Jump to content

పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/కుచేలోపాఖ్యాన ప్రారంభంబు

వికీసోర్స్ నుండి

కుచేలోపాఖ్యాన ప్రారంభంబు

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/కుచేలోపాఖ్యాన ప్రారంభంబు)
రచయిత: పోతన


తెభా-10.2-960-క.
"హధరు డమర్త్య చరితుం
ఘు భుజాబలుఁ డొనర్చు ద్భుత కర్మం
బులు పెక్కు నాల్గు మోములు
మేటియు లెక్క పెట్టఁ లఁడె నరేంద్రా! "

టీక:- హలధరుడు = బలరాముడు; అమర్త్య = దివ్యమైన; చరితుండు = నడవడిక కలవాడు; అలఘు = అధికమైన; భుజాబలుడు = భుజబలము కలవాడు; ఒనర్చున్ = చేయును; అద్భుత = అశ్చర్యకరమైన; కర్మంబులు = పనులు; పెక్కు = అనేకమైన వానిని; నాల్గుమోములుగలమేటియు = బ్రహ్మదేవుడైనా; లెక్కపెట్టగలడె = ఎంచగలడా, ఎంచలేడు; నరేంద్రా = రాజా.
భావము:- “ఓ మహారాజా! పరీక్షిత్తు! హాలాయుధుడూ, దివ్యచారిత్రుడూ, భుజబల సంపన్నుడూ అయిన బలరాముడి అద్భుత కార్యాలను పొగడడానికి నాలుగు ముఖాలు గల బ్రహ్మదేవుడి కైనా సాధ్యంకాదు.”

తెభా-10.2-961-చ.
నిన మునీంద్రుఁ గన్గొని ధరాధిపుఁ డిట్లను "పద్మపత్త్రలో
నుని యనంత వీర్యగుణ సంపద వేమఱు విన్న నైననుం
నియదు చిత్త మచ్యుతకథావిభవం బొకమాటు వీనులన్
వినిన మనోజపుష్ప శరవిద్ధుఁడు నైన విరామ మొందునే?

టీక:- అనిన = అనగా; ముని = ముని; ఇంద్రున్ = ఉత్తముని; కన్గొని = చూసి; ధరాధిపుడు = రాజు; ఇట్లు = ఈ విధముగ; అను = అనెను; పద్మపత్రలోచనుని = కృష్ణుని; అనంత = అనంతమైన; వీర్య = పరాక్రమములు; గుణ = గుణములు; సంపదన్ = కలిమి; వేమఱు = పలుసార్లు; విన్ననైనన్ = విన్నప్పటికి; తనియదు = తృప్తితీరదు; చిత్తము = మనస్సు; అచ్యుత = కృష్ణుని; కథ = వృత్తాంతముల; విభవంబు = వైభవములు; ఒక = ఒక; మాటు = సారి; వీనులన్ = చెవు లందు; వినినన్ = వినగా; మనోజ = మన్మథుని యొక్క; పుష్పశర = పూలబాణములచేత; విద్ధుడు = కొట్టబడిన వాడు; ఐనన్ = అయినప్పటికి; విరామమున్ = విశ్రాంతి; ఒందునె = పొందునా, పొందడు.
భావము:- అలా చెప్పిన శుకమహర్షితో పరీక్షిత్తు ఇలా అన్నాడు “అంబుజాక్షుని అనంత గుణ సంపదలను గురించీ, పరాక్రమ ప్రాశస్త్యాలను గురించీ, ఎన్ని మార్లు విన్నా తనివితీరదు. ఒక్కసారి విష్ణు కథా వైభవాన్ని వింటే చాలు, ఎంత మన్మథ వికార పీడితు డైనా సరే మరీ మరీ వినకుండా ఉండ లేడు.

తెభా-10.2-962-వ.
అదియునుం గాక.
టీక:- అదియునున్ = అంతే; కాక = కాకుండ.
భావము:- అంతేకాకుండా....

తెభా-10.2-963-చ.
రిభజియించుహస్తములుస్తము; లచ్యుతుఁగోరి మ్రొక్కు త
చ్ఛిము శిరంబు; చక్రధరుఁ జేరిన చిత్తము చిత్త; మిందిరా
రుఁగను దృష్టి దృష్టి; మురవైరి నుతించిన వాణి వాణి; య
క్షరుకథ లాను కర్ణములు ర్ణములై విలసిల్లుఁబో భువిన్.

టీక:- హరిన్ = కృష్ణుని; భజియించు = అర్చించునట్టి; హస్తములు = చేతులు; హస్తములు = చేతులు; అచ్యుతున్ = కృష్ణుని; కోరి = కావాలని; మ్రొక్కు = నమస్కరించెడి; తత్ = వాని; శిరము = తల; శిరంబున్ = శిరము; చక్రధరున్ = కృష్ణుని; చేరిన = పొందిన; చిత్తము = మనస్సు; చిత్తము = మనస్సు; ఇందిరావరున్ = కృష్ణుని; కను = చూచు; దృష్టి = చూపు; దృష్టి = చూపు; మురవైరి = కృష్ణుని; నుతించిన = స్తుతించిన; వాణి = నోరు, వాక్కు; వాణి = నోరు, వాక్కు; అక్షరు = కృష్ణుని; కథలు = కథలను; ఆను = వినెడి; కర్ణములు = చెవులు; కర్ణములు = చెవులు; ఐ = అయ్యి; విలసిల్లుబో = తప్పక ప్రకాశించును; భువిని = భూలోకమునందు.
భావము:- హరిని పూజించే చేతులే చేతులు; అచ్యుతునికి నమస్కరించే శిరస్సే శిరస్సు; ఆ చక్రధారుని చూసే కన్నులే కన్నులు; ఆ లక్ష్మీపతిని పొగడే నోరే నోరు; ఆ శాశ్వతుని కథలను వినే చెవులే చెవులు.

