పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/బలరాముని ఘోష యాత్ర

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

బలరాముని ఘోషయాత్ర

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/బలరాముని ఘోష యాత్ర)
రచయిత: పోతన


(తెభా-10.2-483-సీ.)[మార్చు]

'రనాథ! విను మొకనాఁడు తాలాంకుండు;
'చుట్టాల బంధులఁ జూచు వేడ్క
'సుందర కాంచన స్యందనారూఢుఁడై;
'భాసిల్లుచున్న వ్రేల్లె కరిగి
'చిరకాల సంగత స్నేహులై గోప గో;
'పాంగనా నికర మాలింగనములు
'ముచిత సత్కృతుల్‌ లుపఁ గైకొని మహో;
'త్సుక లీల నందయశోదలకును

(తెభా-10.2-483.1-తే.)[మార్చు]

'వందనం బాచరించిన వారు మోద
'మంది బిగియారఁ గౌఁగిళ్ల నొందఁ జేర్చి
'మత దీవించి యంకపీమునఁ జేర్చి
'శిరము మూర్కొని చుబుకంబుఁ గరము పుణికి.

(తెభా-10.2-484-వ.)[మార్చు]

మఱియు నానందబాష్పధారాసిక్త కపోలయుగళంబులతోడం గుశలప్రశ్నంబుగా నిట్లని “రన్నా! నీవును నీ చిన్నతమ్ముండగు వెన్నుండును లెస్సయున్నవారె? మమ్మెప్పుడు నరసిరక్షింప వలయు; మాకు నేడుగడయ మీరకాక యొరులు గలరే?” యని సముచిత సంభాషణంబులం బ్రొద్దుపుచ్చుచుండి; రంత.

(తెభా-10.2-485-క.)[మార్చు]

గో పాలవరులు ప్రమదం
'బా పోవని మది నివర్తి తాఖిల గేహ
వ్యా పారు లగుచు హలధరు
'శ్రీ పాదంబులకు నతులు సేసిరి వరుసన్.

(తెభా-10.2-486-క.)[మార్చు]

సీ రియు వారికిఁ గరుణో
'దా రుండై నడపె సముచిక్రియ లంతం
గో రి తన యీడు గోపకు
'మా రులఁ జే చఱచి బలుఁడు మందస్మితుఁడై.

(తెభా-10.2-487-క.)[మార్చు]

ని సుందర దేహద్యుతి
' తాచలరుచులఁ దెగడ రాముఁడు వారల్‌
జియింప నేగి యొకచో
'వి నస్థలమున వసించి విలసిల్లు నెడన్.

(తెభా-10.2-488-కవి.)[మార్చు]

' ణములం గనస్ఫుట నూపుర; జాలము ఘల్లనుచుం జెలఁగం
' ములఁ గంకణముల్‌ మొరయన్ నలి; కౌనసియాడఁ గుచాగ్రములన్
' రులు నటింపఁ గురుల్‌ గునియన్ విల; న్మణికుండల కాంతులు వి
'స్ఫు రిత కపోలములన్ బెరయన్ వ్రజ; సుందరు లందఱమందగతిన్.

(తెభా-10.2-489-కవి.)[మార్చు]

' ని బలభద్రుని శౌర్య సముద్రుని; సంచితపుణ్యు నణ్యునిఁ జం
' ఘనసార పటీర తుషారసు; ధా రుచికాయు విధేయు సుధా
' రిపుఖండను న్మణిమండను; సారవివేకు నశోకు మహా
'త్ము నిఁ గని గోపిక లోపిక లేకయ; దుప్రభు నిట్లని రుత్కలికన్.

(తెభా-10.2-490-చ.)[మార్చు]

' ధర! నీ సహోదరుఁడు దంచిత కంజవిలోచనుండు స
'ల్ల లిత పురాంగనా జనవిలాస విహార సమగ్ర సౌఖ్యముల్‌
' లిగి సుఖించునే? మము నొకానొక వేళన యేని బుద్ధిలోఁ
' లఁచునొ? నూతనప్రియలఁ దార్కొని యేమియుఁ బల్కకుండునో?

(తెభా-10.2-491-క.)[మార్చు]

నీ జనకుల ననుజులఁ
' నుజుల బంధువుల మిత్రతుల విడిచి నె
మ్మ మున నొండు దలంపక
' ను నమ్మినవారి విడువఁగునే హరికిన్?

