పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/ధర్మజు రాజసూయారంభంబు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ధర్మజు రాజసూయారంభంబు

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/ధర్మజు రాజసూయారంభంబు)
రచయిత: పోతన


(తెభా-10.2-655-సీ.)[మార్చు]

శారదచంద్రికా సారంగరుచితోడ;
డముడికెంపు చేఁ ఱచి నవ్వ
రదంబుదావృత సౌదామనీలతా;
శోభఁ గాంచనకటిసూత్ర మలర
లితపూర్ణేందుమంల కలంకముగతి;
మృదుమృగాజినరుచి మించుఁ జూపఁ
ల్పశాఖాగ్రసంతపుష్పగుచ్ఛంబు;
లీలఁ గేలను నక్షమాల యమర

(తెభా-10.2-655.1-తే.)[మార్చు]

భూరిపుణ్యనదీతోయపూరణమునఁ
గు కమండలు వొక్క హస్తమునఁ దనర
వెల్ల జన్నిద మఱుత శోభిల్ల వచ్చె
నారదుండు వివేకవిశారదుండు.

(తెభా-10.2-656-క.)[మార్చు]

నుదెంచె నట్లు ముని నిజ
నుకాంతుల నఖిలదిగ్వితానము వెలుఁగన్
జాప్తుఁ బోలి యయ్యదు
ములుఁ గృష్ణుండు లేచి సంప్రీతిమెయిన్.

(తెభా-10.2-657-క.)[మార్చు]

వి యమున మ్రొక్కి కనకా
మునఁ గూర్చుండఁ బెట్టి ముచిత వివిధా
ర్చ ములఁ దనిపి మురాంతకుఁ
నియెన్ వినయంబు దోఁప మ్మునితోడన్.

(తెభా-10.2-658-తే.)[మార్చు]

ప్పు డెందుండి వచ్చితి విందులకును?
ఖిలలోకైకసంచారి గుటఁ జేసి
నీ యెఱుంగని యర్థంబు నిఖిలమందు
రయ లేదండ్రు; మిమ్మొకఁ డుగవలయు.

(తెభా-10.2-659-తే.)[మార్చు]

పాండునందను లిప్పు డే గిది నెచట
నున్నవారలొ యెఱిఁగింపు మన్న మౌని
రసరోజాతములు మోడ్చి డఁకతోడఁ
లికెఁ గమలాక్షుఁ జూచి సద్భక్తి మెఱసి.

(తెభా-10.2-660-వ.)[మార్చు]

“దేవా! విశ్వనిర్మాణకర్తవై మాయివై సకల కార్యోత్పాదనాదిశక్తి యుక్తుండవై పావకుండు దారువులందు నంతర్హితప్రకాశుండై యున్న చందంబున వర్తించుచున్న నీదు దురత్యయంబయిన మాయాశతంబులఁ బెక్కుమాఱులు పొడగంటి నిదియు నాకు నద్భుతంబుగా; దదియునుంగాక నీ సంకల్పంబున జగంబుద్భవంబై భవత్పరతంత్రంబు నగు; నట్టి నీ కిష్టంబైన వస్తువు సాధుతరంబుగాఁ దెలియ నెవ్వండు సమర్థుం? డే పదార్థంబు ప్రమాణమూలంబునం దోఁచు నదియును లోకవిచక్షణుండ వైన నీదు రూపంబు; మఱియును ముక్తి మార్గంబు నెఱుంగక సంసార పరవశులైన జీవుల మాయాంధకారంబు నివర్తింపఁజేయ సమర్థంబగు; నీ దివ్యలీలావతారంబులం గలుగు కీర్తియను ప్రదీపంబు ప్రజ్వలింపఁజేసి కృపసేయుదట్టి నీకు నమస్కరించెద; నదిగావున నీ ప్రపంచంబున నీ యెఱుంగని యర్థంబు గలదె?” యని కృష్ణునకు నారదుం డిట్లనియె.

(తెభా-10.2-661-సీ.)[మార్చు]

'యినను వినిపింతు వధరింపుము దేవ! ;
'పాండుతనూజుండు పారమేష్ఠ్య
'కామానుమోదియై కావింప నున్నాఁడు;
'రాజసూయమహాధ్వరంబు నిష్ఠ
'వణింప లోకవిడంబనార్థము గాక;
'రికింపఁ దన కాత్మబంధువుఁడవు
'క్తవత్సలుఁడవు రమపూరుషుఁడవు;
'జ్ఞరక్షకుఁడవు జ్ఞభోక్త

(తెభా-10.2-661.1-తే.)[మార్చు]

'వగు భవత్సేవ చాలదే సుగతి వడయ?
'నైన నీ మేనబావ ధర్మాత్మజుండు
'తని యజ్ఞంబు రక్షింప నంబుజాక్ష!
'లయు విచ్చేయు మచటికి లను మెఱసి.