తెభా-10.2-964-క.
రిపాదతీర్థ సేవా
రుఁడై విలసిల్లునట్టి భాగవతుని వి
స్ఫురితాంగము లంగము; లా
మేశ్వరు నెఱుఁగ నాకుఁ లుకు మునీంద్రా! "

టీక:- హరి = కృష్ణుని; పాద = కాళ్ళు అను; తీర్థ = పుణ్యతీర్థములను; సేవా = అర్చించుట యందు; పరుడు = నిష్ఠ కలవాడు; ఐ = అయ్యి; విలసిల్లునట్టి = విరాజిల్లెడి; భాగవతుని = భాగవత్సేవకుని యొక్క; విస్ఫురిత = ప్రకాశించునట్టి; అంగముల్ = అవయవములు; అంగములు = అవయవములు; ఆ = ఆ దివ్యమైన; పరమేశ్వరున్ = భగవంతుని; ఎఱుగన్ = తెలియ; నా = నా; కున్ = కు; పలుకుము = చెప్పుము; ముని = ముని; ఇంద్రా = శ్రేష్ఠుడా.
భావము:- ఓ మునీశ్వరా! శ్రీహరి పాదపద్మాలు అనే తీర్థాలను సేవించి ధన్యుడైన భాగవతుని అంగములే అంగములు. ఆ పరమాత్ముని తెలుసుకొనే మార్గం నాకు విశదీకరించి చెప్పవలసినది.”

తెభా-10.2-965-సీ.
నుడు వేదవ్యాసనయుఁ డా యభిమన్యు-
నయునిఁ జూచి యిట్లనియెఁ బ్రీతి
"నవర! గోవింద ఖుఁడు కుచేలుండు-
నా నొప్పు విప్రుండు మానధనుఁడు
విజ్ఞాని రాగాది విరహితస్వాంతుండు-
శాంతుండు ధర్మవత్సలుఁడు ఘనుఁడు
విజితేంద్రియుఁడు బ్రహ్మవేత్త దారిద్య్రంబు-
బాధింప నొరులఁ గార్పణ్యవృత్తి

తెభా-10.2-965.1-తే.
డుగఁ బోవక తనకుఁ దా బ్బినట్టి
కాసు పదివేల నిష్కముల్‌ గాఁ దలంచి
యాత్మ మోదించి పుత్రదారాభిరక్ష
యొక విధంబున నడుపుచు నుండు; నంత

టీక:- అనుడున్ = అనగా; వేదవ్యాసతనయుడు = శుకమహర్షి; ఆ = ఆ ప్రసిద్ధుడైన; అభిమన్యుతనయుని = పరీక్షిన్మహారాజుని; చూచి = చూసి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; జనవర = రాజా; గోవింద = కృష్ణుని; సఖుడు = మిత్రుడు; కుచేలుండు = కుచేలుడు; నాన్ = అనగా; ఒప్పు = ఉండు; విప్రుండు = బ్రాహ్మణుడు; మానధనుడు = ఆత్మాభిమాని; విజ్ఞాని = శాస్త్రజ్ఞానము కలవాడు; రాగాది = రాగద్వేషాదులు; విరహిత = లేనట్టి; స్వాంతుండు = మనస్సు కలవాడు; శాంతుండు = శాంతస్వభావి; ధర్మవత్సలుడు = ధర్మమునందు ప్రీతి కల వాడు; ఘనుడు = గొప్పవాడు; విజితేంద్రియుడు = జయించిన ఇంద్రియాలు కల వాడు; బ్రహ్మవేత్త = వేదార్థాలు తెలిసిన వాడు; దారిద్ర్యంబు = పేదరికము; బాధింపన్ = బాధపెట్టుతుండగా; ఒరులన్ = ఇతరుల; కార్పణ్యవృత్తిన్ = నీచభావముతో; అడుగన్ = అడుగుటకు; పోవక = పోకుండా; తనకుతాన్ = తనంతటదే; అబ్బినట్టి = లభించినట్టి; కాసు = కాసైనను {కాసు - రాగినాణెము, దమ్మిడిలో (రూపాయిలో 64వ వంతు కాని కానిలో 3వ వంతు దమ్మిడి) సగము అని కొందరు అంటారు, కాసున్నర ఐతే తులము అని కొందరు అంటారు}; పదివేల = పదివేలు (10000); నిష్కముల్ = నిష్కములు {నిష్కము - బంగారు నాణెము, మాడ అని కొందరు, 108 మాడలు అని కొందరు, పది రూకలు (వెండినాణెములు) అని కొందరు}; కాన్ = ఐనట్టు; తలంచి = భావించి; ఆత్మన్ = మనస్సులో; మోదించి = సంతోషించి; పుత్ర = కొడుకులు; దారా = భార్య యొక్క; అభిరక్ష = కాపాడుటను; ఒక = ఏదో ఒక; విధంబునన్ = విధముగా; నడపుచున్ = జరుపుతు; ఉండున్ = ఉన్న; అంతన్ = అప్పుడు.
భావము:- ఇలా అడిగిన ఆ అభిమన్య పుత్రునితో, వేదవ్యాస మహర్షి పుత్రుడు శుకుడు సంతోషంతో ఇలా అన్నాడు. “ఓ మహారాజా! కుచేలుడు అని శ్రీకృష్ణునికి ఒక బాల్యమిత్రుడు ఉన్నాడు. ఆ బ్రాహ్మణోత్తముడు చాలా గొప్పవాడు, అభిమానధనుడు, విజ్ఞానవంతుడు, రాగద్వేషాలు లేనివాడు, పరమశాంతమూర్తి, ధర్మతత్పరుడు, జితేంద్రియుడు, బ్రహ్మజ్ఞాన సంపన్నుడు. తన ఇంట దారిద్ర్యం దారుణంగా తాండవిస్తున్నా, ఎవరినీ దీనంగా యాచించి ఎరుగడు. తనంత తానుగా ప్రాప్తించిన కాసును కూడా పదివేలుగా భావించి, ఏదో ఒక విధంగా భార్యాపుత్రులను పోషిస్తూ వస్తున్నాడు. ఇలా ఉండగా....