(తెభా-10.2-492-సీ.)[మార్చు]

'లలిత యామునసైకత స్థలమున;
'నుండ మమ్మే మని యూఱడించె
'విమల బృందావన వీథి మా చుబుకముల్‌;
'పుణుకుచే నే మని బుజ్జగించెఁ
'బుష్పవాటికలలోఁ బొలుచు మా కుచయుగ్మ;
'మంటుచు నే మని యాదరించెఁ
'గాసారముల పొంతఁ గౌఁగిట మముఁ జేర్చి;
'య మొప్ప నే మని మ్మఁ బలికె

(తెభా-10.2-492.1-తే.)[మార్చు]

'నన్నియు మఱచెఁ గాఁబోలు వెన్నుఁ డాత్మ
'గోరి తాఁ జాయలున్నైన వారి విడుచు
'నట్టి కృష్ణుఁడు దము ఱట్టు వెట్టు ననక
'యేల నమ్మిరి పురసతుల్‌ బేల లగుచు.

(తెభా-10.2-493-మ.)[మార్చు]

' ని యిబ్భంగి సరోజలోచనుని నర్మాలాపముల్‌ నవ్వులు
'న్న నుబంధుల్‌ పరిరంభణంబులు రతివ్యాసంగముల్‌ భావముల్‌
'వి యంబుల్‌ సరసోక్తులుం దలఁచి యువ్విళ్ళూరు చిత్తంబులన్
' నితానంగశరాగ్నిచేత దురవస్థం బొంది శోకించినన్.

(తెభా-10.2-494-వ.)[మార్చు]

అంత బలభద్రుండు వారల మనంబుల సంతాపంబులు వారింప నుపాయంబు లగు సరసచతురవచనంబులఁ గృష్ణుని సందేశంబులు సెప్పి విగతఖేదలం జేసి యచ్చట మాసద్వయంబు నిలిచి వసంతవాసరంబులు గడపుచుఁ గాళిందీ తీరంబున.

(తెభా-10.2-495-సీ.)[మార్చు]

'మాకంద జంబీర మందార ఖర్జూర;
'నసార శోభిత నములందు
'నేలాలతా లోల మాలతీ మల్లికా;
'ల్లీమతల్లికా వాటికలను
'రళ తరంగ శీర సాధు శీతల;
'సైకతవేదికా స్థలములందు
'కరంద రస పాన దవ దిందిందిర;
'పుంజ రంజిత మంజు కుంజములను

(తెభా-10.2-495.1-తే.)[మార్చు]

'విమలరుచి గల్గు సానుదేశముల యందు
'లిత శశికాంత ఘన శిలాలములందు
'లీల నిచ్ఛావిహార విలోలుఁ డగుచు
'సుందరీజనములు గొల్వఁ జూడ నొప్పె.

(తెభా-10.2-496-తే.)[మార్చు]

'ట్లు విహరింప వరుణునియాజ్ఞఁ జేసి
'వారుణీదేవి మద్య భావంబు నొంది
'నిఖిల తరుకోటరములందు నిర్గమించి
'మించు వాసనచేత వాసించె వనము.

(తెభా-10.2-497-వ.)[మార్చు]

అట్టియెడ.

(తెభా-10.2-498-మ.)[మార్చు]

మొప్పారు నవీనవాసనల నాఘ్రాణించి గోపాల సుం
రులుం దానును డాయనేగి యతిమోదం బొప్ప సేవించి యా
ళాక్షుల్‌ మణిహేమకంకణఝణత్కారానుకారంబులై
తాళంబులు మ్రోయఁబాడుచును వేడ్కన్నాడుచున్ సోలుచున్

(తెభా-10.2-499-సీ.)[మార్చు]

నమీఁది బిరుదాంకిములైన గీతముల్‌;
వాడుచు రా బలద్రుఁ డంత
హిత కాదంబరీ ధుపానమదవిహ్వ;
లాక్షుండు లలితనీలాలకుండు
నాలోల నవపుష్పమాలికోరస్థ్సలుఁ;
నుపమ మణికుండలాంచితుండు
ప్రాలేయ సంయుక్త ద్మంబుగతి నొప్పు;
లలితానన ఘర్మలకణుండు

(తెభా-10.2-499.1-తే.)[మార్చు]

గుచు వనమధ్యమున సలిలావగాహ
శీలుఁడై జలకేళికిఁ జేరి యమున
నిందు రమ్మని పిలువఁ గాళింది యతని
త్తుఁడని సడ్డసేయక సలుటయును.

21-05-2016: :
గణనాధ్యాయి 11:00, 12 డిసెంబరు 2016 (UTC)