిభాగమునకుం జనుదెంచిన.

(తెభా-10.2-25-ఆ.)[మార్చు]

మెఱుఁగుఁదీగెతోడి మేఘంబు కైవడి
యువిదతోడ మింటి నుండి కదలి
రుగుదెంచె మదనుఁ డంగనాజనములు
మెలఁగుచున్న లోనిమేడకడకు.

(తెభా-10.2-26-మ.)[మార్చు]

దశ్యాముఁ బ్రలంబబాహుయుగళుం జంద్రాననున్ నీల సం
కు వక్రాలకుఁ బీతవాసు ఘనవక్షున్ సింహమధ్యున్ మహో
త్ప పత్త్రేక్షణు మందహాసలలితుం బంచాయుధున్ నీరజా
క్షు లు దారేమఱుపాటఁ జూచి హరి యంచుం డాఁగి రయ్యైయెడన్.

(తెభా-10.2-27-క.)[మార్చు]

కొం ఱు హరి యగు నందురు,
కొం ఱు చిహ్నములు కొన్నికొన్ని హరికి లే
వం దురు, మెల్లనె తెలియుద
మం దురు మరుఁ జూచి కొంద బలలు గుములై.

(తెభా-10.2-28-క.)[మార్చు]

రి యని వెనుచని పిదపన్
రిఁ బోలెడువాఁడు గాని రి గాఁ డనుచున్
రిమధ్య లల్లనల్లన
రినందను డాయ వచ్చి రాశ్చర్యమునన్.

(తెభా-10.2-29-ఉ.)[మార్చు]

న్నులు సేర వచ్చి మరు నందఱుఁ జూడఁగఁ దాను వచ్చి సం
న్న గుణాభిరామ హరిట్టపుదేవి విదర్భపుత్రి క్రే
న్నుల నా కుమారకుని కైవడి నేర్పడఁ జూచి బోటితోఁ
న్నులు సేఁప నిట్లనియె సంభ్రమదైన్యము లుల్లసిల్లఁగన్.

(తెభా-10.2-30-శా.)[మార్చు]

కంజేక్షణుఁ డీ కుమారతిలకుం డీ యిందుబింబాననుం
డీ కంఠీరవమధ్యుఁ డిచ్చటికి నేఁ డెందుండి యేతెంచెనో
యీ ల్యాణునిఁ గన్న భాగ్యవతి మున్నే నోములన్ నోఁచెనో
యే కాంతామణియందు వీని కనెనో యేకాంతుఁ డీ కాంతునిన్.

(తెభా-10.2-31-శా.)[మార్చు]

ళీ! నా తొలుచూలి పాపనికి బోర్కాడించి నే సూతికా
శా లామధ్య విశాలతల్పగత నై న్నిచ్చి నిద్రింప నా
బా లున్ నా చనుఁబాలకుం జెఱిచి యే పాపాత్ములే త్రోవ ము
న్నే లీలం గొనిపోయిరో? శిశువుఁ దా నే తల్లి రక్షించెనో!

(తెభా-10.2-32-క.)[మార్చు]

కొ డుకఁడు నా పొదిగిఁటిలోఁ
జె డిపోయిన నాఁటనుండి చెలియా! తెలియం
దే వార్తయు నతఁడే
డువున నెచ్చోట నిలిచి ర్తించెడినో!

(తెభా-10.2-33-క.)[మార్చు]

ఇం దాఁక వాఁడు బ్రదికిన
సం దేహము లేదు దేహచాతుర్యవయ
స్సౌం ర్యంబుల లోకులు
వం దింపఁగ నితనియంతవాఁ డగుఁ జుమ్మీ!

(తెభా-10.2-34-మ.)[మార్చు]

తివా! సిద్ధము నాఁటి బాలకున కీ యాకార మీ వర్ణ మీ
తి యీ హాసవిలోకనస్వరము లీ గాంభీర్య మీ కాంతి వీఁ
తఁడే కాఁదగు నున్నవారలకు నా యాత్మేశు సారూప్య సం
తి సిద్ధింపదు; వీనియందు మిగులం గౌతూహలం బయ్యెడిన్.