తెభా-10.2-966-సీ.
లితపతివ్రతా తికంబు వంశాభి-
జాత్య తద్భార్య దుస్సహ దరిద్ర
పీడచేఁ గడు నొచ్చి పెదవులు దడుపుచు-
శిశువు లాఁకటి చిచ్చుచేఁ గృశించి
లమల మాఁడుచు మానసం బెరియంగఁ-
ట్టెఁ డోరెము మాకుఁ బెట్టు మనుచుఁ
త్త్రభాజనధృతపాణులై తనుఁ జేరి-
వేఁడిన వీనులుసూఁడినట్ల

తెభా-10.2-966.1-ఆ.
యైన నొకనాఁడు వగచి నిజాధినాథుఁ
జేరి యిట్లని పలికె "నో జీవితేశ!
ట్టుముట్టాడు నిట్టి పేఱిక మిట్లు
నొంప దీని కుపాయ మూహింప వైతి. "

టీక:- లలిత = సుకుమారమైన; పతివ్రతా = పతివ్రత; తిలకంబున్ = ఉత్తమురాలు; వంశ = మంచివంశమున; అభిజాత్య = పుట్టినామె; తత్ = అతని; భార్య = పెండ్లాము; దుస్సహ = సహింపరాని; దరిద్ర = పేదరికపు; పీడ = బాధలు; చేన్ = వలన; కడున్ = మిక్కిలి; నొచ్చి = బాధపడి; పెదవులు = పెదాలను; తడుపుచున్ = తడుపుకొనుచు; శిశువులు = పిల్లలు; ఆకటిన్ = ఆకలి అను; చిచ్చు = మంటల; చేన్ = వలన; కృశించి = చిక్కిపోయి; మలమల = మలమల యని (మాడుట యందలి ధన్యనుకరణ); మాడుచున్ = మాడిపోతూ; మానసంబున్ = మనస్సులో; ఎరియంగన్ = పరితపించునట్లుగా; పట్టెడు = గుప్పెడు; ఓరెమున్ = అన్నము, తిండి; మా = మా; కున్ = కు; పెట్టుము = పెట్టు; అనుచున్ = అంటు; పత్రభాజన = విస్తరాకులు, ఆకుదొన్నెలు; ధృత = పట్టుకొన్న; పాణులు = చేతులు కలవారు; ఐ = అయ్యి; తనున్ = తనకు; చేరి = దగ్గరకు వచ్చి; వేడినన్ = అడుగగా; వీనులున్ = చెవులలో; చూడినట్ల = కాల్చినట్లు; ఐనన్ = కాగా; ఒక = ఒకానొక; నాడు = రోజు; వగచి = విచారించి; నిజ = తన; అధినాథున్ = భర్త; చేరి = దగ్గరకు వెళ్ళి; ఇట్లు = ఈ విధముగ; అని = అని; పలికెన్ = చెప్పెను; ఓ = ఓయీ; జీవితేశా = ప్రాణనాథా; తట్టుముట్టాడు = చుట్టుకొను; ఇట్టి = ఇలాంటి; పేదఱికమున్ = దరిద్రము; ఇట్లు = ఇలా; నొంపన్ = బాధించగా; దీని = దీని; కిన్ = కి; ఉపాయము = తొలగించుదారి; ఊహింపవు = ఆలోచించనివాడవు; ఐతి = అయ్యావు.
భావము:- కుచేలుని భార్య మహాపతివ్రత. చక్కటి వంశంలో పుట్టిని సాధ్వి. బిడ్డలు ఆకలి మంట చేత కృశించి ఎండిన పెదవులను నాలుకతో తడుపుకుంటూ చేతుల్లో ఆకులూ గిన్నెలూ పట్టుకుని తల్లి వద్దకు వచ్చి పట్టెడన్నం పెట్టమని అడుగుతుంటే, ఆమె మనసు క్షోభ భరించలేకపోతోంది. అందుకని, ఆమె భర్తతో “ప్రాణేశ్వరా! ఇలా తాండవిస్తూ ఉన్న పేదరికం బాగా బాధిస్తోంది కదా. దీని గురించి మీరు ఆలోచించడం లేదు.”