(తెభా-10.2-662-క.)[మార్చు]

నీ పేరు వినిన నొడివినఁ
'బా పంబులు దూలిపోవు ద్మాక్ష! జగ
ద్దీ క! నీ దర్శనమున
'నే పారవె భక్తజనుల కిహపరసుఖముల్‌.

(తెభా-10.2-663-మ.)[మార్చు]

' దీయోజ్జ్వలకీర్తి దిగ్వితతులన్ భాసిల్లు యుష్మత్పదో
'ద్భ నైర్మల్యజలంబు లుత్కలికఁ బాతాళంబునం బాఱు భో
' తీ నామమునం దనర్చి ధరణిం గంగానదీరూపమై
'ది వి మందాకినియై జగత్త్రయమునం దీపించుఁ గాదే? హరీ!

(తెభా-10.2-664-క.)[మార్చు]

ఖవేళ సమస్త ధ
'రా మండలిఁ గల్గు మేటిరాజులు మౌని
స్తో మంబును భవదీయ మ
'హా హిమముఁ జూచి సత్కృతార్థతఁ బొందన్.

(తెభా-10.2-665-క.)[మార్చు]

రని చెప్పిన నమ్ముని
' లుకులకు ముదంబు నొంది పంకజనాభుం
డె నవ్వు మొగమునకుఁ జెలు
'వొ యఁగఁ బాటించి యుద్ధవున కిట్లనియెన్.

(తెభా-10.2-666-క.)[మార్చు]

ద్ధవ! మహిత వివేక స
'మి ద్ధవచోవిభవ! కార్య మేగతి నడచున్
వృ ద్ధవరానుమతంబుగ
'బో ద్ధవ్యము గాఁగఁ జెప్పు పురుషనిధానా!

(తెభా-10.2-667-తే.)[మార్చు]

'నఘచారిత్ర! నీవు మా క్షియుగము
'వంటివాఁడవు మనకు నశ్య మగుచుఁ
'జేయఁ దగినట్టి కార్యంబుఁ జెప్పు నీవు
'మి పంచినఁ గావింతు నిద్ధచరిత!

(తెభా-10.2-668-వ.)[మార్చు]

అని సర్వజ్ఞుండైన హరి యజ్ఞుండ పోలెఁ దన్ను నడిగినఁ బురుషోత్తముని భాషణంబులకు మనంబున సంతసిల్లి, యతని పాదంబులు దన మనంబున నిడికొని, “వృద్ధానుమతంబుగా నా యెఱింగిన తెఱంగు విన్నవించెద నవధరింపుము; దేవా! దేవముని చెప్పినట్లు భవదీయ భక్తుండైన యుధిష్ఠిరు యాగపాలనంబు సేయం గైకొనుట కార్యం; బదియునుంగాక నిఖిల దిగ్విజయ మూలంబగు రాజసూయ కృత్యంబునందు జరాసంధ మర్ధనంబును, నతనిచే బద్ధులైన రాజులం గారాగృహ విముక్తులం గావిం చుటయుం జేకూరు; నదియునుం గాక నాగాయుతసత్త్వుండును, శతాక్షౌహిణీ బలాన్వితుండును నగు మాగధుని వధియింప మన ప్రభంజననందనుండు గాని యొండొరులు సమర్థలుగా; రట్లగుట నతండు భూసురు లేమి గోరిన, నయ్యర్థంబు వృథసేయక యిచ్చుం; గావున గపటవిప్రవేషంబునం జని యా జరాసంధుని నాహవ భిక్షవేఁడి, భవత్సన్నిధానంబున నప్పవమానతనయుం డతని వధియించునట్టి కార్యంబుసేఁత బహుళార్థసాధనంబగు” నని పలికిన నారదుండును యాదవ జనంబులును సభ్యులునుం బొగడి; రంత.

(తెభా-10.2-669-సీ.)[మార్చు]

రల విచిత్రక స్థగిత ప్రభావలిఁ;
నరారు గరుడకేనము వెలుఁగఁ
గాంచన చక్ర సంటిత ఘంటా ఘణ;
ణ నినాదముల దిక్కరులు బెదర
లలిత మేఘ పుష్పక వలాహక శైబ్య;
సుగ్రీవ తురగవిస్ఫురణ దనర
బాలసూర్యప్రభా భాసమానద్యుతి;
దిగ్వితానం బెల్ల దీటుకొనఁగఁ

(తెభా-10.2-669.1-తే.)[మార్చు]

'బ్రకటరుచి నొప్పు తేరు దారుకుఁడు దేర
'నెక్కి వెడలెడు నపుడు పెంపెనయఁ జెలఁగె
'శంఖ కాహళ పటహ నిస్సాణ డిండి
'మాది రవములు భరితదిగంతములుగ.

(తెభా-10.2-670-క.)[మార్చు]

నుజేశ్వరునకుఁ దాలాం
'కు కును గురువృద్ధజనులకును జెప్పి ప్రియం
బు ననుపఁ గాంచనస్యం
' సామజ వాజి భటకదంబము గొలువన్.

