పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/పాండవులు శ్రీకృష్ణు నెదుర్కొనుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పాండవులు శ్రీకృష్ణు నెదుర్కొనుట

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/పాండవులు శ్రీకృష్ణు నెదుర్కొనుట)
రచయిత: పోతన


(తెభా-10.2-685-క.)[మార్చు]

రిరాక యెఱిఁగి ధర్మజు
లేని ముదంబుతోడ నుజులు బంధుల్‌
గు రుజన సచివ పురోహిత
రిచారక కరి రథాశ్వ టయుతుఁ డగుచున్.

(తెభా-10.2-686-క.)[మార్చు]

చిం ములు మొరయ గాయక
బృం దంబుల నుతులు సెవుల బెరయఁగ భక్తిన్
డెం ము దగులఁగఁ బరమా
నం దంబున హరి నెదుర్కొనం జనుదెంచెన్.

(తెభా-10.2-687-వ.)[మార్చు]

ఇట్లు చనుదెంచి ధర్మనందనుండు సమాగతుండైన సరోజనాభునిం బెద్ధతడవు గాఢాలింగనంబుచేసి రోమాంచకంచుకిత శరీరుండై యానందబాష్పధారాసిక్తకపోలుండై నిర్భరానంద కందళిత హృదయుండై బాహ్యంబు మఱచియుండె; నప్పుడు హరిని వాయునందన వాసవతనూభవులు గౌఁగిటం జేర్చి సమ్మదంబు నొందిరి; మాద్రేయులు దండప్రణామంబు లాచరించి; రంతఁ బుండరీకాక్షుఁడు విప్ర వృద్ధజనంబులకు నమస్కారంబులుచేసి, వారలు గావించు వివిధార్చనలం బరితుష్టుం డై కేకయ సృంజ యాది భూవిభుల మన్నించి సూత మాగధాదుల కనేక పదార్థంబులొ సంగి, చతురంగబలసమేతుండై వివిధ మణితోరణాది విచిత్రాలం కృతంబు నతివైభవోపేతంబునైన పురంబు ప్రవేశించి రాజమార్గంబునం జనుచుండఁ బౌరకామిను లట్టియెడ.

(తెభా-10.2-688-సీ.)[మార్చు]

కొఱనెలపైఁ దోచు నిరులు నాఁ జెలువొంది;
నొసలిపైఁ గురులు తుంపెసలు గునియ
హాటకమణిమయ తాటంకరోచులు;
గండభాగంబుల గంతులిడఁగ
స్ఫురిత విద్రుమనిభాధరబింబరుచితోడ;
రహాసచంద్రిక రసమాడ
నొండొంటితో రాయు నుత్తంగ కుచకుంభ;
ములు మొగంబులకును బుటము లెగయ

(తెభా-10.2-688.1-తే.)[మార్చు]

డుగునడుములు వడఁకంగ డుగు లిడఁగ
వళిమట్టెలు మణినూపుములు మొరయఁ
బొలుచు కచబంధములు భుజంబుల నటింపఁ
య్యెదలు వీడి యాడ సంభ్రమముతోడ.

(తెభా-10.2-689-వ.)[మార్చు]

ఇట్లు కృష్ణసందర్శన కుతూహల పరస్పరాహూయమానలై గురు పతి సుత బంధు జనంబులు వారింప నతిక్రమించి సమున్నత భర్మహర్మ్య శిఖాగ్రంబు లెక్కి కృష్ణుం జూచి తమలో నిట్లనిరి.