తెభా-10.2-967-వ.
అని మఱియు నిట్లనియె.
టీక:- అని = అని; మఱియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- అని శోకంతో పలికి భర్తతో ఇంకా ఇలా అన్నది.

తెభా-10.2-968-తే.
"బాలసఖుఁడైన యప్పద్మత్త్రనేత్రుఁ
గాన నేఁగి దారిద్య్రాంధకార మగ్ను
లైన మము నుద్ధరింపుము; రికృపా క
టాక్ష రవిదీప్తి వడసి మహాత్మ! నీవు.

టీక:- బాల = బాల్య; సఖుండు = మిత్రుడు; ఐనన్ = అయినట్టి; ఆ = ఆ; పద్మపత్రనేత్రుడు = కృష్ణుని; కానన్ = దర్శించుటకు; ఏగి = వెళ్ళి; దారిద్ర్య = పేదరికము అను; అంధకారమున్ = చీకటి యందు; మగ్నులు = మునిగినవారు; ఐనన్ = అయినట్టి; మమున్ = మమ్ములను; ఉద్ధరింపుము = కాపాడుము; హరి = కృష్ణుని; కృపా = దయతోడి; కటాక్ష = కడకంటిచూపు అను; రవి = సూర్యుని; దీప్తిన్ = వెలుగు; పడసి = పొంది; మహాత్మా = గొప్పబుద్ధి కలవాడా; నీవు = నీవు.
భావము:- “మహానుభావ! శ్రీకృష్ణుడు మీ బాల్యసఖుడు కదా. మీరు వెళ్ళి ఆ మహానుభావుడిని దర్శించండి. అతని కృపాకటాక్షం పొంది, దారిద్ర్యంతో తల్లడిల్లుతున్న పిల్లలను, నన్ను కాపాడండి.

తెభా-10.2-969-వ.
మఱియును.
టీక:- మఱియును = ఇంకను.
భావము:- మరి ఇంకా....

తెభా-10.2-970-చ.
దుఁడు సాధుభక్తజనత్సలుఁ డార్తశరణ్యుఁ డిందిరా
రుఁడు దయాపయోధి భగవంతుఁడు కృష్ణుఁడు దాఁ గుశస్థలీ
పుమున యాదవప్రకరముల్‌ భజియింపఁగ నున్నవాఁడు; నీ
రిగిన నిన్నుఁ జూచి విభుఁ ప్పుడ యిచ్చు ననూన సంపదల్.

టీక:- వరదుడు = కోరిన కోరిక లిచ్చువాడు; సాధు = సుజనులైన; భక్త = భక్తులైన; జన = వారి ఎడల; వత్సలుడు = వాత్సల్యము కలవాడు; ఆర్త = దుఃఖము పొందినవారి; శరణ్యుడు = రక్షించువాడు; ఇందిరా = లక్ష్మీదేవి; వరుడు = భర్త; దయా = కృపకు; పయోధి = సముద్రుడు; భగవంతుడు = షడ్గుణైశ్వర్య సంపన్నుడు; కృష్ణుడు = కృష్ణుడు; తాన్ = అతను; కుశస్థలీ = కుశస్థలి అను {కుశస్థలి - 1. రైవతదుర్గమున ఉండిన ఒక పట్టణము. మధురాపురము జరాసంధునిచే కాల్పఁబడినవెనుక కృష్ణునకు ఇది ముఖ్యపట్టణము అయి ఉండెను. తొలుత ఇది ఆనర్తునిచే నిర్మింపఁబడి ఆనర్తదేశములకు రాజధాని అయి ఉండినట్లు తెలియవచ్చెడి.
2. దీని శ్రీరాముని కొమరుఁడు ఐన కుశుఁడు నిర్మాణము చేసెను. ఇది వింధ్యపర్వత ముఖమున (కోసలమున) ఉండును. ఆంధ్రశబ్దరత్నాకరము, ద్వారక}; పురమునన్ = పట్టణము నందు; యాదవ = యదువంశపు వారి; ప్రకరముల్ = సమూహములు; భజియింపన్ = సేవింపగా; ఉన్నవాడు = ఉన్నాడు; నీవు = నీవు; అరిగినన్ = వెళ్ళినచో; నిన్నున్ = నిన్ను; చూచి = చూసి; విభుడు = ప్రభువు; అప్పుడు = అప్పుడు; ఇచ్చున్ = ఇస్తాడు; అనూన = సమస్తమైన, వెలితిలేని; సంపదల్ = సంపదలను.
భావము:- శ్రీకృష్ణుడు ఆశ్రితులను రక్షించేవాడు; సజ్జనుల ఎడ, భక్తుల ఎడ వాత్సల్యము కలవాడు; దయాసాగరుడు; యాదవులు తనను సేవిస్తుండగా, ఆనర్తదేశములలో కోసలమున గల పట్టణమైన కుశస్థలీపురములో ఉన్నాడు కదా. ఒక్కసారి, ఆ శ్రీపతిని దర్శించండి. మిమ్మల్ని చూస్తే చాలు వెంటనే ప్రభువు మీకు అనంతమైన సంపదలు అనుగ్రహిస్తాడు.

