పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/నృగుడు యూసరవి ల్లగుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

నృగుడు యూసరవిల్లగుట

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/నృగుడు యూసరవి ల్లగుట)
రచయిత: పోతన


(తెభా-10.2-476-వ.)[మార్చు]

అని వేగంబున ద్రొబ్బించిన నేను బుడమిం బడునపుడ యీ నికృష్టంబయిన యూసరవెల్లి రూపంబుఁ గైకొంటి; నింతకాలంబు దద్దోష నిమిత్తంబున నిద్దురవస్థం బొందవలసెఁ; బ్రాణులకుఁ బుణ్య పాపంబు లనుభావ్యంబులు గాని యూరక పోనేరవు; నేఁడు సమస్త దురితనిస్తారకంబయిన భవదీయ పాదారవింద సందర్శనంబునం జేసి యీ ఘోరదుర్దశలంబాసి నిర్మలాత్మకుండనైతినని పునఃపునః ప్రణామంబు లాచరించి, మఱియు నిట్లనియె.

(తెభా-10.2-477-ఆ.)[మార్చు]

'కృష్ణ! వాసుదేవ! కేశవ! పరమాత్మ!
'ప్రమేయ! వరద! రి! ముకుంద!
'నిన్నుఁ జూడఁ గంటి, నీ కృపం గనుగొంటి
'ఖిల సౌఖ్యపదవు లందఁ గంటి.

(తెభా-10.2-478-వ.)[మార్చు]

అని యనేకభంగులం గొనియాడి గోవిందుని పదంబులు దన కిరీటంబు సోఁకం బ్రణమిల్లి “దేవా! భవదీయ పాదారవిందంబులు నా హృదయారవిందంబును బాయకుండునట్లుగాఁ బ్రసాదింపవే?” యని తదనుజ్ఞాతుండై యచ్చటి జనంబులు సూచి యద్భుతానందంబులం బొంద నతుల తేజోవిరాజిత దివ్యవిమానారూఢుండై దివంబున కరిగె; నంత నమ్మాధవుండు నచ్చట నున్న పార్థివోత్తములకు ధర్మబోధంబుగా నిట్లనియె.

(తెభా-10.2-479-సీ.)[మార్చు]

'రనాథకుల కానము దహించుటకును;
'వనీసురులవిత్త గ్నికీల;
'ననాయకుల నిజైశ్వర్యాబ్ధి నింకింప;
'బ్రాహ్మణక్షేత్రంబు బాడబంబు;
'పార్థివోత్తముల సంచ్ఛైలములఁ గూల్ప;
'భూసురధనము దంభోళిధార;
'గతీవరుల కీర్తి చంద్రిక మాప వి;
'ప్రోత్తము ధనము సూర్యోదయంబు;

(తెభా-10.2-479.1-తే.)[మార్చు]

'విప్రతతి సొమ్ముకంటెను విషము మేలు
'రళమునకును బ్రతికృతి లదు గాని
'దాని మాన్పంగ భువి నౌషములు లేవు
'గాన బ్రహ్మస్వములు గొంట గాదు పతికి.

(తెభా-10.2-480-క.)[మార్చు]

ఱుఁగమి నైనను భూసుర
' రులధనం బపహరింప లవదు పతికిన్;
పున ననలము ముట్టిన
' రికొని వెసఁ గాల్పకున్నె ను వెరియంగన్?

(తెభా-10.2-481-వ.)[మార్చు]

మఱియును దన ధనంబు పరులచేతఁ గోల్పడిన విప్రుండు దుఃఖమున రోదనంబు సేయ రాలిన యశ్రుకణంబుల నవనిరేణువు లెన్ని తడియు నన్ని వేలేండ్లు తదుపేక్షాపరుండైన పతి దారుణ వేదనలుగల కుంభీపాక నరకంబు నొందు; మఱియు నతనితోడఁ గ్రిందటఁ బదితరంబులవారును, ముందటఁ బదితరంబులవారును మహానరకవేదనలం బొందుదురు; స్వదత్తంబైన నర్ధలోభంబునం జేసి దుశ్శీలుండై యెవ్వఁడు బ్రాహ్మణక్షేత్ర సంభూత ధాన్యధనాదికంబు భుజించు నప్పాపాత్ముం డఱువదివేల సంవత్సరంబులు మలకూపంబునం గ్రిమిరూపంబున వర్తించు; నట్లగుట యెఱింగి విప్రుడెంత తప్పు చేసిన నెన్ని గొట్టిన, నెన్ని దిట్టిన నతని కెదురు పలుకక వినయంబున వందనం బాచరించు పుణ్యాత్ములు నాదు పాలింటివా; రదియునుంగాక యేనును బ్రతిదినంబును భూసురుల నతి వినయంబునఁ బూజింతు; నిట్లు సేయక విపరీతవర్తనులైన తామసుల నేను వెదకి దండింతు; నదిగావున మీరలును బ్రాహ్మణజనంబుల వలనం బరమభక్తి గలిగి మెలంగుండని యానతిచ్చి యాదవప్రకరంబులు సేవింప నఖిలలోకశరణ్యుండైన యప్పుండరీకాక్షుండు నిజ నివాసంబునకుం జనియె” నని చెప్పి శుకుం డిట్లనియె.

(తెభా-10.2-482-క.)[మార్చు]

థఁ జదివిన వారలుఁ
'గై కొని వినువారు విగత లుషాత్మకులై
లౌ కికసౌఖ్యము నొందుదు
'రా కైవల్యంబుఁ గరతలామలక మగున్.

21-05-2016: :
గణనాధ్యాయి 10:59, 12 డిసెంబరు 2016 (UTC)