(తెభా-10.2-690-సీ.)[మార్చు]

విశ్వగర్భుండు నా వెలయు వే ల్పిల యశో;
దానందులకుఁ బ్రియసూనుఁ డయ్యె;
బ్రహ్మాది సురులకు భావింపఁగా రాని;
బ్రహ్మంబు గోపాలబాలుఁ డయ్యె;
వేదశాస్త్రంబులు వెదకి కానఁగలేని;
ట్టి వ్రేతల ఱోలఁ ట్టుపడియె;
దివిజుల కమృతంబు దవిలి యిచ్చిన భక్త;
సులభుండు నవనీత చోరుఁ డయ్యె

(తెభా-10.2-690.1-తే.)[మార్చు]

నెనయఁ గమలాసతికిఁ జిత్త మీని వేల్పు
గొల్లయిల్లాండ్ర యుల్లముల్‌ పల్లవింపఁ
జేసె నని కామినులు సౌధశిఖరములను
గూడి తమలోన ముచ్చట లాడి రధిప!

(తెభా-10.2-691-వ.)[మార్చు]

మఱియును.

(తెభా-10.2-692-సీ.)[మార్చు]

గోపాలబాలురఁ గూడి యాడెడి నాఁడు;
వ్రేపల్లె లోపల నేపు రేఁగి
ల్ల లమ్మగఁ బోవు తుల కొంగులు పట్టి;
మెఱుఁగుఁ జెక్కిళ్ళను మీటిమీటి
లికియై ముద్దాడఁ గౌఁగిటఁ జేర్చిన;
పూఁబోఁడి కుచములు పుణికిపుణికి
పాయని యనురక్తి డాయఁ జీరిన యింతి;
ధరసుధారసం బానియాని

(తెభా-10.2-692.1-తే.)[మార్చు]

యురుసమాధిపరాష్టాంగయోగ యుక్తు
లైన యోగీశ్వరులు గానట్టి జెట్టి
ల్లవీజన వన కల్పల్లి యయ్యె
నుచుఁ బొగడిరి కృష్ణు నయ్యబ్జముఖులు.

(తెభా-10.2-693-మ.)[మార్చు]

ని యిబ్భంగి సరోజలోచనలు సౌధాగ్రంబు లందుండి య
వ్వ జాతాక్షుని దివ్యమూర్తిఁ దమభావం బందుఁ గీలించి సం
నితానంద రసాబ్ధిమగ్న లగుచున్ సంప్రీతిఁ దద్భవ్య కీ
ర్త లై చల్లిరి నవ్యలాజములు మందారప్రసూనావలుల్‌.

(తెభా-10.2-694-వ.)[మార్చు]

తదనంతరంబ శోభనపదార్థంబులు కొనివచ్చి ధరామర ధరావర వణిక్పుంగవులు దామోదరునకు కానుక లిచ్చిరి; పుణ్యాంగనా జనంబులు పసిండిపళ్లెరంబులఁ గర్పూరనీరాజనంబులు నివాళింప నంతఃపురంబు సొత్తెంచె; నంతం గుంతిభోజనందనయుం గృష్ణునిం గని పర్యంకంబు డిగ్గి కౌఁగిలింప నా యదువల్లభుఁడు మేనత్తకుం బ్రణామం బాచరించెఁ; బాంచాలియు ముకుందునకు నభివందనం బొనరించి కుంతిపంపున గోవిందు భామినులగు రుక్మిణి మొదలగువారికి గంధాక్షత కుసుమ తాంబూలంబులిడి లలిత దుకూల మణి భూషణంబులం బూజించె; యుధిష్ఠిరుండును గమలనయనుని వధూజనుల ననుగత బంధుమిత్ర పుత్త్ర సచివ పురోహిత పరిచారక సముదయంబుల నుచితంబు లగు స్థలంబుల విడియింప నియమించి దినదినంబును నభినవంబు లగు వివిధోపచారంబులు గావించుచుండె.

(తెభా-10.2-695-క.)[మార్చు]

రియు యుధిష్ఠిరు సముచిత
' రిచర్యల కాత్మ నలరి పార్థుఁడు దానున్
స విహారక్రియలను
'సు రుచిరగతిఁ గొన్ని నెలలు సుఖముండె నృపా!

(తెభా-10.2-696-వ.)[మార్చు]

అంత.

21-05-2016: :
గణనాధ్యాయి 11:08, 12 డిసెంబరు 2016 (UTC)