తెభా-10.2-971-మ.
లోనం దను మున్నెఱుంగని మహాష్టాత్ముడై నట్టి దు
ర్బలుఁ డాపత్సమయంబునన్ నిజపదాబ్జాతంబు లుల్లంబులోఁ
లఁపన్నంతన మెచ్చి యార్తిహరుఁడై న్నైన నిచ్చున్; సుని
శ్చభక్తిన్ భజియించు వారి కిడఁడే సంపద్విశేషోన్నతుల్‌? "

టీక:- కల = స్వప్నము; లోనన్ = అందైనా; తనున్ = తనను; మున్ను = మునుపు; ఎఱుంగని = తెలియనట్టి; మహా = మిక్కిలి; కష్ట = నీచమైన; ఆత్ముడు = మనస్సు కలవాడు; ఐన్నట్టి = అయినట్టి; దుర్బలుడు = బలహీనుడు; ఆపత్ = ఆపదలు వచ్చిన; సమయంబునన్ = అప్పుడు; నిజ = తన; పదా = పాదములు అను; అబ్జాతంబులున్ = పద్మములను; ఉల్లంబు = మనస్సు; లోన్ = లో; తలపన్ = తలచుకొన్న; అంతన్ = వెంటనే; మెచ్చి = మెచ్చుకొని; ఆర్తి = దుఃఖమును; హరుడు = పోగొట్టువాడు; ఐ = అయ్యి; తన్ను = తనను; ఐనన్ = అయినను; ఇచ్చున్ = ఇచ్చివేయును; సు = మిక్కిలి; నిశ్చల = చలింపని; భక్తిన్ = భక్తితో; భజియించు = అర్చించెడి; వారి = వారల; కిన్ = కు; ఇడడే = ఇవ్వడా, ఇస్తాడు; సంపత్ = సంపదల, కలిమి యొక్క; విశేష = విశిష్టమైన; ఉన్నతుల్ = అధికమైనవానిని.
భావము:- కలలోకూడా తన్నెన్నడూ స్మరించని పాపాత్ముడు అయినా, ఆపదలు చుట్టుముట్టి నప్పుడు, ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆ ఆశ్రిత రక్షకుడి పాదారవిందాలను మనసారా స్మరిస్తే చాలు. ఎలాంటి వాడిని అయినా కనికరిస్తాడు. అవసరమైతే తనను తానే అర్పించుకుంటాడు కదా. అంతటి మహానీయుడు నిరంతరం భక్తితో తనను సేవించే మీవంటి వారికి విశేషమైన సంపదలు ఇవ్వకుండా ఉంటాడా?”

తెభా-10.2-972-క.
ని చెప్పిన నమ్మానిని
సుయోక్తుల కలరి భూమిసురుఁ డా కృష్ణుం
నేఁగుట యిహపర సా
మగు నని మదిఁ దలంచి న సతితోడన్.

టీక:- అని = అని; చెప్పినన్ = చెప్పగా; ఆ = ఆ; మానిని = ఉత్తమురాలు; సు = మంచి; నయ = న్యాయమైన; ఉక్తుల్ = మాటల; కున్ = కు; అలరి = సంతోషించి; భూమిసురుడు = విప్రుడు; ఆ = ఆ దివ్యమైన; కృష్ణున్ = కృష్ణుని; కనన్ = చూచుటకు; ఏగుట = వెళ్ళుట; ఇహ = ఈ లోక సుఖములు; పర = పరలోక సుఖములు; సాధనము = సాధించిపెట్టునది; అగును = అగును; అని = అని; మదిన్ = మనస్సు నందు; తలంచి = అనుకొని; తన = తన యొక్క; సతి = భార్య; తోడన్ = తోటి.
భావము:- ఇలా చెప్తున్న ఆ ఇల్లాలి మాటలకు కుచేలుడు సంతోషించాడు. శ్రీకృష్ణుడిని చూడడానికి వెళ్ళడం ఇహపర సాధనమని మనసులో అనుకుని, తన భార్యతో ఇలా అన్నాడు.

తెభా-10.2-973-తే.
"నీవు సెప్పిన యట్ల రాజీవనేత్రు
పాదపద్మంబు లాశ్రయింపంగఁ జనుట
రమశోభన మా చక్రపాణి కిపుడు
గాను కేమైనఁ గొంపోవఁ లదె మనకు? "

టీక:- నీవు = నీవు; చెప్పిన = చెప్పిన; అట్ల = విధముగనే; రాజీవనేత్రు = కృష్ణుని; పాద = పాదములు అను; పద్మంబులన్ = పద్మములను; ఆశ్రయింపంగన్ = ఆశ్రయించుటకు; చనుట = వెళ్లుట; పరమ = మిక్కిలి; శోభనము = శుభప్రదమైనది; ఆ = ఆ దివ్యమైన; చక్రపాణి = కృష్ణుని; కిన్ = కి; ఇపుడు = ఇప్పుడు; కానుక = బహుమానము; ఏమైనన్ = ఏమైనను; కొంపోవన్ = తీసుకొని వెళ్ళుటకు; కలదె = ఏమైనా ఉందా; మన = మన; కున్ = కు (వద్ద).
భావము:- “నీ వన్నట్లు శ్రీకృష్ణుడిని ఆశ్రయించడం పరమ కల్యాణప్రదమే. కాని చక్రి దగ్గఱకు వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళడానికి కానుక ఏదయినా మన వద్ద ఉందా.”