(తెభా-10.2-35-క.)[మార్చు]

పొ లెడి ముదమునఁ జిత్తము
లెడి నా యెడమమూఁపు, న్నుల వెంటం
బొ లెడి నానందాశ్రులు
మె లెడిఁ బాలిండ్లఁ బాలు; మేలయ్యెడినో!

(తెభా-10.2-36-వ.)[మార్చు]

అని డోలాయమాన మానసయై వితర్కించుచు.

(తెభా-10.2-37-క.)[మార్చు]

యుఁ డని నొడువఁ దలఁచును;
యుఁడు గా కున్న మిగులఁ తిగొని సవతుల్‌
ను నగియెద రని తలఁచు; న
ను సంశయ మలమికొనఁగఁ నుమధ్య మదిన్.

(తెభా-10.2-38-వ.)[మార్చు]

ఇట్లు రుక్మిణీదేవి విచారించుచుండ లోపలినగరి కావలివారివలన విని కృష్ణుండు దేవకీవసుదేవులం దోడ్కొని చనుదెంచి సర్వజ్ఞుం డయ్యు నేమియు వివరింపక యూరకుండె; నంత నారదుండు సనుదెంచి శంబరుఁడు గుమారునిం గొనిపోవుట మొదలైన వార్త లెఱింగించిన.

(తెభా-10.2-39-క.)[మార్చు]

చ్చినబాలుఁడు గ్రమ్మఱ
చ్చిన క్రియ వచ్చెఁ బెక్కుర్షములకు నీ
చ్చరితు నేఁడు గంటిమి;
చె చ్చెర మున్నెట్టి తపము సేయంబడెనో?

(తెభా-10.2-40-వ.)[మార్చు]

అని యంతఃపుర కాంతలును, దేవకీవసుదేవ రామకృష్ణులును యథోచితక్రమంబున నా దంపతుల దివ్యాంబరాభరణాలంకృతుల సత్కరించి సంతోషించిరి; రుక్మిణీదేవియు నందనుం గౌఁగిలించు కొని.

(తెభా-10.2-41-శా.)[మార్చు]

న్నా! నా చనుఁ బాపి నిన్ను దనుజుం డంభోనిధిన్ వైచెనే
యె న్నే వర్షము లయ్యెఁ బాసి సుత! నీ వేరీతి జీవించి యే
న్నాహంబున శత్రు గెల్చితివొ? యాశ్చర్యంబు సంధిల్లెడిన్
ని న్నుం గాంచితి నింతకాలమునకున్ నే ధన్యతం జెందితిన్.

(తెభా-10.2-42-వ.)[మార్చు]

అని కొడుకుం జూచి సంతోషించి కోడలిగుణంబులు కైవారంబు సేసి, వినోదించుచుండె; నంత ద్వారకానగరంబు ప్రజలు విని హర్షించి; రందు.

(తెభా-10.2-43-క.)[మార్చు]

సి రిపెనిమిటి పుత్త్రకుఁ డగు
రుఁ గని హరిఁ జూచినట్ల మాతలు దమలోఁ
రఁగుదు రఁట, పరకాంతలు
రుఁ గని మోహాంధకార గ్నలు గారే?

(తెభా-10.2-44-వ.)[మార్చు]

అని చెప్పి శుకుం డిట్లనియె

(తెభా-10.2-45-క.)[మార్చు]

త్రాజిత్తు నిశాచర
త్రునకుం గీడు సేసి ద్వినయముతోఁ
బు త్రి , శమంతకమణియును
మై త్రిం గొని తెచ్చి యిచ్చె నుజాధీశా!

(తెభా-10.2-46-వ.)[మార్చు]

అనిన విని రా జిట్లనియె.

(తెభా-10.2-47-ఆ.)[మార్చు]

శౌరి కేమి తప్పు త్రాజితుఁడు సేసెఁ?
గూఁతు మణిని నేల కోరి యిచ్చె?
తని కెట్లు కలిగె నా శమంతకమణి
విప్రముఖ్య! నాకు విస్తరింపు.

21-05-2016: :
గణనాధ్యాయి 10:17, 12 డిసెంబరు 2016 (UTC)