పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/బలుడు పల్వలుని వధించుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

బలుడు పల్వలుని వధించుట

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/బలుడు పల్వలుని వధించుట)
రచయిత: పోతన


(తెభా-10.2-943-చ.)[మార్చు]

' నమునం జరించు సురకంటకు కంఠము చేఁతినాగటం
' గిలిచి రోఁక లెత్తి బెడిదం బడరన్ నడునెత్తి మొత్తినన్
'బు బుగ నెత్తు రొల్క నిల బోరగిలం బడె వజ్రధారచేఁ
'దె గి ధరఁ గూలు భూరి జగతీధరముం బురుడింప బెట్టుగాన్.

(తెభా-10.2-944-వ.)[మార్చు]

అట్లు పల్వలుండు మడిసిన.

(తెభా-10.2-945-క.)[మార్చు]

ము నివరులు గామపాలుని
'వి నుతించిరి వేయువేల విధముల వృత్రుం
దు నిమిన యింద్రుని నమరులు
'వి నుతించిన రీతి నపుడు విమలచరిత్రా!

(తెభా-10.2-946-తే.)[మార్చు]

'అంత నభిషిక్తుఁ జేసి యత్యంత సురభి
'మంజులామ్లాన కంజాత మాలికయును
'నంచితాభరణములు దివ్యాంబరములు
'ర్థి నిచ్చినఁ దాల్చి యా లధరుండు.

(తెభా-10.2-947-క.)[మార్చు]

దే వేంద్రుఁ బోలి యొప్పెను
ధీ విలసితుఁ డగుచు మునితతిన్ వీడ్కొని తన్
సే వించుచుఁ గతిపయ వి
ప్రా లి సనుదేరఁ గౌశికాఖ్యంబునకున్.

(తెభా-10.2-948-వ.)[మార్చు]

చని యమ్మహానదిం గృతస్నానుండై యచ్చోటు వాసి సరయువు నందుఁ గ్రుంకులిడి ప్రయాగ నవగాహనంబు సేసి దేవర్షి పితృతర్పణంబు లాచరించి పులస్త్యాశ్రమంబు సొచ్చి గోమతిం దర్శించి గండకీనది నుత్తరించి విదళితభవపాశయగు విపాశయందుఁదోఁగి శోణనదంబున నాప్లావితుండై గయనాడి గంగాసాగరసంగమంబు దర్శించి మహేంద్రనగంబున కరిగి.

(తెభా-10.2-949-క.)[మార్చు]

రా ముఁడు గనుఁగొనె భార్గవ
రా మున్ రజనీశ కులధరావరనగ సు
త్రా మున్ సన్నుత సుగుణ
స్తో ముం గారుణ్యసీము సుజనలలామున్.

(తెభా-10.2-950-ఆ.)[మార్చు]

ని నమస్కరించి కౌతుకం బలరార
తని వీడుకొని హలాయుధుండు
గొమరుమిగిలి సప్తగోదావరికి నేఁగి
యందుఁ దీర్థమాడి చటు గదలి.

(తెభా-10.2-951-వ.)[మార్చు]

వేణీపంపాసరస్సులంజూచి, భీమనదికేఁగి యందుఁ గుమారస్వామిని దర్శించి, శ్రీశైలంబునకుఁ జని, వేంకటాచలంబు దర్శించి, కామకోటి శక్తిని నిరీక్షించి, కాంచీపురంబుం గాంచి, కావేరికిం జని యమ్మహావాహిని నవగాహనంబు సేసి.

(తెభా-10.2-952-స్రగ్ద.)[మార్చు]

సే వించెన్ రంగధామున్ శ్రితనివహపయస్సింధుసంపూర్ణసోముం
గా వేరీ మధ్యసీమున్ నకలుష మహాకాలకూటోగ్ర భీమున్
దే వారిశ్రీ విరామున్ దివిజవినుత సందీపితానంత నామున్
ధీ విజ్ఞానాభిరాముం ద్రిభువన విలసద్దేవతా సార్వభౌమున్.