తెభా-10.2-974-తే.
నిన నయ్యింతి "యౌఁగాక"నుచు విభుని
శిథిల వస్త్రంబు కొంగునఁ బృథుక తండు
ముల నొకకొన్ని ముడిచి నెయ్యమున ననుపఁ
నియె గోవింద దర్శనోత్సాహి యగుచు.

టీక:- అనినన్ = అనగా; ఆ = ఆ; ఇంతి = యువతి; ఔగాక = అలాగే; అనుచున్ = అంటు; విభుని = భర్త యొక్క; శిథిల = చిరుగుల; వస్త్రంబు = బట్టల; కొంగునన్ = కొంగు నందు; పృథుకతండులముల = వరి అటుకులు; ఒకకొన్ని = కొద్దిగా; ముడిచి = ముడివేసి; నెయ్యమునన్ = ప్రీతితో; అనుపన్ = పంపించగా; చనియెన్ = వెళ్ళెను; గోవింద = కృష్ణుని; దర్శన = చూసెడి; ఉత్సాహి = ఉత్సాహము కలవాడు; అగుచున్ = ఔతు.
భావము:- భర్త అభిప్రాయం అంగీకరించిన కుచేలుని భార్య “అలాగే” అంది. పిమ్మట అతని చినిగిన పైట కొంగులో కొన్ని అటుకులు ముడివేసి ప్రేమతో ప్రయాణానికి సిద్ధం చేసింది. కుచేలుడు గోవింద దర్శనం అవుతుందనే ఉత్సాహంతో బయలుదేరాడు.

తెభా-10.2-975-వ.
అట్లు సనుచుం దన మనంబున.
టీక:- అట్లు = ఆ విధముగ; చనుచున్ = వెళ్తూ; తన = తన యొక్క; మనంబునన్ = మనస్సునందు.
భావము:- ద్వారకకు వెళుతూ దారిలో కుచేలుడు తనలో ఇలా అనుకోసాగాడు....

తెభా-10.2-976-సీ.
"ద్వాకానగరంబు నే రీతిఁ జొత్తును?-
భాసురాంతఃపురవాసి యైన
ప్పుండరీకాక్షు ఖిలేశు నెబ్భంగి-
ర్శింపఁ గలనొ? తద్ద్వారపాలు
"రెక్కడి విప్రుఁడ? విం దేల వచ్చెద?"-
ని యడ్డ పెట్టిరే పుడు వారి
కే మైనఁ బరిదాన మిచ్చి చొచ్చెద నన్న-
నూహింప నర్థశూన్యుండ నేను;

తెభా-10.2-976.1-తే.
యిన నా భాగ్య; మతని దయార్ద్రదృష్టి
గాక తలపోయఁగా నొండు లదె? యాతఁ
డేల నన్ను నుపేక్షించు? నేటిమాట?"
నుచు నా ద్వారకాపుర తఁడు సొచ్చి.

టీక:- ద్వారకానగరంబున్ = ద్వారకానగరమును; ఏ = ఏ; రీతిన్ = విధముగా; చొత్తును = ప్రవేశించగలను; భాసుర = ప్రకాశించునట్టి; అంతఃపుర = అంతఃపురమున; వాసి = ఉండువాడు; ఐన = అయిన; ఆ = ఆ; పుండరీకాక్షున్ = కృష్ణుని; అఖిలేశు = ఎల్లరకు ప్రభువును; ఏ = ఏ; భంగిన్ = విధముగా; దర్శింపగలనొ = చూడగలిగెదనో; తత్ = ఆ; ద్వారపాలురు = ద్వారపాలకులు; ఎక్కడి = ఎక్కడ ఉండు; విప్రుడవు = బ్రాహ్మణుడవు; ఇందు = ఇక్కడకు; ఏలన్ = ఎందుకు; వచ్చెదవు = వస్తున్నావు; అని = అని; అడ్డపెట్టిరేని = అడ్డపడినచో; ఏను = నేను; అపుడు = అప్పుడు; వారి = వారల; కున్ = కు; ఏమైన = ఏదైనను; పరిదానము = లంచము; ఇచ్చి = ఇచ్చి; చొచ్చెదన్ = ప్రవేశించెదను; అన్నన్ = అన్నచో; ఊహింపన్ = విచారిస్తే; అర్థ = ధనము; శూన్యుండన్ = లేనివాడను; నేను = నేను; అయిన = అయినప్పటికి; నా = నా యొక్క; భాగ్యము = అదృష్టము; అతని = అతని; దయ = దయచేత; ఆర్ద్ర = ద్రవించిన; దృష్టి = చూపు; కాక = తప్పించి; తలపోయగా = అనుకోడానికి; ఒండు = మరొకటి; కలదె = ఉందా, లేదు; ఆతడు = అతను; ఏలన్ = ఎందుకు; నన్నున్ = నన్ను; ఉపేక్షించున్ = అనాదరము చేయు ననుట; ఏటి = ఎక్కడి; మాట = మాట; అనుచున్ = అంటు; ఆ = ఆ; ద్వారకాపురము = ద్వారకానగరమును; అతడు = అతను; చొచ్చి = ప్రవేశించి.
భావము:- “ద్వారకలోనికి నేను ఎలా వెళ్ళగలను? అత్యంత ప్రభావవంత మైన అంతఃపురంలో ఉన్న శ్రీకృష్ణుడి దర్శనం ఎలా లభిస్తుంది? ఒకవేళ ద్వారపాలకులు “నీవెక్కడ బ్రాహ్మణుడవయ్యా! ఇక్కడకి ఎందుకు వచ్చావయ్యా” అని నన్ను అడ్డగిస్తే నేనేమి చేయగలను? వారికి ఏదయినా బహుమానం ఇద్దామన్నా నేను కటికదరిద్రుడినే. ఏమివ్వగలను? ఇంతకూ నా అదృష్టం ఎలా ఉందో? అయినా, ఆ శ్రీకృష్ణుని కృపాకటాక్షం తప్ప మరొక మార్గం ఏమున్నది? ఆయన నన్నెందుకు ఉపేక్షిస్తాడు?” ఇలా అనుకుంటూ కుచేలుడు ద్వారక ప్రవేశించాడు

