పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/భూసురుని దౌత్యంబు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

భూసురుని దౌత్యంబు

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/భూసురుని దౌత్యంబు)
రచయిత: పోతన


(తెభా-10.2-642-వ.)[మార్చు]

ఇవ్విధంబునం బ్రతిదివసంబును నుండు నవసరంబున నొక్కనా డపూర్వదర్శనుం డైన భూసురుం డొక్కరుండు సనుదెంచి సభా మధ్యంబునం గొలువున్న ముకుందునిం బొడగని దండప్రణామం బాచరించి వినయంబునఁ గరములు మొగిచి యిట్లనియె.

(తెభా-10.2-643-క.)[మార్చు]

కం విలోచన! దానవ
'భం న! యోగీంద్రవిమలభావలసద్బో
ధాం న! దీప్తినిదర్శన!
'రం జితశుభమూర్తి! కృష్ణ! రాజీవాక్షా!

(తెభా-10.2-644-తే.)[మార్చు]

వధరింపు జరాసంధుఁ తుల బలుఁడు
నకు మ్రొక్కని ధారుణీవుల నెల్ల
వెదకి తెప్పించి యిరువదివేల నాఁకఁ
బెట్టినాఁడు గిరివ్రజపట్టణమున.

(తెభా-10.2-645-తే.)[మార్చు]

వారు పుత్తేర వచ్చినవాఁడ నేను
రవరోత్తమ! నృపుల విన్నపము గాఁగ
విన్నవించెద నామాట వినినమీఁద
నఘ! నీ దయ! వారి భాగ్యంబు కొలఁది.

(తెభా-10.2-646-వ.)[మార్చు]

అని ధరాధిపుల విన్నపంబుగా నిట్లనియె.

(తెభా-10.2-647-ఉ.)[మార్చు]

వా రిజనాభ! భక్త జనత్సల! దుష్టమదాసురేంద్ర సం
హా ర! సరోరుహాసన పురారి ముఖామరవంద్య పాదపం
కే రుహ! సర్వలోకపరికీర్తిత దివ్యమహాప్రభావ! సం
సా విదూర! నందతనుజాత! రమాహృదయేశ! మాధవా!

(తెభా-10.2-648-ఆ.)[మార్చు]

ర్త జనుల మమ్ము రసి రక్షింపు మ
హాత్మ! భక్తజనభయాపహరణ!
నిన్ను మది నుతించి నీకు మ్రొక్కెదము నీ
రణయుగము మాకు రణ మనఘ!

(తెభా-10.2-649-క.)[మార్చు]

లియుర దండింపఁగ దు
ర్బ లులను రక్షింప జగతిపై నిజలీలా
లితుఁడవై యుగయుగమున
వడ నుదయింతు కాదె? భవ! యనంతా!

(తెభా-10.2-650-క.)[మార్చు]

నీ దిఁ దోఁపని యర్థం
బీ మేదిని యందుఁ గలదె యీశ్వర! భక్త
స్తో సురభూజ! త్రిజగ
త్క్షే మంకర! దీనరక్ష సేయు మురారీ!

(తెభా-10.2-651-క.)[మార్చు]

నీ పంపు సేయకుండఁగ
నా ద్మభవాదిసురులకైనను వశమే?
శ్రీ తి! శరణాగతులం
జే ట్టి నిరోధ ముడుగఁ జేయుము కృష్ణా!

(తెభా-10.2-652-క.)[మార్చు]

వుఁ డవయ్యును జగతిం
బ్ర వించుట లీల గాక వమందుటయే
ప్ర భువులకుం బ్రభుఁడవు మము
యాత్ముల నరసి కావఁ ను నార్తిహరా!

(తెభా-10.2-653-క.)[మార్చు]

నమున నీ భుజావలి
కె దిరింపఁగ లేక పాఱఁడే విక్రమ సం
సెడఁగ జరాసంధుఁడు
దునెనిమిదిసార్లు ధరణిపాలురు నవ్వన్.

(తెభా-10.2-654-వ.)[మార్చు]

ఇట్లు తనపడిన బన్నములం దలంపక సింహంబు సమదదంతావళంబుల నరికట్టి కావరించు చందంబున మమ్ముం జెఱపట్టి బాధించుచున్న యప్పాపాత్ముని మర్దించి కారాగృహబద్ధుల మగు మా నిర్బంధంబులు వాపి, సుత దార మిత్ర వర్గంబులం గూర్చి యనన్యశరణ్యులమైన మమ్ను రక్షింపు”మని విన్నవించి రని బ్రాహ్మణుండు విన్నపంబు సేయు సమయంబున.

21-05-2016: :
గణనాధ్యాయి 11:06, 12 డిసెంబరు 2016 (UTC)