(తెభా-10.2-953-వ.)[మార్చు]

అచ్చోటు వాసి వృషభాద్రి నెక్కి, హరిక్షేత్రంబు ద్రొక్కి, మధురాపురంబున కరిగి, సేతుబంధనంబు మెట్టి, యచటం బదివేల పాఁడిమొదవుల భూసురుల కిచ్చి, రామేశ్వరుం దర్శించి, తామ్రపర్ణికిం జని, మలయాచలంబెక్కి, యగస్త్యునింగని నమస్కరించి, దక్షిణసముద్రంబు దర్శించి, కన్యాఖ్యదుర్గాదేవి నుపాసించి, పంచాప్సరంబను తీర్థంబున నాప్లవనం బాచరించి, గోకర్ణంబున నిందుమౌళిని దర్శించి, ద్వీపవతి యైన కామదేవిని వీక్షించి, తాపింబయోష్ణిని దర్శించి, నిర్వింధ్యంబు గడచి, దండకావనంబున కరిగి, మాహిష్మతీపురంబున వసియించి, మనుతీర్థం బాడి, క్రమ్మఱం బ్రభాసతీర్థంబునకు వచ్చి యచ్చటి బ్రాహ్మణ జనంబుల వలన బాండవధార్తరాష్ట్రుల భండనంబునందు సకలరాజలోకంబు పరలోకగతు లగుటయు, వాయునందన సుయోధనులు గదాయుద్ధ సన్నద్ధులై యుండుటయు నెఱింగి వారల వారించు తలంపున నచటికిం జని.

(తెభా-10.2-954-తే.)[మార్చు]

ర్మనందనుఁ దనకు వంనము సేయు
కృష్ణు నరు మాద్రిసుతుల నీక్షించి యేమి
లుక కుగ్ర గదాదండపాణు లగుచుఁ
గ్రోధమునఁ బోరు భీమ దుర్యోధనులను.

(తెభా-10.2-955-వ.)[మార్చు]

చూచి వారల డాయం జని యిట్లనియె.

(తెభా-10.2-956-సీ.)[మార్చు]

వీరపుంగవులార! వినుఁడు; మీలోపల;
భూరిభుజాసత్త్వమున నొకండు
ప్రకటితాభ్యాస సంద్విశేషంబున;
నొక్కండు యధికుఁడై యుంటఁ జేసి
మబలు; లటు గాన ర్చింపఁగా నిందు;
య మొక్కనికి లేదు మరమందుఁ;
గాన యూరక పోరఁగా నేల మీకని;
వారింప నన్యోన్య వైరములను

(తెభా-10.2-956.1-తే.)[మార్చు]

డరి తొల్లింటి దుర్భాష లాత్మలందుఁ
లఁచి తద్భాషణము లపథ్యములు గాఁగ
మొక్కలంబునఁ బోర నా ముష్టికాసు
రారి వీక్షించు వీరి శుభాశుభములు,

(తెభా-10.2-957-వ.)[మార్చు]

ఎట్లుగావలయు నట్ల యయ్యెడుం గాక యని; యచ్చోట నిలువక యుగ్రసేనాది బంధుప్రకరంబులు పరితోషంబున నెదుర్కొన ద్వారకాపురంబు సొచ్చి; యందుండి మగిడి నైమిశారణ్యంబు నకుంజని; యందుల మునిపుంగవు లనుమతింప నచ్చట నొక మఖంబు గావించి బహుదక్షిణ లొసంగి; యంచితజ్ఞానపరిపూర్ణు లగునట్లుగా వరంబిచ్చి; రేవతియునుం దానును బంధు జ్ఞాతి యుతంబుగానవభృథస్నానం బాచరించి; యనంతరంబ.

(తెభా-10.2-958-చ.)[మార్చు]

వి సిత మాల్య చందన నవీన విభూషణ రత్న వస్త్రముల్‌
పొ లుపుగఁ దాల్చి యంచిత విభూతిఁ దలిర్చెను బూర్ణచంద్రికా
లిత సుధాంశురేఖ నెసకం బెసఁగన్ నిజబంధులోచనో
త్ప చయ ముల్లసిల్లఁ బరిపాండుర చారు యశోవిలాసుఁడై.

(తెభా-10.2-959-వ.)[మార్చు]

ఇవ్విధంబున ననంతుండు నప్రమేయుండును మాయామానుష విగ్రహుండు నసంఖ్యబలశాలియు నైన బలదేవుం డతివైభంబున నిజపురంబు ప్రవేశించి సుఖంబుండె” నని చెప్పి యిట్లనియె.

21-05-2016: :
గణనాధ్యాయి 11:18, 12 డిసెంబరు 2016 (UTC)