తెభా-10.2-977-వ.
ఇట్లు ప్రవేశించి రాజమార్గంబునం జనిచని కక్ష్యాంతరంబులు గడచి చని ముందట.
టీక:- ఇట్లు = ఈ విధముగ; ప్రవేశించి = లోనికి వెళ్ళి; రాజమార్గంబునన్ = ప్రధానవీథి వెంట; చనిచని = వెళ్ళి; కక్ష్యా = ప్రాకారములు; అంతరంబులున్ = నడుమలను; గడచి = దాటి; చని = వెళ్ళి; ముందటన్ = ఎదురుగా.
భావము:- ఇలా అనుకుంటూ కుచేలుడు ద్వారకాపట్టణం రాజమార్గాన ముందుకు సాగిపోయి, కొన్ని ప్రాకారాలు దాటాక అక్కడ....

తెభా-10.2-978-సీ.
విదమై యొప్పు షోసహస్రాంగనా-
లితవిలాస సంతిఁ దనర్చి
హనీయ తపనీయ ణిమయగోపుర-
ప్రాసాద సౌధ హర్మ్యములు సూచి,
ము బ్రహ్మానందమును బొందఁ గడు నుబ్బి-
సంతోషబాష్పముల్‌ డిగొనంగఁ
బ్రటమై విలసిల్లు నొ వధూమణి మంది-
మున నింతులు చామములు వీవఁ

తెభా-10.2-978.1-తే.
నరు మృదుహంసతూలికా ల్పమందుఁ
దానుఁ బ్రియయును బహు వినోములఁ దనరి
హితలావణ్య మన్మథన్మథుండు
నఁగఁ జూపట్టు పుండరీకాయతాక్షు.

టీక:- విశదమై = స్పష్టముగా; ఒప్పు = ఉన్నట్టి; షోడశసహస్ర = పదహారువేల (16000); అంగనా = స్త్రీలతో; కలిత = కూడియున్న; విలాస = విలాసములతో; సంగతిన్ = కూడు ఉండుటచేత; తనర్చి = అతిశయించి; మహనీయ = బాగా గొప్ప; తపనీయ = బంగారపు; మణి = రత్నాలు; మయ = పొదిగిన; గోపుర = గోపురములు; ప్రాసాద = దేవళములు; సౌధ = రాజభవనములు; హర్మ్యములు = మిద్దిళ్ళు; చూచి = చూసి; మనము = మనస్సు; బ్రహ్మ = మిక్కుటమైన; ఆనందమును = సంతోషమును; పొందన్ = పొందగా; కడున్ = మిక్కిలి; ఉబ్బి = ఉప్పొంగి; సంతోష = సంతోషపు; బాష్పముల్ = కన్నీళ్ళు; జడికొనంగన్ = వర్షించగా; ప్రకటము = స్పష్టముగా; ఐ = అయ్యి; విలసిల్లు = ప్రకాశించునట్టి; ఒక = ఒకానొక; వధూమణి = ఇల్లాలి; మందిరమునన్ = ఇంటిలో; ఇంతులు = స్త్రీలు; చామరములు = వింజామరలు; వీవన్ = వీస్తుండగా; తనరు = అతిశయించు; మృదు = మెత్తని; హంసతూలికా = హంసతూలికా; తల్పము = పాన్పు; అందున్ = మీద; తానున్ = తను; ప్రియయునున్ = ప్రియురాలు; బహు = పెక్కు; వినోదములన్ = వేడులను; తనరి = కలిగుండి; మహిత = గొప్ప; లావణ్య = లావణ్యముతో; మన్మథ = మన్మథునికే; మన్మథుండు = మోహము పుట్టించువాడు; అనగన్ = అన్నట్లుగా; చూపట్టు = కనబడెడి; పుండరీకాయతాక్షున్ = కృష్ణుని.
భావము:- శ్రీకృష్ణుని పదహారువేల సతులతో ప్రకాశిస్తున్న సుందర సమున్నత మణిమయ స్వర్ణసౌధాలను చూసి కుచేలుడు పరమానందం చెందాడు. అతని కళ్ళలో ఆనందబాష్పాలు స్రవించాయి. ఒక అంగన మందిరంలో మగువలు వింజామరలు వీస్తుండగా హంసతూలికాతల్పం మీద శ్రీకృష్ణుడు సతీమణితో సరసాలాడుతున్నాడు. ఆ మన్మథమన్మథుడైన మనోహర సౌందర్యమూర్తిని పద్మాక్షుని దర్శించాడు.