(తెభా-10.2-671-తే.)[మార్చు]

'వంది మాగధ సూత కైవారరవము
'సుమతీసురకోటి దీనల మ్రోఁత
'నుగమింపంగ సతులు సౌధాగ్రశిఖర
'జాలములనుండి ముత్యాలశాస లొలుక.

(తెభా-10.2-672-క.)[మార్చు]

లీ లం జని కృష్ణుఁడు వా
'హ్యా లిన్ నవకుసుమ ఫలభరానత శాఖా
లో ఘనసారసాల ర
'సా వనస్థలములందుఁ తురత విడిసెన్.

(తెభా-10.2-673-వ.)[మార్చు]

అట్టి యెడ సరోజనాభు శుద్ధాంతంబున.

(తెభా-10.2-674-సీ.)[మార్చు]

'వికచమరంద నవీన సౌరభ లస;
'న్మందార కుసుమదాములు దుఱిమి
'చారు సుగంధ కస్తూరికా ఘనసార;
'మిళిత చందనపంక మెలిమి నలఁది
'నక కుండల రణత్కంకణ నూపుర;
'ముద్రికాభూషణములు ధరించి
'యంచిత ముక్తాఫలాంచల మృదుల ది;
'వ్యాంబరములు సెలువారఁ గట్టి

(తెభా-10.2-674.1-తే.)[మార్చు]

'ర్ధచంద్రుని నెకసక్కె మాడునట్టి
'లికఫలకలఁ దిలకము లరఁ దీర్చి
'పెంపు దీపింప నుడురాజబింబముఖులు
'వచతుర్విధ శృంగార వధరించి.

(తెభా-10.2-675-తే.)[మార్చు]

'లజలోచను కడకు నుత్కలికతోడఁ
'నరు శిబికల నెక్కి నంనులుఁ దాముఁ
'నఁగ నేతేరఁ బ్రతిహారనులు వేత్ర
'లితులై పౌరులను నెడలుగ జడియ.

(తెభా-10.2-676-క.)[మార్చు]

మాస్త్రుఁడు పులు గడిగిన
'కు సుమాస్త్రములను హసించు కోమలతనువుల్‌
మి మిస మెఱవఁగ వేశ్యా
'వి రము దాసీజనంబు విభవ మెలర్పన్.

(తెభా-10.2-677-ఆ.)[మార్చు]

'రుల వేసడములఁ రులను నెక్కి తో
'రుగుదేర బహువిధాయుధములు
'దాల్చి సుభటకోటి గిలి రా నంతఃపు
'రాంగనలు సితాంబుజాక్షు కడకు.

(తెభా-10.2-678-వ.)[మార్చు]

వచ్చి రంత.

(తెభా-10.2-679-క.)[మార్చు]

నా దుని మాధవుఁడు స
'త్కా రంబున వీడుకొలుప తఁడును హృదయాం
భో రుహమునఁ గృష్ణునకును
'వా క మ్రొక్కుచును వెస దివంబున కరిగెన్.

(తెభా-10.2-680-క.)[మార్చు]

వరుల దూతయును ముర
' రుచే నభయప్రదాన మంది ధరిత్రీ
రులకడ కేగి పద్మో
' రు వచనము సెప్పి సమ్మదంబునఁ దేల్చెన్.

(తెభా-10.2-681-వ.)[మార్చు]

అంతఁ గృష్ణుండు నిజకాంతాతనయ బంధు సుహృజ్జన సమేతుండై కదలి చనునెడ.

(తెభా-10.2-682-చ.)[మార్చు]

' పటరత్నకంబళనికాయకుటీరము లుల్లసిల్ల ను
'త్క పటుచామరధ్వజ పతాక కిరీట సితాతపత్త్ర వి
'స్ఫు ఘనహేతిదీధితి నభోమణిఁ గప్పఁగఁ దూర్యఘోషముల్‌
' టులతిమింగిలోర్మిరవసాగరఘోషము నాక్రమింపఁగన్.

(తెభా-10.2-683-క.)[మార్చు]

రి హరి రథ సుభట సము
'త్క ములు సేవింప మురవిదారుఁడు గడచెన్
రి దుపవన దుర్గ సరో
' జనపద పుర పుళింద న గోష్ఠములన్.

(తెభా-10.2-684-వ.)[మార్చు]

ఇట్లు గడచి చనుచు నానర్తక సౌవీర మరుదేశంబులు దాటి యిందుమతిని దర్శించి, దృషద్వతి నుత్తరించి, సరస్వతీనది దాఁటి పాంచాల మత్స్యవిషయంబులు లోనుగాఁ గడచి యింద్ర ప్రస్థనగరంబు డాయం జని, తత్పురోపకంఠవనంబున విడిసిన.

21-05-2016: :
గణనాధ్యాయి 11:07, 12 డిసెంబరు 2016 (UTC)