తెభా-10.2-979-సీ.
ఇందీవరశ్యాము, వందితసుత్రాముఁ-
రుణాలవాలు, భాసు కపోలుఁ,
గౌస్తుభాలంకారుఁ, గామితమందారు-
సురుచిరలావణ్యు, సుర శరణ్యు
ర్యక్షనిభమధ్యు, ఖిలలోకారాధ్యు-
నచక్రహస్తు, జత్ప్రశస్తు,
గకులాధిపయానుఁ, గౌశేయపరిధానుఁ-
న్నగశయను, నబ్జాతనయను,

తెభా-10.2-979.1-తే.
కరకుండల సద్భూషు, మంజుభాషు
నిరుపమాకారు, దుగ్ధసావిహారు,
భూరిగుణసాంద్రు, యదుకులాంభోధి చంద్రు,
విష్ణు, రోచిష్ణు, జిష్ణు, సహిష్ణుఁ, గృష్ణు

టీక:- ఇందీవర = నల్లకలువల వంటి; శ్యామున్ = నల్లనిఛాయకలవాడు; వందిత = నమస్కరించిన; సుత్రామున్ = ఇంద్రుడు కలవానిని; కరుణాల = దయలకు; వాలున్ = పాదు ఐనవానిని; భాసుర = ప్రకాశించునట్టి; కపోలున్ = చెక్కిళ్ళు కలవానిని; కౌస్తుభ = కౌస్తుభమణి; అలంకారున్ = అలంకారముకలవానిని; కామిత = కోరినవారికి; మందారున్ = కల్పవృక్షమైన వానిని; సు = మంచి; రుచిర = కాంతివంతమైన; లావణ్యున్ = లావణ్యము కలవానిని; సుర = దేవతలకు; శరణ్యున్ = రక్షకముగా ఉండువాడు; హర్యక్షము = సింహము {హర్యక్షము - పచ్చకన్నుల మృగము, సింహము}; నిభ = వంటి; మధ్యున్ = నడుము కలవానిని; అఖిల = సర్వ; లోకా = లోకములకు; ఆరాధ్యున్ = ఆరాధింపబడువాడు; ఘన = గొప్ప; చక్ర = చక్రమును; హస్తున్ = చేతియందు కలవానిని; జగత్ = విశ్వముచేత; ప్రశస్తున్ = స్తుతింపబడువానిని; ఖగకులాధిప = గరుడ; యాను = వాహనముగా కలవానిని; కౌశేయ = పట్టు; పరిధానున్ = బట్టలుకట్టుకొన్నవానిని; పన్నగ = ఆదిశేషునిపై; శయనున్ = పరుండువానిని; అబ్జాతనయనున్ = పద్మాక్షుని;
మకరకుండల = మొసలికుండలములు; సత్ = చక్కటి; భూషున్ = ఆభరణములుకలవానిని; మంజు = మనోజ్ఞమైన; భాషున్ = మాట్లాడువానిని; నిరుపమ = సాటిలోని; ఆకారున్ = స్వరూపము కలవానిని; దుగ్దసాగర = పాలసముద్రము నందు; విహారున్ = మెలగువానిని; భూరి = గొప్పవైన; గుణ = గుణములు; సాంద్రున్ = దట్టముగా కలవానిని; యదు = యదువు యొక్క; కుల = వంశము అను; అంభోధిన్ = సముద్రమునకు; చంద్రున్ = చంద్రుడైనవానిని; విష్ణున్ = సర్వవ్యాపకశీలుని; రోచిష్ణున్ = ప్రకాశించుశీలుని; జిష్ణున్ = జయించుశీలుని; సహిష్ణున్ = సహనశీలుని; కృష్ణున్ = కృష్ణుని.
భావము:- నల్లకలువలవంటి శ్యామలవర్ణం వాడూ; దేవేంద్రునిచేత పొగడబడేవాడూ; కృపకు నిలయమైనవాడూ; ప్రకాశించే చెక్కిళ్ళు కలవాడూ; కౌస్తుభాన్ని ధరించిన వాడూ; ఆర్ధులకు కల్పవృక్షం వంటివాడూ; సౌందర్యమూర్తీ; దేవతలకు దిక్కయినవాడూ; సింహమధ్యముడూ; సకల లోకాల యందు పూజింపబడువాడూ; చక్రాయుధుడూ; జగత్తులో పేరెన్నిక గలవాడూ; గరుడవాహనుడూ; పీతాంబరధారీ; ఆదిశేషునిపై శయనించేవాడూ; అరవిందాక్షుడూ; మకరకుండల భూషణుడూ; మధుర భాషణుడూ; సాటిలేని మేటి సౌందర్యం కలవాడూ; పాలసముద్రంలో విహరించే వాడూ; సుగుణ సాంద్రుడూ; యాదవకుల మనే సాగరానికి చంద్రుడూ; సర్వ వ్యాపకుడూ; ప్రకాశ వంతుడూ; జయ శీలుడూ; సహన శీలుడు అయిన శ్రీకృష్ణుడు ఆయనకు కనిపించాడు,